diploma student
-
డిప్లొమా విద్యార్థి ఆత్మహత్య
మధురవాడ: టీడీపీ మాజీ ఎమ్మెల్సీకి చెందిన చైతన్య ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతున్న డిప్లొమా విద్యార్థి బలవన్మరణానికి పాల్పడిన ఘటన తీవ్ర కలకలం రేపింది. పీఎంపాలెం పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పార్వతీపురం మన్యం జిల్లా నర్సిపురం బీజీ కాలనీకి చెందిన నిండుగొండ శంకరరావు, జ్ఞానేశ్వరి కుమారుడు జ్యోతి ప్రకాశ్ (16) విశాఖ నగర శివారు కొమ్మాది చైతన్య వ్యాలీలోని చైతన్య ఇంజనీరింగ్ కళాశాలలో డిప్లమా మెకానికల్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. కళాశాలలోని బాయ్స్ హాస్టల్ బ్లాక్ ఎఫ్–7లో ఏడుగురు విద్యార్థులతో కలిసి ఉంటున్నాడు. శుక్రవారం తల్లితో ఫోన్లో మాట్లాడిన జ్యోతి ప్రకాశ్.. అక్టోబర్ మొదటి వారంలో పరీక్షలు ఉండడంతో ఆందోళనగా ఉందని చెప్పాడు. శనివారం ఉదయం కాస్త కడుపు నొప్పిగా ఉందని, క్లాసుకి వెళ్లలేనని తల్లికి మళ్లీ ఫోన్ చేసి చెప్పాడు. దీంతో ఆమె వార్డెన్‌కు ఫోన్ చేసి హాస్టల్లో ఉంచాలని చెప్పింది. మధ్యాహ్నం 1.30 సమయంలో ఇదే గదిలో ఉంటున్న సహచర విద్యార్థి తలుపు కొట్టగా తియ్యలేదు. దీంతో హాస్టల్ సిబ్బంది బలవంతంగా తలుపులు తీయగా.. జ్యోతిప్రకాశ్ ఫ్యాన్‌కి ఉరేసుకుని ఉన్నాడు. వైద్యం నిమిత్తం సమీపంలోని గాయత్రి హాస్పిటల్‌కి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. విద్యార్థి మృతికి గల కారణాలు తెలియరాలేదని పీఎంపాలెం సీఐ గేదెల బాలకృష్ణ చెప్పారు. కాగా కొద్ది నెలల క్రితం ఇదే క్యాంపస్‌లో ఓ విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఒకే ఏడాదిలో ఇద్దరు విద్యార్థులు చనిపోవడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. తల్లి జ్ఞానేశ్వరి పోలీసులకు ఫిర్యాదు చేసింది. -
కష్టపడి చదివాడు .. ఎన్నో కలలు.. కానీ కాలం అతన్ని దొంగగా మార్చింది
బనశంకరి(బెంగళూరు): కష్టపడి చదివిన చదువుకు సరైన ఉద్యోగం లభించక ఒక డిప్లొమా హోల్డర్ చోరీల బాట పడ్డాడు. ఏపీలో బైక్‌లను చోరీ చేసి కర్ణాటకలో విక్రయిస్తూ బండెపాళ్య పోలీసులకు పట్టుబడ్డాడు. డిప్లొమా సివిల్ ఇంజినీరింగ్ పూర్తి చేసిన ఈ నిందితుడు ఎలాంటి ఉద్యోగం లభించకపోవడంతో బైక్ చోరీలను వృత్తిగా పెట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. కూడ్లుగేట్ వద్ద బైక్ విక్రయిస్తుండగా నిందితుడిని అరెస్ట్ చేసి అతని వద్దనుంచి రూ. 15 లక్షల విలువచేసే 5 రాయల్ ఎన్ఫీల్డ్ బైకులు, 4 యమహా, బజాజ్ పల్సర్ బైకుతో పాటు మొత్తం 10 బైక్‌లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఇతనిపై బెంగళూరు నగరంలో 5 కేసులు, విజయవాడలో 1, బద్వేలు 2, తిరుపతి టౌన్ 2 కేసులతో కలిపి మొత్తం 10 కేసులు వెలుగు చూశాయి. చదవండి: కలిసికట్టుగా కొట్టేశారు.. సినిమాలోనూ ఇలాంటి దొంగతనం చూసుండరు ! -
ప్యాంట్ విప్పి తనిఖీ.. అవమానంతో రైలు కిందపడి
సాక్షి, చీరాల: పరీక్షకు స్లిప్పులు తెచ్చాడని పాలిటెక్నిక్ విద్యార్థిని అందరి ముందు తనిఖీల పేరుతో అవమానించడంతో తీవ్ర మనస్తాపం చెంది ఓ విద్యార్థి రైలు కిందపడి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన చీరాల్లోని ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలో సోమవారం జరిగింది. అందిన వివరాల ప్రకారం.. వేటపాలెం మండలం లక్ష్మీపురానికి చెందిన కమల నాగరాజు, ఇందిర దంపతుల రెండో కుమారుడు ఎలీషా (19) బైపాస్ రోడ్డులోని యలమంచిలి సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్న పాలిటెక్నిక్ కళాశాలలో ఈఈఈ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. సోమవారం నుంచి కళాశాలలో పరీక్షలు జరుగుతున్నాయి. స్లిప్పులు తెచ్చి పరీక్ష రాస్తున్నాడని స్క్వాడ్ అధికారులు పరీక్ష కేంద్రం వద్దే ప్యాంట్ విప్పించి తనిఖీ చేశారు. అంతేగాక పరీక్ష రాయకుండా బయటకు పంపించారు. డీబార్ కూడా చేస్తున్నట్లు ప్రకటించడంతో తీవ్ర మనస్తాపం చెందిన ఎలీషా సాయంత్రం బేరుపేట సమీపంలో రైలు కింద బలవన్మరణానికి పాల్పడ్డాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం చీరాల ఏరియా వైద్యశాలకు తరలించారు. మంగళవారం ఉదయం విద్యార్థులు, ఎస్ఎఫ్ఐ నాయకులు కళాశాల ఎదుట ఆందోళన చేపట్టారు. విద్యార్థి మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవడంతో పాటు కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న టూటౌన్ సీఐ పాపారావు, ఎస్ఐలు ఆందోళన చేస్తున్న విద్యార్థులతో పాటు కళాశాల ప్రతినిధులతో చర్చలు జరిపారు. సాయంత్రానికి ఎలీషా మృతదేహంతో కుటుంబ సభ్యులు తమకు న్యాయం చేయాలని కోరుతూ కళాశాల ఎదుట బైఠాయించారు. అన్యాయంగా తమ బిడ్డను పొట్టన పెట్టుకున్నారని, తమకు న్యాయం చేయాలని, తమ బిడ్డ చావుకు కారణమైన వారిని శిక్షించాలని డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న చీరాల డీఎస్పీ పి.శ్రీకాంత్ తన సిబ్బందితో కళాశాల వద్దకు చేరుకుని సంఘటన జరగిన తీరు తెలుసుకున్నారు. బాధితుల ఆందోళన.. విద్యార్థుల నినాదాలతో కళాశాల ప్రాంగణం మార్మోగింది. కళాశాల యాజమాన్యం, అధ్యాపకుల తీరుతో ఎలీషా ఆత్మహత్యకు పాల్పడ్డాడని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఎట్టకేలకు మధ్యవర్తుల హామీతో మృతుడి బంధువులు, విద్యార్థులు ఆందోళన విరమించారు. చదవండి: రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా.. కుమార్తె లవ్ మ్యారేజ్: కానిస్టేబుల్ దంపతుల ఆత్మహత్య -
కన్నతండ్రే కాలయముడయ్యాడా..!
గొల్లపల్లి: కన్నతండ్రే కాలయముడిగా మారి కుమార్తెను హతమార్చాడా..? సవతి తల్లి పాత్ర కూడా ఇందులో ఉందా...? అన్నీ సాఫీగా జరిగి ఉండి ఉంటే పెళ్లి చేసుకుని నూతన జీవితంలోకి అడుగుపెట్టాల్సిన ఓ యువతి... తెల్లారే సరికి శవమై కనిపించడం వెనుక ఎన్నో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కరీంనగర్ జిల్లా గొల్లపల్లి మండలం వెన్గుమట్ల గ్రామంలో బుధవారం తెల్లవారుజామున ఓ యువతి అనుమానస్పద స్థితిలో మృతి చెందింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... వెన్గుమట్ల గ్రామానికి చెందిన పాట్కూరి సత్యనారాయణరెడ్డి, ప్రేమలతలకు 30 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వీరికి మౌనశ్రీ (23) అనే కూతురు ఉంది. మనస్పర్థలు రావడంతో ప్రేమలత-సత్యనారాయణరెడ్డిలు 20 ఏళ్ల క్రితమే విడిపోయారు. అనంతరం సత్యనారాయణరెడ్డి లత అనే మరో మహిళను వివాహం చేసుకున్నాడు. మూడేళ్ల క్రితం వెటర్నరి డిప్లోమా పూర్తిచేసిన మౌనశ్రీ కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు కాలేజీలో లెక్చరర్‌గా పనిచేస్తోంది. మౌనశ్రీ వివాహం బాధ్యత సత్యనారాయణరెడ్డిపై ఉండటంతో అతను కొంత కాలంగా సంబంధాలు చూస్తున్నారు. ఈ క్రమంలో మౌనశ్రీకి కరీంనగర్లో ఓ సంబంధం చూడగా కుదిరింది. వివాహం గురించి మాట్లాడటానికి రావాలంటూ మంగళవారం సత్యనారాయణరెడ్డి మిత్రుడితో మౌనశ్రీకి ఫోన్ చేయించాడు. తండ్రి పిలుపునందుకున్న మౌనశ్రీ మంగళవారం సాయంత్రం 7 గంటల ప్రాంతంలో వెన్గుమట్లకు చేరుకుంది. భోజనం చేసిన అనంతరం రాత్రి ఇంట్లోనే నిద్రించింది. బుధవారం ఉదయం చూసేసరికి మౌనశ్రీ మృతి చెంది కన్పించింది. విషయం తెలుసుకున్న ప్రేమలత వెన్గుమట్లకు చేరుకుని కన్నీరు మున్నీరుగా రోదించింది. రూ. 25 లక్షల కట్నం ఇచ్చి వివాహం జరిపించాల్సి వస్తుందన్న కోపంతోనే కుమార్తెను పథకం ప్రకారం పిలిపించుకుని హతమార్చారని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. మంగళవారం సాయంత్రం వెన్గుమట్లకు చేరుకున్న మౌనశ్రీ టీ తాగిన కొద్దిసేపటికే ఫోన్ చేసి మత్తుగా ఉందని తనతో చెప్పిందని ఆమె తల్లి ప్రేమలత పేర్కొంది. దీంతో మౌనశ్రీ మృతి వెనుక ఆమె తండ్రి, అతని బంధువుల పాత్ర ఉండి ఉండవచ్చనే కోణంలో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.