భార్య భర్తల మధ్య ఎంత వయసు తేడా ఉండాలి ? | What Should Be The Age Difference Between Husband And Wife | Sakshi
Sakshi News home page

భార్య భర్తల మధ్య ఎంత వయసు తేడా ఉండాలి ?

Published Sat, Jan 28 2023 7:59 PM | Last Updated on Sat, Jan 28 2023 8:23 PM

What Should Be The Age Difference Between Husband And Wife - Sakshi

ఆధునిక వివాహాలు
అమ్మాయిలు తమకంటే ఎక్కువ వయసు ఉన్న వారిని పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడడం లేదు . ప్రేమ వివాహం అయితే సాధారణంగా తమ క్లాసుమేట్ లేదా ఒకటి రెండు సంవత్సరాల సీనియర్.

తమ తోటి ఫ్రండ్స్ లవ్ మ్యారేజ్ చేసుకొన్నారు . అమ్మాయికన్నా,  అబ్బాయి మహా అయితే,  ఒకటిరెండెళ్లు పెద్ద .  తమది అరేంజ్డ్ మ్యారేజ్ అయినా ఇలాగే ఉండాలని,  అమ్మాయిలు అనుకొంటున్నారు . తమ కంటే వయసులో పెద్ద అయితే తమని చిన్న పిల్ల ను చూసినట్టు చూస్తారని , అంటే తమ పై డామినేట్ చేస్తారని అమ్మాయిలు అనుకొంటున్నారు . ఇందులో పాయింట్ ఉంది.  

అరేంజ్డ్ మ్యారేజ్ అయితే అమ్మాయికి అబ్బాయికి సగటు వయసు నేడు ముప్పై గా మారింది . ముప్పై ఏళ్లున్న అమ్మాయి తనకంటే వయసులో బాగా పెద్ద అయిన అబ్బాయి ని అంకుల్ అన్నట్టు చూస్తోంది . ఆరంజ్డ్ మ్యారేజెస్ లో నేడు అమ్మాయిల మాటే నడుస్తోంది . డిమాండ్ సప్లై ఇందుకు కారణం { లింగ నిష్పత్తి } .

ఒకప్పటి వివాహాలు : ఒకప్పటి అంటే నేను వందేళ్లు వెనక్కు వెళ్లడం లేదు . ఆ రోజుల్లో బాల్య వివాహాలు ఎక్కువ . అంతే కాకుండా బహుభార్యత్వం ఎక్కువ .  ఒక తరం లేదా రెండు తరాలు ముందుకు వెళితే { అంటే నేడు యాభై నుంచి డెబ్భై ఎనబై ఉన్నవారు} భార్య కి భర్తకి పదేళ్లు తేడా సహజంగా ఉండేది .

స్త్రీలలో సాధారణంగా లైంగిక వాంఛ 45  వయసు ప్రాంతం లో సన్నగిల్లుతుంది . అదే ఆరోగ్య కరమయిన పురుషుడికి అరవై దాటాక కూడా అది కొనసాగుతుంది . ఒకే వయసు వారైతే నలబై యాభై లో పడ్డ భర్త లైంగిక వాంఛను,  భార్య తీర్చే అవకాశం సన్నగిలుతుంది . అదే పదేళ్లు తేడా ఉంటే ఈ సమస్య రాదు . జీవశాస్త్ర పరంగా ఈ వయసు తేడా వాంఛనీయం .

భర్తకు ముప్పై,  భార్య కు ఇరవై ఉంటే వారికి పొసుగుతుందా ?
స్రీలు సాధారణంగా తమ వయసులంటే ఎక్కువ మానసిక పరిణతిని కనబరుస్తారు . ఇంతే కాకుండా సాంప్రదాయిక వివాహాల్లో పురుషాధిక్యత ఉండేది .  మనది పితృ వంశీయ , పితృ స్వామ్య , పితృ స్థానిక ఆచారం . ఇది అందరికీ తెలిసిందే .

ఆధునిక భార్య తన భర్తను పేరుతొ పిలిస్తుంది . అదే వెనుకటి రోజుల్లో  భర్త పేరు చెప్పాల్సి వచ్చినా,  భార్య నానా హైరానా పడిపోయేది . "ఛీ పాడు.. నేను చెప్పను . ఆలా భర్త పేరు చెప్పకూడదు . అది అమర్యాద "అని చెప్పేది .

సమాజం మారుతోంది . లింగ సమానత్వం మంచి పరిణామం . అదే సమయం లో ఇతర జైవిక అంశాలను కూడా పరిగణలోకి   తీసుకోవాలి .

అమ్మాయి అబ్బాయి ఇష్టపడినప్పుడు { నిన్న మెసెంజర్ లో ఇదే ప్రశ్న అడిగారు } పదేళ్లు వయసు తేడా తప్పు కాదు . ఒక కోణంలో అభిలషణీయం కూడా . 

చిన్నపిల్లల పై లైంగిక అత్యాచారాలు చేసే వారు రెండు రకాలు . 1 . జైవికంగా పెడోఫిల్లీ వాంఛ కలిగిన వారు . రెండోది అవకాశవాద పెడోఫిలీలు . ఈ రెండో  కేటగిరీ లో నలబై ఏళ్ళ- యాభై అరవై ఏళ్ళ వల్లే ఎక్కువ . 

లైంగిక వాంఛ తీరక,  "చిన్న పిల్లలైతే రిస్క్ తక్కువ .. అడ్డు చెప్పరు .. బయటపడదు" అని ఈ వెధవలు అనుకొంటారు . ఇటీవలి కాలం లో వీరి సంఖ్య భారీగా పెరుగుతోంది . దానికి ఒక కారణం పైన పేరా    లో నేను చెప్పింది .

మానవ సమాజానికి సంబంధించి సాధారణీకరణ అంటే నూటికి నూరు శాతం అని కాదు . సింహ భాగం మాత్రమే .  పైన చెప్పిన నలబై యాభై లో కి అడుగుపెట్టి సెక్సువల్లి ఫ్రాస్ట్రేటెడ్  వారు ఎంత నిజమో ముప్పై లో ఉండి భార్య కు తీవ్ర అసంతృప్తిని మిగిల్చే లాప్ టాప్ వీరులు కూడా అంతే నిజం .
-వాసిరెడ్డి అమరనాథ్‌
సబ్జెక్ట్‌ నిపుణుడు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement