Diamonds found
-
12 లక్షల విలువైన వజ్రాలు ఈ నెలలో 20 లభ్యం
-
కర్నూల్ లో వజ్రాల వేట
-
660 కి.మీ. లోతుల్లో బ్లూ డైమండ్
వాషింగ్టన్: అత్యంత నాణ్యమైన వజ్రాలు భూమి అంతర్భాగంలో 410–660 కి.మీ.ల లోతుల్లో ఏర్పడతాయని ఓ అధ్యయనంలో తేలింది. భూమి మీద అత్యంత నాణ్యమైన, ఖరీదైన వజ్రంగా నీలం రంగు వజ్రాన్ని భావిస్తారు. వజ్రాలు, ఇతర రత్నాలు భూమి మాంటిల్ పొరలో ఏర్పడతాయి. అయితే ఈ నీలం డైమండ్ మాత్రం మాంటిల్ పొరకు సుమారు నాలుగు రెట్లు దిగువన ఏర్పడుతుందని పరిశోధకులు కనుగొన్నారు. ‘2బీ వజ్రాలుగా పిలిచే ఇవి చాలా ఖరీదైనవి’ అని జెమ్‌లాజికల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అమెరికాకు చెందిన పరిశోధకులు ఇవాన్ స్మిత్ తెలిపారు. ఈ తరహా వజ్రాల్లో చిన్న చిన్న మినరల్ క్రిస్టల్స్ ఉంటాయి. ఈ క్రిస్టల్స్‌ను బట్టి 2బీ వజ్రాలు ఏ విధంగా ఏర్పడ్డాయన్నది తెలుసుకునే అవకాశం ఉంటుందని అన్నారు. బోరాన్ మూలకం వల్లే 2బీ వజ్రానికి నీలం రంగు వచ్చిందని చెప్పారు. -
వెయ్యి కోట్ల పన్ను ఎగవేత!
సాక్షి, చెన్నై: ‘ఆపరేషన్ క్లీన్ మనీ’లో భాగంగా చెన్నై సహా తమిళనాడులోని పలు ప్రాంతాల్లో శశికళ సన్నిహితుల ఇళ్లలో ఐటీ సోదాలు రెండో రోజూ కొనసాగాయి. ఈ సోదాల్లో శశికళ, ఆమె కుటుంబ సభ్యులు రూ. 1000 కోట్ల పన్ను ఎగవేసినట్లు ప్రాథమిక విచారణలో తేలినట్లు సమాచారం. తనిఖీల్లో పెద్ద ఎత్తున నగదు, బంగారు నగలు, వెండి, వజ్రాలు బయటపడినట్లు తెలిసింది. పెద్ద సంఖ్యలో బినామీ సంస్థల ద్వారా నగదు బట్వాడా, బ్యాంకు ఖాతాలు, విదేశీ సంస్థల్లో పెట్టుబడులకు సంబంధించిన రికార్డులు స్వాధీనంచేసుకున్నట్లు సమాచారం. బంధువుల నుంచి పనిమనుషుల వరకు.. అక్రమాస్తుల కేసులో శిక్షననుభవిస్తున్న శశికళ, ఆమె భర్త నటరాజన్, సోదరుడు దివాకరన్, మేనల్లుడు దినకరన్‌లతో పాటు సన్నిహితులు, వారి సంస్థల్లో పనిచేస్తున్న సిబ్బంది, వారి బంధువులు, వారి వంట, పనిమనుషులు, జ్యోతిష్కుడు, వైద్యుడు, ఆడిటర్.. ఇలా ఆ కుటుంబంతో సంబంధమున్న వారి ఇళ్లల్లో, కార్యాలయాల్లో శుక్రవారం దాడులుచేశారు. రెండో రోజు 147 చోట్ల తనిఖీల్లో ఐటీ వర్గాలు నిమగ్నమయ్యాయి. పలుచోట్ల శశికళ, దినకరన్, దివాకరన్ మద్దతుదారులు దాడులకు వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు. శశికళ స్వగ్రామం మన్నార్గుడిలో ఉద్రిక్తత చోటుచేసుకోవడంతో ఆమె మద్దతుదారుల్ని పోలీసులు అరెస్టు చేశారు. ఈ తనిఖీల్లో వెయ్యి కోట్ల మేరకు పన్ను ఎగవేతకు సంబంధించిన ఆధారాలు చిక్కినట్టు ఓ అధికారి పేర్కొన్నారు. అలాగే, మన్నార్గుడిలోని దివాకరన్ కళాశాలలో రూ.25 లక్షలు విలువగల నగలు, వెండి బయట పడ్డట్టు తెలిసింది. ప్రధానంగా పది బినామీ సంస్థల వివరాలతో పాటు, విదేశాల్లోని అనేక సంస్థల్లో శశికళ కుటుంబం పెట్టుబడులకు సంబంధించిన రికార్డులు, దస్తావేజుల్ని ఐటీ వర్గాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. -
పద్మనాభ స్వామి వజ్రాలు దొరికాయ్
తిరువనంతపురం: కేరళలోని ప్రముఖ అనంత పద్మనాభ స్వామి ఆలయంలో కనిపించకుండా పోయిన 26 వజ్రాల్లో 12 తిరిగి దొరికాయి. ప్రత్యేక దర్యాప్తు బృందం వీటిని ఆలయం పరిసరాలలోనే గుర్తించింది. ఇది దొంగతనం కాదనీ, కొన్ని సంవత్సరాల క్రితం వజ్రాలను స్వామివారికి అలంకరిస్తున్నప్పుడో, మరో సమయంలోనో కనిపించకుండా పోయాయని దర్యాప్తు అధికారులు చెప్పారు. స్వామి అలంకరణకు ఉపయోగించే ఆభరణాలలో ఈ వజ్రాలు కూడా భాగమే. వజ్రాల విలువ కొన్ని కోట్ల రూపాయలు ఉంటుందనీ, ఎంత విలువ అనేది కచ్చితంగా ఇప్పుడే చెప్పలేమని అధికారులు పేర్కొన్నారు. 12 వజ్రాలతోపాటు గతంలో పోయిన మరికొన్ని విలువైన వస్తువులను కూడా దర్యాప్తు బృందం గుర్తించింది. మిగిలిన 14 వజ్రాల కోసం కూడా వెతికి త్వరలోనే కనుగొంటామని విచారణాధికారి వెల్లడించారు. ఎంతో విశాలంగా ఉండే ఈ ఆలయంలోని నాలుగు నేలమాళిగల్లో కొన్నేళ్ల క్రితం వందల కోట్ల విలువైన బంగారు ఆభరణాలు, పాత్రలు, ఇతర నగలు, అమూల్యమైన రాళ్లు బయటపడి దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవడం తెలిసిందే.