సినిమాలు, టీవీ షోల్లో సెక్స్ వర్కర్లు! | Sex workers getting ready for TV soaps/films | Sakshi
Sakshi News home page

సినిమాలు, టీవీ షోల్లో సెక్స్ వర్కర్లు!

Published Fri, Feb 12 2016 11:05 AM | Last Updated on Tue, Oct 2 2018 3:43 PM

సినిమాలు, టీవీ షోల్లో సెక్స్ వర్కర్లు! - Sakshi

సినిమాలు, టీవీ షోల్లో సెక్స్ వర్కర్లు!

కోల్కతా: అన్ని అనుకూలిస్తే టీవీ షోలు, సినిమాల్లో సెక్స్ వర్కర్లు నటించనున్నారు. ఆసియాలోనే అతిపెద్ద రెడ్ లైట్ ఏరియా అయిన కోల్కతాలోని సోనగచి సెక్స్వర్కర్లకు నటనను కెరీర్కు ఎంచుకునేందుకు నటన, డాన్స్, పాటలు పాడటంలో శిక్షణ ఇస్తున్నారు. వేశ్యావృత్తిని వదిలేయాలని భావిస్తున్న సెక్స్ వర్కర్లను, వారి పిల్లలను ఎన్జీవో చేరదేసి.. ఏబీసీ ఆఫ్ యాక్టింగ్ నిపుణుల చేత శిక్షణ ఇప్పిస్తోంది.

వేశ్యావృత్తిని వీడి సెక్స్ వర్కర్లు మళ్లీ జనజీవన స్రవంతిలో కలిసేలా పశ్చిమబెంగాల్ ప్రభుత్వం 'ముక్తిర్ అలో' ప్రాజెక్ట్ను ప్రవేశపెట్టింది. సెక్స్ వర్కర్ల కోసం రెండో విడత పునరావాస పథకాన్ని అమలు చేస్తోంది. సెక్స్ వర్కర్లకు, వారి పిల్లలకు నటనలో శిక్షణ ఇవ్వడం ద్వారా వారు సినిమాలు, టీవీల్లో నటించే అవకాశం పొందగలరని ఆ రాష్ట్ర మహిళాభివృద్ధి శాఖ మంత్రి శశి పంజ చెప్పారు. పలువురు సినీ, టీవీ సీరియల్ దర్శకులను, నిర్మాతలను సంప్రదించి, నటనతో పాటు ఇంగ్లీష్ నేర్చుకునేందుకు శిక్షణ ఇప్పించామని తెలిపారు. ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇంతకుముందు సెక్స్ వర్కర్ల కోసం పలు చేతివృత్తి పథకాలను ప్రవేశపెట్టింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement