వరుస చిత్రాలతో జీవా బిజీ
యువ నటుడు జీవా ఇటీవల రేస్‌లో కాస్త వెనుకబడ్డారనే చెప్పాలి. యాన్, అంతకుముందు నటించిన నీ దానే ఎన్ పొన్ వసంతం చిత్రాలు ఆశించిన స్థాయిలో ఆడలేదు. చిన్న బ్రేక్ తీసుకుని మళ్లీ ఫుల్ ఎనర్జీతో రెడీ అవుతున్నారు జీవా. వరుసగా మూడు చిత్రాలకు సైన్ చేసేశారు. అందులో ఒకటి మార్చి 15న ఆరంభం కానుంది. రామ్‌నాథ్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రంలో హీరోయిన్గా నయనతార పేరు ప్రచారంలో ఉంది. అయితే ఆమె కాల్షీట్స్ సర్దుబాటు కాకపోవడంతో లక్కీ నాయకి శ్రీదివ్యకు అవకాశం వరించింది.
ఈ విషయాన్ని చిత్ర యూనిట్ నిర్ధారించింది. ఇది గ్రామీణ నేపథ్యంలో సాగే యాక్షన్, లవ్, సెంటిమెంట్ అంశాలతో కూడిన విభిన్న కథా చిత్రం అని యూనిట్ వర్గాలు తెలిపారు. చాలా గ్యాప్ తరువాత జీవా గ్రామీణ కథా చిత్రంలో నటించనున్నారన్నమాట. ఈ చిత్రం తరువాత యామిరుక్క భయమే చిత్రం ఫేమ్ డీకే దర్శకత్వంలో ఎల్రెడ్ కుమార్ నిర్మించనున్న చిత్రంలోనూ ఆ తరువాత రాజేష్ ఎం దర్శకత్వంలో మరో చిత్రం చేయనున్నారు