660 కి.మీ. లోతుల్లో బ్లూ డైమండ్‌ | Rare blue diamonds may be Earth's deepest secret | Sakshi
Sakshi News home page

660 కి.మీ. లోతుల్లో బ్లూ డైమండ్‌

Published Fri, Aug 3 2018 4:11 AM | Last Updated on Thu, Apr 4 2019 3:25 PM

Rare blue diamonds may be Earth's deepest secret - Sakshi

బ్లూ డైమండ్‌

వాషింగ్టన్‌: అత్యంత నాణ్యమైన వజ్రాలు భూమి అంతర్భాగంలో 410–660 కి.మీ.ల లోతుల్లో ఏర్పడతాయని ఓ అధ్యయనంలో తేలింది. భూమి మీద అత్యంత నాణ్యమైన, ఖరీదైన వజ్రంగా నీలం రంగు వజ్రాన్ని భావిస్తారు. వజ్రాలు, ఇతర రత్నాలు భూమి మాంటిల్‌ పొరలో ఏర్పడతాయి. అయితే ఈ నీలం డైమండ్‌ మాత్రం మాంటిల్‌ పొరకు సుమారు నాలుగు రెట్లు దిగువన ఏర్పడుతుందని పరిశోధకులు కనుగొన్నారు. ‘2బీ వజ్రాలుగా పిలిచే ఇవి చాలా ఖరీదైనవి’ అని జెమ్‌లాజికల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ అమెరికాకు చెందిన పరిశోధకులు ఇవాన్‌ స్మిత్‌ తెలిపారు. ఈ తరహా వజ్రాల్లో చిన్న చిన్న మినరల్‌ క్రిస్టల్స్‌ ఉంటాయి. ఈ క్రిస్టల్స్‌ను బట్టి 2బీ వజ్రాలు ఏ విధంగా ఏర్పడ్డాయన్నది తెలుసుకునే అవకాశం ఉంటుందని అన్నారు. బోరాన్‌ మూలకం వల్లే 2బీ వజ్రానికి నీలం రంగు వచ్చిందని చెప్పారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement