ముంబై: శిథిల భవనాల్లో నివసిస్తున్న వారిని తక్షణమే ఖాళీ చేయించాలని రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ (మాడా)కు హైకోర్టు సూచించింది. లేకపోతే తాము ఈ విషయంలో జోక్యం చేసుకోవాల్సి వస్తుందని హెచ్చరించింది. మధ్యముంబైలోని పరేల్ ప్రాం తంలో శిథిలావస్థకు చేరుకున్న దిన్ భవనంలో నివసిస్తున్నవారిని మూడువారాల్లోగా ఖాళీ చేయిం చాలని ఆదేశించింది. జస్టిస్ వి.ఎం.కనడే, జస్టిస్ ఎం.ఎస్.సోనక్‌ల నేతృత్వంలోని ధర్మాసనం ఈ మేరకు మాడాకు ఉత ్తర్వులు జారీచేసింది. కాగా 90 ఏళ్ల క్రితంనాటి దిన్ భవన పునరాభివృద్ధి హక్కులను పొందిన హరేకృష్ణ బిల్డర్స్ సంస్థ... అందులో నివసిస్తున్నవారిని తక్షణమే ఖాళీ చేయించాలంటూ సదరు భవన నిర్వహణ బాధ్యతలను నిర్వర్తిస్తున ్న మాడాను ఆదేశించాలంటూ హైకోర్టులో ఇటీవల పిటిషన్ దాఖలుచేసింది.
కాగా దిన్ భవనం ఏ క్షణంలోనైనా కూలిపోయే ప్రమాదం ఉందని హరేకృష్ణ బిల్డర్స్ తన పిటిషన్‌లో పేర్కొంది. ఈపిటిషన్‌ను పరిశీలించిన జస్టిస్ కనడే స్పందిస్తూ ‘అనేక భవనాలు ఒకదాని వెంట మరొకటిగా కూలుతున్న ఘటనలను ప్రస్తుతం మనం చూస్తూనే ఉన్నాం. ఈ ఘటనల్లో అనేకమంది అమాయకులు తమ ప్రాణాలను కోల్పోయారు. కూలిపోయే దశకు చేరుకున్న భవనాల్లో నివసిస్తున్నామని తెలిసినప్పటికీ అనేకమంది అందులోనే తమ జీవనయానాన్ని కొనసాగిస్తున్నారు. ఖాళీ చేసేందుకు వారు ఎంతమాత్రం ఇష్టనడడం లేదు. ఇలా తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా అందులో జీవించేవారి విషయం లో కోర్టులు జోక్యం చేసుకుంటాయి. తగు చర్యలు తీసుకుంటాయి’ అని పేర్కొన్నారు. కాగా మూడువారాల్లోగా ఖాళీ చేయించాలంటూ రాష్ర్ట గృహనిర్మాణ శాఖను ఆదేశించిన హైకోర్టు... అందులో నివసిస్తున్న ప్రతి ఒక్కరికీ ఏడాదికాలానికి ఇంటికి కిరాయికయ్యే మొత్తంతోపాటు అడ్వాన్సు కూడా చెల్లించాలంటూ సదరు భవన డెవలపర్‌ను ఆదేశించింది.
‘దిన్’ వాసుల్ని ఖాళీ చేయించండి
Published Fri, Dec 6 2013 12:28 AM | Last Updated on Sat, Sep 2 2017 1:17 AM
Advertisement