Director of sugars
-
త్రిశంకుస్వర్గంలో తుమ్మపాల
నేడు హైదరాబాద్‌లో డెరైక్టర్ ఆఫ్ సుగర్స్తోఎమ్డీల సమావేశం భవిష్యత్‌పై స్పష్టత వచ్చే అవకాశం అనకాపల్లి: జిల్లాలో తుమ్మపాల చక్కెరమిల్లు మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. కష్టకాలంలో రుణాలివ్వాల్సిన ఆప్కాబ్ మొండికేయడం, షూరిటీ విషయంలో ప్రభుత్వం ప్రేక్షకపాత్ర వహించడం వంటి పరిణామాలతో దీని పరిస్థితి త్రిశంకుస్వర్గమైంది. వందలాది మంది కార్మికులు, వేలాది మంది రైతులకు చేదును పంచే పరిస్థితులు నెలకొన్నాయి. ఉద్యోగులకు జీతాలు, చెరకు సరఫరా చేసిన రైతులకు చెల్లింపులు యాజమాన్యం చేపట్టలేకపోవడంతో ఇప్పటికే పరపతి దెబ్బతింది. గానుగాటకు ముహూర్తం ముంచుకొస్తున్నా స్పష్టత లేని దుస్థితి. డోలాయమానంలో ఉన్న ఈ కర్మాగారంపై గురువారం స్పష్టత రానుందని అంతా భావిస్తున్నారు. డెరైక్టర్ ఆఫ్ సుగర్స్ గురువారం హైదరాబాద్‌లో సహకార చక్కెర మిల్లుల ఎమ్‌డీలతో సమావేశమవుతున్నారు. ఈ సీజన్లో క్రషింగ్‌పై సమీక్షించనున్నారు. రాష్ట్రంలోని అన్ని కర్మాగారాలు ఇప్పటికే గానుగాటకు సిద్ధమయ్యాయి. తుమ్మపాలకు ఇప్పటికీ క్లియరెన్స్ రాలేదు. జిల్లాలో చోటుచేసుకుంటున్న పరిణామాలతో క్రషింగ్‌పై ఆచితూచి వ్యవహరించాలని ఎమ్‌డీకి జిల్లా అధికారులు సూచించడంతో అత్యంత గోప్యత పాటిస్తున్నారు. మిల్లును మూసేస్తారంటూ ఇటీవల సుగర్కేన్ కమిషనర్ నుంచి వచ్చిన లేఖ కర్మాగార వర్గాల్లో అలజడి సృష్టించిన సంగతి తెలిసిందే. మిల్లు పరిస్థితిపై అంతా గోప్యం : మిల్లు పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడిలా మారింది. మూలకు చేరిన యంత్రాలతోపాటు అమూల్యమైన స్థలాలతో కలిపి కర్మాగార ఆస్తులను లెక్కిస్తే ప్రభుత్వ గణాంకాల మేరకు రూ.40 కోట్లుపైబడి ఉంటుందని అంచనా. అప్పులు, బకాయిలు రూ.15కోట్లు ఉంటాయి. మిల్లుకు సంబంధించిన డాక్యూమెంట్లన్నింటినీ తనాఖా కింద ఒక సహకార బ్యాంకు తనవద్దే ఉంచుకుందని సమాచారం. వేలాదిమంది రైతుల షేర్ధనంతో ఊపిరి పోసుకున్న మిల్లు ఆర్థికస్థితిగతులపై సహకారరంగ అధికారులు అత్యంత గోప్యతను పాటిస్తున్నారు. వాస్తవాలు బయటపెట్టకపోవడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల జిల్లాకు చెందిన ఒక మంత్రి చేసిన వ్యాఖ్యల మేరకు కర్మాగారాన్ని మాక్స్ చట్టం కింద ఒక సహకార వ్యవస్థ అధినేతకు అప్పగిస్తారన్న వాదన వ్యక్తమైంది. ఇప్పుడున్న పరిస్థితిలో స్వయంగా సీఎం చంద్రబాబు చొరవ తీసుకొని ఫ్యాక్టరీకి భారీస్థాయిలో నిధులు కేటాయిస్తే తప్ప ఉపశమనం కలగదు. ఇప్పటికే మిల్లు పరిధిలోని చెరకును పొరుగు జిల్లాలోని కర్మాగారానికి తరలించుకుపోతున్నారు. గతేడాది బిల్లులు చెల్లించకపోవడంతో రైతులు బెల్లం తయారీకే మొగ్గు చూపుతున్నారు. దీంతో క్రషింగ్‌కు అవసరమైన చెరకు లేనందున గానుగాట చేపట్టి నిధులు వృథా చేయెద్దని జిల్లాకు చెందిన అధికారి ఒకరు ఇటీవల చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. మరోవైపు రిటైర్డ్ ఉద్యోగులు తమకు జీతం బకాయిలు, ఫీఎఫ్ చెల్లించాలంటూ కోర్టును ఆశ్రయించే పనిలో పడ్డారు. ఈపరిణామాల నేపథ్యంలో గురువారంనాటి సమావేశంలో ఎమ్డీ రూపొందించిన నివేదికను చక్కెరశాఖ డెరైక్టర్ పరిశీలించి తుమ్మపాల గానుగాటపై స్పష్టత ఇవ్వనున్నారని తెలుస్తోంది. -
షుగర్ ఫ్యాక్టరీ ఎండీపై విచారణ
కోవూరు, న్యూస్‌లైన్: కోవూరు చక్కెర కర్మాగారం ఎండీ సుధాకర్‌రెడ్డిపై వచ్చిన అవినీతి ఆరోపణలపై విచారణకు డెరైక్టర్ ఆఫ్ షుగర్స్ నిర్ణయించింది. ఈ మేరకు 15 రోజుల్లో విచారణ జరిపి నివేదిక పంపాలని శుక్రవారం కలెక్టర్ శ్రీకాంత్‌కు ఆదేశాలు పంపింది. వెంటనే స్పందించిన ఆయన కర్మాగారంలోని పలు విషయాలు, ఆర్థిక లావాదేవీలపై విచారణ జరిపేందుకు కోఆపరేటివ్ ఆఫీసర్లను నియమించారు. సుధాకర్‌రెడ్డి ఎండీగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఇప్పటివరకు రూ.36 కోట్ల లావాదేవీలు జరిగినట్లు, అందులో రూ.6.86కోట్లకు సంబంధించి లెక్కలు లేవని, వాటిని తేల్చాలని డెరైక్టర్ ఆఫ్ షుగర్స్ తన ఆదేశాల్లో వైఎస్సార్సీపీ డిమాండ్ చేస్తోందని ఎంపీ మేకపాటి పేర్కొన్నారు. అన్ని ప్రాం తాల వారికృషితోనే హైదరాబాద్ అభివృద్ధి చెందిందన్నారు. ఇప్పటికీ కర్ణాట క, మహారాష్ట్రలో డ్యాంలు నిండితేనే దిగువకు నీళ్లు వదులుతున్నార న్నారు. వి భజన జరిగితే శ్రీశైలం, నాగార్జునసాగర్ ఒట్టి పోతాయన్నారు.ఇవన్నీ ఆలోచించకుండా రాష్ట్ర విభజనకు పూనుకోవడం దారుణమన్నారు. తెలుగు ప్రజ లు దీనిని అంగీకరించడం లేదన్నారు. విభజన కోసం ఇచ్చిన లెటర్‌ను వె నక్కు తీసుకున్న తరువాతనే చంద్రబాబు సీమాంధ్రలో యాత్ర చేయాల న్నారు. బాబు నాటకాలను ప్రజలు నమ్మరన్నారు. విభజన ప్రకటన తరువా త కొత్తరాజధాని కోసం రూ.5 లక్షల కోట్లు కావాలని బాబు అడగడం వా స్తవం కాదా అని ప్రశ్నించారు. ఎన్జీఓలు కలిసి లేఖ వెనక్కు తీసుకోమంటే చంద్రబాబు కుదరదని చెప్పడం అందరికీ తెలిసిందేనన్నారు. ఇప్పుడు సీ మాంధ్ర కోసం త్యాగాలకు సిద్ధమంటూ ప్రజలను మోసగించేందుకు బాబు సిద్ధమయ్యాడని విమర్శిం చారు. ఆయనకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా లేఖ వెనక్కు తీసుకోవాలని డి మాండ్ చేశారు. సమైక్యాంధ్రకు వైఎస్సార్సీపీ కట్టుబడి ఉందన్నారు. సమావేశంలో పార్టీ జిల్లా కన్వీనర్ మేరిగ మురళీధర్, ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి, పార్టీ సీఈసీ సభ్యుడు ఎల్లసిరి గో పాల్‌రెడ్డి, సమన్వయకర్తలు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, పాశం సునీల్‌కుమార్, డాక్టర్ బాలచెన్నయ్య, సంజీవయ్య, దబ్బల రాజారెడ్డి, నేదురుమల్లి పద్మనాభరెడ్డి, నెల్లూరు సిటీ క న్వీనర్ ఆనం వెంకటరమణారెడ్డి, మాజీ డీఐజీ బాలకొండయ్య, బండ్లమూడి అనిత, మాజీ ఎమ్మెల్సీ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి, స్పందన ప్రసాద్, మల్లికార్జునగౌడ్, సన్నపురెడ్డి వెంకట సుబ్బారెడ్డి, నరసింహారెడ్డి, రూప్‌కుమార్ యాదవ్, చంద్రమౌళి, పాండురంగారెడ్డి పాల్గొన్నారు.