Director Sundar C
-
నా మద్దతు రజనీకాంత్‌కే!
తమిళసినిమా: నా మద్దతు రజనీకాంత్‌కే అని అన్నారు ప్రముఖ దర్శకుడు సుందర్.సీ. ఉళ్లతైఅల్లితా, అరుణాచలం, అన్భేశివమ్, అరణ్మణై ఇలా పలు విజయవంతమైన చిత్రాలను రూపొందించిన ఈయన సక్సెస్ఫుల్ దర్శక నిర్మాతగా రాణిస్తున్నారు. నటి, కాంగ్రెస్ పార్టీ ప్రచార ప్రతినిధి కుష్బూ భర్త సుందర్.సీ నటుడు రజనీకాంత్, కమలహాసన్ చిత్రాలకు దర్శకత్వం వహించారన్నది గమనార్హం. తాజాగా జీవా, జై,శివ, నిక్కీగల్రాణి, క్యాథరిన్ ట్రెసా హీరోహీరోయిన్లుగా కలగలప్పు–2 చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇంతకు ముందు ఈయన తెరకెక్కించిన కలగలప్పు చిత్రానికి ఇది సీక్వెల్. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. దర్శకుడు సుందర్.సీ మాట్లాడుతూ మంచి ఎంటర్టెయినర్ చిత్రంగా కలగలప్పు–2 చిత్రం ఉంటుందని చెప్పారు. మీ దర్శకత్వంలో జయంరవి, ఆర్య కలిసి నటించనున్న సంఘమిత్ర డ్రాప్ అయిపోయ్యిందనే ప్రచారం జరగుతోంది. నిజమేనా అన్న ప్రశ్నకు అదంతా అసత్య ప్రచారం అని కొట్టిపారేశారు. సంఘమిత్ర చిత్రం ఏప్రిల్‌లో గానీ, మే ప్రథమార్థంలో గానీ ప్రారంభం అవుతందని స్పష్టం చేశారు. మీరు రజనీకాంత్, కమలహాసన్‌లతో పలు చిత్రాలు తెరకెక్కించారు. వారిద్దరూ ఇప్పుడు రాజకీయ రంగప్రవేశం చేస్తున్నారు. వారిలో మీ మద్దతు ఎవరికి అన్న ప్రశ్నకు కచ్చితంగా తన మద్దతు రజనీకాంత్‌కే అని చెప్పారు. -
ఆ సినిమాకు విజయ్ దూరం
ప్రముఖ తమిళ నటుడు, దర్శకుడు సుందర్ సి ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన సంఘమిత్ర సినిమాలో తాను నటించబోనని తమిళ సూపర్ స్టార్ విజయ్ తేల్చిచెప్పేశాడు. బాహుబలి కంటే పెద్ద బడ్జెట్ తో 11 దేశాలలో షూటింగ్ ఉంటుందని చెబుతున్న ఇంతటి భారీ ప్రాజెక్టును విజయ్ తిరస్కరించాడు. 'ఈ సినిమాలో నటించాల్సిందిగా విజయ్ ని దర్శకుడు సుందర్ అడిగిన విషయం నిజమే. కానీ ఈ ప్రాజెక్టు పూర్తికావడానికి ఏడాదికిపైగా పడుతుందని విజయ్ భావించాడు. విజయ్ తన కెరీర్‌ను దృష్టిలో ఉంచుకుని ఓ ప్రాజెక్టు కోసం ఇంత సుదీర్ఘ సమయం కేటాయించడానికి సుముఖత చూపలేదు' అని విజయ్ సన్నిహితులు చెప్పారు. సుందర్ దర్శకత్వంలో థెనాండల్ ఫిల్మ్స్ ఈ సినిమాను 350 కోట్ల రూపాయల బడ్జెట్‌తో నిర్మించనున్నట్టు వార్తలు వచ్చాయి. కాగా ఈ సినిమాకు ఇప్పటివరకు ప్రధాన పాత్రలకు నటులను ఎంపిక చేయలేదు. దర్శకుడు సుందర్ టెక్నికల్ సిబ్బందిని ఎంపిక చేసుకున్నాడు. సంగీత దర్శకుడిగా ఏఆర్ రెహ్మాన్, కెమెరామెన్‌గా సుదీప్ ఛటర్జీ, ఆర్ట్ డైరెక్టర్‌గా సబు సిరిల్లను ఎంపిక చేశాడు. విజువల్ ఎఫెక్స్ బాధ్యతలు ఆర్ సీ కమలాకన్నన్కు అప్పగించాడు. -
సుందర్‌తో పూనంబాజ్వా
దర్శకుడు సుందర్.సీతో రొమాన్స్‌కు సిద్ధమైం నటి పూనంబాజ్వా. ఈ అమ్మడికి చాలా కాలం తరువాత కథానాయకిగా అవకాశం వచ్చింది. ఇంతకు ముందు జీవాతో కఛేరి అరంభం తదితర చిత్రాలలో హీరోయిన్గా నటించిన పూనంబాజ్వా ఎందుకనో ఇప్పటికీ తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకోలేక పోయింది. అందాలారబోతకు హద్దులు చెరిపేయడానికైనా సిద్ధపడే ఈ ఉత్తరాది బ్యూటీకి బహుశా అదే మైనస్ అయ్యిందేమో. ఇటీవల విడుదలైన అరణ్మణై- చిత్రంలో కూడా త్రిష, హన్సికలతో కలిసి గ్లామర్‌ను గుప్పించిన పూనంబాజ్వాకు ఆ చిత్రం దర్శక, నటుడు సుందర్.సీ మరో అవకాశం కల్పించారు. తాను హీరోగా నటిస్తున్న చిత్రంలో పూనంను హీరోయిన్గా ఎంచుకున్నారు. సక్సెస్ఫుల్ దర్శకుడిగా రాణించిన సుందర్.సీ అనూహ్యంగా తలైనగరం చిత్రంతో హీరోగా అవతారమెత్తిన విషయం తెలిసిందే. ఆ తరువాత కొన్ని చిత్రాల్లో నటించి మళ్లీ కలగలప్పు చిత్రంతో దర్శకత్వం వైపు మొగ్గు చూపారు. ఆ తరువాత తీయ వేలై చేయనుమ్ కుమారూ, ఆంబళ, అరణ్మణై, అరణ్మణై-2 చిత్రాలను తెరకెక్కించారు. ఇవన్నీ విజయం సాధించాయి. కాగా తాజాగా మరోసారి హీరోగా తెరపైకి రానున్నారు. ఈ చిత్రానికి ఆయన శిష్యుడు వెంకట్ రాఘవన్ మెగాఫోన్ పట్టడం విశేషం. ఈ చిత్ర విషయాలను ఆయన తెలుపుతూ మలయాళంలో బీజూమీనన్ హీరోగా నటించిన వెళ్లిముంగా చిత్రాన్ని తమిళంలోకి రీమేక్ చేస్తున్నట్లు వెల్లడించారు. తమిళం కోసం చాలా మార్పులు చేసినట్లు చెప్పారు. ఇది రాజకీయ వ్యంగ్యకథా చిత్రంగా ఉంటుందన్నారు. ఇందులో పూనంబాజ్వా హీరోయిన్గా నటిస్తున్నారని తెలిపారు. కిరణ్, సతీష్, రవిమరియ, వీటీవీ.గణేశ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి భానుమురుగన్ ఛాయాగ్రహణను,సిద్ధార్థ్ విపిన్ సంగీతాన్ని అందిస్తున్నారని, చిత్రం షూటింగ్ ఆదివారం ప్రారంభమైందని తెలిపారు. -
అరణ్మణై-2 ఆలోచన ముందు లేదు
అర ణ్మణై-2 చి త్రం శుక్రవారం తెరపైకి రానుంది. సిద్ధార్ధ్, త్రిష, హన్సిక, పూనం బాజ్వా, కోవైసరళ, సూరి తదితరులతో పాటు సుందర్.సీ దర్శకత్వం వహించి కీలక పాత్ర పోషించిన చిత్రం ఇది. అరణ్మణై చిత్రం మంచి విజయం సాధించడంతో దానికి రెండో భాగమైన ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా సుందర్.సీ ఎప్పుడు చిత్రం చేసినా ఆయన అడగకుండానే కాల్షీట్స్ కేటాయించేంతగా ఆయన దర్శకత్వంపై నాకు గుడ్డి నమ్మకం ఉందని నటి హన్సిక తెలిపారు. అరణ్మణై-2 చిత్రం గురించి సుందర్.సీ చెప్పగానే ఇది నా చిత్రం, నేను లేకుండా షూటింగ్ ప్రారంభం కావడానికి వీలులేదు అని ఆయనకు చెప్పానని, ఇందులో నాకు మామ అనే పాట ఉంది, చాలా నైస్ సాంగ్ అని హన్సిక పేర్కొన్నారు. సుందర్.సీ చిత్రాలంటేనే ప్రేక్షకులకు ప్రత్యేకం, ఈ అరణ్మణై-2 చిత్రం నాకు ప్రత్యేకమని, ఈ చిత్రంలో నటించడం సరి కొత్త అనుభవమని త్రిష తెలిపారు. ఇందులో కొన్ని సన్నివేశాల్లో నేను చాలా సెక్సీగా కనిపిస్తాను, సెక్సీ అనే కంటే నన్ను బ్యూటీఫుల్‌గా చూపించారని చెప్పవచ్చు అని నటి త్రిష అంటున్నారు. ఇక చిత్ర సృష్టికర్త సుందర్.సీ ఏమంటున్నారో చూద్దాం. ప్ర: అరణ్మణై చిత్రానికి పార్టు-2 చేయాలనే ఆలోచన ఎలా వచ్చింది? నిజం చెప్పాలంటే అలాంటి ఆలోచన ముందు నాకు లేదు. అరణ్మణై చిత్రం చూసిన ప్రేక్షకులకు ఆ ఫీల్ పోకూడదని చిత్రం చివరిలో కిటికిలో నుంచి దెయ్యం చూస్తున్నట్లు చూపించాను. దీంతో అరణ్మణై చిత్రం విజయం సాధించడంతో చాలా మంది పార్టు-2 ఎప్పుడు తీస్తున్నారు అని అడగడం మొదలెట్టారు. ఇంట్లో మా పిల్లలు కూడా అదే మాట అడగడంతో అప్పుడు అరణ్మణైకు సీక్వెల్ కథ తయారు చేయడానికి సిద్ధం అయ్యాను. ఇది అరణ్మణై చిత్రం కంటే సూపర్‌గా వచ్చింది. ప్ర: ఇందులోనూ నటి హన్సికనే ఎంపిక చేయడానికి కారణం? కథ రెడీ అవ్వగానే మొట్ట మొదట ఫోన్ చేసి చెప్పింది హన్సికకే.నేనామెను నటించమని అడగక ముందే ఈ చిత్రంలో నేను ఉంటున్నాను అని కాల్షీట్స్ బుకింగ్ చేసుకున్నది హన్సికనే. ఇకపోతే అరణ్మణై-3 చిత్రం చేసే ఆలోచన కూడా ఉంది. ప్ర: సిద్ధార్ధ్, త్రిష గురించి? సిద్ధార్ధ్ ఈ చిత్రంలో నటించడం అన్నది యాదృచ్ఛికంగానే జరిగింది. ఒక సందర్భంలో కలిసిన సిద్ధార్ద్‌కు ఈ చిత్రం గురించి చెప్పారు. వెంటనే ఆయన నేను నటిస్తున్నాను అని అన్నా రు. ఇందులో ప్రముఖ నటులు నటించడానికి సంకోచించే పాత్రలో సిద్ధార్ధ్ చేశారు. నటి త్రిష అంతే. వీరిద్దరికీ తొలి హారర్ చిత్రం ఇదే. ఇక నటుడు సూరి నా దర్శకత్వంలో తొలి సారిగా నటించారు. అలాగే కోవైసరళను హాస్య దెయ్యమనే చెప్పాలి. నటుడు మనోబాలా ఇలా చాలా మంది నటించారు. ప్ర: చిత్రంలో హైలైట్ ఏమిటి? యుగళ గీతాలు, ఐటమ్స్ లాంటి వాటి కి ఎవరైనా సంగీతాన్ని అందిస్తారు. ఇందు లో అమ్మోరు పాట ఒకటి ఉంది. అలాంటి పాటకు హిప్ హాప్ తమిళన్ బాణీలు కట్టగలరా అన్న సందేహం కలిగింది. అయితే ఆయన అద్భుతంగా సంగీతాన్ని అందించారు. ఆ పాట చిత్రీకరించడం మాకు సవాల్‌గా మారింది. 150 అడుగుల పొడవైన దేవతా విగ్రహం, 350 మంది నృత్యకళాకారులు, వేలాది మంది సహాయ నటీనటులతో ఆ పాటను చిత్రీకరించాం. చిత్రీకరణ సమయంలో ప్రతి సన్నివేశానికి కనీసం నలుగురికి పూనకాలు వచ్చేవి.