differances
-
భార్య భర్తల మధ్య ఎంత వయసు తేడా ఉండాలి ?
ఆధునిక వివాహాలు అమ్మాయిలు తమకంటే ఎక్కువ వయసు ఉన్న వారిని పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడడం లేదు . ప్రేమ వివాహం అయితే సాధారణంగా తమ క్లాసుమేట్ లేదా ఒకటి రెండు సంవత్సరాల సీనియర్. తమ తోటి ఫ్రండ్స్ లవ్ మ్యారేజ్ చేసుకొన్నారు . అమ్మాయికన్నా, అబ్బాయి మహా అయితే, ఒకటిరెండెళ్లు పెద్ద . తమది అరేంజ్డ్ మ్యారేజ్ అయినా ఇలాగే ఉండాలని, అమ్మాయిలు అనుకొంటున్నారు . తమ కంటే వయసులో పెద్ద అయితే తమని చిన్న పిల్ల ను చూసినట్టు చూస్తారని , అంటే తమ పై డామినేట్ చేస్తారని అమ్మాయిలు అనుకొంటున్నారు . ఇందులో పాయింట్ ఉంది. అరేంజ్డ్ మ్యారేజ్ అయితే అమ్మాయికి అబ్బాయికి సగటు వయసు నేడు ముప్పై గా మారింది . ముప్పై ఏళ్లున్న అమ్మాయి తనకంటే వయసులో బాగా పెద్ద అయిన అబ్బాయి ని అంకుల్ అన్నట్టు చూస్తోంది . ఆరంజ్డ్ మ్యారేజెస్ లో నేడు అమ్మాయిల మాటే నడుస్తోంది . డిమాండ్ సప్లై ఇందుకు కారణం { లింగ నిష్పత్తి } . ఒకప్పటి వివాహాలు : ఒకప్పటి అంటే నేను వందేళ్లు వెనక్కు వెళ్లడం లేదు . ఆ రోజుల్లో బాల్య వివాహాలు ఎక్కువ . అంతే కాకుండా బహుభార్యత్వం ఎక్కువ . ఒక తరం లేదా రెండు తరాలు ముందుకు వెళితే { అంటే నేడు యాభై నుంచి డెబ్భై ఎనబై ఉన్నవారు} భార్య కి భర్తకి పదేళ్లు తేడా సహజంగా ఉండేది . స్త్రీలలో సాధారణంగా లైంగిక వాంఛ 45 వయసు ప్రాంతం లో సన్నగిల్లుతుంది . అదే ఆరోగ్య కరమయిన పురుషుడికి అరవై దాటాక కూడా అది కొనసాగుతుంది . ఒకే వయసు వారైతే నలబై యాభై లో పడ్డ భర్త లైంగిక వాంఛను, భార్య తీర్చే అవకాశం సన్నగిలుతుంది . అదే పదేళ్లు తేడా ఉంటే ఈ సమస్య రాదు . జీవశాస్త్ర పరంగా ఈ వయసు తేడా వాంఛనీయం . భర్తకు ముప్పై, భార్య కు ఇరవై ఉంటే వారికి పొసుగుతుందా ? స్రీలు సాధారణంగా తమ వయసులంటే ఎక్కువ మానసిక పరిణతిని కనబరుస్తారు . ఇంతే కాకుండా సాంప్రదాయిక వివాహాల్లో పురుషాధిక్యత ఉండేది . మనది పితృ వంశీయ , పితృ స్వామ్య , పితృ స్థానిక ఆచారం . ఇది అందరికీ తెలిసిందే . ఆధునిక భార్య తన భర్తను పేరుతొ పిలిస్తుంది . అదే వెనుకటి రోజుల్లో భర్త పేరు చెప్పాల్సి వచ్చినా, భార్య నానా హైరానా పడిపోయేది . "ఛీ పాడు.. నేను చెప్పను . ఆలా భర్త పేరు చెప్పకూడదు . అది అమర్యాద "అని చెప్పేది . సమాజం మారుతోంది . లింగ సమానత్వం మంచి పరిణామం . అదే సమయం లో ఇతర జైవిక అంశాలను కూడా పరిగణలోకి తీసుకోవాలి . అమ్మాయి అబ్బాయి ఇష్టపడినప్పుడు { నిన్న మెసెంజర్ లో ఇదే ప్రశ్న అడిగారు } పదేళ్లు వయసు తేడా తప్పు కాదు . ఒక కోణంలో అభిలషణీయం కూడా . చిన్నపిల్లల పై లైంగిక అత్యాచారాలు చేసే వారు రెండు రకాలు . 1 . జైవికంగా పెడోఫిల్లీ వాంఛ కలిగిన వారు . రెండోది అవకాశవాద పెడోఫిలీలు . ఈ రెండో కేటగిరీ లో నలబై ఏళ్ళ- యాభై అరవై ఏళ్ళ వల్లే ఎక్కువ . లైంగిక వాంఛ తీరక, "చిన్న పిల్లలైతే రిస్క్ తక్కువ .. అడ్డు చెప్పరు .. బయటపడదు" అని ఈ వెధవలు అనుకొంటారు . ఇటీవలి కాలం లో వీరి సంఖ్య భారీగా పెరుగుతోంది . దానికి ఒక కారణం పైన పేరా లో నేను చెప్పింది . మానవ సమాజానికి సంబంధించి సాధారణీకరణ అంటే నూటికి నూరు శాతం అని కాదు . సింహ భాగం మాత్రమే . పైన చెప్పిన నలబై యాభై లో కి అడుగుపెట్టి సెక్సువల్లి ఫ్రాస్ట్రేటెడ్ వారు ఎంత నిజమో ముప్పై లో ఉండి భార్య కు తీవ్ర అసంతృప్తిని మిగిల్చే లాప్ టాప్ వీరులు కూడా అంతే నిజం . -వాసిరెడ్డి అమరనాథ్ సబ్జెక్ట్ నిపుణుడు -
రెవెన్యూలో రచ్చ
ఏలూరు (మెట్రో) : జిల్లా రెవెన్యూ అసోసియేషన్‌లో విభేదాలు రచ్చకెక్కాయి. అసోసియేషన్ నాయకులు ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకునే స్థాయికి చేరాయి. ఇప్పటికే రాష్ట్ర రెవెన్యూ అసోసియేషన్ రెండు వర్గాలుగా చీలిపోగా.. ఒక వర్గం రెవెన్యూలో రచ్చ అశోక్‌బాబు తరఫున, మరోవర్గం బొప్పరాజు తరఫున పనిచేస్తున్నాయి. జిల్లాలో మాత్రం ఒకే రెవెన్యూ అసోసియేషన్ నడుస్తుండగా.. ఇందులో విభేదాలు తారస్థాయికి చేరాయి. జిల్లా రెవెన్యూ శాఖలో 2,500 మంది వీఆర్ఓలు, 909 మంది వీఆర్ఏలు, 900 మంది జూనియర్, సీనియర్ అసిస్టెంట్లు, ఆర్ఐలు, సూపరిం టెండెంట్లు, ఏఓలు కలిపి మొత్తంగా 4,300 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరందరి సమస్యల పరిష్కారానికి కృషి చేసే జిల్లా రెవెన్యూ అసోసియేషన్‌లో 12 మంది జిల్లాస్థాయి నాయకులు, ఏడుగురు కార్యవర్గ సభ్యులు, ఒక రాష్ట్ర కార్యదర్శి, 10 మంది డివిజన్ అధ్యక్షులు, కార్యదర్శులు ఉన్నారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం తాపత్రయం వ్యక్తిగత ప్రయోజనాల కోసమే అసోసియేషన్ నాయకులు వెంపర్లాడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. రెవెన్యూ అసోసియేషన్ తరఫున ఏదైనా ఆందోళన చేయాల్సి వస్తే ముందుగా సమావేశం నిర్వహించి.. అజెండాలో ఆ అంశాన్ని పొందుపర్చాలి. సభ్యులందరి నిర్ణయం మేరకు తీర్మానం ఆమోదించాలి. అనంతరం కలెక్టర్‌కు నివేదించాలి. అప్పటికీ సమస్య పరిష్కారం కాకుంటే నల్లబ్యాడీ్జలు ధరించి భోజన విరామ సమయంలో నిరసన తెలపడం వంటి దశలవారీ ఆందోళన కార్యక్రమాలు చేపట్టాల్సి ఉంటుంది. అయితే, ఫిబ్రవరి 13న అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు లాం విద్యాసాగర్ ఇవేమీ చేయకుండానే నేరుగా వర్కు టు రూల్ ఉద్యమానికి తెరతీశారు. ఇది ఆయన వ్యక్తిగత ప్రయోజనాల కోసమే చేశారంటూ యూనియన్ సభ్యులు విమర్శలు సంధించారు. దీంతో ఆ ఉద్యమం విఫలమైంది. కేసుల పరంపర సంఘ అధ్యక్షుడు విద్యాసాగర్ అసోసియేషన్‌కు వ్యతిరేకంగా పనిచేస్తున్నారంటూ మార్చి నెలలో రాష్ట్ర అసోసియేషన్ ప్రతినిధులు విచారణ జరిపారు. సంఘ సభ్యులే తనపై ఫిర్యాదులు చేశారని విద్యాసాగర్ ఆరోపించారు. అనంతరం అసోసియేషన్ జిల్లా కార్యదర్శి కె.రమేష్ కుమార్‌ను ఆ బాధ్యతల నుంచి తొలగిస్తున్నట్టు విద్యాసాగర్ ప్రకటించారు. తనను తొలగించే అధికారం ఎవరికీ లేదంటూ రమేష్ మంగళవారం కార్యవర్గ సమావేశం నిర్వహించగా.. రమేష్ తనపై దాడి చేసేందుకు సభ్యులను కూడగడుతున్నారని విద్యాసాగర్ ఏలూరు డీఎస్పీకి ఫిర్యాదు చేశారు. అనంతరం విద్యాసాగర్ కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేశారు. దీంతో రెండువర్గాల మధ్య ఘర్షణలు తలెత్తే అవకాశం ఉందనే ఉద్దేశంతో పోలీసులు జిల్లా రెవెన్యూ భవనం వద్ద పికెట్ ఏర్పాటు చేశారు. రూ.20 లక్షలు కాజేసేందుకు కుట్ర ! రెవెన్యూ అసోసియేషన్‌లో రూ.20 లక్షల సొమ్ము ఉన్నట్టు చెబుతున్నారు. ఆ మొత్తాన్ని కారు కొనేందుకు, స్వలాభాలకు ఉపయోగించుకునేందుకు అసోసియేషన్ నాయకులు కుట్ర పన్నుతున్నారనే ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో రెవెన్యూ అసోసియేషన్ ప్రతిని ధులు బుధవారం వర్గాలుగా విడిపోయి ఒకరిపై ఒకరు విమర్శలు సంధించుకుంటూ పత్రికలకు ప్రకటనలు విడుదల చేశారు. ఇది ఎటు దారితీస్తుందోననే ఆందోళన, ఉత్కంఠ రెవెన్యూ ఉద్యోగుల్లో నెలకొంది. -
నిప్పటించుకుని వ్యక్తి ఆత్మహత్య
పెదవేగి రూరల్ : కుటుంబ తగాదాల నేపథ్యంలో ఒక వ్యక్తి పెట్రోలు పోసుకుని నిప్పటించుకుని మంగళవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసుల కథనం ప్రకారం.. పెదవేగి గ్రామానికి చెందిన తాతా సాయిబాబు (30)కు మలగచర్ల గ్రామానికి చెందిన విజయషాలినికి ఏడాది కిత్రం వివాహమైంది. ఈ నేపథ్యంలో భార్యాభర్తల మధ్య మనస్పర్థలు చోటుచేసుకోవడంతో మృతుడి మామ పరసా మల్లేశ్వరరావు అప్పటి డీఎస్పీ సమక్షంలో కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు. తాజాగా నెల క్రితం సాయిబాబు తన భార్యను మామ ఇంటి వద్ద దింపి స్వగ్రామానికి వచ్చాడు. ఈ మధ్యలో పలుమార్లు మామ మల్లేశ్వరరావు తన కుమార్తెకు అనారోగ్యంగా ఉంది వచ్చి తీసుకెళ్లాలనిసాయిబాబుకు ఫోన్ చేసినా స్పందించలేదు. ఈ నేపథ్యంలో ఏమైందో తెలియదు.. ఉన్నంట్టుండి మంగళవారం సాయంత్రం 4.30 గంటల సమయంలో సాయిబాబు కోకో తోటకు వెళ్లి పెట్రోలు పోసుకుని నిప్పంటించుకున్నాడు. దీనిని పాలేరు ప్రసాద్ గమనించి వారి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడు. అప్పటికే సాయిబాబు మృతి చెందాడు. దీనిపై మృతుడి చిన్నాన తాతా సత్యనారాయణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వీరంకి రామకోటేశ్వరరావు తెలిపారు.