Dhulipalla
-
సత్తెనపల్లి మండలం ధూళిపాళ్లలో ట్రిపుల్ మర్డర్
-
వారం రోజులే టైం
-
ఈ కుర్రాడు.. ఇక శతావధాని ఆదిత్యుడు
సాక్షి, రాజమహేంద్రవరం: లలితాదిత్యుడు మధ్యందిన మార్తాండుడిలా జాజ్వల్యమానంగా ప్రకాశించాడు. పృచ్ఛకవరేణ్యుల అక్షర అస్త్రశ్రస్తాలను అతి లాఘవంగా ఎదుర్కొన్నాడు. పద్యాలను ఛందోబద్ధంగా మాత్రమే కాదు, రసరమ్య గీతాలుగా, భావస్ఫోరకంగా చెప్పి పండితుల ఆమోదాన్ని, ఆశీస్సులను అందుకున్నాడు. ఆదికవి నన్నయ భట్టారకుడు, తిరుపతి వేంకట కవులు, కవిసార్వభౌముడు శ్రీపాద కృష్ణమూర్తిశాస్త్రి వంటి హేమాహేమీలు నడయాడిన గడ్డ మీద.. అమెరికాలో జన్మించి, అక్కడే చదువు‘సంధ్య’లు సాగిస్తున్న ఈ నూనూగు మీసాల నూత్నయౌవనంలో ఉన్న కుర్రాడు మంగళవారం శతావధానం విజయవంతంగా పూర్తి చేశాడు. ఈ మహత్తర ఘటన తెలుగు సాహితీ జగత్తుకు గర్వకారణంగా నిలిచిపోతుందని పలువురు సాహితీవేత్తలు ఈ సందర్భంగా ముక్తకంఠంతో పేర్కొన్నారు.. ఆంధ్ర యువతీ సంస్కృత కళాశాల, శుభోదయం ఇన్ఫ్రా సంయుక్త ఆధ్వర్యాన కళాశాలలో ఆదివారం ప్రారంభమైన శతావధానం నిర్వాహకుల అంచనాలకంటే ముందుగానే ఉదయం 11.43 గంటలకు ముగిసింది. ఘంటానాదం చేస్తున్న ధూళిపాళ శతావధానంలోని అంశాలు మూడు నిషిద్ధాక్షరులు, 24 సమస్యలు, 24 దత్తపదులు, 24 వర్ణనలు, 19 ఆశువులు, నాలుగు ఘంటావధానాలు, మూడు అప్రస్తుత ప్రసంగాలు వెరసి.. 101 అంశాలపై పృచ్ఛకులు సంధించిన ప్రశ్నలకు యతిప్రాసలు చెడకుండా, రసాత్మకంగా లలిత్ ఆదిత్య పద్యాలను అలవోకగా అందించాడు. ‘శ్చి’, స్త్వం’ వంటి ప్రాసలతో పద్యాలు చెప్పవలసివచ్చినా అదరలేదు.. బెదరలేదు. ‘శిష్యవాత్సల్యము చెలువుమీర’ అవధాన ప్రాచార్య డాక్టర్ ధూళిపాళ మహాదేవమణి అవధానిని ప్రోత్సహిస్తూ, పృచ్ఛకులను కవ్విస్తూ, రసజ్ఞులను మెప్పిస్తూ అంతటా తానే అయి, అన్నీ తానే అయి అవధాన క్రతువు నిర్వహించారు. అవధానిని ‘అవధాన శరచ్చంద్ర’ బిరుదుతో సత్కరించారు. 25 నిమిషాల్లో 75 పద్యాలు మూడు రోజులుగా పృచ్ఛకులు అడిగిన ప్రశ్నలకు తాను పద్యరూపంగా ఇచ్చిన సమాధానాలను సాయంత్రం జరిగిన మహాధారణలో లలిత్ ఆదిత్య 25 నిమిషాలలో చదివాడు. ‘గురువులయ్యె గురువుల దీవెనల్, లఘువులయ్యె నాదు శ్రమల్’ అని గురువులను స్తోత్రం చేశాడు. ఇది సరికొత్త రికార్డు అని మహాదేవమణి శిష్యుని ఆలింగనం చేసుకున్నారు. మహామహోపాధ్యాయులు, సంస్కృత శతావధానులు కొలువు తీరిన సభలో ఆదిత్య మహాధారణకు కరతాళధ్వనులు ఆగకుండా మోగాయి. పూరి, గారె, వడ, దోసెలతో వాతావరణ కాలుష్యంపై పద్యం చెప్పమని సరసకవి డాక్టర్ ఎస్వీ రాఘవేంద్రరావు కోరగా.. అవధాని ఇలా చెప్పారు. ‘పూరి’త మయ్యె ముజ్జగము భూస్థితి భంగ రసాయనంబులన్ దూరినభ్యాదతన్‌గొనగ ‘దోసి’ళు లొగ్గిన వారు లేరు పొం ‘గారె’ను బాష్పముల్ కువలయాంగనకున్ కలుషమ్ము మీరగా ఆరయచిత్తకంధి ‘వడ’వాగ్నిగ రేగెను దిర్నివారమై.. పండితుల ప్రశంసలు ధార, ధారణ, పూరణ అవధానానకి ప్రాణాలు. శీలసంపద లేని పాండిత్యం, హారతి లేని పూజ, పూలు తలలో లేని మగువ కొప్పు, ధారణ లేని అవధానం వ్యర్థం. ధారణలో లలిత్ సందీప్ అసామాన్యమైన ప్రతిభ చూపాడు. – ప్రవచన రాజహంస డాక్టర్ ధూళిపాళ మహాదేవమణి అత్యద్భుత ప్రతిభ లలిత్ ఆదిత్యుని ప్రతిభ అద్భుతం. దేవీదత్తం, ఉపాసనాసిద్ధి పొందిన లక్షణాలు అవధానిలో కనిపిస్తున్నాయి. – మహామహోపాధ్యాయ శలాక రఘునాథశర్మ పురాకృత సుకృతం పద్యవిద్యలో లలిత్ ఆదిత్య సాధించిన ప్రతిభ పురాకృత సుకృతం. గురువుల ఆశీస్సులను మెండుగా అందుకున్న లలిత్ ఆదిత్య భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని కోరుతున్నాను. – చింతలపాటి శర్మ, రాష్ట్రపతి పురస్కార గ్రహీత -
హెచ్ఐవీ పిల్లల హాస్టల్ ప్రారంభం
సాక్షి, సత్తెనపల్లి(గుంటూరు) : ప్రజలకు అవినీతి రహిత పరిపాలన అందించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే అంబటి రాంబాబు తెలిపారు. హౌస్ ఆఫ్ ఆనియన్స్ స్వచ్ఛంద సేవా సంస్థ డైరెక్టర్ ఫాదర్ వైఎల్ మర్రెడ్డి ఆధ్వర్యంలో ధూళిపాళ్ళ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన హెచ్ఐవీ పిల్లల పాఠశాల, వసతి గృహాన్ని గురువారం ఆయన ప్రారంబించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఎమ్మెల్యే అంబటి మాట్లాడుతూ ప్రజలకు మంచి పరిపాలన అందించాలనే దృక్పథంతో సీఎం వైఎస్ జగన్ పని చేస్తున్నారన్నారు. ఫాదర్ మర్రెడ్డి ఎంతో సేవా దృక్పథంతో ఎంతో కష్టానికి ఓర్చి నిదులు సమకూర్చి పాఠశాల, హాస్టల్ నిర్మించి విద్యార్థులకు సేవ చేయాలనే ప్రయత్నం అభినందనీయమన్నారు. సంస్థ డైరెక్టర్ ఫాదర్ వైఎల్ మర్రెడ్డి మాట్లాడుతూ ధూళిపాళ్ళ ప్రాంతంలో ఎక్కువ మంది హెచ్ఐవీ బాధితులు ఉన్నారని, హైవే పక్కన ఉన్న గ్రామాలను ఎంపిక చేసుకొని ఈ పాఠశాల, హాస్టల్‌ను ఏర్పాటు చేశామని చెప్పారు. అనంతరం అమెరికా ప్రతినిధులు చారెల్, డేవిడ్‌ను సత్కరించారు. కార్యక్రమంలో పేరేచర్ల కు చెందిన ఫాదర్ బాలస్వామి, స్థానిక పెద్దలు, నాయకులు తదితరులు ఉన్నారు. -
తీవ్ర వ్యాఖ్యలు చేసిన ధూళిపాళ్ల
సాక్షి, అమరావతి : గుంటూరులో అతిసార వ్యాధిపై మున్సిపల్ శాఖ వ్యవహరించిన తీరును అధికార పార్టీ సభ్యుడు ధూళిపాళ్ల నరేంద్ర తప్పుపట్టారు. ఆయన మంగళవారం అసెంబ్లీలో కాలింగ్ అటెన్షన్ ద్వారా అతిసార విషయాన్ని ప్రస్తావించారు. అధికార యంత్రాంగం అతిసార నివారణకు చర్యలు తీసుకోవడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. అధికారులు సకాలంలో స్పందించి ఉంటే కొందరి ప్రాణాలైనా రక్షించేగలిగేవారని తెలిపారు. ‘ఈ-కొలి బ్యాక్టిరీయా కారణంగా కిడ్నీలు కూడా దెబ్బ తిన్నాయనే ప్రచారం జరుగుతోంది. అతిసార వ్యాధి ప్రబలడానికి అధికారులు ఖచ్చితమైన సమాచారం ఇవ్వాలి. రాజధానికి 30 కిలో మీటర్ల దూరంలో ఉన్న గుంటూరులో అతిసార వ్యాధితో 10 మంది చనిపోతే సభలో కనీస ప్రస్తావన లేకపోవడం బాధాకరం. అసెంబ్లీలో అరకొర సమాధానం ఇవ్వడం సరైన పద్దతి కాదు’ అని ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కాగా రాజధాని నగరంగా రూపాంతరం చెందుతున్న గుంటూరుకు అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ (యూజీడీ) మంజూరైందనగానే నగర ప్రజలు ఎంతో ఆనందించారు. అయితే యూజీడీ పనులు జరుగుతున్న తీరుతో ఆందోళన చెందుతున్నారు. రోడ్లను ఇష్టారాజ్యంగా తవ్వి, పైపులైనులు వేసిన అనంతరం జరిగా పూడ్చకపోవడంతో నగరం మొత్తం గుంతలమయంగా మారింది. యూజీడీ పనుల కోసం చేపట్టిన తవ్వకాల వల్ల భూమిలోని తాగునీటి పైపులైన్లు దెబ్బతిన్నాయి. ఫలితంగా తాగునీటిలోకి మురుగు చేరింది. దీంతో నీటిలో ప్రమాదకర ఈకోలి బ్యాక్టీరియా వృద్ధి చెందింది. ఈ బ్యాక్టీరియా కారణంగానే నగరంలో డయేరియా వ్యాధి ప్రబలి తొమ్మిది మందిని బలితీసుకుంది. గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని కొన్ని ప్రాంతాల్లో పైపులైనులు లీకై మురుగునీరు చేరింది. దీంతో తాగునీరు కలుషితమైంది. ఆ నీటిలో ప్రమాదకర ఈకోలి బ్యాక్టీరియా చేరింది. ఈ బ్యాక్టీరియా కారణంగా వందల మంది ప్రజలు డయేరియా బారిన పడ్డారని డీఎంహెచ్ఓ జొన్నలగడ్డ యాస్మిన్ పేర్కొన్న విషయం తెలిసిందే. తమ ప్రాంతాల్లో సైతం యూజీడీపనుల వల్ల పైపులైనులు లీకవడం, పగిలిపోవడం వంటి ఘటనలు చోటు చేసుకోవడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. -
చెప్పేవి శ్రీరంగనీతులు.. కూల్చేవి పేదల గుడిసెలు
గుంటూరు జిల్లా ధూళిపాళ్లలో అధికార పార్టీ ముఖ్యనేత నిర్వాకం తనయుని దందాలకు వత్తాసు పలుకుతున్న వైనం రూ.17 కోట్ల విలువ చేసే భూమిలో పాగా రౌడీల దౌర్జన్యాలకు కొమ్ము కాస్తున్న పోలీసులు! సాక్షి, హైదరాబాద్: చెప్పేవి శ్రీరంగనీతులు.. కూల్చేవి పేదల గుడి సెలు అన్న చందంగా మారింది గుంటూరు జిల్లాకు చెందిన ఓ ముఖ్యనేత వ్యవహారశైలి. అత్యంత గౌరవప్రదమైన పదవిలో ఉన్న ఆయన అందరికీ ఆదర్శంగా నిలవాల్సిందిపోయి తనయుడు చేస్తున్న భూదందాలు, దాష్టీకాలకు వత్తాసు పలుకుతూ తన పదవికే మచ్చతెస్తున్నారు. నరసరావుపేట, సత్తెనపల్లి నియోజకవర్గాల్లో వీరి అరాచకాలకు అడ్డూఅదుపూ లేకుండా పోతోంది. వీరి ఆగడాలను అడ్డుకోవాల్సిన పోలీసులు వారికే తొత్తులుగా మారిపోయారు. భూ ఆక్రమణలకు అండగా నిలుస్తూ బాధితుల ఆక్రందనలు పట్టించుకోవడం లేదు. సత్తెనపల్లి మండలం ధూళిపాళ్ళ గ్రామంలో గత నాలుగు రోజులుగా పేట రౌడీలు చేస్తున్న దౌర్జన్యకాండను నిలువరించకపోగా, వారి జోలికి ఎవరూ వెళ్ళకుండా కాపలాలు కాస్తున్నారంటే పోలీస్ వ్యవస్థ ఏ స్థాయికి దిగజారిందో అర్ధమవుతుంది. సత్తెనపల్లి మండలం ధూళిపాళ్ళ గ్రామంలో 17.30 ఎకరాల విలువైన భూమిని జిల్లా ముఖ్యనేత తనయునికి పీఏగా వ్యవహరించే ఓ వ్యక్తి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని పేర్కొంటూ బాధితుడు గొడుగుల సుబ్బారావు కోర్టును ఆశ్రయించారు. సదరు భూమి సుబ్బారావు ఆధీనంలో ఉండడంతో.. తమ స్వాధీనంలోకి తీసుకునే క్రమంలో ముఖ్యనేత తనయుని ఆదేశాలతో నరసరావుపేటకు చెందిన కొందరు రౌడీలు గత శనివారం రాత్రి వివాదాస్పద భూమిలోకి చొరబడి అక్కడ ఏర్పాటుచేసిన సీసీ కెమెరాలు ధ్వంసం చేసి బోర్డులను తొలగించారు. బాధితుని తరఫు బంధువులు రాస్తారోకోకు దిగడంతో అక్కడినుంచి వె ళ్లిపోయారు. తిరిగి ఆదివారం మధ్యాహ్నం పేటకు చెందిన రేషన్ మాఫియా ఆధ్వర్యంలో సుమారు 200 మంది రేషన్ డీలర్లు అక్కడికి వెళ్లి హల్చల్ చేశారు. అలా వెళ్లకపోతే మరోదఫా డీలర్‌షిప్‌లు దక్కకుండా చేస్తామని ముఖ్యనేత బెదిరించినట్టు సమాచారం. కాగా వీరు వెళ్లడానికి అరగంట ముందే బాధితుల తరఫు వారందరినీ పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించడంతో.. పోలీసులు ఉద్దేశపూర్వకంగా వారికి సహకరించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై బాధితుడు వైఎస్సార్సీపీ నేతల సహాయంతో రూరల్ ఎస్పీ నారాయణ నాయక్‌ను మంగళవారం కలసి ఫిర్యాదు చేశారు. అయినా ఫలితం లేకుండాపోయింది. కోళ్లఫారాలు కూల్చిన పేట రౌడీలు మంగళవారం అర్ధరాత్రి 2 గంటల సమయంలో వివాదాస్పద భూమిలోని సుబ్బారావుకు చెందిన రెండు కోళ్లఫారాలను పేట రౌడీలు పూర్తిగా కూల్చి నేలమట్టం చేశారు. షెడ్లల్లో ఉన్న రూ. 20 లక్షల విలువ చేసే పదివేల కోళ్లను ఎత్తుకు పోయారు. నరసరావుపేటకు చెందిన వ్యక్తులు అక్కడే మకాం వేసి తన మూడు ఎకరాల్లోని మొక్కజొన్న పంటను రోటావేటర్తో దున్ని నాశనం చేయడమే కాక కోళ్లఫారాలను కూల్చి వేశారని బాధితుడు సుబ్బారావు ఆవేదన వ్యక్తం చేశారు. సత్తెనపల్లి సబ్‌డివిజన్ పరిధిలోని పోలీస్ అధికారులంతా వారికే వత్తాసు పలుకుతూ వివాదాస్పద భూమికి సమీపంలోనే తిరుగుతూ అటువైపు ఎవరూ రాకుండా కాపాలా కాస్తున్నారని బాధితుడు వాపోయారు. తనకు జరిగిన అన్యాయంపై రాష్ట్ర స్థాయి పోలీసు అధికారులను కలిసి ఫిర్యాదు చేయనున్నట్లు ఆయన తెలిపారు. వివాదాస్పద భూమి ఆక్రమణ విషయంలో పోలీసుల పాత్రపై విచారణ జరుపుతున్నామని, వారి ప్రమేయం ఉన్నట్టు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని రూరల్ ఎస్పీ నారాయణ నాయక్ చెప్పారు. -
స్పీకర్ కోడెల కుమారుడి అనుచరుల వీరంగం
సత్తెనపల్లి (గుంటూరు) : సత్తెనపల్లి మండలం ధూళిపాళ్ల సమీపంలో ఓ రైతుకు చెందిన పొలంలో ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల కుమారుడు శివరామకృష్ణ అనుచరులు సోమవారం మధ్యాహ్నం వీరంగం సృష్టించారు. వివాదాస్పద భూమికి సంబంధించి కోర్టు తమకు అనుకూలంగా తీర్పు చెప్పిందని 50మంది వ్యక్తులు బలవంతంగా పొలం వద్దకు వెళ్లి అక్కడి పంటను ధ్వంసం చేశారు. అలాగే కోళ్లఫారం కూడా తొలగించారు. శనివారం రాత్రి కూడా ఎర్ర మాస్కులు ధరించిన దుండగులు పొలంలోకి జొరబడి కోళ్లఫారం వద్ద నిర్మించుకున్న ఇంటిని ధ్వంసం చేశారు. ఈ విషయమై ఆ భూమికి చెందిన రైతు సుబ్బారావు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తర్వాత బాధితుడితోపాటు గ్రామస్తులు రాస్తారోకో చేశారు. ఈ గొడవ సద్దమణగకముందే సోమవారం మధ్యాహ్నం మరోసారి పొలంలోకి చొరబడి పంట నాశనం చేస్తున్నారని సుబ్బారావు ఆవేదన వ్యక్తం చేశాడు. అక్కడికి చేరుకున్న పోలీసులు పొలంలోకి ఎవరినీ వెళ్లనీయకుండా చూస్తున్నారుగానీ లోపల జరుగుతున్న విధ్వంసాన్ని అడ్డుకోవడం లేదని స్థానికులు చెబుతున్నారు. ఈ వివాదాస్పద భూమి 17 ఎకరాలు ఉంది. దీనిపై కన్నేసిన స్పీకర్ కోడెల కుమారుని అనుచరులు పోలీసుల సాయంతో భూమిని స్వాధీనం చేసుకునే ప్రయత్నిస్తున్నారని బాధిత రైతు ఆరోపించాడు. ప్రస్తుతం అక్కడి పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది.