Dilapidated buildings
-
డేంజర్
శిథిలావస్థలో భవనాలు పట్టించుకోని అధికార యంత్రాంగం పొంచి ఉన్న ప్రమాదం గత ప్రమాదాల నుంచి పాఠాలు నేర్చని వైనం వర్షాలతో జనంలో భయం సిటీబ్యూరో: విశ్వ నగరం దిశగా అడుగులేస్తున్నామని చెబుతూ... ఆకాశ హర్మ్యాల వైపు చూస్తున్న అధికారులు తమ కళ్ల ముందు శిథిల భవనాల రూపంలో పొంచి ఉన్న మృత్యువును గుర్తించడంలో విఫలమవుతున్నారు. మహా నగరంలో వానకు తడుస్తూ... గాలికి ఊగుతూ ఏక్షణాన కూలిపోతాయో తెలియని స్థితిలో వందలాది భవనాలు ఉన్నాయి. పొరపాటున ఏదైనా భవనం కూలితే పెద్ద సంఖ్యలో ప్రాణ నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి. గతంలో చోటుచేసుకున్న ఈ తరహా సంఘటనల నుంచి అధికారులు ఎటువంటి పాఠమూ నేర్చుకున్నట్టు కనిపించడం లేదు. శిథిల భవనాలపై కానీ.. ఫైర్‌సేఫ్టీ నిబంధనల అమలుపై కానీ జీహెచ్ఎంసీ అధికారులు శ్రద్ధ కనబరచడం లేదు. ఏదైనా ఘోరం జరిగినప్పుడో.. ప్రజల ప్రాణాలు పోయినప్పుడో మాత్రం లేనిపోని హడావుడి చేస్తూ... ఆ తర్వాత మిన్నకుంటున్నారు. రెండేళ్ల క్రితం సిటీలైట్ హోటల్ ప్రమాదంలో 13మంది మృతి చెందినప్పుడు ఎంతో హడావుడి చేశారు. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపడతామన్నారు. ఆ తరువాత షరా మామూలే. ఈ సీజన్లో ఇప్పటి వరకూ చెప్పుకోదగ్గ స్థాయిలో వర్షం కురవలేదు. భారీ వర్షాలు వస్తే ఎన్ని భవనాలు కుప్పకూలుతాయో తెలియని దుస్థితి. గుర్తించేదెవరో... శిథిల భవనాలను గుర్తించేందుకు జీహెచ్ఎంసీ ఎలాంటి ప్రత్యేక ఏర్పాట్లూ చేయలేదు. తమ పరిధిలో ఉన్న భవనాల్లో బాగా పాతబడి... ఏ క్షణాన్నయినా కూలిపోవచ్చునేమోనన్నట్లుగా కనిపిస్తున్న వాటినే సంబంధిత అధికారులు శిథి లమైనవిగా గుర్తిస్తున్నారు. ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తున్న సందర్భాల్లో నోటీసులు జారీ చేస్తున్నారు. అంతే తప్ప స్ట్రక్చరల్ స్టెబిలిటీని బట్టి శిథిల భవనాలను గుర్తించడం లేదు. వర్షాకాలానికి ముందే ఇలాంటివి కూల్చివేయాల్సి ఉంది. ఆ పనులూ కనిపించవు. ఏటా మొక్కుబడిగా నోటీసులివ్వడం... తదుపరి చర్యలు లేకపోవడంతో, శిథిల భవనాల యజమానులు సైతం మరమ్మతు చర్యలు చేపట్టడం లేదు. లెక్క తేల్చినా... గట్టిగా నాలుగు చినుకులు పడితే 1819 భవనాలు కుప్పకూలడానికి సిద్ధంగా ఉన్నట్లు రెం డేళ్ల క్రితం గుర్తించారు. వాటిల్లో 845 భవనాలకు మరమ్మతులు చేయడమో లేక కూల్చివేయడమో జరిగినట్లు పేర్కొన్నారు. మిగతా 974 ఇంకా అదే దుస్థితిలో కొట్టుమిట్టాడుతున్నాయి. వాటిపై ఇంతవరకు ఎలాంటి చర్యలూ లేవు. వీటిలో కొన్ని కూలినప్పటికీ సమాచారం లేదు. గడచిన రెండేళ్లలో మరికొన్ని భవనాలు శిథిలావస్థకు చేరి నా వాటి లెక్కలే లేవు. ఇలాంటి భవనాలను చూ సి పరిసర ప్రాంతాల ప్రజలు తల్లడిల్లుతున్నారు. అమలుకు నోచని ప్రకటనలు.. తొలిదశలో యాభై ఏళ్లు దాటిన.. సున్నం తోనూ... పిల్లర్లు లేకుండా గోడల ఆధారంతో నిర్మించిన వాణిజ్య భవనాలను తనిఖీ చే సి చర్యలు తీసుకుంటామని రెండేళ్ల క్రితం చెప్పారు. సిటీలైట్ హోటల్ ప్రమాద ఘటనతో అప్పట్లో ఆ ప్రకటన చేశారు. ఆ తర్వాత మరచిపోయారు. ముంబై కార్పొరేషన్ చట్టం తరహాలో రాష్ట్రంలోనూ 30 ఏళ్లు దాటిన భవనాల యజమానులు స్ట్రక్చరల్ స్టెబిలిటీ సర్టిఫికెట్ ఇచ్చేలా చూస్తామన్నారు. ఆమేరకు జీహెచ్ ఎంసీ చట్టాన్ని సవరించనున్నట్లు ప్రకటించినప్పటికీ అమలుకు నోచలేదు. శిథిల భవనాల వివరాలను జీహెచ్ఎంసీ వెబ్సైట్లో ఉంచుతామనే హామీలూ అమలు కాలేదు. ఇదీ పరిస్థితి 2008లో వర్షాకాలంలో పాతబస్తీలోని పంజేషాలో పురాతన భవనం కూలి ముగ్గురు మృతి చెందారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. 2009లోనూ మరో రెండు భవనాలు కూలాయి.మూడేళ్ల క్రితం సైదాబాద్‌లో ఓ భవనం కూలింది.రెండేళ్ల క్రితం మౌలాలిలోని మెహదీజంగ్ కాలనీలో ప్రహరీ కూలి ఆరుగురు మృతి చెందారు.గతంలో దిల్‌సుఖ్‌నగర్‌లో సెల్లార్ పనులు జరుగుతుండగా ప్రమాదం జరిగింది. సోమాజిగూడలో ఓ కార్పొరేట్ ఆస్పత్రి పునరుద్ధరణ పనులు జరుగుతుండగా ప్రమాద ం సంభవించింది.శిథిల భవనాల్లోనూ, నిర్మాణ పనుల్లోనూ, సెల్లార్ల నిబంధనల్లోనూ చూసీ చూడనట్లు వ్యవహరి స్తుండటంతో ప్రజల ప్రాణాల మీదకు వస్తోంది. -
గతి తప్పిన గ్రంథాలయాలు
ఆదిలాబాద్ కల్చరల్ : ఆదిలాబాద్ నియోజకవర్గంలో గ్రంథాలయాల పరిస్థితి అసౌకర్యాల నడుమ కొనసాగుతోంది. జిల్లా కేంద్రంలోని గ్రంథాలయంలో కొంత అభివృద్ధి చెందిన అసౌకర్యాలు పోలేదు. విద్యార్థులకు పోటీ పరీక్షలకు కావాల్సిన పుస్తకాలు లేవు. గ్రూపు పరీక్షలకు సంబంధించిన మెటిరియల్ లేక గత్యంతరం లేక వేల రూపాయలు ఖర్చుచేసి పుస్తకాలు కొనాల్సినపరిస్థితి ఉంది. జిల్లా కేంద్రంలోని రెండో గేటు ప్రారంభానికి నొచుకోవడం లేదు. అరకొరగా పుస్తకాలు పాతవాటినే వాడుతున్నారు. కొత్త పుస్తకాలు కొనుగోలు చేయడం లేదు. జైనథ్ మండల కేంద్రంలోని గ్రంథాలయాల ప్రాథమిక పాఠశాలలో అద్దె భవనంలో కొనసాగుతోంది. అక్కడ అటెండరే లైబ్రేరియన్‌గా మారాడు. లైబ్రేరియన్ ఉన్నా లేనట్టేననే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సమయపాలన లేకుండా ఉంది. ఎప్పుడు తెరుస్తారో ఎప్పుడు తెరువరో ఎవరికీ తెలియని పరిస్థితి ఉంది. సదరు లైబ్రేరియన్ గ్రంథాలయ సంస్థ నాయకుడిగా ఉన్నందున అధికారులు చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి. బేల మండలంలోని గ్రంథాలయం మరాఠి మీడియం ప్రాథమిక పాఠశాలలో కొనసాగుతోంది. వసతులు లేకుండా ఉంది. కేవలం న్యూస్‌పేపర్లు మాత్రమే ఉన్నాయి. కనీస సౌకర్యాలు లేవు. ఎటు చూసినా అసౌకర్యాలే ఇచ్చోడ : చిరిగిన చొక్కా అయిన తొడుక్కొ.. కానీ ఓ మంచి పుస్తకం కొనుక్కొ అన్నారో కవి. అంటే పుస్తక పఠనం ద్వారా కలిగే లాభాలు, అవగాహన మనిషికి ఎంత అవసరమో స్పష్టమవుతోంది. పుస్తకాలు కొనలేని వారు గ్రంథాలయానికి వచ్చి చదువుకుంటారు. కానీ గ్రంథాలయాల్లో అనింన రకాల పుస్తకాలు ఉండడం లేదు. నిధుల కొరతతో ఈ సమస్య ఉంది. దీంతో విజ్ఞాన భాండాగారాలుగా విలసిల్లాల్సిన గ్రంథాలయాలు ఏ జ్ఞానమూ అందించలేకపోతున్నాయి. గదులు సరిపోక పుస్తకాలు, పత్రికలను నిల్వ చేసే పరిస్థితి కూడా చాలాచోట్ల లేదు. ప్రభుత్వ పట్టింపులేనితనం ఈ దుస్థితికి కారణమవుతోంది. బోథ్ నియోజకవర్గంలోని ఏడు మండలాల్లో గ్రంథాలయాలను అసౌర్యాలు వెంటాడుతున్నాయి. తలమడుగు, బోథ్, నేరడిగొండ, గుడిహత్నూర్ మండలాల గ్రంథాలయాలకు సొంత భవనాలు లేవు. పంచాయతీ కార్యాలయల్లో కొన్ని, అద్దె భవనాల్లో మరిన్ని కొనసాగుతున్నాయి. పుస్తకాలు పెట్టే స్థలం లేక అధికారులు ఇబ్బందులు పడుతున్నారు. ఇరుకు గదుల్లో అసౌకర్యాల మధ్య చదవలేక పాఠకులు అవస్థలు పడుతున్నారు. ఇచ్చోడలో భవనం ఉన్నా సరిపడా ఫర్నిచర్ లేక పాఠకులకు ఇబ్బందులు తప్పడంలేదు. నేరడిగొండ మండలంలో గ్రంథాలయం పంచాయతీకి చెందిన ఇరుకు గదిలో కొనసాగుతోంది. బోథ్ గ్రంథాలయం 30 ఏళ్లుగా గ్రామాభివృద్ధి కమిటీ తరఫున ఇచ్చిన భవనంలో అరకొర వసతులు మధ్య కొనసాగుతోంది. గుడిహత్నూర్‌లో పరిస్థితి మరింత అధ్వానంగా ఉంది. ఒకే గది దిక్కయిందిక్కడ. ఇక్కడి గ్రంథాలయ అధికారి తరచూ రాకపోవడంతో గ్రంథాలయం మూసే ఉంటోంది. బజార్హత్నూర్ మండల గ్రంథాలయానికి సొంత భవనం లేదు. దీంతో ప్రస్తుతం పశువైద్యశాలకు చెందిన భవనంలోనే తాత్కాలికంగా కొనసాగుతోంది. ఈ క్రమంలో ఇక్కడ పాఠకులకు తీవ్ర తిప్పలు తప్పడం లేదు. నిర్మాణం పూర్తయ్యేదెప్పుడో? నిర్మల్ : నిర్మల్‌లో 1958లో గ్రంథాలయాన్ని ప్రారంభించారు. మొదట గాంధీచౌక్‌లో ఓ అద్దె భవనంలో దీనిని నిర్వహించారు. 1960లో పౌర గ్రంథాలయ చట్టం అమలులోకి రావడంతో డీఈవో పరిధిలోకి, అనంతరం గ్రంథాలయాలకు ప్రత్యేక శాఖ ఏర్పడడంతో 1962లో గ్రంథాలయశాఖ ఆధ్వర్యంలో కొనసాగుతూ వస్తోంది. అద్దె భవనం కావడం, అక్కడ సమస్యలు తెలత్తడంతో 2004 నవంబర్‌లో నిర్మల్ పాలించిన పాలకులు నిర్మించిన వందల ఏళ్ల నాటి సర్ద్మహాల్ (శీతలమందిరం)లోకి మార్చారు. అయితే ప్రస్తుతం కొనసాగుతున్న భవనం పురాతనమైనది కావడం, ఒకటే గది ఉండడం అది కూడా పుస్తకాలను భద్రపర్చేందుకే సరిపోతోంది. దీంతో వచ్చే పాఠకులు ఆరుబయటే చదువుకునే పరిస్థితులు నెలకొంటున్నాయి. అలాగే భవనం వెనుకభాగంలో ఉన్న బావిలో నుంచి విషసర్పాలు, తేళ్లు వంటి వస్తుండడంతో అధికారులు, పాఠకులు భయాందోళనల మధ్య పఠించే పరిస్థితి ఏర్పడింది. ఈ గ్రంథాలయ ఆధునికీకరణకు గతంలో అధికారులు, ప్రజాప్రతినిధులు హామీలు ఇచ్చారు. కానీ నేటికీ అవి ఆచరణకు నోచుకోలేదు. నియోజకవర్గంలోని మామడలో పురాతన భవనంలోనే గ్రంథాలయం కొనసాగుతోంది. మిగతా మండలాలకు గ్రంథాలయ భవనాలున్నా ఇతర సౌకర్యాలు కల్పించాల్సి ఉంది. -
‘దిన్’ వాసుల్ని ఖాళీ చేయించండి
ముంబై: శిథిల భవనాల్లో నివసిస్తున్న వారిని తక్షణమే ఖాళీ చేయించాలని రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ (మాడా)కు హైకోర్టు సూచించింది. లేకపోతే తాము ఈ విషయంలో జోక్యం చేసుకోవాల్సి వస్తుందని హెచ్చరించింది. మధ్యముంబైలోని పరేల్ ప్రాం తంలో శిథిలావస్థకు చేరుకున్న దిన్ భవనంలో నివసిస్తున్నవారిని మూడువారాల్లోగా ఖాళీ చేయిం చాలని ఆదేశించింది. జస్టిస్ వి.ఎం.కనడే, జస్టిస్ ఎం.ఎస్.సోనక్‌ల నేతృత్వంలోని ధర్మాసనం ఈ మేరకు మాడాకు ఉత ్తర్వులు జారీచేసింది. కాగా 90 ఏళ్ల క్రితంనాటి దిన్ భవన పునరాభివృద్ధి హక్కులను పొందిన హరేకృష్ణ బిల్డర్స్ సంస్థ... అందులో నివసిస్తున్నవారిని తక్షణమే ఖాళీ చేయించాలంటూ సదరు భవన నిర్వహణ బాధ్యతలను నిర్వర్తిస్తున ్న మాడాను ఆదేశించాలంటూ హైకోర్టులో ఇటీవల పిటిషన్ దాఖలుచేసింది. కాగా దిన్ భవనం ఏ క్షణంలోనైనా కూలిపోయే ప్రమాదం ఉందని హరేకృష్ణ బిల్డర్స్ తన పిటిషన్లో పేర్కొంది. ఈపిటిషన్ను పరిశీలించిన జస్టిస్ కనడే స్పందిస్తూ ‘అనేక భవనాలు ఒకదాని వెంట మరొకటిగా కూలుతున్న ఘటనలను ప్రస్తుతం మనం చూస్తూనే ఉన్నాం. ఈ ఘటనల్లో అనేకమంది అమాయకులు తమ ప్రాణాలను కోల్పోయారు. కూలిపోయే దశకు చేరుకున్న భవనాల్లో నివసిస్తున్నామని తెలిసినప్పటికీ అనేకమంది అందులోనే తమ జీవనయానాన్ని కొనసాగిస్తున్నారు. ఖాళీ చేసేందుకు వారు ఎంతమాత్రం ఇష్టనడడం లేదు. ఇలా తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా అందులో జీవించేవారి విషయం లో కోర్టులు జోక్యం చేసుకుంటాయి. తగు చర్యలు తీసుకుంటాయి’ అని పేర్కొన్నారు. కాగా మూడువారాల్లోగా ఖాళీ చేయించాలంటూ రాష్ర్ట గృహనిర్మాణ శాఖను ఆదేశించిన హైకోర్టు... అందులో నివసిస్తున్న ప్రతి ఒక్కరికీ ఏడాదికాలానికి ఇంటికి కిరాయికయ్యే మొత్తంతోపాటు అడ్వాన్సు కూడా చెల్లించాలంటూ సదరు భవన డెవలపర్‌ను ఆదేశించింది.