ప్రభుత్వ మందులు పారేశారు
మంచాల: ప్రజారోగ్యానికి పంపిణీ చేయాలని ప్రభుత్వం మందులను సమకూరిస్తే వాటిని అటవీప్రాంతంలో పారేసిన వైనం వెలుగులోకొచ్చింది. వివరాల్లోకెళితే జూలై 28 నుండి ఆగస్టు 8 వరకు మండలంలోని పాఠశాలల్లో ఆరోగ్యం-పరిశుభ్రత వంటి అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.ఈక్రమంలో విద్యార్థులకు బలాన్నిచ్చే ఫోలిక్ఆసిడ్ మందు బిళ్లలను ఇవ్వాలి. డయేరియా వంటి వ్యాధులు ప్రబలకుండా ఓఆర్ఎస్ ప్యాకెట్లు ప్రతి ఇంటికి పంచాలి. కాని గ్రామాల్లో ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో పంపిణీ చేయలేదు.
అయితే ప్రజలకు పంచాల్సిన ఈ మందులు బుధవారం జాపాల్-రంగాపూర్ అటవీ ప్రాంతంలోని చెట్లపొదల్లో పెద్దమొత్తంలో ప్రత్యక్షమయ్యాయి. అవి ఒక్కచోటే కాకుండా అక్కడకక్కడ విసిరేసినట్లుగా కనిపించాయి. ఇవి ప్రభుత్వం మాత్రమే సరఫరా చేసే మందులు కావడంతో వైద్యారోగ్య సిబ్బ ంది పారేసి ఉండవచ్చని స్థానికులు అనుమానం వ్య క్తం చేస్తున్నారు. ప్రభుత్వ వైద్యశాలకు వెళితే మందు లు లేవని, బయట తీసుకోవాలని చిట్టీలు రాస్తున్నారు. ఇక్కడ చూస్తే విలువైన మందులు అటవీపాలయ్యా యి. ఘటనపై ఆరుట్ల ప్రభుత్వ ఆస్పత్రి డాక్టర్ కిరణ్‌ను వివరణ కోరగా.. సదరు మందులను గ్రామా ల్లో ప్రజలకు పంచాలని ఏఎన్ఎంలు, ఆశవర్కర్లకు ఇచ్చామని, ఘటనపై విచారణ జరుపుతామని చెప్పారు.