dharmana
-
శ్రీకాకుళం జిల్లాకు చంద్రబాబు చేసిందేమి లేదు : మంత్రి ధర్మాన
-
రాష్ట్ర విభజన చట్టం చేసినప్పుడు ఏపీకి అన్యాయం జరిగింది : మంత్రి ధర్మాన
-
ఉత్తరాంధ్రను చంద్రబాబు, పవన్ అవహేళన చేస్తున్నారు : మంత్రి ధర్మాన
-
జగన్ బొమ్మ చూపించు నాయనా.. బామ్మ ఆప్యాయత
శ్రీకాకుళం : పోలాకి మండలం ప్రియాగ్రహారంలో జెడ్పీటీసీ ధర్మాన కృష్ణచైతన్యకు శుక్రవారం ఓ హృద్యమైన అనుభవం ఎదురైంది. పార్టీ నేతలతో కలిసి ఇంటింటికీ వెళ్తూ కోరాడ అమ్మాయమ్మ(84) ఇంటికి వెళ్లారు. బామ్మా నీకు పింఛన్ వస్తుందా.. అని అడిగితే.. ‘ఆ వస్తుంది గానీ నాకు జగన్ బొమ్మ చూపించు నాయనా..!’ అని ఆప్యాయంగా అడి గింది ఆ బామ్మ. దీంతో కృష్ణచైతన్య సీఎం చిత్రాన్ని బామ్మకు చూపించగా ఆమె మురిసిపోయారు. వేలిముద్ర పడకపోయినా సచివాలయం నుంచి ఒక వ్యక్తి వచ్చి పింఛను ఇస్తున్నారని ఆమె చెప్పి దీవించారు. -
ఇప్పటికైనా పోరాడవా... చంద్రబాబూ!
* అరుణ్‌జైట్లీ ప్రత్యేక హోదా ప్రస్తావనే చేయలేదు * వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మాన సాక్షి, హైదరాబాద్: ఏపీకి ప్రత్యేక హోదా గురించి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ పార్లమెంటులో చేసిన ప్రసంగంలో కనీసం ప్రస్తావనైనా లేదని, ఇప్పటికైనా ముఖ్యమంత్రి చంద్రబాబు పోరాటం చేయరా? అని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు సూటిగా ప్రశ్నించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో ధర్మాన మాట్లాడుతూ.. రాష్ట్రానికి ఇవ్వాల్సిన నిధుల్ని పుష్కలంగా కేటాయిస్తామని జైట్లీ చెప్పారే గానీ ప్రత్యేక హోదా ఊసే ఎత్తలేదన్నారు. చంద్రబాబును ప్రజలు గెలిపించింది వారి తరఫున పోరాడ్డానికే గాని, ఆయన స్వార్థ ప్రయోజనాలను కాపాడుకోవడానికి కాదని పేర్కొన్నారు. ప్రభుత్వాధినేతగా ఉంటూ తెగించి పోరాటం చేయకపోతే ప్రత్యేక హోదా ఎలా వస్తుందని ప్రశ్నించారు. ఈ నెల 10నవైఎస్సార్‌సీపీ చేబట్టబోయే ధర్నాల్లో చంద్రబాబు వైఫల్యాన్ని ఎండగడతామని ధర్మానహెచ్చరించారు. సీఎం చంద్రబాబుకు వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధిపై ఏ మాత్రం చిత్తశుద్ధి లేదని ధర్మాన మండిపడ్డారు. ఉత్తరాంధ్రనువెనుకబడిన ప్రాంతంగా కేంద్రం గుర్తించి ఇచ్చిన నిధులను ఖర్చు చేయలేదని ఆయన విమర్శించారు. -
'చంద్రబాబు రైతాంగాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు'
-
పరిశ్రమల ఎంఓయూ బహిర్గత పర్చాలి : ధర్మాన
-
ఆంధ్రప్రదేశ్ ప్రజల గతేం కానూ.. ?!
-
నేడు తేలనున్న ధర్మాన, సబిత భవితవ్యం
-
నేడు తేలనున్న ధర్మాన, సబిత భవితవ్యం
హైదరాబాద్ : మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ధర్మాన ప్రసాద్‌ల భవితవ్యం నేడు తేలనుంది. జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించాలన్న సీబీఐ మెమోపై సీబీఐ ప్రత్యేక కోర్టు తీర్పును బుధవారం వెలువరించనుంది. సబితా , ధర్మాన బయట ఉంటే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని సీబీఐ కోర్టుకు తెలిపింది. వీరిద్దరు మాట్లాడిన వీడియో క్లిప్పింగ్‌లను సీబీఐ కోర్టుకు సమర్పించింది. వ్యక్తిగత పూచికత్తులు సమర్పించినా ..జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపవచ్చంటూ సీబీఐ వాదించింది. అయితే సీబీఐ నిందితులకు రాజ్యాంగం కల్పించిన భావప్రకటనా స్వేచ్ఛను కాలరాస్తుందని ధర్మాన ,సబితా తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. కోర్టు నిందితులకు సమన్లు జారీ చేసిందని.. కోర్టుకు వ్యక్తిగత పూచికత్తును కూడా సమర్పించారని .. అప్పుడు జ్యుడీషియల్ రిమాండ్ అడగని సీబీఐ ఇప్పుడు ఎలా పిటిషన్ దాఖలు చేస్తుందని ప్రశ్నించారు. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు నిర్ణయాన్ని ఈ నెల 7కు వాయిదా వేసిన విషయం తెలిసిందే.