Dharmapuri district
-
వింత ఆచారం.. ‘ఎర్రని’ అభిషేకం!
చెన్నై: కొన్ని ఆచారాలు వింత ఉంటాయి. తమిళనాడు ధర్మపురి జిల్లాలోని నల్లంపల్లిలో పాటించే ఆచారం కూడా ఇలాంటిదే. స్థానిక కరుప్పస్వామి ఆలయంలో ఆడి(ఆషాడ) అమావాస్య సందర్భంగా అర్చకుడికి కారం కలిపిన నీళ్లతో అభిషేకం చేస్తారు. ఏంటి నమ్మలేకపోతున్నారా! ప్రతి ఏటా ఆడి అమావాస్య రోజున ఆలయ ఉత్సవం నిర్వహించటం ఆనవాయితీ. ఉత్సవంలో భాగంగా పెద్ద ఎత్తున ఆలయానికి భక్తులు చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. చివరిగా ఆలయంలో అనాదిగా వస్తున్న ఆచారం నిర్వహించారు. అర్చకుడు ముందుగా ఓ ఆసనంపై కూర్చుని భక్తులకు ఉపదేశం చేయగా అక్కడే సిద్దంగా బిందెలలో ఉంచిన నీటిలో 75 కిలోల దంచిన ఎండు మిరపకాయల కారం పోసి కలిపారు. కారం కలిపిన జలంతో అర్చకుడికి గ్రామ పెద్దలు అభిషేకం చేశారు. భక్తులంతా ఈ ఘట్టాన్ని ఎంతో ఆసక్తిగా తిలకించారు. కారం కలిపిన నీటితో అభిషేకం చేస్తున్నా అర్చకుడు ఎటువంటి ఇబ్బంటి పడకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. కారం మంట పెడుతున్నా కరుప్పస్వామిపై ఉన్న భక్తి వల్ల అర్చకుడుకి ఏమాత్రం బాధ ఉండదని భక్తులు విశ్వసిస్తారు. తమ గ్రామంలో ఏళ్లు తరబడి వస్తున్న ఈ ఆచారాన్ని కొనసాగించటం ఆనందంగా ఉందని గ్రామస్తులు అంటున్నారు. ఇలా చేయటం ద్వారా అర్చకుడి ఉపదేశ వాక్కు ఫలిస్తుందని వారినమ్మకమట. గ్రామస్తుల ఆచారాలు ఎలా ఉన్నా కారం నీళ్లతో మనిషికి అభిషేకం విచిత్రంగానే ఉంది. -
కోడలి తల నరికిన మామ
చెన్నై, సాక్షి ప్రతినిధి: తమిళనాడు ధర్మపురి జిల్లా పాలక్కోడు సమీపంలో కోడలి తలనరికి పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయిన మామ ఉదంతం శుక్రవారం చోటుచేసుకుంది. ధర్మపురి జిల్లా పాలక్కోడు సమీపం కుత్తలఅల్లి గ్రామానికి చెందిన రమేష్, ఆనంది (30) దంపతులు. వీరికి శ్వేత (4) కుమార్తె ఉంది. రమేష్ మూడేళ్ల క్రితం శరణ్య అనే మరో యువతిని రెండో వివాహం చేసుకున్నాడు. రెండో వివాహం చేసుకున్నప్పటి నుంచి భార్యాభర్తలు గొడవపడేవారు. గురువారం రాత్రి గొడవపడగా అత్తామామలు సుబ్రమణి, ఏకమ్మాళ్ ఇద్దరికీ సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. అయితే ఆమె అత్తామామల మాటలు వినిపించుకోలేదు. భర్తతో భరించలేనంటూ శుక్రవారం ఉదయం ఆనంది తన కుమార్తె శ్వేతతో సహా పుట్టింటికి బయలుదేరింది. ఇంతలో అత్తామామలు వారించారు. ఆమె బస్‌స్టేష న్కు చేరుకుంది. ఇంతలో మామ సుబ్రమణి తనవద్దనున్న కొడవలితో బస్టాండ్‌కు చేరుకున్నాడు. కోడలి తల నరికివేశాడు. మొండెంతో వేరుపడిన తలను తీసుకుని రోడ్డుపై నడుచుకుంటూ వెళ్లి పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయాడు. -
మృత్యు ఘోష
రాష్ర్టంలో మంగళవారం మృత్యువు విలయతాండవం చేసింది. రెండు ప్రమాదాల్లో 12మంది మృత్యువాత పడ్డారు. ధర్మపురి జిల్లా హొగెనేకల్ సమీపంలో ప్రభుత్వ బస్సు బోల్తాపడి 8 మంది మృతి చెందారు. పాడి వంతెన సమీపంలోని సిగ్నల్ వద్ద ఆగి ఉన్న ద్విచక్ర వాహనదారులపైకి ఒక లారీ అతివేగంగా దూసుకొచ్చింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. హొసూరు :తమిళనాడులోని ధర్మపురి జిల్లా హొగేనకల్ పర్యాటక ప్రాంతంలోని అటవీ ప్రాంతం లోయలో ప్రభుత్వ ఆర్టీసీ పడింది. మంగళవారం మధ్యాహ్నం చోటు చేసుకున్న ఈ ప్రమాదంలో ఎనిమిది మంది అక్కడికక్కడే మరణించారు. పది మంది పరిస్థితి విషమంగా ఉంది. మరో 42మంది గాయపడ్డారు. బస్సు తునాతునకలైంది. క్షతగాత్రుల ఆర్తనాదాలతో అరణ్యం హొరెత్తింది. వివరాల్లోకి వెళితే.. ధర్మపురి జిల్లా బొమ్మడి నుంచి హొగేనకల్ మీదుగా క్రిష్ణగిరి జిల్లా అంచెట్టికి 60 మంది ప్రయాణికులతో మంగళవారం ఉదయం 11.45 గంటలకు తమిళనాడు ఆర్టీసీ బస్సు బయలుదేరింది. పెన్నాగరం దాటి ఆంజనేయస్వామి ఆలయం వద్ద ఉన్న మలుపులో వేగంగా ముందు వెళుతున్న బస్సును ఓవర్టేక్ చేసే ప్రయత్నంలో బస్సు అదుపు తప్పి కుడివైపున ఉన్న రక్షణగోడను దాటుకుని వంద అడుగుల లోయలోకి దూసుకెళ్లింది. ఘటనలో బస్సు తునాతునకలైంది. ప్రయాణికులు కాళియప్ప(54), ఇతని భార్య వెంకటమ్మ (50), మాదమ్మ (50), మాదమ్మ మనుమరాలు శివశంకరి(10), సహాదేవ (50), మణివణ్ణన్, సుధాకర్(క్రిష్ణగిరి అగ్నిమాపక శాఖ ఉద్యోగి), ఓ చిన్నారి అక్కడికక్కడే మరణించారు. సమాచారం అందుకున్న స్థానికులు పెద్ద ఎత్తున అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. పెన్నాగరం, హొగేనకల్ అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. రెండు గంటలకు పైగా శ్రమించి క్షతగాత్రులను వెలికి తీసి పది 108 అంబులెన్సల ద్వారా పెన్నాగరం, ధర్మపురి ప్రభుత్వాస్పత్రులకు తరలించారు. డ్రైవర్ శివకుమార్‌తో పాటు ప్రయాణికులు కాళియప్ప, శివకుమార్, మహేశ్వరి, ఈశ్వరి, పెరియస్వామి మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. 42 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఘటనా స్థలాన్ని ధర్మపురి జిల్లా కలెక్టర్ వివేకానంద, డీఆర్వో శంకర్ ఎస్పీ, పోలీస్ అధికారులు పరిశీలించారు. ఘటనపై విచారణ జరపనున్నట్లు కలెక్టర్ తెలిపారు.