నిప్పటించుకుని వ్యక్తి ఆత్మహత్య
Published Thu, Oct 13 2016 1:35 AM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM
పెదవేగి రూరల్ : కుటుంబ తగాదాల నేపథ్యంలో ఒక వ్యక్తి పెట్రోలు పోసుకుని నిప్పటించుకుని మంగళవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసుల కథనం ప్రకారం.. పెదవేగి గ్రామానికి చెందిన తాతా సాయిబాబు (30)కు మలగచర్ల గ్రామానికి చెందిన విజయషాలినికి ఏడాది కిత్రం వివాహమైంది. ఈ నేపథ్యంలో భార్యాభర్తల మధ్య మనస్పర్థలు చోటుచేసుకోవడంతో మృతుడి మామ పరసా మల్లేశ్వరరావు అప్పటి డీఎస్పీ సమక్షంలో కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు. తాజాగా నెల క్రితం సాయిబాబు తన భార్యను మామ ఇంటి వద్ద దింపి స్వగ్రామానికి వచ్చాడు. ఈ మధ్యలో పలుమార్లు మామ మల్లేశ్వరరావు తన కుమార్తెకు అనారోగ్యంగా ఉంది వచ్చి తీసుకెళ్లాలనిసాయిబాబుకు ఫోన్ చేసినా స్పందించలేదు. ఈ నేపథ్యంలో ఏమైందో తెలియదు.. ఉన్నంట్టుండి మంగళవారం సాయంత్రం 4.30 గంటల సమయంలో సాయిబాబు కోకో తోటకు వెళ్లి పెట్రోలు పోసుకుని నిప్పంటించుకున్నాడు. దీనిని పాలేరు ప్రసాద్ గమనించి వారి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడు. అప్పటికే సాయిబాబు మృతి చెందాడు. దీనిపై మృతుడి చిన్నాన తాతా సత్యనారాయణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వీరంకి రామకోటేశ్వరరావు తెలిపారు.
Advertisement
Advertisement