ధర్మసాగర్లో శేఖర్‌బాబు విగ్రహం ఏర్పాటు
వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్
ఆకట్టుకున్న గయో పాఖ్యానం నాటకం
హన్మకొండ కల్చరల్ : తెలంగాణ పద్యనాటకానికి గుర్తింపు తెచ్చిన పందిళ్ల శేఖర్‌బాబు విగ్రహాన్ని ఆయన జన్మించిన ధర్మసాగర్లో ఏర్పాటు చేసేందుకు తనవంతు కృషి చేస్తానని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమే ష్ అన్నారు. తెలంగాణ రాష్ట్రభాషా సాంస్కృతికశాఖ సౌజన్యంతో పందిⶠ్ల శేఖర్‌బాబు స్మారక పద్యనాటక సప్తాహ కమిటీ ఆధ్వర్యంలో హన్మకొండ పబ్లిక్‌గార్డెన్‌లోని నేరేళ్ల వేణుమాధవ్ కళాప్రాంగణంలో నిర్వహిస్తు న్న రాష్ట్రస్థాయి పద్యనాటక ప్రదర్శనలు ఆది వారం మూడో రోజుకు చేరాయి. ఈ సందర్భంగా ప్రదర్శనలను సాయంత్రం ఎమ్మెల్యే అరూరి రమేష్, సీఎం కార్యాలయ ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రా రంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో కళాకారుల దే ముఖ్య పాత్ర అన్నారు.
దేశపతి శ్రీనివాస్ మాట్లాడుతూ ఓరుగల్లు కళలకు పుట్టినిల్లు అన్నారు. హైదరాబాద్‌లో కూడా ఇలాంటి పౌరాణిక పద్య నాటక ఉత్సవాలు నిర్వహించేందుకు కృషి చేస్తామన్నారు. తెలుగు విశ్వవిద్యాలయం శేఖర్‌బాబు పేరిట అవార్డు ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి సిఫారసు చేస్తానన్నారు. కాగా, హార్మోనిస్టు భద్రాచలం భాగవతార్‌ను ఎమ్మెల్యే అరూరి రమేష్, దేశపతి శ్రీనివాస్, నిర్వాహకులు శాలువా, పూలమాలలతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో వరంగల్ దూరదర్శన్ డైరెక్టర్ ఎం.వరప్రసాదరావు, వరంగల్ ఆకాశవాణి అసిస్టెంట్ డైరెక్టర్ సి.జయపాల్‌రెడ్డి, తెలంగాణ రచయితల సంఘం జిల్లా అధ్యక్షుడు పొట్లపల్లి శ్రీనివాసరావు, టీఎన్జీ వో జిల్లా అధ్యక్షుడు కోల రాజేష్, గెజిటెడ్ ఆఫీసర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు ఏఎస్ జగన్మోçßæన్‌రావు, శతపథి శ్యామల్రావు, పంది ళ్ల అశోక్‌కుమార్, బూర విద్యాసాగర్, జ్యోతి జయాకర్రావు, ఓడపల్లి చక్రపాణి, మారేడోజు సదానందచారి పాల్గొన్నారు.
ఆకట్టుకున్న నాటక ప్రదర్శన
వరంగల్ కాకతీయ నాటక కళాపరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన గయోపాఖ్యాన ం పద్యనాటకం సభికులను ఆకట్టుకుంది. కాకతీయ నాటక కళాపరిషత్ అధ్యక్షుడు నాయకపు స మ్మయ్యగౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ప్రదర్శన లో కళాకారులు అద్భుత ప్రదర్శన ఇచ్చారు. ఇందులో దేవరాజు రవీందర్రావు, వెంకట కృష్ణ, అంజిరెడ్డి, ఆకుల సదానందం, భిక్షప తి, రవీందర్, గణేశ్‌కుమార్, రాగి వీరబ్రహ్మచారి, శ్రీనివాస్, సాల్వాచారి, శ్రీరాజు సుం దరమూర్తి, బిటవరం శ్రీధరస్వామి, రమాలక్ష్మి, వెంగమాంబ నటించారు. కాగా, సోమవారం సాయంత్రం మహబూబ్‌నగర్ జనతా సేవా సమితి ఆధ్వర్యంలో విప్రనారాయణ నాటకం ప్రదర్శించనున్నారు.