వినూత్న యాప్స్‌తో ధనార్జన
గుడ్లవల్లేరు : వినూత్న యాప్స్ ధనార్జ దోహదపడేలా చేసుకోవచ్చునని ఎ.ఎ.ఎన్.ఎం అండ్ వి.వి.ఆర్.ఎస్.ఆర్ పాలిటెక్నిక్ కాలేజీ ప్రిన్సిపాల్ ఎన్.ఎస్.ఎస్.వి.రామాంజనేయులు తెలిపారు. స్థానిక కాలేజీలో మైక్రోసాఫ్ట్‌చే ధృవీకరించబడిన కంప్యూటర్ విద్యా నిపుణుల బృందం ‘కాంపసిఫై’వారు విండోస్-8 యాప్ డెవలప్మెంట్పై రెండు రోజుల వర్క్‌షాపును మంగళ, బుధవారాలు నిర్వహించారు. పాలిటెక్నిక్ చివరి సంవత్సరం కంప్యూటర్, ఐటీ కోర్సులు చదువుతున్న 76మంది విద్యార్థులు ఈ వర్క్‌షాప్‌లో పాల్గొన్నారు.
తొలి రోజు యాప్స్‌కు సంబంధించిన విండోస్-8ఓఎస్, విండోస్-8 స్టోర్ యాప్స్, విండోస్-8అప్లికేషన్స్, విజువల్ స్టూడియో వంటి అంశాల్ని విద్యార్థులు ఆసక్తిగా నేర్చుకున్నారు. రెండో రోజు టూల్ బాక్స్‌ను ఉపయోగించి మైక్రోసాఫ్ట్ బ్లెండ్‌తో యానిమేషన్ ఎఫెక్ట్‌ను జత చేయడం, యాప్స్‌ను విండోస్ స్టోర్‌కు అప్లోడ్ చేయడం వంటి విషయాలపై ప్రయోగాలను నిర్వహించారు.
ఈ విద్యార్థులందరూ ఈనెల 30న జిల్లాలోని వివిధ ఇంజినీరింగ్ కాలేజీల విద్యార్థులతో పాటు ఏకబిగిన 24గంటల పాటు సాగే నూతన యాప్స్ ఆవిష్కర పోటీల్లో పాల్గొంటారని ప్రిన్సిపాల్ తెలిపారు. రెండు రోజుల వర్క్‌షాప్‌లో శిక్షణ పొందిన విద్యార్థులందరికీ ధ్రువపత్రాల్ని ముగింపు సభలో జీఈసీ అకడమిక్ డీన్ డాక్టర్ ప్రసాద్ అందజేశారు. కాంపసిఫై నిపుణుడు జంపని చైతన్య, రాజశేఖరరెడ్డి, శ్రావణ్‌కుమార్, రూపేష్ గుప్తా శిక్షణ ఇచ్చారు. వర్క్‌షాప్‌ను కంప్యూటర్, ఐటీ శాఖాధిపతులు జి.వి.వి.సత్యనారాయణ, ఎన్.రాజశేఖర్ పర్యవేక్షించారు.