Director Anurag Kashyap
-
అవసరం లేకున్నా డైరెక్టర్ ఆ సీన్ తీశాడు!
స్ట్రీమింగ్ సర్వీసుల్లో అభ్యంతరకర కంటెంట్ కట్టడిలో భాగంగా కేంద్రం కొరడా జులిపించడం మొదలైంది. ఈ క్రమంలో బాలీవుడ్ ఫిల్మ్ మేకర్, నటుడు అనురాగ్ కశ్యప్ తీసిన ఓ షార్ట్‌ఫిల్మ్‌పై తొలి ఫిర్యాదు నమోదు అయ్యింది. అనురాగ్ తీసిన ‘ఘోస్ట్ స్టోరీస్’ అంథాలజీ షార్ట్ ఫిల్మ్ కిందటి ఏడాది జవనరిలో రిలీజ్ అయ్యి.. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో ఓ సీన్లో నటి శోభితా ధూళిపాళ పాత్రకి గర్భస్రావం అవుతుంది. ఆ టైంలో ఆ క్యారెక్టర్ మృత శిశువును చేతిలో పట్టుకుని కూర్చుంటుంది. ఈ సీన్ ఆ కథకు అవసరం లేదని, అయినా మేకర్లు ఆ సీన్ తీయడం మహిళల మానసిక స్థితిపై తీవ్ర ప్రభావం చూపెట్టే అంశమని జులై 27న నమోదు అయిన ఆ ఫిర్యాదు పేర్కొని ఉంది. అయితే ఈ ఫిర్యాదుపై కేసు నమోదు అవుతుందా? లేదా అనేది స్పష్టత రావాల్సి ఉంది. ఎందుకంటే కంటెంట్ రిలీజ్ అయిన తర్వాత వీలైనంత త్వరగా(24 గంటల్లో!) ఫిర్యాదు చేయాలని కేంద్రం రిలీజ్ చేసిన మార్గదర్శకాల్లో ఉంది. అయినప్పటికీ ఈ ఫిర్యాదుకు సంబంధించిన వివరాలను.. సంబంధిత ప్రొడక్షన్ కంపెనీకి సైతం తెలియజేసినట్లు నెట్‌ఫ్లిక్స్ ప్రతినిధి ఒకరు వెల్లడించారు. కాగా, ఓటీటీ కంటెంట్ కట్టడిలో భాగంగా కేంద్ర సమాచార ప్రసార శాఖ ఐటీ యాక్ట్‌ను కఠినతరం చేసింది. అశ్లీలత, హింస, మనోభావాలు దెబ్బతీయడం, వ్యూయర్స్ మానసిక స్థితిపై ప్రభావం చూపే ఎలాంటి కంటెంట్ మీద అయినా సరే.. అభ్యంతరాలు వ్యక్తం అయితే కఠిన చర్యలు తప్పవని ఫిల్మ్ మేకర్స్‌ను హెచ్చరించింది. ప్రత్యేక మార్గదర్శకాలతో పాటు డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్ పేరిట కఠినమైన నిబంధనలతో ‘రూల్స్-2021’ను రిలీజ్ చేసింది. ఇదిలా ఉంటే ఇంతకు ముందు ‘సాక్రెడ్ గేమ్స్, ఏ సూటబుల్ బాయ్’ ద్వారా నెట్‌ఫ్లిక్స్ వివాదాల్లో నిలిచిన సంగతి తెలిసిందే. -
బాధితులు మాట్లాడాలి
‘ఫిల్మ్ ఇండస్ట్రీలో సెక్సువల్ హెరాస్మెంట్ ఉంది’ అంటూ హాలీవుడ్ నుంచి ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీల వరకూ ‘మీటూ’ ఉద్యమ దుమారం లేస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయంపై బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ స్పందిస్తూ – ‘‘లైంగిక దాడుల గురించి అందరూ తమ ఒపీనియన్ చెప్పాలి అంటున్నారు. నా ఉద్దేశం ఏంటంటే.. వర్క్ ప్లేస్‌లో ఇలాంటి హెరాస్మెంట్కి గురైన వారు బయటికొచ్చి నిర్భయంగా మాట్లాడితే ఏదైనా మార్పు వస్తుంది కానీ అందరూ బాధితులు కానివాళ్లు మాట్లాడటం వల్ల ఏ మార్పూ రాదు. ఏ ఉద్యమమైనా బాధితులు బయటకు వచ్చి మాట్లాడగలిగినప్పుడే విజయవంతం అవుతుంది. అలా బయటకు వచ్చిన వారికి మేమంతా అండగా నిలబడొచ్చు’’ అని పేర్కొన్నారాయన. -
ఇక ఎవరికి వారే!
పన్నెండేళ్ల వైవాహిక జీవితానికి స్వస్తి చెప్పారు బాలీవుడ్ నటి కల్కి కోయిచ్లిన్, దర్శకుడు అనురాగ్ కశ్యప్. వాస్తవానికి గత 2013లోనే విడిపోతున్నట్టు ప్రకటించినా... తాజాగా విడాకుల కోసం అప్పీల్ చేసుకున్నట్టు ఓ ఆంగ్ల పత్రిక కథనం. ‘గత ఏడాది కొంత స్ట్రగులయ్యా. అనురాగ్‌తో తన బంధం ఎక్కడికి వెళుతుందన్న దానిపై నాకు స్పష్టత లేదు. కానీ ఇప్పుడు ఇద్దరం క్లియర్‌గా ఉన్నాం. ఇకపై ఇద్దరం కలసి జీవించలేమని తేల్చుకున్నాం. అందుకే విడాకులు తీసుకోవాలనుకున్నాం’ అని చెప్పింది కల్కి. మొత్తానికి హిందీ ఫిల్మీ దునియాలో వివాహ బంధానికి ఫుల్స్టాప్ పెట్టింది వీరిద్దరే కాదు... ఎందరో ఉన్నారు. రీసెంట్ పాస్ట్‌లో స్టార్ హీరో హృతిక్ రోషన్ కూడా డైవర్స్ తీసుకున్నాడు.