dhramana prasada rao
-
మీ ఓటుతోనే గెలుపు..
► ప్రజా అవసరాలు గుర్తించేవాడే నాయకుడు ►పక్కా వ్యూహం, కచ్చిత సమాచారం అవసరం ►వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు జలుమూరు:‘‘మీ ఓటుతోనే విజయం వరిస్తోంది. మీకు అప్పచెప్పిన బాధ్యతగల ప్రయోజనం గుర్తించగలగాలి. అన్ని సామాజిక వర్గాలను కలుపుకొని పక్కా వ్యూహంతోపాటు కచ్చిత సమాచారం ఉన్నప్పుడే మనకు గెలుపు సాధ్యమవుతోంది’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు అన్నారు. చల్లవానిపేటలోని ఓ కల్యాణ మండపంలో జలుమూరు మండల బూత్‌కమిటీ సమావేశం శనివారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంచాయతీలో మీకు అప్పచెప్పిన బాధ్యతలు ఎంతో కీలకమైనవని, ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా నష్టపోయే ప్రమాదముందన్నారు. దీనికి నిదర్శనం అనకాపల్లి, విజయనగరం ఎంపీలు కొణతాల రామకృష్ణ, బొత్స ఝాన్సీలు గత ఎన్నికల్లో అతి తక్కువ ఓట్లతో గెలిచిన విషయాన్ని గుర్తించుకోవాలన్నారు. ఒక్కో బూత్‌లో ఎన్ని ఓట్లు ఉంటాయి, ఇందులో సామాజిక కులాలివి ఎన్ని, తటస్థులు ఎంతమంది, మన పార్టీ అభిమానులు, మహిళలు, పురుషు ఓటర్లు ఎంతమంది, ఇతర ప్రాంతాల్లో ఉన్న వారు, ప్రత్యర్ధి పార్టీ నుంచి మనవైపు చూస్తున్న వారిని గుర్తించి ముందుకు సాగాలన్నారు. ఒక్కో బూత్ నుంచి కనీస ఓటర్లను మనవైపునకు తిప్పుకోవడం ద్వారా భారీ మెజారిటీ సాధ్యమవుతోందన్నారు. వీటితోపాటుమన పార్టీ లక్ష్యం. గ్రామ స్థాయిలో ఉన్న లోపాలు, పార్టీలో చేరిక, ఇతర పార్టీనుంచి ఎవరు చెబితే మనవైపునకు వస్తారు అన్న విషయాలను కార్యకర్తలు గుర్తించి మండల, నియోజకవర్గ నాయకులకు చేరవేయడం ప్రధానమన్నారు. ప్రజా అవసరాలను గుర్తించి వారి కోసం నిత్యం శ్రమించిన వాడే నిజమైన నాయకుడని, వారికే ప్రజలు పట్టం కడతారన్నారు. ఎన్నో అబద్దపు మాటలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబుపై ప్రజల కు విశ్వాసం పోయిందని, ఇదే సమమయంలో వారికి మనపై నమ్మకం కలిగేంచేలా వివరించాలన్నారు. అన్నివర్గాల వారు మన వారే అనే ధోరణిలో ఉండాలన్నారు. -
3 నియోజకవర్గాలకు సమన్వయకర్తలు
శ్రీకాకుళం అసెంబ్లీ, లోక్‌సభ నియోజకవర్గాలకు. ఇచ్ఛాపురం అసెం బ్లీ నియోజకవర్గానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తలను నియమించింది. శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గ ఏకైక సమన్వయకర్తగా మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు నియమితులయ్యారు. అదే విధంగా శ్రీకాకుళం లోక్‌సభ నియోజకవర్గ సమన్వయకర్తగా రెడ్డి శాంతిని నియమించారు. ఇక ఇచ్చాపురం నియోజకవర్గ సమన్వయకర్తగా నర్తు నరేంద్రయాదవ్ నియ మితులయ్యారు. పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు వీరిద్దరిని నియమించినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది. ధర్మాన ప్రసాదరావు జిల్లాలో 30 ఏళ్లుగా కీలక రాజకీయ నేతగా ఉన్నారు. 1989, 1999 ఎన్నికల్లో నరసన్నపేట ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2004లో శ్రీకాకుళం నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించి దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి ప్రభుత్వంలో కీలకమైన రెవెన్యూ శాఖ మంత్రిగా చేశారు. 2009 ఎన్నికల్లో కూడా ఆయన శ్రీకాకుళం నుంచి రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచి వై.ఎస్. ప్రభుత్వంలో రెవెన్యూ మంత్రిగా కొనసాగారు. అనంతరం రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వాల్లో కూడా మంత్రిగా చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరి 9న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇక శ్రీకాకుళం లోక్‌సభ నియోజకవర్గ సమన్వయకర్తగా నియమితులైన రెడ్డి శాంతి కూడా జిల్లాలో ప్రముఖ రాజకీయ కుటుంబానికి చెందినవారే. ఆమె సీనియర్ నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలకమండలి సభ్యుడు పాలవలస రాజశేఖరం కుమార్తె. రెడ్డి శాంతి భర్త నాగభూషణరావు ఐఎఫ్ఎస్ అధికారిగా ఢిల్లీలో విధులు నిర్వర్తిస్తున్నారు. జిల్లాలో ప్రముఖ రాజకీయ కుటుంబానికి చెందిన ఈమె ను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రీకాకుళం లోక్‌సభ నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించింది. ఇచ్ఛాపురం ఏకైక సమన్వయకర్తగా నియమితులైన నర్తు నరేంద్ర ఇటీవలి వరకు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షునిగా పని చేశారు. మాజీమంత్రి ధర్మాన ప్రసాదరావుతోపాటు కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి వైఎస్ఆర్సీపీలో చేరారు. ధర్మా న ప్రసాదరావు, రెడ్డి శాంతి, నర్తు నరేంద్రల నియామకాలు వెంటనే అమలులోకి వస్తాయని పార్టీ కేంద్ర కార్యాలయం వెల్లడించింది.