బాధితులు మాట్లాడాలి | Film industry is first to acknowledge sexual harassment, says Anurag kashyap | Sakshi
Sakshi News home page

బాధితులు మాట్లాడాలి

Published Fri, May 4 2018 12:25 AM | Last Updated on Mon, Jul 23 2018 9:15 PM

Film industry is first to acknowledge sexual harassment, says Anurag kashyap - Sakshi

దర్శకుడు అనురాగ్‌ కశ్యప్‌

‘ఫిల్మ్‌ ఇండస్ట్రీలో సెక్సువల్‌ హెరాస్‌మెంట్‌ ఉంది’ అంటూ హాలీవుడ్‌ నుంచి ఇండియన్‌ ఫిల్మ్‌ ఇండస్ట్రీల వరకూ  ‘మీటూ’ ఉద్యమ దుమారం లేస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయంపై బాలీవుడ్‌ దర్శకుడు అనురాగ్‌ కశ్యప్‌ స్పందిస్తూ – ‘‘లైంగిక దాడుల గురించి అందరూ తమ ఒపీనియన్‌ చెప్పాలి అంటున్నారు.

నా ఉద్దేశం ఏంటంటే.. వర్క్‌ ప్లేస్‌లో ఇలాంటి హెరాస్‌మెంట్‌కి గురైన వారు బయటికొచ్చి నిర్భయంగా మాట్లాడితే ఏదైనా మార్పు వస్తుంది కానీ అందరూ బాధితులు కానివాళ్లు మాట్లాడటం వల్ల ఏ మార్పూ రాదు. ఏ ఉద్యమమైనా బాధితులు బయటకు వచ్చి మాట్లాడగలిగినప్పుడే విజయవంతం అవుతుంది. అలా బయటకు వచ్చిన వారికి మేమంతా అండగా నిలబడొచ్చు’’ అని పేర్కొన్నారాయన.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement