dialasys
-
కరోనా సోకడానికి ఆ సెంటరేనా కారణం?
సాక్షి, సిటీబ్యూరో/హుడాకాంప్లెక్స్: మీరు మూత్రపిండాల సమస్యతో బాధపడుతున్నారా? డయాలసిస్ కోసం ఆస్పత్రులకు వెళ్తున్నారా? అయితే కాస్త జాగ్రత్త సుమండీ! అసలే రోగ నిరోధకశక్తి తక్కువ.. ఆపై డయాలసిస్ కోసం వచ్చిన వారికి కరోనా వైరస్ విస్తరిస్తుండటంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. రోగుల ప్రాణాలు కాపాడాల్సిన సెంటర్లే వారి ప్రాణాలను హరిస్తుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్‌లో సుమారు 1,5000 మంది కిడ్నీ సంబంధిత సమస్యతో బాధపడుతున్నారు. వీరిలో చాలా మంది డయాలసిస్‌పై నెట్టుకొస్తున్నారు. డయాలసిస్‌కు వచ్చిన వారిలో ఎవరికి.. ఏ వైరస్ ఉందో? గుర్తించడం అక్కడి టెక్నిషియన్లకు కష్టసాధ్యంగా మారింది. డయాలసిస్ కోసం వచ్చిన వారిలో కొంత మందికి కరోనా వైరస్ సోకడం, వారి నుంచి ఇతర రోగులకు విస్తరిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా మలక్‌పేట కేంద్రంగా పని చేస్తున్న ఓ ప్రముఖ ఆస్పత్రిలో డయాలసిస్ చేయించుకున్న ముగ్గురు రోగులు సహా వారికి సన్నిహితంగా మెలిగిన మరో ఇద్దరు మొత్తం అయిదుగురు మృత్యువాత పడటం ఆందోళన కలిగిస్తోంది. వీరి ద్వారా ఆయా వ్యక్తుల కుటుంబ సభ్యులంతా వైరస్ బారిన పడాల్సివచ్చింది. అంతే కాదు చనిపోయిన వారికి కనీసం కర్మకాండలు కూడా చేయలేని దుస్థితి తలెత్తింది. డయాలసిస్ సెంటర్ల నిర్వహణ లోపం ఒకరి నుంచి మరొకరికి వైరస్ విస్తరణకు కారణమని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరణాలు.. కేసులు.. ♦ మూత్రపిండాల సమస్యతో బాధపడుతున్న సరూర్‌నగర్ జింకలబావి కాలనీకి చెందిన ఓ వృద్ధుడు (72) ఇటీవల ఇదే ఆస్పత్రిలో డయాలసిస్ చేయించుకున్నారు. ఆ తర్వాత రెండు రోజులకే తీవ్ర జ్వరం, దగ్గు, జలుబుతో బాధపడుతూ ఆస్పత్రిలో చేరగా, వైద్య పరీక్షల్లో ఆయనకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. మే ఒకటో తేదీన ఆయన మృతి చెందారు. ఈయన ద్వారా ఆయన కుమారుడికి వైరస్ సోకింది. డయాలసిస్ చేయించుకున్న తర్వాత వైరస్ బారిన పడి మృతి చెందిన వ్యక్తికి వైరస్ ఎక్కడ? ఎవరి నుంచి? ఎలా? వైరస్ సోకిందనేది ప్రశ్నార్థకంగా మారింది. ♦ గడ్డిఅన్నారం తిరుమలానగర్‌కు చెందిన మరో వృద్ధుడు (77) ఇటీవల ఆయన ఇదే కేంద్రంలో డయాలసిస్ చేయించుకున్నారు. ఆ తర్వాత ఆయన కరోనా వైరస్‌తో మృతి చెందారు. ఆయన ద్వారా ఇంట్లోని తొమ్మిది మందికి వైరస్ విస్తరించింది. ఆయన భార్య కూడా మృత్యువాత పడి ంది. భార్యభర్తలిద్దరూ చనిపోవడంతో ఆ కుటుంభాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టింది. అంతే కాదు.. ఆ తర్వాత అదే ఇంట్లో తొమ్మిది మందికి వైరస్ సోకి, వారంతా రిస్క్‌లో పడాల్సి వచ్చిది. ♦ వనస్థలిపురానికి చెందిన ఇంకో వృద్ధుడు (75) ఏప్రిల్ మూడో వారంలో మలక్‌పేటలోని ఓ ఆస్పత్రిలో డయాలసిస్ చేయించుకున్నారు. ఆ తర్వాత వైరస్ బారిన పడి ఏప్రిల్ 29న మృతి చెందారు. అప్పటికే ఆయన పెద్ద కుమారినికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడం, ఆ తర్వాత ఆయన ద్వారా ఆయన రెండో కుమారుడి(48)కి రావడం, తండ్రి చనిపోయిన రెండో రోజే ఆయ న కూడా చనిపోవడంతో ఆ కుటుంబం ఛిన్నాభిన్నమైంది. భార్య, ఇద్దరు కోడళ్లు సహా కుమార్తె, అల్లుడు, నలుగురు మనవళ్లు, ఇద్దరు మనవరాళ్లు, చిన్న కోడలి తల్లి, ఆమె కొడుకు, కోడలు, ఇద్ద రు మనవళ్లు, ఇంటి పనిమనిషి, కారు డ్రైవర్ ఇలా మొత్తం 25 మంది రిస్క్‌లో పడాల్సి వచ్చింది. -
బతికించండి!
హిమాయత్‌నగర్: రెండు కిడ్నీలు పూర్తిగా పాడయ్యాయి. దీంతో భర్త వదిలేశాడు. డయాలసిస్ చేయించుకునేందుకు చేతిలో చిల్లిగవ్వ కూడా లేదు. ఆరోగ్యం మరింత క్షీణించడంతో ‘పెర్మ్‌క్యాత్’ చేయాల్సిన అవసరం ఏర్పడింది. ఇది చేయని పక్షంలో డయాలసిస్ చేయడం కష్టమవుతుంది. డయాలసిస్ చేయకపోతే మనిషి బతికే చాన్స్ లేదంటూ వైద్యులు తెలిపారు. ఇదీ కేతావత్ కస్తూరి నాయక్ దీనగాథ. ఈ సమయంలో ఆమె దాతల కోసం ఎదురుచూస్తోంది. ఆదుకోవాలని అభ్యర్థిస్తోంది. బాలానగర్‌కు చెందిన కేతావత్ కస్తూరి నాయక్(37)కు రెండేళ్ల క్రితం కిడ్నీలు పూర్తిగా చెడిపోయాయి. అప్పటికే కస్తూరికి ఇద్దరు పిల్లలు కూడా ఉండగా... భర్త వదిలేసి వెళ్లిపోయాడు. పుట్టింటికి వెళ్దామంటే.. తల్లిదండ్రులు ఇద్దరూ చనిపోయారు. దీంతో దిక్కుతోచని స్థితిలో ‘వెల్ఫేర్ అసోసియేషన్ ఫర్ కిడ్నీ పేరెంట్స్’ ఫౌండర్, ప్రెసిడెంట్ ఐ.మమతను ఆమె ఆశ్రయించింది. కస్తూరిని వెస్ట్‌మారేడ్‌పల్లిలోని ఓ హాస్టల్లో ఉంచి ప్రతి నెలా వీరే డబ్బులు చెల్లిస్తున్నారు. అలాగే రెండేళ్లుగా అసోసియేషన్ ద్వారా డయాలసిస్ చేయిస్తున్నారు. రూ.2 లక్షలు అవసరం.. కస్తూరి నాయక్ శరీరంలో ‘ఫిస్టుల’ ఫెయిలైంది. దీంతో ఇప్పుడు ‘వాస్కులర్ సర్జన్’ ద్వారా ‘పెర్మ్‌క్యాత్’ చేయాల్సి ఉంది. దీనికి గాను రూ.లక్ష పైన అవసరం. ఈ చికిత్స చేసిన తర్వాత మందుల కోసం, తాను ఉండేందుకు గాను మొత్తం రూ.2లక్షల వరకు అవసరం కానుంది. దాతలు స్పందించి తనకు సాయం చేస్తే అందరిలాగే తన పిల్లలతో ఆనందంగా ఉంటానంటోంది కస్తూరి నాయక్. దాతలు సాయం చేయాలనుకుంటే.. బ్యాంకు వివరాలు పేరు: కేతావత్ కస్తూరి నాయక్ అకౌంట్ నంబర్: 0670101029026 బ్యాంకు: కెనరా బ్యాంక్ బ్రాంచి: ఉప్పల్ బ్రాంచ్ ఐఎఫ్‌సీ కోడ్: సీఎన్ఆర్బీ0000670 ఫోన్: 95055 90393,79950 56739, 94402 18174 -
కళ్లెదుటే ప్రాణం విడిచాడు!
కిడ్నీ వ్యాధిగ్రస్తుడు సకాలంలో వైద్యం అందక మృతి చెందాడు. శ్వాసతీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నఅతడిని చూసి బస్సులోంచి దించేశారు.రోడ్డు పక్కన తన ఒడిలో పెట్టుకుని భార్య సపర్యలు చేస్తుండగానే భర్త ప్రాణం వదిలాడు.గుండెలవిసేలా రోదిస్తున్న భార్యను చూసి ప్రతి ఒక్కరూ కంటతడి పెట్టారు. కళ్యాణదుర్గం: కుందుర్పి మండలం బసాపురం గ్రామానికి చెందిన వడ్డే ఈరన్న (65) మూడేళ్లుగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నాడు. వారానికొకసారి అనంతపురంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో డయాలసిస్ చేయించుకుంటున్నాడు. సోమవారం ఉదయం భార్య ఈరక్కతో కలిసి ఆస్పత్రికి బయల్దేరాడు. కుందుర్పి నుంచి ప్రైవేట్ బస్సులో కళ్యాణదుర్గం వచ్చి.. అక్కడి నుంచి మరో బస్సు ఎక్కారు. అప్పటికే ఈరన్న శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నాడు. గమనించిన కండక్టర్ తమకెందుకు రిస్క్ అనుకున్నాడో ఏమో వారిని టీ సర్కిల్లోనే దించేశాడు. భార్య ఒడిలోనే ప్రాణాలు వదిలిన భర్త శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్న భర్తను భార్య తన ఒడిలోకి తీసుకుని సపర్యలు చేసింది. నిమిషాల వ్యవధిలోనే భర్త ఊపిరి ఆగిపోయింది. కళ్లెదుటే భర్త మరణించడం ఆమె తట్టుకోలేకపోయింది. 108 సిబ్బంది వచ్చినా.. అప్పటికే ప్రాణం పోవడంతో వారు వెనుదిరిగారు. భర్త మృతదేహాన్ని ఒడిలో పెట్టుకుని రోదిస్తున్న ఆమెను స్థానికులు, ప్రయాణికులు చూసి ‘అయ్యో పాపం.. ఎంత కష్టం వచ్చిందంటూ’ నిట్టూర్చారు. గంట అవుతున్నా అలాగే రోదిస్తుండటంతో ఎమ్మార్పీఎస్ తాలూకా అధ్యక్షుడు గూబనపల్లి నాగరాజు, వైఎస్సార్సీపీ బీసీ సెల్ యూత్ నాయకుడు దొడగట్ట సూరి, మరికొంత మంది స్థానికులు చలించిపోయి మృతదేహాన్ని స్వగ్రామానికి పంపేందుకు ఏర్పాట్లు చేస్తుండగా.. విషయం తెలుసుకున్న కుమారులు భీమేష్, ఓబిలేసులు కళ్యాణదుర్గం చేరుకున్నారు. ప్రైవేట్ వాహనంలో ఈరన్న మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకెళ్లారు. మృతునికి ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. -
ఎయిమ్స్‌లో అరుణ్ జైట్లీకి డయాలసిస్
సాక్షి, న్యూఢిల్లీ : మరికొద్ది రోజుల్లో కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స నిర్వహించనున్న ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి ఎయిమ్స్‌లో డయాలసిస్ చేస్తున్నారని ఆస్పత్రి అధికారులు తెలిపారు. కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ సర్జరీకి ముందు కొద్దిరోజుల పాటు జైట్లీకి డయాలసిస్ చేస్తారని చెప్పారు. కిడ్నీలు పనిచేయకుండా విఫలమైన సందర్భంలో రక్తంలో విషపూరిత వ్యర్ధాలు పేరుకుపోకుండా డయాలసిస్ చేస్తారు. ఇతర కాంప్లికేషన్లు లేకుండా సర్జరీ విజయవంతంగా చేపట్టి మెరుగైన రికవరీ కోసం డయాలసిస్ నిర్వహిస్తున్నామని తెలిపారు. ఎన్నిరోజుల పాటు డయాలసిస్ చేస్తారనేదానిపై ఎయిమ్స్ వైద్యులు స్పష్టత ఇవ్వలేదు. త్వరలోనే జైట్లీకి కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ సర్జరీ జరుగుదుందని వెల్లడించారు. ఏ రోజైనా శస్త్రచికిత్స నిర్వహించవచ్చని తెలిపారు. సర్జరీ కోసం అవసరమైన లాంఛనాలను పూర్తి చేసేందుకు గురువారం మంత్రి జైట్లీ ఎయిమ్స్‌ను సందర్శించారు. ఎయిమ్స్ కార్డియో-న్యూరో టవర్‌లో శుక్రవారం చేరిన జైట్లీ అప్పటి నుంచి వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. కిడ్నీ దాతతో పాటు జైట్లీకి పలు పరీక్షలు నిర్వహించారు. కిడ్నీ దాత వివరాలను వైద్యులు, ఎయిమ్స్ అధికారులు గోప్యంగా ఉంచుతున్నారు. -
6 జిల్లాల్లో డయాలసిస్ సెంటర్లు, పాఠశాలలు
పాలకొల్లు అర్బన్ : రోటరీ ఇంటర్నేషనల్ ప్రోత్సాహంతో ఈ ఏడాది ఆరు జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టుగా డయాలసిస్ సెంటర్లు, రోటరీ స్కూళ్లు ఏర్పాటు చేస్తున్నట్టు రోటరీక్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ ఎస్వీఎస్ రావు అన్నారు. గవర్నర్ అధికారిక పర్యటనలో భాగంగా శుక్రవారం ఆయన పాలకొల్లు మండలంలో పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం నాగరాజుపేటలోని గురుకుల విద్యార్థులు ఎండ్ పోలియో ఆకృతిలో కూర్చుని పోలియోని శాశ్వతంగా నిర్మూలిద్దాం అంటూ నినాదం ఇచ్చారు. అంజలి మానసిక వికలాంగుల స్కూల్లో మదర్‌థెరిస్సా 150వ పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. క్లబ్ అధ్యక్షుడు బాలి ఏడుకొండలు విరాళం రూ.5 లక్షలతో నిర్మించిన భవన సముదాయాన్ని ఆయన ప్రారంభించారు. అంజలి స్కూల్ విద్యుదీకరణ నిమిత్తం రూ.40 వేలు విరాళాన్ని ప్రకటించారు. ఓఎన్జీసీ జనరల్ మేనేజర్ ఏవీవీఎస్ కామరాజు స్కూల్‌కి 12సీలింగ్ ఫ్యాన్లు విరాళం ప్రకటించారు. ఈ సందర్భంగా గురుకుల విద్యాలయలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రతి రెవెన్యూ డివిజన్‌లోనూ రోటరీ డయాలసిస్ సెంటర్, రోటరీ స్కూల్ ఏర్పాటుకు ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలు, దాతల సహకారంతో సన్నాహాలు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఛాంబర్ అధ్యక్షుడు కొప్పు సత్యనారాయణణ, క్ల»Œ æకార్యదర్శి అనంతపల్లి కిరణ్‌కుమార్, రావూరి వెంకట అప్పారావు, చందక రాము, గొర్ల శ్రీనివాస్, సోమంచి శ్రీనివాసశాస్త్రి, గుడాల హరిబాబు, యాతం రమేష్ తదితరులు పాల్గొన్నారు.