MHADA
-
4,082 ఇళ్లకు 23 వేలకు పైగా అప్లికేషన్లు
మహారాష్ట్ర హౌసింగ్ అండ్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ (MHADA) ముంబైలో వివిధ వర్గాల ప్రజలకు అందుబాటు ధరల్లో అపార్ట్మెంట్లను అందిస్తోంది. ఇందు కోసం లాటరీ నిర్వహించి ఫ్లాట్లను కేటాయించనుంది. ఈ ఇళ్ల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. 23 వేలకు పైగా దరఖాస్తులు ఎంహెచ్ఏడీఏ మొత్తం 4,083 ఫ్లాట్లకు మే 21 నుంచి దరఖాస్తుల స్వీకరణ చేపట్టింది. వీటికి ఇప్పటివరకూ 23 వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. అయితే 4,083 ఫ్లాట్లలో ఒకటి లిటిగేషన్లో ఉండటంతో దాన్ని జాబితా నుంచి తొలగించింది. దీంతో మొత్తం ఫ్లాట్ల సంఖ్య 4,082కు తగ్గింది. లాటరీ జాబితా నుంచి తొలగించిన ఈ అపార్ట్మెంట్ ముంబైలోని దాదర్ ప్రాంతంలోని ఒక మధ్యతరగతి సమూహం (MIG) అపార్ట్మెంట్. దాదాపు 750 చదరపు అడుగుల విస్తీర్ణం ఉంది. దీని విలువు రూ. 2 కోట్లకు పైగా ఉంటుంది. ధర రూ.24 లక్షల నుంచి రూ.7.57 కోట్లు 200 నుంచి 1,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ అపార్ట్మెంట్ల ధర రూ.24 లక్షల నుంచి రూ.7.57 కోట్ల మధ్య ఉంటుంది . అమ్మకానికి ఉన్న 4,082 ఫ్లాట్లు ఆర్థికంగా వెనుకబడిన విభాగం (EWS), దిగువ ఆదాయ వర్గం (LIG), మధ్య ఆదాయ సమూహం (MIG), అధిక ఆదాయ సమూహం (HIG) వంటి వివిధ వర్గాల కోసం ఉద్దేశించారు. కాగా దరఖాస్తులను సమర్పించడానికి చివరి తేదీ జూన్ 26. లాటరీ ఫలితాలు జూలై 18న ప్రకటిస్తారు. ఇదీ చదవండి: Oldest Real Estate Agent: 74 ఏళ్ల వయసులో రియల్ఎస్టేట్ ఏజెంట్! పరీక్ష రాసి మరీ.. -
ఐదేళ్ల తర్వాత అమ్ముకోవచ్చు..
సాక్షి, ముంబై: మహారాష్ట్ర హౌసింగ్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ (మాడా) ఇళ్లలో ఉంటున్న మిల్లు కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. యజమానులు తమ మాడా ఇళ్లను ఐదేళ్ల తరువాత అమ్ముకోవడానికి అనుమతినిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇదివరకు ఈ ఇళ్లను పదేళ్ల తరువాత మాత్రమే విక్రయించాలనే నిబంధన ఉండేది. కానీ, మిల్లు కార్మికులు పడుతున్న ఆర్థిక ఇబ్బందులు, వారి డిమాండ్లను దృష్టిలో పెట్టుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు నిబంధనలను సడలించడానికి అంగీకరించింది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో మిల్లు కార్మికులు, వారి వారసులు, కుటుంబ సభ్యుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరంలో సుమారు 56 వస్త్ర మిల్లులు ఉండేవి. రెండు దశాబ్దాల కిందటి వరకు మిల్లు కార్మికులతో ముంబై నగరం కళకళలాడేది. అయితే, 2000-2005 సంవత్సరాల మధ్య కాలంలో దశలవారీగా వస్త్ర మిల్లులన్నీ మూతపడ్డాయి. దీంతో వేలాది మంది కార్మికులు రోడ్డున పడ్డారు. ఆ తరువాత మూతపడిన మిల్లుల స్థానంలో కార్మికులకు ఇళ్లు నిర్మించి, చౌక ధరకే అందజేయాలనే డిమాండ్ తెరమీదకు వచ్చింది. ఈ మేరకు అనేక ఆందోళనలు జరిగాయి. మిల్లు కార్మికుల సంఘాలు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడం ప్రారంభించాయి. కార్మికుల డిమాండ్లకు ఇతర రాజకీయ పార్టీలు కూడా మద్దతు పలకడంతో అప్పటి కాంగ్రెస్, ఎన్సీపీ కూటమి ప్రభుత్వం దిగివచ్చింది. మిల్లుల స్థానంలో కార్మికులకు ఇళ్లు కట్టి ఇచ్చేందుకు అంగీకరించింది. ఈ మేరకు కార్మికుల నుంచి దరఖాస్తులు స్వీకరించి పరిశీలన ప్రక్రియ పూర్తిచేసింది. లాటరీ పద్ధతిలో అర్హులను ఎంపిక చేసి చౌక ధరకే వారికి ఇళ్లను అందజేసింది. అయితే, పదేళ్ల వరకు ఆ ఇళ్లను విక్రయించరాదని, అద్దెకు కూడా ఇవ్వరాదని నిబంధనలు విధించింది. దీంతో కార్మికుల ఆర్థిక ఇబ్బందులు తీవ్రం అయ్యాయి. ఇక్కడ ఎక్కువ ధరకు అద్దెకిచ్చి మరోచోట తక్కువ అద్దెకు ఉందామనుకున్న అనేక పేద కుటుంబాల ఆశలకు ప్రభుత్వ నిబంధనలు అశనిపాతంగా మారాయి. దీంతో కార్మిక సంఘాలు ఈ అంశాన్ని పలుమార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాయి. ఈ క్రమంలో ఇళ్లను అద్దెకు ఇచ్చుకునేందుకు ప్రభుత్వం అంగీకారం తెలిపింది. కానీ, ఇళ్లు వచ్చిన కార్మికుల్లో కొందరు చనిపోగా, వారి కుటుంబ సభ్యులు సొంత గ్రామాలకు వెళ్లిపోయారు. మరికొందరు పిల్లల చదువులు, పెళ్లిళ్లు చేసి అప్పుల పాలయ్యారు. ఉన్న ఇంటిని అమ్ముకొనైనా అప్పులు తీరుద్దామని, ఆర్థిక ఇబ్బందుల నుంచి బయట పడదామని అనుకున్న వారి ఆశలకు ప్రభుత్వ నిబంధనలు అడ్డుగా నిలిచాయి. పదేళ్ల వరకు ఆ ఇళ్లను విక్రయించడానికి వీలు లేకపోవడంతో గత్యంతరం లేని అనేక మంది గుట్టుచప్పుడు కాకుండా దళారుల ద్వారా అమ్ముకోవడం మొదలు పెట్టారు. ఈ విషయం ప్రభుత్వం దృష్టికి వెళ్లినప్పటికీ తగిన రుజువులు లేకపోవడంతో ఏమీ చేయలేకపోయింది. దళారీ వ్యవస్థ వల్ల కార్మికులు ఆర్థికంగా చాలా నష్టపోతున్నారు. అంతేగాక, రిజిస్ట్రేషన్, స్టాంపు డ్యూటీ ద్వారా ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయనికి కూడా గండి పడుతోంది. వీటన్నింటిని పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం ఇళ్లు కేటాయించిన ఐదేళ్ల తరువాత అమ్ముకునేందుకు వీలు కల్పించింది. ఇళ్లను విక్రయించేందుకు ప్రభుత్వం అధికారికంగా అనుమతినివ్వడంతో దళారుల బెడద తప్పనుంది. అధికారికంగా క్రయ, విక్రయాలు జరగడం వల్ల రిజిస్ట్రేషన్, స్టాంపు ద్వారా ప్రభుత్వ ఖజానాలోకి అదనంగా ఆదాయం కూడా రానుంది. -
ప్రముఖ బాలీవుడ్ హీరోకి లీగల్ నోటీసులు
ముంబై: ప్రముఖ బాలీవుడ్ హీరో అనిల్ కపూర్ కు మహారాష్ట్ర హౌసింగ్ అండ్ ఏరియా డెవలప్ మెంట్ అథారిటీ(ఎమ్ హెచ్ఏడీఏ) లీగల్ నోటీసులు జారీ చేసింది. ఒక ప్రైవేటు నిర్మాణ సంస్థ కు సంబంధించి తప్పుడు ప్రకటన లో ఆయన ఉన్నందుకు ఈ నోటీసులు జారీ అయ్యాయి. ఏక్తా వరల్డ్ లో నిర్మిస్తున్న ఫ్లాట్ల విక్రయానికి సంబంధించి డెక్కన్ క్రానికల్ పత్రికలో ఒక ప్రకటనను ఇచ్చారు. ఇందులో ఎమ్ హెచ్ఏడీఏ కంటే తక్కువ ధరకే తాము ఫ్లాట్ల అమ్మకం చేపడతామని ప్రకటించారు. తప్పుడు సమాచారంతో తమ సంస్థ పేరును వాడుకున్నారని ఏక్తా వరల్డ్ యాజమాని అశోక్ మెహనాని కి, ప్రకటనలో నటించినందకు అనిల్ కపూర్ కూ నోటీసులను ఎమ్ హెచ్ఏడీఏ జారీచేసింది. -
బీడీడీ చాల్స్ పునరుద్ధరణ ప్రక్రియ వేగవంతం
- టెండర్లు ఆహ్వానించిన ఎంహెచ్ఏడీఏ - ఎం ఆదేశాల మేరకు మొదలైన పనులు - మొత్తం 198 భవనాలకు మరమ్మతులు సాక్షి, ముంబై: నగరంలోని బాంబే డవలప్మెంట్ డిపార్ట్మెంట్ (బీడీడీ) చాల్స్ పునరుద్ధరణ ప్రక్రియను మహారాష్ట్ర గృహనిర్మాణ అభివృద్ధి సంస్థ (ఎంహెచ్ఏడీఏ) వేగవంతం చేసింది. మాస్టర్ ప్లాన్ తయారు చేసేందుకు ఆసక్తి ఉన్న బిల్డర్ల నుంచి టెండర్లు ఆహ్వానించింది. నగరంలోని నాయ్‌గావ్, వర్లీ, ఎన్.ఎం.జోషి మార్గ్ ప్రాంతాల్లో బీడీడీ చాల్స్ ఉన్నాయి. మొత్తం 86.98 హెక్టర్ల స్థలంలో ఉన్న 198 భవనాలను బ్రిటిష్ కాలంలో 1920-1925 మధ్య నిర్మించారు. ప్రస్తుతం వీటి కాలం చెల్లిపోవడంతో శిథిలావస్థ కు చేరుకున్నాయి. మరమ్మతు పనులకు రూ.140 కోట్లు ఖర్చు చేసినప్పటికీ ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా ఉంది పరిస్థితి. దాదాపు 16వేల కుటుంబాలు నివాసముంటున్నాయి. ఎప్పుడు, ఏ రూపంలో ప్రమాదం ముంచుకొస్తుందో తెలియని దుస్థితి నెలకొంది. వర్షాకాలంలో బిక్కుబిక్కుమంటూ గడపాల్సిందే. ఈ నేపథ్యంలో వాటిలో నివాసం ఉంటున్న వారికి తాత్కాలికంగా మరోచోట పునరావసం కల్పించి చాల్స్‌ను పునరాభివృద్ధి చేయాలని ఎంహెచ్ఏడీఏనిర్ణయించింది. దక్షిణ ముంబైలోని అత్యంత కీలకమైన ప్రాంతంలో ఈ భవనాలు ఉండటంతో ఈ స్థలాలకు భారీ డిమాండ్ ఉంది. గత ప్రభుత్వాల నిర్లక్ష్యపు నీడలో కొట్టుమిట్టాడిన చాల్స్ నివాసులకు బీజేపీ ప్రభుత్వం ఆదుకుంటామని తెలిపింది. ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఏప్రిల్‌లో జరిగిన ఓ సమావేశంలో బీడీడీ చాల్స్‌ను పునరాభివృద్ధి చేస్తామని సీఎం ఫడ్నవీస్ ప్రకటించారు. సీఎం ఆదేశాల మేరకు 195 చాళ్లను అభివృద్ధి చేసేందుకు ఎంహెచ్ఏడీఏ నడుము బిగించింది. ఇందుకోసం బిల్డర్లు, ఆర్కిటెక్చర్ల నుంచి టెండర్లను ఆహ్వానించింది. దశాబ్దాలుగా అభివృద్ధికి ఆమడదూరంలో ఉన్న బీడీడీ చాల్స్ నివాసులకు త్వరలో మంచి రోజుల వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
31.5 వేలకు చేరిన ఎంహెచ్ఏడీఏ ఇళ్ల దరఖాస్తులు
- మంగళవారం ఒక్క రోజే ఏడు వేల దరఖాస్తులు - అక్షయ తృతీయ కావడంతోనే.. సాక్షి, ముంబై: మహారాష్ట్ర గృహ నిర్మాణ అభివృద్ధి సంస్థ (ఎంహెచ్ఏడీఏ) నిర్మించిన ఇళ్ల కోసం భారీ సంఖ్యలో అక్షయ తృతీయ రోజున ఆన్లైన్లో దరఖాస్తులు అందాయి. మంగళవారం ఉదయం నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు సమారు 7,100 దరఖాస్తులు వచ్చినట్లు సమాచారం. దీంతో మొత్తం దరఖాస్తుల సంఖ్య 31,580కు చేరింది. ఈ విషయాన్ని ఎంహెచ్ఏడీఏ ముంబై రీజియన్ అధికారి చంద్రకాంత్ డాంగే వెల్లడించారు. మంచి ముహూర్తం కావడంతో అందులో 722 మంది ఇళ్ల కోసం బ్యాంకులో డీడీలు కూడా తీశారు. మధ్య తరగతితోపాటు అల్ప, అత్యల్ప వర్గాలందరికీ ఇళ్లు ఉండాలనే ఉద్దేశంతో ముంబై దగ్గరలోని సైన్, గోరేగావ్, ములుండ్, మాన్‌ఖుర్ద్ తదితర ప్రాంతాల్లో ఎంహెచ్ఏడీఏ ఈ ఏడాది 997 ఇళ్లు నిర్మించి సిద్ధంగా ఉంచింది. ఇందులో అర్హులైన వారి ఆదాయాన్ని బట్టి దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. ఇందుకు సంబంధించి మే 31న బాంద్రాలోని రంగశారద సభా గృహంలో లాటరీ వేయనున్నారు. అందులో ఇళ్లు దక్కిన వారు డీడీ డబ్బులు పోగా మిగతా సొమ్ము చెల్లించాలి. ఈ నెల 15వ తేదీ నుంచి ఆన్లైన్లో దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. మొదటి రోజే 6,756 మంది దరఖాస్తు చేసుకున్నారు. అయితే సంఖ్య ఇంకా పెరగవచ్చని ఎంహెచ్ఏడీఏ అధికారులు భావించినా.. అది సగానికి తగ్గిపోయింది. అక్షయ తృతీయ ముహూర్తం సందర్భంగా ఏడు వేలకుపైగా దరఖాస్తులు చేసుకోవడంతో అధికారులకు ఆశ్చర్యాన్ని కలిగించింది. గడువు మే 18న సాయంత్రం ఆరు గంటల ముగియనుంది. -
‘దిన్’ వాసుల్ని ఖాళీ చేయించండి
ముంబై: శిథిల భవనాల్లో నివసిస్తున్న వారిని తక్షణమే ఖాళీ చేయించాలని రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ (మాడా)కు హైకోర్టు సూచించింది. లేకపోతే తాము ఈ విషయంలో జోక్యం చేసుకోవాల్సి వస్తుందని హెచ్చరించింది. మధ్యముంబైలోని పరేల్ ప్రాం తంలో శిథిలావస్థకు చేరుకున్న దిన్ భవనంలో నివసిస్తున్నవారిని మూడువారాల్లోగా ఖాళీ చేయిం చాలని ఆదేశించింది. జస్టిస్ వి.ఎం.కనడే, జస్టిస్ ఎం.ఎస్.సోనక్‌ల నేతృత్వంలోని ధర్మాసనం ఈ మేరకు మాడాకు ఉత ్తర్వులు జారీచేసింది. కాగా 90 ఏళ్ల క్రితంనాటి దిన్ భవన పునరాభివృద్ధి హక్కులను పొందిన హరేకృష్ణ బిల్డర్స్ సంస్థ... అందులో నివసిస్తున్నవారిని తక్షణమే ఖాళీ చేయించాలంటూ సదరు భవన నిర్వహణ బాధ్యతలను నిర్వర్తిస్తున ్న మాడాను ఆదేశించాలంటూ హైకోర్టులో ఇటీవల పిటిషన్ దాఖలుచేసింది. కాగా దిన్ భవనం ఏ క్షణంలోనైనా కూలిపోయే ప్రమాదం ఉందని హరేకృష్ణ బిల్డర్స్ తన పిటిషన్లో పేర్కొంది. ఈపిటిషన్ను పరిశీలించిన జస్టిస్ కనడే స్పందిస్తూ ‘అనేక భవనాలు ఒకదాని వెంట మరొకటిగా కూలుతున్న ఘటనలను ప్రస్తుతం మనం చూస్తూనే ఉన్నాం. ఈ ఘటనల్లో అనేకమంది అమాయకులు తమ ప్రాణాలను కోల్పోయారు. కూలిపోయే దశకు చేరుకున్న భవనాల్లో నివసిస్తున్నామని తెలిసినప్పటికీ అనేకమంది అందులోనే తమ జీవనయానాన్ని కొనసాగిస్తున్నారు. ఖాళీ చేసేందుకు వారు ఎంతమాత్రం ఇష్టనడడం లేదు. ఇలా తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా అందులో జీవించేవారి విషయం లో కోర్టులు జోక్యం చేసుకుంటాయి. తగు చర్యలు తీసుకుంటాయి’ అని పేర్కొన్నారు. కాగా మూడువారాల్లోగా ఖాళీ చేయించాలంటూ రాష్ర్ట గృహనిర్మాణ శాఖను ఆదేశించిన హైకోర్టు... అందులో నివసిస్తున్న ప్రతి ఒక్కరికీ ఏడాదికాలానికి ఇంటికి కిరాయికయ్యే మొత్తంతోపాటు అడ్వాన్సు కూడా చెల్లించాలంటూ సదరు భవన డెవలపర్‌ను ఆదేశించింది.