అరణ్మణై-2 ఆలోచన ముందు లేదు
అర ణ్మణై-2 చి త్రం శుక్రవారం తెరపైకి రానుంది. సిద్ధార్ధ్, త్రిష, హన్సిక, పూనం బాజ్వా, కోవైసరళ, సూరి తదితరులతో పాటు సుందర్.సీ దర్శకత్వం వహించి కీలక పాత్ర పోషించిన చిత్రం ఇది. అరణ్మణై చిత్రం మంచి విజయం సాధించడంతో దానికి రెండో భాగమైన ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా సుందర్.సీ ఎప్పుడు చిత్రం చేసినా ఆయన అడగకుండానే కాల్‌షీట్స్ కేటాయించేంతగా ఆయన దర్శకత్వంపై నాకు గుడ్డి నమ్మకం ఉందని నటి హన్సిక తెలిపారు.
అరణ్మణై-2 చిత్రం గురించి సుందర్.సీ చెప్పగానే ఇది నా చిత్రం, నేను లేకుండా షూటింగ్ ప్రారంభం కావడానికి వీలులేదు అని ఆయనకు చెప్పానని, ఇందులో నాకు మామ అనే పాట ఉంది, చాలా నైస్ సాంగ్ అని హన్సిక పేర్కొన్నారు. సుందర్.సీ చిత్రాలంటేనే ప్రేక్షకులకు ప్రత్యేకం, ఈ అరణ్మణై-2 చిత్రం నాకు ప్రత్యేకమని, ఈ చిత్రంలో నటించడం సరి కొత్త అనుభవమని త్రిష తెలిపారు. ఇందులో కొన్ని సన్నివేశాల్లో నేను చాలా సెక్సీగా కనిపిస్తాను, సెక్సీ అనే కంటే నన్ను బ్యూటీఫుల్‌గా చూపించారని చెప్పవచ్చు అని నటి త్రిష అంటున్నారు. ఇక చిత్ర సృష్టికర్త సుందర్.సీ ఏమంటున్నారో చూద్దాం.
ప్ర: అరణ్మణై చిత్రానికి పార్టు-2 చేయాలనే ఆలోచన ఎలా వచ్చింది?
నిజం చెప్పాలంటే అలాంటి ఆలోచన ముందు నాకు లేదు. అరణ్మణై చిత్రం చూసిన ప్రేక్షకులకు ఆ ఫీల్ పోకూడదని చిత్రం చివరిలో కిటికిలో నుంచి దెయ్యం చూస్తున్నట్లు చూపించాను. దీంతో అరణ్మణై చిత్రం విజయం సాధించడంతో చాలా మంది పార్టు-2 ఎప్పుడు తీస్తున్నారు అని అడగడం మొదలెట్టారు. ఇంట్లో మా పిల్లలు కూడా అదే మాట అడగడంతో అప్పుడు అరణ్మణైకు సీక్వెల్ కథ తయారు చేయడానికి సిద్ధం అయ్యాను. ఇది అరణ్మణై చిత్రం కంటే సూపర్‌గా వచ్చింది.
ప్ర: ఇందులోనూ నటి హన్సికనే ఎంపిక చేయడానికి కారణం?
కథ రెడీ అవ్వగానే మొట్ట మొదట ఫోన్ చేసి చెప్పింది హన్సికకే.నేనామెను నటించమని అడగక ముందే ఈ చిత్రంలో నేను ఉంటున్నాను అని కాల్‌షీట్స్ బుకింగ్ చేసుకున్నది హన్సికనే. ఇకపోతే అరణ్మణై-3 చిత్రం చేసే ఆలోచన కూడా ఉంది.
ప్ర: సిద్ధార్ధ్, త్రిష గురించి?
సిద్ధార్ధ్ ఈ చిత్రంలో నటించడం అన్నది యాదృచ్ఛికంగానే జరిగింది. ఒక సందర్భంలో కలిసిన సిద్ధార్ద్‌కు ఈ చిత్రం గురించి చెప్పారు. వెంటనే ఆయన నేను నటిస్తున్నాను అని అన్నా రు. ఇందులో ప్రముఖ నటులు నటించడానికి సంకోచించే పాత్రలో సిద్ధార్ధ్ చేశారు. నటి త్రిష అంతే. వీరిద్దరికీ తొలి హారర్ చిత్రం ఇదే. ఇక నటుడు సూరి నా దర్శకత్వంలో తొలి సారిగా నటించారు. అలాగే కోవైసరళను హాస్య దెయ్యమనే చెప్పాలి. నటుడు మనోబాలా ఇలా చాలా మంది నటించారు.
ప్ర: చిత్రంలో హైలైట్ ఏమిటి?
యుగళ గీతాలు, ఐటమ్స్ లాంటి వాటి కి ఎవరైనా సంగీతాన్ని అందిస్తారు. ఇందు లో అమ్మోరు పాట ఒకటి ఉంది. అలాంటి పాటకు హిప్ హాప్ తమిళన్ బాణీలు కట్టగలరా అన్న సందేహం కలిగింది. అయితే ఆయన అద్భుతంగా సంగీతాన్ని అందించారు. ఆ పాట చిత్రీకరించడం మాకు సవాల్‌గా మారింది. 150 అడుగుల పొడవైన దేవతా విగ్రహం, 350 మంది నృత్యకళాకారులు, వేలాది మంది సహాయ నటీనటులతో ఆ పాటను చిత్రీకరించాం. చిత్రీకరణ సమయంలో ప్రతి సన్నివేశానికి కనీసం నలుగురికి పూనకాలు వచ్చేవి.