మీ ఓటుతోనే గెలుపు.. | dharmana prasada rao says The leader is recognizes the public needs | Sakshi
Sakshi News home page

మీ ఓటుతోనే గెలుపు..

Published Sun, Jul 30 2017 11:24 AM | Last Updated on Tue, May 29 2018 4:40 PM

మీ ఓటుతోనే గెలుపు.. - Sakshi

మీ ఓటుతోనే గెలుపు..

► ప్రజా అవసరాలు గుర్తించేవాడే నాయకుడు
►పక్కా వ్యూహం, కచ్చిత సమాచారం అవసరం
►వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు


జలుమూరు:‘‘మీ ఓటుతోనే విజయం వరిస్తోంది. మీకు అప్పచెప్పిన బాధ్యతగల ప్రయోజనం గుర్తించగలగాలి. అన్ని సామాజిక వర్గాలను కలుపుకొని పక్కా వ్యూహంతోపాటు కచ్చిత సమాచారం ఉన్నప్పుడే మనకు గెలుపు సాధ్యమవుతోంది’’ అని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు అన్నారు. చల్లవానిపేటలోని ఓ కల్యాణ మండపంలో జలుమూరు మండల బూత్‌కమిటీ సమావేశం శనివారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంచాయతీలో మీకు అప్పచెప్పిన బాధ్యతలు ఎంతో కీలకమైనవని, ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా నష్టపోయే ప్రమాదముందన్నారు.

దీనికి నిదర్శనం అనకాపల్లి, విజయనగరం ఎంపీలు కొణతాల రామకృష్ణ, బొత్స ఝాన్సీలు గత ఎన్నికల్లో అతి తక్కువ ఓట్లతో గెలిచిన విషయాన్ని గుర్తించుకోవాలన్నారు. ఒక్కో బూత్‌లో ఎన్ని ఓట్లు ఉంటాయి, ఇందులో సామాజిక కులాలివి ఎన్ని, తటస్థులు ఎంతమంది, మన పార్టీ అభిమానులు, మహిళలు,  పురుషు ఓటర్లు ఎంతమంది, ఇతర ప్రాంతాల్లో ఉన్న వారు, ప్రత్యర్ధి పార్టీ నుంచి మనవైపు చూస్తున్న వారిని గుర్తించి ముందుకు సాగాలన్నారు. ఒక్కో బూత్‌ నుంచి కనీస ఓటర్లను మనవైపునకు తిప్పుకోవడం ద్వారా భారీ మెజారిటీ సాధ్యమవుతోందన్నారు.

వీటితోపాటుమన పార్టీ లక్ష్యం. గ్రామ స్థాయిలో ఉన్న లోపాలు, పార్టీలో చేరిక, ఇతర పార్టీనుంచి ఎవరు చెబితే మనవైపునకు వస్తారు అన్న విషయాలను కార్యకర్తలు గుర్తించి మండల, నియోజకవర్గ నాయకులకు చేరవేయడం ప్రధానమన్నారు. ప్రజా అవసరాలను గుర్తించి వారి కోసం నిత్యం శ్రమించిన వాడే నిజమైన నాయకుడని, వారికే ప్రజలు పట్టం కడతారన్నారు. ఎన్నో అబద్దపు మాటలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబుపై ప్రజల కు విశ్వాసం పోయిందని, ఇదే సమమయంలో వారికి మనపై నమ్మకం కలిగేంచేలా వివరించాలన్నారు. అన్నివర్గాల వారు మన వారే అనే ధోరణిలో ఉండాలన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement