Devotional serials
-
అసలైన ప్రార్థన అంటే?
మన శాస్త్రాల్లో సాధకులకు ఉపయోగపడే వందల కొలది మార్గాలు ఉన్నాయి. ప్రపంచంలో వేల కొలది బోధకులు ఉన్నారు. మన సంప్రదాయాలను అనుసరించి భగవంతునికి కోట్లాది రూపాలున్నాయి. సాధకులు తమ మార్గాలను, గురువులను, వారు పూజించు దేవుళ్ళను మార్చుకోవడం చూస్తూ ఉంటాం. ఆ విధంగా చేయడం సరైనదే కావచ్చు, కాకపోనూ వచ్చు. కానీ లక్ష్యాలను చేరుకోవడానికి వారు చూపించే ఉత్సాహం మెచ్చుకోతగింది. అటువంటివారి దృష్టి అంతా ఎల్లప్పుడూ ఆదర్శమార్గం, ఆదర్శ గురువు, ఆదర్శప్రాయమైన భగవత్ స్వరూపం పైననే ఉంటుంది. వారు ఏ మార్గాన్ని అనుసరించినప్పటికీ, ప్రయాణం మాత్రం అంతరాత్మ లోనికే అనే విషయాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు.గురువులందనూ బోధించే సత్యం ఒకటే. భగవంతుని ఏ స్వరూపంలో పూజించినప్పటికీ, అది సర్వేశ్వరుని పూజించినట్లే. వారు ఎంచుకొనే మార్గం, అనుసరించే గురువు, ఆరాధించే భగవత్ స్వరూపం... ఇవన్నీ సాంకేతికంగా భగవంతుని సూచిస్తాయి. నీవు నీ మార్గాన్ని గంభీరంగా, భక్తిపూర్వకంగా నిశ్చిత బుద్ధితో అనుసరించడమే ముఖ్యం. ప్రపంచంలోని అన్ని మతాలవారికీ ప్రార్థన ఉంది. అయితే చేసే విధానాలు విభిన్నంగా ఉండవచ్చు. కాని ఇది అందరికీ ముఖ్యమైనది. కేవలం మానవులకు మాత్రమే ప్రార్థన అనేదాన్ని భగవంతుడు అనుగ్రహించాడు. ప్రార్థన చాలా శక్తిమంతమైనది. మనకు ఆపదలు, దుఃఖం కలిగినప్పుడు మాత్రమే సాధారణంగా భగవంతుని ప్రార్థిస్తాం.దీనిలో నష్టం ఏమీ లేదు. అయినప్పటికీ, అన్ని పరిస్థితుల్లో భగవంతుని ప్రార్థించడం అలవరచుకోవాలి. వ్యక్తిత్వాన్ని సరిచేసుకోవడం, ఆత్మవికాసమే ప్రార్థన ముఖ్య ఉద్దేశాలుగా ఉండాలి. భౌతిక అవసరాలను లేక కోరికలను తీర్చు కోవడానికి భగవంతుని ప్రార్థించకూడదు. కాబట్టి నీవు చేసే ప్రార్థన బంధ విముక్తి కోసం చేయాలి. ఎట్టి పరిస్థితిలో అయినా ఆ దేవదేవుని మరచిపోకుండా ఉండేట్లు ఉంచమని ఆయననే ప్రార్థించాలి. కొన్ని విషయాలు మనకు సంతోషం కలిగించవు. అందువలన బాధ కలుగుతుంది. అటువంటి విషయాలను ప్రార్థన ద్వారా దేవుని అడుగరాదు. అదే నిజమైన ప్రార్థన. నీ ప్రార్థన భగవంతుని నియమానుసారానికి లోబడి ఉండాలి. అందుకు తగినట్లు నిన్ను నీవు మలచుకోవాలి.– శ్రీ గణపతి సచ్చిదానందస్వామి -
టీవీక్షణం: భక్తి రసాత్మకం... ఈ ధారావాహికం!
భక్తి సీరియళ్లకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారని రామాయణం, మహాభారతం, శ్రీకృష్ణ వంటి సీరియల్స్ నిరూపించాయి. యేళ్లపాటు వాటిని ఆదరించి, వీక్షించి తరించారు తెలుగు ప్రేక్షకులు. వాటి సరసన మరోటి చేరింది. అదే... హరహర మహాదేవ. లయకారుడైన పరమశివుడి గాథ ఇది. లైఫ్ ఓకే చానెల్లో ‘దేవోంకే దేవ్ మహాదేవ్’ పేరుతో ప్రసారమవుతోన్న ఈ సీరియల్‌ను ‘హరహర మహాదేవ’గా తెలుగు ప్రేక్షకుల ముందుకు తెచ్చారు మాటీవీ వారు. శివుడిగా మోహిత్ రైనా అద్భుతమైన అభినయం అందరినీ కట్టిపడేస్తోంది. సాక్షాత్తూ పరమ శివుడినే చూస్తున్నట్టుగా ీఫీలయ్యి శివనామ స్మరణలో తరిస్తున్నారు జనం. పార్వతిగా సోనారిక భదోరియా కూడా చూపు తిప్పుకోనివ్వకుండా చేస్తోంది. అందుకే ఈ సీరియల్ హిందీతో పాటు తెలుగులో కూడా విజయవంతంగా సాగిపోతోంది. ఇతర భక్తి సీరియళ్లను తన టీఆర్పీతో అధిగమిస్తోంది. అయినా మహాదేవుణ్నే తీసుకొచ్చి ముంగిట నిలుపుతామంటే ఎవరు మాత్రం కాదంటారు! ఈశ్వరుడి లీలలకు అందమైన చిత్ర రూపమిచ్చి కళ్లకు కడతామంటే ఎవరు చూడనంటారు! మళ్లీ ఆడేసుకుంటారట! డ్యాన్స్‌షోలకు విపరీతంగా క్రేజ్ పెరిగిపోయింది. చిన్నపిల్లల దగ్గర్నుంచి పెద్దవాళ్ల వరకూ వాటిని చూసి ఎంజాయ్ చేస్తున్నారు. దాంతో అన్ని చానెళ్లవారూ అటువంటి షోలు ప్రదర్శించేందుకు పోటీ పడుతున్నారు. వాటిలో ఒకటి... ‘ఆట’. ఓంకార్ నిర్వహించే ఈ డ్యాన్స్షో మాంచి సక్సెస్ అయ్యింది. తీవ్ర విమర్శలు ఎదురైనా... షో మాత్రం ఆగకుండా సాగుతోంది. త్వరలోనే మరో సిరీస్ మొదలు పెట్టడానికి ప్లాన్ చేస్తున్నాడు ఓంకార్. వేసవి సెలవుల్లో మొదలుపెడితే అందరూ బాగా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాడట. సుందరం మాస్టారితో పాటు, కొరియోగ్రాఫర్ ప్రేమ్క్ష్రిత్, నటి చార్మిలను న్యాయ నిర్ణేతలుగా తీసుకురావాలని ప్లాన్లు వేస్తున్నాడట. పైగా... ఈసారి కాన్సెప్ట్ కొత్తగా ఉంటుందట. కొత్తదనం సంగతేమో గానీ మెలోడ్రామాతో కృత్రిమంగా అనిపిస్తుందని ఈ షో మీద సెటైర్లు వేస్తుంటారంతా. ఈసారైనా ఓంకార్ షో స్టయిల్ మార్చి, ఈ సెటైర్లకు సెలవిస్తాడేమో చూడాలి! ‘నాన్న’ రెండోసారీ నచ్చాడు! హిందీ చానెళ్లలో ప్రతి సీరియల్ ఎపిసోడ్ రోజుకి రెండుమూడుసార్లు వస్తుంది. దాంతో ఒకసారి మిస్ అయినా మరోసారి చూడవచ్చు. కానీ మన తెలుగులో ఆ అవకాశం లేదు. ఒక్కసారి మిస్సయ్యామా... ఇక అంతే సంగతులు! ఎపిసోడే రెండోసారి చూడలేం అని ఫీలయ్యేవాళ్లకు ఏకంగా సీరియల్‌నే రెండోసారి ప్రసారం చేస్తే ఎలా ఉంటుంది? మొదట చూడనివాళ్లు, కొన్ని ఎపిసోడ్లు మిస్ అయినవాళ్లు, చూసి కూడా బాగా నచ్చి మరోసారి చూడాలనుకునేవాళ్లందరికీ అది శుభవార్తే కదా! అందుకే ‘నాన్న’ సీరియల్ రెండోసారి కూడా సక్సెస్‌ఫుల్‌గా సాగిపోతోంది. కొత్తగా పెళ్లయిన ఓ యువకుడి దగ్గరకు నేను నీ కొడుకునంటూ ఓ పిల్లాడు వస్తే... ఆ యువకుడి భార్య మనసులో, వారి కుటుంబంలో చెలరేగే అలజడి ఎలా ఉంటుంది? వారి జీవితాలు ఎలాంటి మలుపు తిరుగుతాయి? అసలా పిల్లాడు ఎవరు? ఎందుకొచ్చాడు? ఆద్యంతం సస్పెన్స్‌తో సాగే ఈ సీరియల్ అప్పట్లో జెమినీ చానెల్లో ప్రసారమై నంది అవార్డును అందుకుంది. ఇప్పుడు మాటీవీలో మరోసారి ప్రసారమవుతూ ప్రేక్షకులను టెలివిజన్ సెట్లకు కట్టిపడేస్తోంది!