జిల్లాలకు ఎపీసీసీ పరిశీలకుల నియామకం
హైదరాబాద్: స్థానిక సంస్థలకు జరిగే ఉప ఎన్నికల్లో పరిశీలకులను నియమించడానికి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మార్చి 17న ఇందిరాభవన్లో సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు డాక్టర్ ఎన్. రఘువీరారెడ్డి పార్టీ సీనియర్ నాయకులతో సమావేశమయ్యారు.
ఈ సమావేశంలో రాబోయే స్థానిక సంస్థల ఉప ఎన్నికలకు సంబంధించిన విషయాలపై చర్చించారు. త్వరలో జరగనున్న మున్సిపల్/కార్పొరేషన్, వార్డుల ఉప ఎన్నికలకు పార్టీ పరిశీలకులుగా కొందరు నేతలకు బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు జిల్లాలు, వాటి పరిశీలకుల వివరాలను ఓ ప్రకటనలో ఏపీసీసీ వెల్లడించింది.
జిల్లా పేరు పరిశీలకులు
1. విజయనగరం --- ద్రోణం రాజు శ్రీనివాస్(ఎపీసీసీ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే)
2. విశాఖపట్నం --- ఎస్.ఎన్.రాజా (ఎపీసీసీ ప్రధాన కార్యదర్శి)
3. తూర్పు గోదావరి --- పక్కాల సూరిబాబు (ఎపీసీసీ ప్రధాన కార్యదర్శి)
4. పశ్చిమ గోదావరి --- నరహరశెట్టి నరసింహారావు(ఎపీసీసీ ప్రధాన కార్యదర్శి)
5. కృష్ణా ---- సుందరరామ శర్మ (ఎపీసీసీ లీగల్ సెల్ చైర్మన్)
6. గుంటూరు ---- కె. బాపిరాజు (ఎపీసీసీ ఉపాధ్యక్షులు, మాజీ ఎంపీ)
7. నెల్లూరు ----- మస్తాన్వలీ (ఎపీసీసీ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే)
8. చిత్తూరు ------ డాక్టర్ సాకె శైలజానాధ్ (ఎపీసీసీ ఉపాధ్యక్షులు, మాజీ మంత్రి)
9. కడప ----- షాజహన్ బాషా (ఎపీసీసీ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే)
10. కర్నూలు ----- డాక్టర్ ఎన్. తులసిరెడ్డి ( ఎపీసీసీ ఉపాధ్యక్షులు, మాజీ ఎంపీ)
11. అనంతపురం ------ అహ్మదుల్లా ( ఎపీసీసీ ఉపాధ్యక్షులు, మాజీ మంత్రి)