Dimonitization
-
కేంద్రం చెబుతున్న మానిటైజేషన్‌తో ప్రయోజనం ఎవరికి ?
నష్టాలపాలవుతున్న ప్రభుత్వ ఆస్తుల నగదీకరణ గురించి కేంద్ర ప్రభుత్వం డాంబిక పదజాలం వెనుక దాక్కుంటోంది కానీ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం భారత ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటుకు అప్పగించే పథకాన్ని ప్రకటించింది. ఈ పథకంలో రహదారులు, నౌకాశ్రయాలు, విమానాశ్రయాలు, రైల్వే ట్రాక్, స్టేషన్లు, ఇంధన పైప్ లైన్లు, టెలికాం టవర్లు, ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్, వేర్‌హౌస్‌లు, స్టేడియంలు వంటి ప్రభుత్వ ఆస్తులను బడా ప్రైవేట్ మదుపుదారులకు స్వాధీనం చేయనున్నారు. 2025 ఆర్థిక సంవత్సరం నాటికి నాలుగేళ్ల కాలంలో రూ.6 లక్షల కోట్ల నగదు సమీకరణ ఈ పథకం లక్ష్యం. ఈ భారీ మొత్తాన్ని కొత్త మౌలిక వసతుల కల్పనకు ఉపయోగిస్తామని ప్రభుత్వం చెప్పింది.అయితే ఇది ప్రైవేటీకరణ ఏమాత్రం కాదని కేంద్ర ఆర్థిక మంత్రి వాదించారు. చర్చించాల్సిన అంశాలు ప్రస్తుతం మౌలిక వసతుల కల్పనకు సంబంధించి ఉనికిలో ఉన్న, పనిచేస్తున్న ప్రభుత్వ రంగ సంస్థల ప్రాజెక్టుల నుంచి రాబడులు ఆర్జించడానికి ప్రైవేట్ మదుపుదారులకు నిర్దిష్ట కాలం వరకు వాటిపై హక్కులను తాత్కాలికంగా ప్రైవేట్ యాజమాన్యాలకు అప్పగిస్తున్నామని నిర్మలా సీతారామన్ వక్కాణించారు. అయితే ఈ ఆస్తులపై యాజమాన్యం ప్రభుత్వం చేతిలోనే ఉంటుందని స్పష్టం చేశారు. ఇక్కడ నాలుగు అంశాలను చర్చించాల్సి ఉంది. - ఉపయోగం లేకుండా వృ«థాగా ఉంటున్న ప్రభుత్వ ఆస్తుల విలువను పెంచడమే జాతీయ నగదీకరణ లక్ష్యం అని చెబుతున్నారు. కానీ ఇలా ప్రైవేట్ పరిశ్రమలకు అప్పగించిన ఆస్తులు నిర్దిష్టకాలం తర్వాత ప్రభుత్వానికి తిరిగి దఖలుపర్చడం జరిగినప్పటికీ, తదుపరి దశ నగదీకరణ కోసం వీటిని మళ్లీ మార్కెట్లోకి ప్రభుత్వం పంపించగలదు. ఆస్తులపై తనకు యాజమాన్య హక్కులు ఉన్నాయని ప్రభుత్వం భావించవచ్చు. కానీ తన వద్ద ఉన్నమౌలికరంగ ఆస్తులను ప్రభుత్వం ఎన్నడూ నిర్వహించిన పాపాన పోలేదు. అలాగని సేవలను అందిం చిందీ లేదు. కానీ ఆ ఆస్తుల విలువను కేవలం డబ్బు చేసుకోవాలనుకుం టోంది. కానీ గత అనుభవాల బట్టి, మదుపుదారులను ఆకర్షించడానికి ప్రభుత్వ ఆస్తుల అమ్మకం పెద్దగా పనిచేయదని తెలుస్తుంది. పైగా ప్రభుత్వ ఆస్తుల వేలం ప్రారంభానికి ముందే వాటిద్వారా ఇంత వస్తుందని అంచనా వేస్తున్నప్పటికీ, ఆస్తుల అమ్మకాల ద్వారా లభించే మొత్తం అంత అధికంగా ఉండదు. - ప్రభుత్వ మాలిక రంగ ఆస్తులను తీసుకుని, వాటిని నిర్వహించడం ద్వారా వాటి సేవల అమ్మకాల నుండి వచ్చే రాబడులపై ప్రైవేట్ రంగానికి గ్యారంటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వమే ఈ ఆస్తులకు యజమానిగా ఉన్నప్పటికీ, ధరలు నిర్ణయించడం వాణిజ్యపరంగా ఉంటుంది. ప్రైవేట్ రంగం ఆశించే అధిక రాబడులు సిద్ధించాలంటే వినియోగదారులపై భారీగా యూజర్ చార్జీలు విధించాల్సి ఉంటుంది లేదా ఈ రాబడుల విషయంలో వచ్చే వ్యత్యాసాన్ని పూడ్చడానికి ప్రభుత్వమే నిధులను పంపిణీ చేయవలసి ఉంటుంది. రాబడులు తక్కువగా ఉండి లేదా పరిమితంగా ఉన్న సందర్భాల్లో ప్రభుత్వ సహాయం గణనీయంగా ఉండాలి. ఈ క్రమంలో ప్రభుత్వం భారీ స్థాయిలో నిధులను వెచ్చించాల్సి ఉంటుంది. - తగినన్ని రాబడులను ఆర్జించడానికి ప్రైవేట్ రంగం ఖర్చులను తగ్గించుకునే స్వాతంత్య్రం కావాలని డిమాండ్ చేయవచ్చు. వీటిలో కార్మికులు, సిబ్బందిపై పెట్టే ఖర్చులు కూడా ఉంటాయి. లేబర్ ఖర్చులను తగ్గించే ప్రయత్నం వేతనాల కోత, ఉద్యోగాల నుంచి తొలగింపు వంటి అంశాలతో ముడిపడి ఉంటుంది. సంఘటిత కార్మిక మార్కెట్ల కోసం ప్రమాణాలు స్ధిరంగా కొనసాగించే ప్రభుత్వరంగ పాత్ర ఈ విషయంలో పూర్తిగా తగ్గిపోవచ్చు లేదా దాని ప్రాధాన్యతను తొలగించవచ్చు కూడా. - ప్రభుత్వ ఆస్తులను సాధించిన ప్రైవేట్ రంగ మేనేజర్లు వాంఛనీయమైన సేవలను అందించే విషయమై ప్రభుత్వం ఏ రకమైన పాత్ర నిర్వహిస్తుంది అనే అంశంపై ఈ జాతీయ నగదీకరణ విధానం స్పష్టత ఇవ్వడం లేదు. ఈ లక్ష్యం కోసం రెగ్యులేటరీ వ్యవస్థను అమలు చేసినట్లయితే, అది ఖర్చుతో కూడుకున్నది. కాలహరణం కూడా జరగవచ్చు. దీనివల్ల అధిక ఖర్చులతో కూడిన సేవల నాణ్యత నిర్లక్ష్యానికి గురై క్షీణించే అవకాశం కూడా ఉంది. అంతిమ లబ్ధి వాళ్లకే ఆస్తుల నగదీకరణపై ఒక్కమాటలో చెప్పాలంటే, గ్రీన్ ఫీల్డ్ ఇన్ఫ్రా ప్రాజెక్టులపై పెట్టుబడి వనరులను సమీకరించడం అంటే బడా వ్యాపార వర్గాల చర్యలకు ఈ రంగం మొత్తాన్ని విస్తరించజేయడమే అవుతుంది. స్పష్టంగా చెప్పాలంటే వినియోగదారులు లేదా ప్రభుత్వ ఖజానా నుంచి పెట్టే ఖర్చుతో బడా పారిశ్రామిక వర్గాలు అధిక రాబడులను ఆర్జిస్తాయి. అంటే సంపద అనే పిరమిడ్‌లో శిఖరాగ్రాన ఉంటున్న వర్గాలవారికే మరింత ఆదాయాన్ని, సంపదను పంపిణీ చేయడమే నగదీకరణ అంతిమ లక్ష్యం. ప్రజా సంపదను తాకట్టు పెడుతున్న కుంభకోణాన్ని తలపించే ఈ పథకం కొంతమంది ఎంపిక చేసుకున్న వాణిజ్య వర్గాలను మరింతగా బలపర్చడానికే ఉపయోగపడుతుంది తప్పితే కేంద్రప్రభుత్వం ఘనంగా చెబుతున్నట్లుగా కొత్త ఆస్తుల సృష్టికి ఏమంత పెద్దగా దోహదం చేయదు. మానిటైనేజన్ ఓ కుంభకోణం జాతీయ మౌలిక వసతుల కల్పనా రంగంతో సహా పలు కీలక ప్రాజెక్టుల్లో వచ్చే అయిదేళ్ల కాలంలో మొత్తం 111 లక్షల కోట్ల రూపాయలను మదుపు చేయనున్నట్లు కేంద్రం ప్రకటించింది. అయితే ప్రభుత్వ ఆస్తుల అమ్మకం లేదా నగదీకరణ పథకం ద్వారా వస్తుందని భావిస్తున్నది 6 లక్షల కోట్ల రూపాయలు మాత్రమే. అంటే కొత్త మౌలిక రంగ ప్రాజెక్టులకు ఈ నగదీకరణ పథకం ద్వారా అందేది అందులో అయిదు శాతం మాత్రమే. వాస్తవానికి, గడిచిన కొన్ని దశాబ్దాలుగా ప్రజాధనం వెచ్చించి సృష్టించిన అపార సంపదలను బడా వాణిజ్య వర్గాలకు కట్టబెట్టడానికి ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వం కంకణం కట్టుకుంటోంది. ప్రభుత్వ ఆస్తులను ప్రైవేట్ పరం చేయడం ద్వారా ప్రభుత్వానికి వచ్చే అయిదేళ్ల కాలంలో ముట్టేది అయిదు శాతం కంటే తక్కువే అనేది చేదు నిజం. ఇది పథకం ప్రకారం రూపొందిస్తున్న భారీ కుంభకోణం తప్ప మరేమీ కాదు. నగదీకరణ వాస్తవ రాబడి ఎంత? ప్రభుత్వ రంగ ఆస్తులను ప్రైవేట్ సంస్థలకు 25 సంవత్సరాల పాటు లీజు లేదా రెంట్‌కు అప్పగించడం ద్వారా 6 లక్షల కోట్ల రూపాయల రాబడిని కేంద్రం ఆశిస్తోంది. కానీ ప్రభుత్వానికి అంతిమంగా మిగిలేది పెద్దగా ఉండదని చిన్న ఉదాహరణ చెబుతుంది. ఆస్తుల విలువ ఇప్పుడు 100 రూపాయలు అనుకుందాం. ఈ సంపదపై సంవత్సరానికి 4 శాతం రాబడి వస్తుందనుకుందాం (ద్రవ్యోల్బణం తీసివేశాక). అయితే ప్రైవేటు వ్యాపారులు వాస్తవ వడ్డీరేటు అంచనా 6 శాతం అనుకుంటే ఈ వందరూపాయల సంపదపై వారికి వచ్చేది రూ. 51.3. దీన్ని రౌండ్ ఫిగర్ కింద 50గా మారిస్తే 25 ఏళ్లకాలానికి 4 శాతం వార్షిక రాబడి కింద వంద రూపాయల ఆస్తిపై రూ.50 రాబడి వచ్చినట్లు లెక్క. అంటే ఆస్తుల నగదీకరణ కింద అప్పగించిన ప్రతి వంద రూపాయలకు ప్రైవేట్ ఆపరేటర్‌కి వచ్చే రాబడి 50 రూపాయలన్నమాట. దీంట్లోంచి పెట్టుబడిపై ఆశించే రాబడిని తీసివేయాలి. తన మదుపుపై 50 శాతం కనీస రాబడిని ప్రైవేట్ వ్యాపారి ఆశిస్తున్నట్లయితే, ప్రతి రూ.100 ఆస్తిపై రూ.35లను చెల్లించడానికి అతడు సిద్ధపడతాడు. ఇప్పుడు అసలు లెక్క వస్తుంది. ఆరు లక్షల కోట్ల మార్కెట్ విలువ నుంచి రెంటల్ తదితర ఖర్చులను మినహాయిస్తే ప్రభుత్వానికి వచ్చే అసలు రాబడి రూ.1.5 లక్షల కోట్లు మాత్రమే. వరుస తప్పిదాలు వాస్తవానికి కేంద్రప్రభుత్వం పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ వంటి విధ్వంసకర నిర్ణయాల ద్వారా ఆర్థిక వ్యవస్థను నిశ్శబ్ద సంక్షోభంలోకి నెట్టివేసింది. 2019లో కార్పొరేట్ రంగానికి పన్నుల కోత ద్వారా రూ.1.45 లక్షల కోట్లను మిగిలించడం అతిపెద్ద విధ్వంసకర నిర్ణయం. జీడీపీ వృద్ధి నిరంతరాయంగా పతనం చెందడం, ఆర్థికంగా తప్పుడు నిర్ణయాల వల్ల రాబడులు తగ్గిపోవడం, వీటికి తోడు కార్పొరేట్ పన్ను కోతల భారం నుంచి తప్పించుకునేందుకు చమురు ధరను పెంచుతూ పోయారు. ప్రత్యక్ష పన్నులను పెంచడం ద్వారా దిగువ మధ్యతరగతి వినియోగదారులను పరోక్షంగా దెబ్బ తీశారు. దీంతో జీడీపీ పతన బాట పడుతూనే వచ్చింది. ఆస్తుల అప్పగింత ద్వారా వచ్చే రాబడిని ప్రభుత్వం ఏం చేస్తుందనేది ముఖ్యం. పెరిగిన ప్రభుత్వ వినియోగానికి రాబడిని ఉపయోగిస్తూ వస్తున్నారు. మౌలికరంగంపై మరింత పెట్టుబడి పెడతామంటున్నారు కానీ మితిమీరిపోయిన ప్రభుత్వ రుణాన్ని చెల్లించడానికి అది సరిపోతుంది. అంటే ప్రభుత్వ లక్ష్యాలు ఏవీ వాస్తవంగా అమలు కాలేవన్నది నిజం. – ప్రొఫెసర్ సి.పి. చంద్రశేఖర్, ఆర్థిక రంగ నిపుణులు చదవండి : ఆస్తుల నగదీకరణ ఎందుకు ? -
నోట్ల రద్దుకు మద్దతివ్వడం మా తప్పు: కేటీఆర్
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో జాతీయ పార్టీలేవీ లేవని, అలా చలామణిలో ఉన్నవన్నీ పెద్ద సైజు ప్రాంతీయ పార్టీలేనని తెలంగాణ పరిశ్రమలు, ఐటీ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. గురువారం ఢిల్లీలో జరిగిన టైమ్స్ నౌ యాక్షన్ ప్లాన్–2020 సమ్మిట్‌లో పాల్గొన్నారు. ‘దేశ నిర్మాణంలో రాష్ట్రాల పాత్ర’ అనే అంశంపై జరిగిన చర్చాగోష్టిలో మాట్లాడుతూ.. ‘దేశంలో ఉన్న పార్టీలన్నీ ప్రాంతీయ పార్టీలే. దేశవ్యాప్తంగా ఉనికి, యంత్రాంగం ఉన్న జాతీయ పార్టీలేవీ లేవు. బీజేపీ, కాంగ్రెస్ సైతం పెద్ద సైజు ప్రాంతీయ పార్టీలే. భారతదేశం రాష్ట్రాల సమాఖ్య మాత్రమే అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. బలమైన రాష్ట్రాలు ఉన్నప్పుడే బలమైన దేశం సాధ్యమవుతుంది. కేంద్రం విధివిధానాలు ఎన్ని ఉన్నా వాటి ఆచరణ అంతా రాష్ట్రాల్లోనే ఉందని పేర్కొన్నారు. కేంద్రం నిర్వహించే కార్యక్రమాల అమలును సైతం రాష్ట్ర ప్రభుత్వాలే చేయాల్సి ఉంటుందని చెప్పారు. మేకిన్ ఇండియా లాంటి కార్యక్రమాల్లోనూ రాష్ట్రాల అనుమతులు, రాష్ట్ర ప్రభుత్వ శాఖల సహకారం వంటి అంశాలు కీలకంగా ఉంటాయన్నారు. రాష్ట్రాలు ఇస్తేనే కదా.. ‘రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం తన సొంత నిధులు ఇస్తుందన్న ఆలోచన సరికాదు. రాష్ట్రాలు కూడా కేంద్రానికి నిధులు సమకూరుస్తుందన్న విషయం మరవకూడదు. తెలంగాణ నుంచి గడిచిన ఐదేళ్లలో రూ.2.72 లక్షల కోట్లు కేంద్రానికి పన్నుల రూపంలో ఇస్తే తిరిగి తెలంగాణకు కేంద్రం రూ.1.12 లక్షల కోట్లు మాత్రమే ఇచ్చింది. తెలంగాణ లాంటి అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలు కేంద్రానికి చెల్లిస్తున్న పన్నులతో పోల్చుకుంటే.. కేంద్రం అన్ని నిధులను రాష్ట్రానికి తిరిగి ఇవ్వలేని విషయాన్ని గుర్తుంచుకోవాలి’అని పేర్కొన్నారు. రాజకీయ ప్రత్యర్థులుగానే చూస్తాం ‘బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను శత్రువులుగా భావించట్లేదు. రాజకీయ ప్రత్యర్థులుగా మాత్రమే భావించి ఎన్నికల్లో పోరాడుతాం. అలాంటి పార్టీలతో వ్యక్తిగత శత్రుత్వం లేదు. తమ వాదన లేదా సైద్ధాంతికతకు వ్యతిరేకంగా నిలిచి ఉన్నంత మాత్రాన.. కేంద్రంలో ఉన్న ప్రభుత్వం రాష్ట్రాలను, లేదా ఇతర పార్టీలను శత్రువులుగా చూడాల్సిన అవసరం లేదు. కేంద్రం చేపట్టిన అనేక చర్యలను అంశాల వారీగా మద్దతిచ్చిన మేం.. ప్రజా వ్యతిరేకమైన అసంబద్ధమైన చర్యలనూ వ్యతిరేకించాం’అని పేర్కొన్నారు. నోట్ల రద్దుపై మా నిర్ణయం తప్పు.. ‘పెద్ద నోట్ల రద్దు ద్వారా దేశానికి మంచి జరుగుతుంది.. సంపూర్ణ క్రాంతి వస్తుందన్న ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్రం అన్న మాటలు నమ్మి మద్దతిచ్చాం. కానీ పెద్ద నోట్ల రద్దు ద్వారా దేశానికి నష్టం జరిగిన విషయం తేలిన తర్వాత మా నిర్ణయం తప్పని తేలింది’అని కేటీఆర్ వివరించారు. ‘టీఆర్ఎస్.. బీజేపీ ‘బీ’టీమ్ అని కాంగ్రెస్ వ్యాఖ్యానిస్తోంది. టీఆర్ఎస్ కాంగ్రెస్ ‘బీ’టీం అని బీజేపీ వ్యాఖ్యానిస్తోంది. మేం తెలంగాణ ప్రజలకు ‘ఏ’టీం మాత్రమే. ఎవరికీ మేం ‘బీ’టీం కాదు’అని చర్చలో పేర్కొన్నారు. ప్రత్యామ్నాయ కూటమికి అవకాశాలు ‘గత కొంతకాలంగా జరుగుతూ వస్తున్న ప్రతి ఎన్నికల్లోనూ ప్రాంతీయ పార్టీలే బలమైన ప్రత్యామ్నాయంగా ఎదుగుతూ వస్తున్నాయి. భవిష్యత్తులో కచ్చితంగా ప్రత్యామ్నాయ కూటమికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. రెండు జాతీయ పార్టీలు దేశాన్ని ఇప్పటికే నిరాశ పరిచాయి. ఆర్థిక అభివృద్ధి, మౌలిక వసతుల సదుపాయాల కల్పన, సంక్షేమ కార్యక్రమాల రూపకల్పన వంటి అంశాల్లో దేశ ప్రజల ఆకాంక్షలను అందుకోలేకపోయాయి. ఈ విషయాన్ని దేశ ప్రజలు ఇప్పుడిప్పుడే గుర్తిస్తున్నారు’అని కేటీఆర్ వివరించారు. భిన్నత్వంలో ఏకత్వమే భారతదేశం ‘పౌరసత్వ సవరణ చట్టాన్ని మా పార్టీ తీవ్రంగా వ్యతిరేకించింది. కేంద్రం ఇలాంటి వివాదాస్పద చట్టాలపై కాకుండా.. అతి ప్రాధాన్యత కలిగిన ఇతర అంశాలపై దష్టి సారించాల్సి ఉంది. భారతదేశం భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక.. అలాంటప్పుడు ఒక వర్గంపై ఎలా వివక్ష చూపుతారు?’అని మంత్రి ప్రశ్నించారు. రెండో రాజధానిగా ప్రజలు స్వాగతిస్తారో లేదో తెలియదు ‘జీవించడానికి అనుకూలమైన అత్యుత్తమ నగరాల్లో మెర్సర్ గత ఐదేళ్లుగా హైదరాబాద్‌కు అగ్రస్థానం కల్పిస్తూ వస్తోంది. భారతదేశాన్ని రెండో జాతీయ రాజధానిగా ప్రకటించాల్సి వస్తే హైదరాబాద్ ప్రజలు అంగీకరిస్తారో లేదో అనే విషయంలో నాకు అనుమానం ఉంది’అని పేర్కొన్నారు. సమాఖ్య స్ఫూర్తి ఏది? ‘కో–ఆపరేటివ్ ఫెడరలిజం, టీమిండియా వంటి మాటలు చెప్పే ప్రధానమంత్రి.. ఆ భావనల స్ఫూర్తి ఆధారంగా పని చేయాలని కోరుకుంటున్నాం. నీతి ఆయోగ్ తెలంగాణ ప్రభుత్వానికి ఆర్థికంగా సహకరించాలని అనేక సూచనలు చేసినా, ఇప్పటిదాకా మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, కాళేశ్వరం ప్రాజెక్టు వంటి వాటికి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు’అని దుయ్యబట్టారు. కేంద్రం ఆర్థిక సంస్కరణలు, ఎఫ్ఆర్బీఎం పరిమితులు వంటి అంశాల్లో మరింత లిబరల్గా ఉండాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అప్పుడే దేశం వేగంగా అభివృద్ధి చెందుతుందని చెప్పారు. -
గాంధీలా బతుకుతున్న నన్నంటాడా?
సాక్షి, విజయవాడ: గాంధీలా చాలా సాధారణ జీవితం గడుపుతున్న తనపై ప్రధాని నరేంద్ర మోదీ అవినీతి ఆరోపణలు చేస్తారా? అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మోదీ రోజూ రూ. కోట్ల విలువైన సూటు బూట్లు వేసుకుంటారని, తాను మాత్రం మహాత్మాగాంధీలా చాలా సాదాసీదాగా ఉంటానని చంద్రబాబు చెప్పుకొచ్చారు. విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో ఆదివారం ముఖ్య అతిథిగా పాల్గొన్న సీఎం మాట్లాడుతూ.. ‘40 ఏళ్లుగా ఒకేరకం బట్టలు వేసుకుంటున్నాను. ఎక్కడకు వెళ్లినా వేషం మార్చడం లేదు. సూట్లు వేసుకోవడం లేదు. ఈ రోజు ప్రజల కోసం నల్ల చొక్కా వేసుకుంటున్నాను’ అని పేర్కొన్నారు. గుంటూరు సభలో ప్రధాని మోదీ చేసిన విమర్శలపై చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. రాజకీయ గురువుకు పంగనామాలు పెట్టిన ప్రధాని మోదీ.. తనను సొంతమామకు వెన్ను పోటు పొడిచానని విమర్శించడం సరికాదని అన్నారు. మోదీకి రాజకీయ ఎదుగుదలకు సాయపడింది ఎల్కే అద్వానీ అని, గోద్రా అల్లర్ల అనంతరం మోదీని ముఖ్యమంత్రిగా తప్పించాలని వాజ్‌పేయ్ ప్రతిపాదించగా.. అద్వానీయే కాపాడారని బాబు పేర్కొన్నారు. చివరకు గురువుకే మోదీ పంగనామాలు పెట్టారని ఎద్దేవా చేశారు. మోదీ ప్రధాని అయ్యేందుకు అద్వానీ సహకరిస్తే ఆయనకు కనీసం ప్రతి నమస్కారం పెట్టే సంస్కారం లేని వ్యక్తి అని తీవ్ర స్థాయిలో విమర్శించారు. సీనియర్లను గౌరవించడం చేతకాని, గురువుకు పంగనామాలు పెట్టిన వ్యక్తా నా గురించి మాట్లాడేది! అని మోదీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిని చూసే అసూయ అమరావతి అభివృద్ధిని చూసి నరేంద్రమోదీ అసూయపడి ఉంటారని, కేంద్రం ఏ సాయం చేయకపోయిన అభివృద్ధి చెందుతోందని బాధపడుతున్నారని చంద్రబాబు అన్నారు. ‘గుజరాత్‌ను ఆంధ్రప్రదేశ్ మించిపోతుందని మీకు అసూయ ఉండొచ్చు. మాకు డబ్బులు ఇవ్వమని కోరితే నేను లెక్కలు చెప్పలేదంటున్నారు. నేను లెక్కలు చెప్పను.. మా సీఐజీ మాత్రమే చెబుతుంది’ అని మోదీపై విమర్శలు కొనసాగించారు. మోదీ ఎంత మాట్లాడినా అదే స్థాయిలో తిప్పి కొట్టేశక్తి తమకు ఉందని, ఢిల్లీ వచ్చి ప్రశ్నిస్తానని.. దేశ ప్రజల ముందు ప్రధాని నరేంద్రమోదీని దోషిగా నిలబెడతానని చంద్రబాబు హెచ్చరించారు. మోదీని ఇంటికి పంపి రాష్ట్ర హక్కులు సాధించుకునే వరకు పోరాడతానని చెప్పారు. రాష్ట్ర విభజన అనంతరం తల్లిని చంపి బిడ్డను కాపాడారంటూ కాంగ్రెస్‌ను మోదీ విమర్శించారని.. ఇప్పుడు తల్లిని మోదీ దగా చేశారని చంద్రబాబు ఎద్దేవా చేశారు. నా తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన నరేంద్రమోదీని సార్..సార్! అన్నానని, ప్రధానమంత్రి పదవిలో ఉన్నందుకే గౌరవించానని చెప్పుకొచ్చారు. రాజధాని శంకుస్థాపనకు పిలిస్తే పార్లమెంట్ నుంచి మట్టి, నీళ్లు తెచ్చి మన ముఖంపై కొట్టారని విమర్శించారు. కుటుంబవ్యవస్థపై గౌరవం ఉందా? లోకేష్ తండ్రి చంద్రబాబు అని మోదీ అభివర్ణించడాన్ని సీఎం తప్పుపట్టారు. ‘నీకు అబ్బాయిలు లేరు.. కుటుంబం లేదు.. సంబంధాలు, బంధాల్ని తెంచే వ్యక్తివి నువ్వు. నీకు కుటుంబ వ్యవస్థపై గౌరవం ఉందా?’ అని చంద్రబాబు ప్రశ్నించారు. భార్య యశోదాబెన్‌ను దూరంగా పెట్టిన మీరా మాట్లాడేది..? ఆమెకు విడాకులు కూడా ఇవ్వలేదు అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. గురువింద సామెతను నరేంద్రమోదీ గుర్తుంచుకోవాలన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని కుటుంబాలకు తాను పెద్దగా ఉన్నందుకు గర్వపడుతున్నానని చెప్పారు. లోకేష్‌కు తండ్రిగా, దేవాన్ష్‌కు తాతగా, భువనేశ్వరికి భర్తగా ఉన్నందుకు గర్వపడుతున్నానే తప్ప బాధపడటం లేదని, నా రాజకీయాలపై నా కుటుంబసభ్యులెవరూ ఆధారపడిలేరని, ఆధారపడరని అన్నారు. నోట్ల రద్దు తుగ్గక్ చర్య ఈ ప్రధానిది ప్రచారయావని, చేతల మనిషి కాదని బాబు తప్పుపట్టారు. నోట్ల రద్దు వల్ల ఎవరైనా లాభపడ్డారా? అది పిచ్చి తుగ్లక్ చర్య అని చంద్రబాబు అభివర్ణించారు. జీఎస్టీతో చాలా మంది ఇబ్బంది పడ్డారని, మోదీ హయాంలో బ్యాంకులు దివాలా తీశాయని, కొందరు దేశ సంపద దోచుకుని విదేశాలకు పారిపోతే, మోదీ ప్రభుత్వం గమ్మున కూర్చుందని, మోదీ విధానాలతో ఆర్ధిక వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైందని విమర్శించారు. సమావేశంలో జలవనరులశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్, జలీల్‌ఖాన్, జడ్పీ చైర్మన్ గద్దె అనూరాధ తదితరులు పాల్గొన్నారు. ఏపీపై యుద్ధానికి మోదీ వస్తున్నారు సాక్షి, అమరావతి : ఏపీపై యుద్ధానికి నరేంద్ర మోదీ వస్తున్నారని ఆదివారం టీడీపీ నేతలతో టెలికాన్ఫరెన్స్‌లో చంద్రబాబు అన్నారు. రాష్ట్రానికి మోదీ అన్యాయం చేశారని, వ్యవస్థల్ని మోదీ నాశనం చేశారని విమర్శించారు. మోదీపై అస్సాం, పశ్చిమబెంగాల్, తమిళనాడులో నిరసనలు వ్యక్తమవుతున్నాయని, ఈశాన్య రాష్ట్రాలు బీజేపీపై ఆగ్రహంగా ఉన్నాయని చెప్పారు. దక్షిణాది రాష్ట్రాలు కూడా మోదీ అంటే మండిపడుతున్నాయన్నారు. రాష్ట్రానికి చేసిన అన్యాయంపై నిరసనలు చేపట్టాలని పిలుపునిచ్చారు. ర్యాలీల్లో రెండు కుండలు పగులకొట్టాలని, ఒకటి నరేంద్రమోదీ, ఇంకోటి జగన్మోహన్ రెడ్డికి సంకేతమని, రెండు కుండలు రెండు పార్టీల లాలూచీకి సంకేతమని అన్నారు. -
‘నోట్ల రద్దు అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయం కాదు’
న్యూఢిల్లీ : నోట్ల రద్దు విషయం అప్పటికప్పుడు ఆకస్మాత్తుగా తీసుకున్న నిర్ణయం కాదన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మోదీ మాట్లాడుతూ.. ‘2016లో తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయం అనూహ్యమైన షాక్ ఏం కాదు. ఈ విషయం గురించి ఓ ఏడాది ముందు నుంచే చెబుతున్నాం. నల్ల ధనం ఉన్న వారందరిని ఏడాది ముందే నుంచే హెచ్చరిస్తున్నాం. మీ దగ్గర ఉన్న నల్లధనాన్ని డిపాజిట్ చేయండి.. జరిమానా చెల్లించి ఇబ్బందుల నుంచి బయటపడండి అని చెప్పాను’ అన్నారు. కానీ చాలా మంది ‘మోదీ కూడా ఇతర ప్రధానుల్లానే. కేవలం మాటలు చెప్తారు అని భావించారు. ఫలితం అనుభవించారు. చాలా కొద్ది మంది మాత్రమే నేను చెప్పిన విషయాన్ని సీరియస్‌గా తీసుకుని ఆచరించార’ని పేర్కొన్నారు. -
నకిలీ చలా‘మనీ’!
సాక్షి, సిటీబ్యూరో : పాత కరెన్సీ పెద్ద నోట్లను రద్దు చేస్తే జన బాహుళ్యంలో ఉన్న దొంగనోట్ల బెడద తప్పుతుందని భావిస్తే.. నకిలీగాళ్లు మాత్రం ‘కొత్త’గా చెలరేగిపోతున్నారు. ప్రభుత్వం సరికొత్త కరెన్సీ నోట్లను అమల్లోకి తెచ్చాక కూడా రాజధాని నగరంలో ఫేక్ కరెన్సీ ఇబ్బడిముబ్బడిగా వచ్చిపడుతోంది. డీమానిటైజేషన్ అమలులోకి వచ్చిన 2016లో నకిలీ నోట్ల చలామణిపై 88 కేసులు నమోదు కాగా, గతేడాది 76 కేసులు, ఈ ఏడాది మే వరకు 34 కేసులు సీసీఎస్‌లో నమోదయ్యాయి. ఫేక్ నోట్లపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) సైతం ప్రత్యేక దృష్టి సారించింది. నకిలీ నోట్లకు సంబంధించిన ప్రతి ఉదంతాన్నీ హైదరాబాద్ నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్) పోలీసులకు ఫిర్యాదు చేయాల్సిందిగా బ్యాంకులను ఆదేశించింది. దేశ భద్రతతో ముడిపడిన అంశం కావడంతో ప్రతి కేసుకూ ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. కచ్చితంగా ఫిర్యాదు చేయాల్సిందే.. వినియోగదారుల నుంచి బ్యాంకులకు కొన్ని నకిలీ నోట్లు రావడం ఎప్పటి నుంచో ఉంది. కేవలం ఒకటిరెండు నోట్లు వస్తే ఒకప్పుడు ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకునే వారు కాదు. అయితే ఆర్బీఐ గతేడాది కీలక ఆదేశాలు జారీ చేసింది. నకిలీ నోట్లు వెలుగులోకి వచ్చిన ప్రతి ఉదంతం పైనా పోలీసులకు ఫిర్యాదు చేయాలని స్పష్టం చేసింది. రాజధానిలో బయటపడే కరెన్సీకి సంబంధించి కేసుల నమోదు, దర్యాప్తు బాధ్యతలను సీసీఎస్ పోలీసులు చేపడుతున్నారు. దీంతో బ్యాంకు అధికారులు ఈ విషయాన్ని కచ్చితంగా పోలీసుల దృష్టికి తీసుకువెళ్తున్నారు. ఆర్బీఐ జారీ చేసిన మార్గదర్శకాలను అనుసరిస్తున్న సీసీఎస్ అధికారులు.. బ్యాంకునకు వచ్చిన వినియోగదారుడి వద్ద ఒక లావాదేవీలో నాలుగు అంతకంటే తక్కువ నకీలీ కరెన్సీ నోట్లు వస్తే దాన్ని నాన్–ఎఫ్ఐఆర్ కేసుగా, ఐదు అంతకంటే ఎక్కువ నోట్లు వస్తే ఎఫ్ఐఆర్ కేసుగా పరిగణిస్తున్నారు. బ్యాంకులు గుర్తించకుండా, అసలు వాటికి చేరకుండా చెలామణిలో ఉంటున్న ఫేక్ కరెన్సీ.. గుర్తించిన దానికంటే కొన్ని రెట్లు ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. క్వాలిటీ బాగుంటే ‘యూఏపీఏ’ కింద ఆర్బీఐ సహా వివిధ బ్యాంకులు తమ ఫిర్యాదుతో పాటు గుర్తించిన నకిలీ నోట్లను సైతం తీసుకువచ్చి సీసీఎస్ అధికారులకు అప్పగిస్తాయి. నాన్ ఎఫ్ఐఆర్, ఎఫ్ఐఆర్.. వీటిలో ఏ తరహా కేసు అయినప్పటికీ పోలీసుల ప్రాథమికంగా ఆ నకిలీ నోట్లను మైసూర్‌లోని భారతీయ రిజర్వ్ బ్యాంక్ నోట్ ముద్రణ్ ప్రైవేట్ లిమిటెడ్‌కు పంపిస్తారు. నోట్లను అక్కడి నిపుణులు పరీక్షించి నకిలీ కరెన్సీ క్వాలిటీ నిర్దేశిస్తూ నివేదిక ఇస్తారు. నకిలీ నోట్లు హై క్వాలిటీతో ఉన్నట్లు నివేదిక వస్తే సీసీఎస్ పోలీసులు అన్ లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ (యూఏపీఏ) ను సైతం జోడిస్తున్నారు. కేసు దర్యాప్తు పూర్తయిన తర్వాత కోర్టు ఉత్తర్వులకు లోబడి సీసీఎస్ పోలీసులు ఆయా నకిలీ నోట్లను ధ్వంసం చేయడానికి ఆర్బీఐకే అప్పగిస్తున్నారు. ఈ నకిలీ కరెన్సీలో రూ.2 వేల డినామినేషన్లో ఉన్నవే ఎక్కువగా ఉంటున్నాయని పోలీసులు చెబుతున్నారు. ‘చెస్ట్’ కేసుల్లో దర్యాప్తు కష్టమే.. సీసీఎస్ అధికారులకు బ్యాంకులతో పాటు ఆర్బీఐ నుంచీ ఈ నకిలీ కరెన్సీపై ఫిర్యాదులు వస్తున్నాయి. ఓ వినియోగదారుడు చేసిన లావాదేవీలపై వచ్చిన ఫిర్యాదుల కేసుల్లో పురోగతి ఉంటోంది. ఆ వ్యక్తిని పిలిచి వాంగ్మూలం నమోదు చేస్తున్న పోలీసులు.. మరికాస్త ముందుకు వెళ్లి కూపీ లాగుతున్నారు. ఇలా బ్యాంకు స్థాయిలో గుర్తించలేని నకిలీ కరెన్సీని ఆయా బ్యాంకులకు చెందిన చెస్ట్‌లకు పంపినప్పుడు అక్కడి సిబ్బంది గుర్తిస్తున్నారు. ఇక్కడా సాధ్యం కాకుంటే ఆర్బీఐ అధికారులు గుర్తిస్తున్నారు. అయితే సదరు కరెన్సీ ఏ బ్యాంకు శాఖ నుంచి వచ్చిందో బ్యాంకు చెస్ట్ నుంచి వచ్చిందో ఆర్బీఐ చెస్ట్ అధికారులు చెప్పగలుగుతున్నారు. ఇంతకు మించి మరే వివరాలు దొరకడం లేదు. ఫలితంగా దర్యాప్తు ముందుకు సాగడం లేదు. ఇలాంటి కేసుల్లో మూతపడుతున్నవే ఎక్కువగా ఉంటున్నాయి. (చెస్ట్ అంటే.. ఒక బ్యాంకు చెందిన అన్ని శాఖల నుంచి వచ్చిన నగదు నిల్వ కేంద్రం. ఇక్కడి నుంచే కొత్త నోట్లు ఆయా శాఖలకు సరఫరా చేస్తారు) సీసీఎస్ గణాంకాల ప్రకారం ఫేక్ కరెన్సీపై నమోదైన కేసులు ఇవీ.. ఏడాది ఎఫ్ఐఆర్ నాన్– ఎఫ్ఐఆర్ గుర్తించిన నోట్లు 2016 9 79 70,823 2017 4 72 22,867 2018 (మే) 3 31 17,740 -
నోట్ల రద్దుతో నష్టమే ఎక్కువ..!
• ప్రయోజనం రూ.80 వేల కోట్లు.. ఖర్చు రూ. 2 లక్షల కోట్లు • పెద్ద నోట్ల రద్దుపై పరిశీలకుల అంచనా... • ప్రభుత్వం చెప్పే లెక్కలకు పొంతన లేదంటూ విశ్లేషణ డీమోనిటైజేషన్(పెద్ద నోట్ల రద్దు) వ్యవహారంతో ఒనగూరే ప్రయోజనాల కన్నా నష్టాలే ఎక్కువగా ఉండబోతున్నాయంటూ హెచ్చరిస్తున్నారు విశ్లేషకులు. రద్దు చేసిన పెద్ద నోట్లన్నీ బ్యాంకింగ్ వ్యవస్థలోకి వచ్చేయగలవంటూ ప్రభుత్వమే చెబుతుండటం దీనికి ఊతమిస్తోందని వారంటున్నారు. దీంతో మొత్తం డీమోనిటైజేషన్ ప్రక్రియ పరమార్ధమే దెబ్బతింటోందని చెబుతున్నారు. డీమోనిటైజేషన్ ప్రక్రియతో పెద్ద నోట్లు గణనీయంగా బ్యాంకింగ్ వ్యవస్థలోకి రాకుండా పోతాయని, రూ. 3 లక్షల కోట్లు- రూ. 5 లక్షల కోట్ల మేర నల్లధనం ధ్వంసమవుతుందని ప్రభుత్వం చెబుతూ వచ్చింది. ఇలా పెద్ద ఎత్తున మిగిలిపోయే మొత్తాలను ప్రజోపయోగ పనులు, మౌలిక సదుపాయాల కల్పన మొదలైన వాటికి వెచ్చిస్తామని, భవిష్యత్ రూపు రేఖలు ఒక్కసారిగా మారిపోతాయని ఊదరగొట్టింది. కానీ, రద్దు చేసిన రూ. 500, రూ. 1,000 నోట్లు అన్నీ కూడా బ్యాంకింగ్ వ్యవస్థలోకి వచ్చేయగలవని భావిస్తున్నట్లు తాజాగా కేంద్ర రెవెన్యూ విభాగ కార్యదర్శి హస్ముఖ్ అధియా ప్రకటించడం ప్రభుత్వ హామీలపై సందేహాలు రేకెత్తిస్తోందని విశ్లేషకులు అంటున్నారు. ఆర్బీఐ గణాంకాల ప్రకారం బుధవారం నాటికి దాదాపు రూ.12 లక్షల కోట్లు బ్యాంకుల్లోకి చేరారుు. దీంతో ప్రభుత్వం ముందుగా చెప్పినట్లు ఖజానాకు భారీ నిధులేమీ వచ్చే అవకాశాలేమీ లేకుండా పోరుుందని పరిశీలకులు చెబుతున్నారు. డీమోనిటైజేషన్‌కి సంబంధించి ప్రభుత్వం చెప్పిన లెక్కలకు, వాస్తవ పరిస్థితులకు ఎక్కడా పొంతన ఉండటం లేదని వారు విశ్లేషిస్తున్నారు. ఖర్చులు, ప్రయోజనాలను పోల్చి చూసుకుంటే ఈ ప్రక్రియ కారణంగా ప్రభుత్వం..అంతిమంగా దేశం నష్టపోనుందని అంటున్నారు. రూ. 4.5 లక్షల కోట్ల నల్లధనం లెక్కలు.. ప్రభుత్వ లెక్కలను బట్టి రద్దు చేసిన రూ. 15.4 లక్షల కోట్ల నగదులో దాదాపు 30 శాతం నల్లధనం ఉంటుందని అంచనా. అంటే సుమారు రూ. 4.5 లక్షల కోట్లు ఉండొచ్చు. అరుుతే, నవంబర్ 8 నాటి డీమోనిటైజేషన్ ప్రకటన తర్వాత నల్ల కుబేరులు ఏదో రకంగా కనీసం రూ. 1.5 లక్షల కోట్లకు చట్టబద్ధత తెచ్చేసుకుని ఉంటారని అంచనా. ఇందుకోసం వారు జన ధన ఖాతాలు, రూ. 2.5 లక్షల పరిమితులు మొదలైన మార్గాలు ఉపయోగించుకుని ఉంటారు. ఇక నవంబర్ 28న ప్రభుత్వం కొత్తగా ప్రకటించిన ఆదాయ వెల్లడి పథకం (ఐడీఎస్) కింద దాదాపు రూ.1.3 లక్షల కోట్లు వెల్లడి కావొచ్చని కేంద్రీయ ప్రత్యక్ష పన్నుల బోర్డు(సీబీడీటీ) అంచనా వేస్తోంది. కొందరు విశ్లేషకులు దీన్ని కాస్త ఉదారంగా రూ. 1.5 లక్షల కోట్లకు పెంచి రౌండు ఫిగర్ చేశారు. ఇక ముందుగా అనుకున్న రూ. 4.5 లక్షల కోట్ల నల్లధనంలో మిగిలింది రూ. 1.5 లక్షల కోట్లు. వీటికి సంబంధించి మాత్రమే వివరాల కోసం, చర్యల కోసం ఆదాయ పన్ను విభాగం.. డిపాజిట్‌దారుల వెంటపడాల్సి ఉండొచ్చు. అరుుతే, ఇందుకు కనీసం రెండు మూడేళ్లరుునా పట్టేస్తుంది. కాబట్టి ప్రస్తుతం ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన (కొత్త ఐడీఎస్కి ప్రభుత్వం పెట్టిన పేరు) కింద వెల్లడైన సంపదపై 50% మేర పన్ను విధిస్తే ప్రభుత్వ ఖజానాకు తక్షణం దక్కేది రూ. 75,000 కోట్లు. ఐడీఎస్ కింద డిపాజిట్ చేసే పాతిక శాతం మీద తొలి ఏడాది వడ్డీ ఇవ్వాల్సిన అవసరం లేదు కాబట్టి ఆ విధంగా రూ. 2,500 కోట్లు మిగులుతుంది. మొత్తం మీద రౌండ్ ఫిగర్ చేస్తే ఒక రూ. 80,000దాకా తేలుతుంది. లక్షల కోట్ల ఖర్చు.. ఇక ప్రభుత్వానికి వచ్చేది కాస్సేపు పక్కన పెట్టి ఈ మొత్తం ప్రక్రియకు అవుతున్న వ్యయాలు ఓసారి చూస్తే.. సెంటర్ ఫర్ మానిటరింగ్ ది ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ)అంచనాల ప్రకారం డీమోనిటైజేషన్ కారణంగా నవంబర్ 8 నుంచి డిసెంబర్ 30 మధ్య కాలంలో భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)పై రూ. 1.28 లక్షల కోట్ల మేర ప్రతికూల ప్రభావం పడనుంది. ప్రస్తుత త్రైమాసికం ప్రభావాలు వచ్చే త్రైమాసికంలోను, ఆపైనా కూడా కొనసాగే అవకాశం ఉన్నప్పటికీ.. దాన్ని పరిగణనలోకి తీసుకోకుండా సీఎంఐఈ కాస్త ఉదారంగా వేసిన లెక్కల ప్రకారమే ఇంత భారీ స్థారుులో నష్టం వాటిల్లనుంది. స్థూలంగా జీడీపీకి దాదాపు రూ. 1.5 లక్షల కోట్ల మేర నష్టం జరగొచ్చని సీఎంఐఈ చెబుతోంది. డీమోనిటైజేషన్ వాస్తవ ఖర్చులు (కొత్త నోట్లు ముద్రించడం, రవాణా చేయడం మొదలైనవి) దాదాపు రూ. 20,000 కోట్లు ఉంటారుు. బ్యాంకుల్లోకి కుప్పతెప్పలుగా వచ్చి పడుతున్న నగదుకు తగ్గట్లుగా రూ. 6 లక్షల కోట్ల మేర మార్కెట్ స్థిరీకరణ (ఎంఎస్ఎస్) బాండ్లను జారీ చేసేందుకు ఆర్బీఐకి ప్రభుత్వం అనుమతిచ్చింది. వీటి మీద కనీసం 6-6.5% మేర వార్షిక వడ్డీ రేటు నిర్ణరుుంచినా.. 9 నెలల కాలానికి (ఈ వ్యవధిలో అంతా సద్దుమణుగుతుందని అంచనా) ఆర్బీఐ కనీసం రూ.30,000 కోట్లు-35,000 కోట్లు చెల్లించాల్సి వస్తుంది. ఇదంతా కలిపినప్పుడు.. డీమోనిటైజేషన్‌కి సంబంధించి ఖర్చులు మొత్తం రూ. 2 లక్షల కోట్లుగా లెక్క తేలుతోంది. తీరా చూస్తే వచ్చే లబ్ధి మాత్రం రూ. 80,000 కోట్లే.