సాక్షి, తిరుమల: తిరుమలలో సోమవారం భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవేంకటేశ్వరస్వామివారి దర్శనం కోసం భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో 16 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 8 గంటలు, ప్రత్యేక దర్శనానికి 2 గంటల సమయం పడుతుంది. ఆదివారం 78,383 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. 28,513 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కు చెల్లించుకున్నారు. నిన్న స్వామివారి హుండీ ద్వారా రూ.2.84కోట్లు ఆదాయం వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు.