సుందర్‌తో పూనంబాజ్వా
దర్శకుడు సుందర్.సీతో రొమాన్స్‌కు సిద్ధమైం నటి పూనంబాజ్వా. ఈ అమ్మడికి చాలా కాలం తరువాత కథానాయకిగా అవకాశం వచ్చింది. ఇంతకు ముందు జీవాతో కఛేరి అరంభం తదితర చిత్రాలలో హీరోయిన్‌గా నటించిన పూనంబాజ్వా ఎందుకనో ఇప్పటికీ తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకోలేక పోయింది. అందాలారబోతకు హద్దులు చెరిపేయడానికైనా సిద్ధపడే ఈ ఉత్తరాది బ్యూటీకి బహుశా అదే మైనస్ అయ్యిందేమో. ఇటీవల విడుదలైన అరణ్మణై- చిత్రంలో కూడా త్రిష, హన్సికలతో కలిసి గ్లామర్‌ను గుప్పించిన పూనంబాజ్వాకు ఆ చిత్రం దర్శక, నటుడు సుందర్.సీ మరో అవకాశం కల్పించారు.
తాను హీరోగా నటిస్తున్న చిత్రంలో పూనంను హీరోయిన్‌గా ఎంచుకున్నారు. సక్సెస్‌ఫుల్ దర్శకుడిగా రాణించిన సుందర్.సీ అనూహ్యంగా తలైనగరం చిత్రంతో హీరోగా అవతారమెత్తిన విషయం తెలిసిందే. ఆ తరువాత కొన్ని చిత్రాల్లో నటించి మళ్లీ కలగలప్పు చిత్రంతో దర్శకత్వం వైపు మొగ్గు చూపారు. ఆ తరువాత తీయ వేలై చేయనుమ్ కుమారూ, ఆంబళ, అరణ్మణై, అరణ్మణై-2 చిత్రాలను తెరకెక్కించారు. ఇవన్నీ విజయం సాధించాయి. కాగా తాజాగా మరోసారి హీరోగా తెరపైకి రానున్నారు. ఈ చిత్రానికి ఆయన శిష్యుడు వెంకట్ రాఘవన్ మెగాఫోన్ పట్టడం విశేషం.
ఈ చిత్ర విషయాలను ఆయన తెలుపుతూ మలయాళంలో బీజూమీనన్ హీరోగా నటించిన వెళ్లిముంగా చిత్రాన్ని తమిళంలోకి రీమేక్ చేస్తున్నట్లు వెల్లడించారు. తమిళం కోసం చాలా మార్పులు చేసినట్లు చెప్పారు. ఇది రాజకీయ వ్యంగ్యకథా చిత్రంగా ఉంటుందన్నారు. ఇందులో పూనంబాజ్వా హీరోయిన్‌గా నటిస్తున్నారని తెలిపారు. కిరణ్, సతీష్, రవిమరియ, వీటీవీ.గణేశ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి భానుమురుగన్ ఛాయాగ్రహణను,సిద్ధార్థ్ విపిన్ సంగీతాన్ని అందిస్తున్నారని, చిత్రం షూటింగ్ ఆదివారం ప్రారంభమైందని తెలిపారు.