తమిళసినిమా: నా మద్దతు రజనీకాంత్‌కే అని అన్నారు ప్రముఖ దర్శకుడు సుందర్.సీ. ఉళ్లతైఅల్లితా, అరుణాచలం, అన్భేశివమ్, అరణ్మణై ఇలా పలు విజయవంతమైన చిత్రాలను రూపొందించిన ఈయన సక్సెస్‌ఫుల్ దర్శక నిర్మాతగా రాణిస్తున్నారు. నటి, కాంగ్రెస్ పార్టీ ప్రచార ప్రతినిధి కుష్బూ భర్త సుందర్.సీ నటుడు రజనీకాంత్, కమలహాసన్ చిత్రాలకు దర్శకత్వం వహించారన్నది గమనార్హం. తాజాగా జీవా, జై,శివ, నిక్కీగల్రాణి, క్యాథరిన్ ట్రెసా హీరోహీరోయిన్లుగా కలగలప్పు–2 చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇంతకు ముందు ఈయన తెరకెక్కించిన కలగలప్పు చిత్రానికి ఇది సీక్వెల్.
నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. దర్శకుడు సుందర్.సీ మాట్లాడుతూ మంచి ఎంటర్‌టెయినర్ చిత్రంగా కలగలప్పు–2 చిత్రం ఉంటుందని చెప్పారు. మీ దర్శకత్వంలో జయంరవి, ఆర్య కలిసి నటించనున్న సంఘమిత్ర డ్రాప్ అయిపోయ్యిందనే ప్రచారం జరగుతోంది. నిజమేనా అన్న ప్రశ్నకు అదంతా అసత్య ప్రచారం అని కొట్టిపారేశారు. సంఘమిత్ర చిత్రం ఏప్రిల్‌లో గానీ, మే ప్రథమార్థంలో గానీ ప్రారంభం అవుతందని స్పష్టం చేశారు. మీరు రజనీకాంత్, కమలహాసన్‌లతో పలు చిత్రాలు తెరకెక్కించారు. వారిద్దరూ ఇప్పుడు రాజకీయ రంగప్రవేశం చేస్తున్నారు. వారిలో మీ మద్దతు ఎవరికి అన్న ప్రశ్నకు కచ్చితంగా తన మద్దతు రజనీకాంత్‌కే అని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment