devotis
-
కుంభమేళలో భారీగా కరోనా కేసులు!
లక్నో: కుంభమేళాలో కరోనా కేసులు తీవ్రంగా పెరిగిపోతున్నాయి. ఏప్రిల్ 10 నుండి 14 తేదీల మధ్య కాలంలో 2,36,751 మందిని పరీక్షించగా.. 1,701 మంది కరోనా బారిన పడ్డారు. అయితే మరిన్ని ఆర్టీపీసీఆర్ నివేదికలు రావాల్సి ఉంది. ఈనేపథ్యంలో కరోనా కేసులు మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. కాగా, ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో గంగానది తీరాన నిర్వహించే కుంభమేళా ఏప్రిల్ 1 నుండి ఈనెల 30వ తేది వరకు జరుగనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే, ఆర్టీపీసీఆర్ నెగెటివ్ సర్టిఫికేట్ ఉన్న యాత్రికులకు మాత్రమే పవిత్ర స్నానాలకు అనుమతిస్తున్నారు. ఈ ఉత్సవంలో భాగంగా ఏప్రిల్ 12,14,27 తేదిల్లో షాహీస్నాన్ నిర్వహిస్తారు. ఈ రోజుల్లో భక్తులు పెద్ద ఎత్తున పుణ్యస్నానాలు ఆచరిస్తారు. గత 12 వ తేదినాటి షాహీస్నాన్ కార్యక్రమం వలన భక్తులు పెద్ద ఎత్తున కరోనా బారిన పడ్డారని ఉత్తరఖండ్ ప్రభుత్వం భావిస్తుంది. కాగా, కుంభమేళ 670 హెక్టార్లలో హరిద్వార్, టెహ్రీ, డెహ్రాడూన్ జిల్లాలలో విస్తరించి ఉంది. ఏప్రిల్ 12న సోమవతి అమావాస్య సందర్భంగా జరిగిన షాహిస్నాన్‌లో పాల్గొన్న 48.51 లక్షల మందిలో చాలా మంది కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించారని ఉత్తరాఖండ్ ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే, అక్కడ ప్రభుత్వం, వైద్య సిబ్బంది, పారామిలటరీ సిబ్బంది, కరోనా నిబంధనలు పాటించేలా.. భక్తులకు వారికి కేటాయించిన స్లాట్ సమయాల్లోనే పవిత్ర స్నానాలను ముగించుకొవాల్సిందిగా ఆదేశాలను జారీ చేసింది. అయినప్పటికి చాలా మంది కోవిడ్ నిబంధనలు పాటించడంలేదు. దీనితో రానున్న రోజుల్లో మరిన్ని కరోనా కేసులు పెరిగే అవకాశం ఉందని ఉత్తరఖండ్ ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తుంది. -
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
సాక్షి, తిరుమల: తిరుమలలో మంగళవారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనానికి భక్తులు 2 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. స్వామివారి సర్వదర్శనానికి 5 గంటల సమయం, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, కాలినకడనక వచ్చే భక్తులకు 2 గంటల సమయం పడుతుంది. ఏడుకొండలవాడిని సోమవారం 77,292 మంది దర్శించుకున్నారు. 24,475 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం నిన్న రూ. 3.26 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు. -
భక్తులతో తిరుమల కిటకిట
సాక్షి, తిరుమల: తిరుమలలో సోమవారం భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవేంకటేశ్వరస్వామివారి దర్శనం కోసం భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో 16 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 8 గంటలు, ప్రత్యేక దర్శనానికి 2 గంటల సమయం పడుతుంది. ఆదివారం 78,383 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. 28,513 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కు చెల్లించుకున్నారు. నిన్న స్వామివారి హుండీ ద్వారా రూ.2.84కోట్లు ఆదాయం వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు. -
తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ
సాక్షి, తిరుమల : తిరుమలలో బుధవారం ఉదయం భక్తుల రద్దీ తగ్గింది. శ్రీవారి దర్శనం కోసం 4 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. స్వామివారి సర్వదర్శనానికి 4 గంటలు, కాలినడక భక్తులకు 2 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. మంగళవారం 70,898 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా, 27,291 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ. 2.89 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు. -
యాదాద్రికి పెరిగిన భక్తుల రద్దీ
యాదగిరికొండ : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహాస్వామి దేవస్థానంలో ఆదివారం భక్తుల రద్దీ పెరిగింది. ఈ సందర్భంగా ఆలయ పరిసరాలు, గర్భాలయం, క్యూలైన్లు భక్తులతో నిండిపోయాయి. ప్రసాదాలను తీసుకోవడానికి భక్తులు పోటీలు పడ్డారు. ఆలయంలో స్వామి అమ్మవార్లకు విశేష పూజలను నిర్వహించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొన్ని ఆలయాన్ని ఉదయం 3 గంటలకే తెరిచారు. -
మత్స్యగిరిగుట్టలో భక్తుల కిటకిట
వలిగొండ : మండలంలోని వెంకటాపురం గ్రామ పరిధిలోని శ్రీమత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. దసరా సెలవులకు తోడు ఆదివారం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. దర్శనం కోసం భక్తులు క్యూలైన్లలో బారులుదీరారు. వివిధ వస్తువుల కొనుగోళ్లతో దుకాణాలు కళకళలాడాయి. మెుత్తంగా దేవాలయ పరిసరాలు భక్తులో సందడిగా మారాయి. భక్తులకు ఇబ్బందులు కలుగకుండా దేవస్థాన సిబ్బంది సదుపాయాలు కల్పించారు.