Dilip Trivedi
-
సీఆర్పీఎఫ్ కోసం అక్తర్ గీతం
28న రాష్ట్రపతి ఆవిష్కరణ న్యూఢిల్లీ: దాదాపు 3 లక్షల మంది సిబ్బందితో దేశ భద్రతలో ప్రధాన భూమిక పోషిస్తున్న కేంద్ర పారామిలిటరీ బలగాల(సీఆర్పీఎఫ్) సేవలను కొనియాడుతూ ప్రఖ్యాత బాలీవుడ్ రచయిత జావేద్ అక్తర్ ఓ గీతాన్ని రాశారు. ‘హం హే దేశ్కే రక్షక్..’ అంటూ సాగే ఈ గీతాన్ని సీఆర్పీఎఫ్ 75వ ఆవిర్భావ దినోత్సవమైన ఈ నెల 28న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆవిష్కరించనున్నట్టు ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. సీఆర్పీఎఫ్కు ఇప్పటికే ఓ గీతం ఉన్నప్పటికీ తాజా సేవలు, పరిణామాల నేపథ్యంలో సీఆర్పీఎఫ్ డెరైక్టర్ జనరల్ దిలీప్ త్రివేదీ ఈ గీతాన్ని రాయించారని వివరించారు. నక్సల్స్ వ్యతిరేక పోరులో విజయం సాధించిన బలగాలకు ఆవిర్భావ దినోత్సవంలో శౌర్య పతకాలను అందించనున్నట్టు తెలిపారు. -
సీఆర్పీఎఫ్ నూతన అధిపతిగా దిలీప్ త్రివేది
దేశంలో అతిపెద్ద పారమిలటరీ దళమైన సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) అధిపతిగా దిలీప్ త్రివేది శనివారం నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. ఉత్తరప్రదేశ్ కేడర్‌కు చెందిన దిలీప్ త్రివేది 1978 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. ఇప్పటి వరకు ఆయన సరిహద్దు భద్రత దళంలో ప్రత్యేక డైరెక్టర్ జనరల్‌గా విధులు నిర్వర్తించారు. గతంలో కేంద్రంలో పలు కీలక పదవులను దిలీప్ త్రివేది ఎంతో సమర్థవంతగా నిర్వహించారు. కాగా ఇప్పటి వరకు ఆ పదవిలో కొనసాగిన ప్రణయ్ సహయి జులై 31న పదవి విరమణ పొందారు. దీంతో ఎన్ఎస్జీ అధిపతి అరవింద్ రాజన్‌కు నాటి నుంచి సీఆర్పీఎఫ్ అధిపతిగా తాత్కలిక బాధ్యతలను హోం మంత్రిత్వశాఖ అప్పగించింది. దేశవ్యాప్తంగా సీఆర్పీఎఫ్ దళంలో దాదాపు 3 లక్షలకు పైగా సిబ్బంది పని చేస్తున్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాల్లోని నక్సల్స్ చర్యలను నిరోధించేందుకు సీఆర్పీఎఫ్ సమర్థవంతంగా పని చేస్తున్న సంగతి తెలిసిందే.