dishonesty
-
ప్రతిపక్షాలది దగాకోరు రాజకీయం
న్యూఢిల్లీ: తమ ప్రభుత్వాన్ని విమర్శించడంలో ప్రతిపక్షాలు బూటకపు మేధోతనాన్ని, దగాకోరు రాజకీయాన్ని ప్రదర్శిస్తున్నాయంటూ ప్రధాని నరేంద్ర మోదీ నిప్పులు చెరిగారు. దశాబ్దాల క్రితమే అనేక ప్రయోజనాలు పొందాల్సిన ప్రజలకు ఇంతవరకు ఎలాంటి ఫలాలు అందలేదని, అలాంటివారికి సరైన ఫలితాలు అందించాలంటే భారీ, కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఓపెన్ మేగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పలు అంశాలను ప్రస్తావించారు. నూతన సాగు చట్టాలు, జీఎస్టీ అమలు, ఆధార్, నూతన పార్లమెంట్ భవన నిర్మాణం తదితర అనేక అంశాలపై ప్రతిపక్షాల విమర్శలను ఆయన దుయ్యబట్టారు. ఈ అంశాలన్నింటిపై తొలుత ఏకీభవించిన తర్వాత రాజకీయ కారణాలతో విపక్షాలు యూటర్న్ తీసుకొని ద్వేషపూరిత ప్రచారం ఆరంభించాయని ఆరోపించారు. ప్రస్తుతం సాగు చట్టాలను వ్యతిరేకిస్తున్నవారిని చూస్తే ప్రజలకు బూటకపు మేధోతనం, దగాకోరుతనమంటే ఏమిటో తెలుస్తోందన్నారు. ఒక రాజకీయ పార్టీ ఒక వాగ్దానమిచ్చి తర్వాత నెరవేర్చలేకపోవడం వేరని, కానీ సంస్కరణలపై ముందు ఏకీభవించి తర్వాత యూటర్న్ తీసుకొని దు్రష్పచారం చేయడం సహించరానిదని ఆరోపించారు. ఇప్పుడు తమ సంస్కరణలను వ్యతిరేకిస్తున్నవారే వారివారి మేనిఫెస్టోల్లో ఇవే అంశాలను పొందుపరిచారని, అయితే ప్రజామోదం పొందిన తమ పార్టీ వీటిని అమలు చేయడంతో సహించలేక అనైతికంగా వ్యవహిస్తున్నారని విమర్శించారు. రైతులకు ఏది ప్రయోజనం అని ఆలోచించకుండా తమ రాజకీయాలకు ఏది ప్రయోజనమని విపక్షాలు ఆలోచిస్తున్నాయని ఆరోపించారు. కరోనా కట్టడిలో భేష్ అనేక అభివృద్ధి చెందిన దేశాల కన్నా కరోనాను కట్టడి చేయడంలో భారత్ ఎంతో మెరుగ్గా వ్యవహరించిందని మోదీ చెప్పారు. కోవిడ్ విషయంలో తమ ప్రభుత్వ చర్యలను విమర్శించిన వారిపై ఆయన విరుచుకుపడ్డారు. వీరి లక్ష్యం అంతర్జాతీయంగా భారత్ పేరును నాశనం చేయడమేనని నిప్పులు చెరిగారు. కరోనా వల్ల ప్రపంచ దేశాలన్నీ ఇబ్బంది పడ్డాయని, మనం మాత్రం నెగిటివ్ ప్రచారాలను తట్టుకొని కరోనా కట్టడిలో మెరుగ్గా వ్యవహరించామని చెప్పారు. అవసరం వచి్చనప్పుడు ఇండియా ఐక్యంగా నిలబడుతుందనే పాఠాన్ని కోవిడ్ తెలియజేసిందన్నారు. ‘‘భారత్ టీకాను రూపొందించకపోతే ఏమయ్యేదో ఆలోచించండి. పరిస్థితులు ఎలా ఉండేవి? ఇప్పటికీ ప్రపంచంలో చాలా ప్రాంతాల్లో కోవిడ్ టీకా లభించడం లేదు. కానీ మనం వ్యాక్సినేషన్లో విజయవంతం అయ్యాము.’’అని చెప్పారు. స్వాలంబంన(ఆత్మనిర్భరత) ఇందుకు కారణమన్నారు. విమర్శలను తాను స్వాగతిస్తానని, ఆరోగ్యవంతమైన పురోగతికి ఇవి అవసరమని ఆయన చెప్పారు. కానీ అలాంటి నిజమైన విమర్శలు చాలా స్వల్పమని, అసంబద్ధ ఆరోపణలే అధికమని విచారం వ్యక్తం చేశారు. మిమ్మల్ని మీరే అవహేళన చేసుకుంటున్నారు నూతన పార్లమెంటు ఆవశ్యకతపై గొంతెత్తిన పారీ్టలే నేడు తాము నిర్మిస్తున్న నూతన భవన సముదాయాన్ని వ్యతిరేకిస్తున్నాయని, ఇది వారిని వారు అవహేళన చేసుకోవడమేనని మోదీ ఎద్దేవా చేశారు. గతంలో ఈ పార్టీల నేతలు కొత్త భవనం కావాలని కోరలేదా? అని ప్రశ్నించారు. దాన్ని సాకారం చేయాలని యతి్నస్తుంటే ఏవో కుంటిసాకులతో వ్యతిరేకించడం ఎంతవరకు సబబన్నారు. నిజానికి దేశ ప్రజలకు అనేక ప్రయోజనాలు దశాబ్దాల క్రితమే అందాల్సిఉందని, కానీ ఇంతవరకు వీరికి సరైన ఫలాలు అందలేదని వివరించారు. అలాంటివారికి సత్ఫలితాలివ్వడానికి పనిచేస్తున్నామని, ఇందుకు కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సివస్తే తీసుకుంటామని చెప్పారు. ఆందోళన చేస్తున్న రైతు సంఘాలతో చర్చలకు సిద్ధమని తమ ప్రభుత్వం తొలినుంచి చెబుతోందని గుర్తు చేశారు. ఇప్పటికి అనేక మార్లు వారితో చర్చలు జరిపామని, కానీ నిజానికి చట్టాల్లో ఏం మార్చాలో వారికే స్పష్టత లేదని దుయ్యబట్టారు. గత ప్రభుత్వాలన్నీ కాం గ్రెస్ గోత్రీకుల ఆధ్వర్యంలో ఏర్పాటయ్యేవని ఎద్దేవా చేశారు. అందుకే గత ప్రభుత్వాలన్నీ ఒకేవిధమైన రాజకీయ, ఆర్థిక ఆలోచనతో వ్యవహరించాయని, కానీ తొలిసారి వాజ్‌పేయికి ప్రజలు ప్రత్యామ్నాయ అవకాశం ఇచ్చారని గుర్తు చేశారు. తన హయాంలో తొలిసారి కాంగ్రెస్‌తో సంబంధం లేకుండా ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశమిచ్చారన్నారు. ప్రజలు సంపూర్ణ మార్పు కోరారనేందుకు ఇదే నిదర్శనమన్నారు. -
ఆధార్‌పై దుష్ప్రచారం
సాక్షి, బెంగళూరు: ఆధార్ వ్యవస్థను అప్రతిష్టపాలు చేసేందుకు పద్ధతిప్రకారం దుష్ప్రచారం జరుగుతోందని యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) మాజీ చైర్మన్ నందన్ నీలేకని పేర్కొన్నారు. గురువారం బెంగళూరులో ఇన్ఫోసిస్ సైన్స్ ఫౌండేషన్ అవార్డుల కార్యక్రమంలో పాల్గొన్న నీలేకని.. దేశంలో ఉన్న ప్రభుత్వ గుర్తింపు పత్రాల్లో అత్యంత విశిష్టమైన ఆధార్‌పై కావాలనే అవాస్తవాలను ప్రచారం చేస్తుండటం విచారకరమన్నారు. అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో ఆధార్ వ్యవస్థకు భద్రత కల్పించామన్నారు. ఆధార్‌పై వ్యతిరేక ప్రచారం చేస్తే అదేరకమైన ఫలితాలుంటాయన్నారు. ‘ఇదంతా ఆధార్ వ్యవస్థకు అపఖ్యాతిపాలు చేసేందుకు వందశాతం పద్ధతిప్రకారం జరుగుతున్న దుష్ప్రచారం. ఆధార్ డేటా రక్షణకు ఎన్నో దశల భద్రత కల్పించాం. దీన్ని ఛేదించటం అంత సులభమేం కాదు’ అని అన్నారు. కాగా, ఆధార్ డేటా తస్కరణకు గురైందంటూ వస్తున్న వార్తలతో ఆందోళన వద్దని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ గురువారం సూచించారు. ఢిల్లీలో జరిగిన 6వ వార్షిక అంతర్జాతీయ వాణిజ్య సదస్సులో పాల్గొన్న మంత్రి.. ‘ఆధార్‌లో మీ మతం, సామాజికవర్గం, వైద్య, విద్య, ఆదాయ వివరాలేమీ ఉండవు. ఐరిస్, వేలిముద్రలు మాత్రమే ఉంటాయి. వందలకోట్లసార్లు ప్రయత్నించినా ఈ డేటాను చోరీ చేయలేరు. దేశంలో అత్యంత గోప్యమైన విషయాలు.. బ్యాంకు ఖాతాల వివరాలు, ఆరోగ్య వివరాలే’ అని రవిశంకర్ అన్నారు. -
మళ్లీ దగా పడిన రైతన్న
పునరావృతమైన నకిలీ మిర్చి విత్తనాల సమస్య ఏపుగా పెరిగినా కాయలు రాలేదంటూ చెన్నారావుపేట రైతుల గగ్గోలు గత సీజన్లో నష్టపోయిన రైతులకు ఇప్పటికీ అందని పరిహారం హన్మకొండ : రైతన్నలు దగా పడడం.. రైతులను దగాకు గురిచేసిన వారు తప్పించుకోవడం ఏటేటా పునరావృతమవుతోంది. నకిలీ విత్తనాల బారిన పడి నష్టపోయిన రైతులను ఆదుకునే విషయంలో ప్రభుత్వం ఏ మాత్రం పట్టనట్లు వ్యవహరిస్తుండడంతో ఈ పరిస్థితి ఎదురవుతోంది. బాధ్యులపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామని, నకిలీ విత్తనాల సమస్య రాకుండా ప్రత్యేక చట్టం రూపొందిస్తామంటూ చెబుతున్న పాలకులు అమలులో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడం.. మోసం చేయాలనుకునే వారికి అంది వచ్చిన అవకాశంగా మారుతోంది. నాలుగు నెలల క్రితమే.. గత నాలుగు నెలల కిందట జిల్లాలోని పరకాల, ఆత్మకూరు, నర్సంపేట, నల్లబెల్లి, నెక్కొండ, దుగ్గొండి మండలాలకు చెందిన సుమారు 900మంది రైతులు నకిలీ మిర్చి విత్తనాలు కొనుగోలు చేసి లక్షలాది రూపాయలు పెట్టుబడితో సాగు చేశారు. అయితే, మొక్కలు ఏపుగా పెరిగినా పూత, కాత లేకపోవడంతో వారు ఆందోళన చెందారు. అప్పటి నుంచి ఇప్పటివరకు రైతన్నలు అనేక ఆందోళనలు చేసినప్పటికీ, రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నామని చెబుతున్న ప్రభుత్వం కన్నెత్తి చూడలేదు. పరిహారం మాట పక్కన పెడితే అధికార పార్టీ నుంచి పరామర్శించే వారు లేకపోవడంతో రైతులు ఏం చేయాలో తోచక ఊరుకుండిపోయారు. అదే సమయంలో నకిలీ విత్తనాల బాధ్యులపై పీడీ చట్టం కింద కేసులు నమోదు చేస్తామని.. నకిలీ విత్తనాల నియంత్రణ చట్టం రూపొందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో ఏది కూడా అమలుకు నోచుకోలేదు. ప్రభుత్వ అలసత్వం.. గత సీజన్లో నకిలీ మిర్చి విత్తనాల కారణంగా నష్టపోయిన రైతులు పరిహారం అందించకపోగా.. బాధ్యులైన కంపెనీలు, వ్యాపారులపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీనిని అవకాశంగా తీసుకున్న వ్యాపారులు మళ్లీ విజృంభించారు. తాజాగా జిల్లాలోని చెన్నారావుపేట మండలంలోని కోనాపురం, జల్లి, ఎల్లాయగూడెం గ్రామానికి చెందిన జీవా మిర్చి విత్తనాలు సాగుచేయగా అవి ఏపుగా పెరిగినప్పటికీ కాయలు కాయకపోవడంతో గగ్గోలు పెడుతున్నారు. చివరకు తాము మోసపోయామని గ్రహించి నర్సంపేటలోని షాపు ఎదుట సుమారు 300మంది రైతులు శనివారం ఆందోళన నిర్వహించారు. అయినా ప్రభుత్వంలో ఏమాత్రం చలనం లేకపోవడం గమనార్హం. అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ వరంగల్ రూరల్ జిల్లాలో పండించే మిర్చి పంటకు ఇప్పటివరకు అంతర్జాతీయంగా మంచి డిమాండ్ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఖానాపురం మండలంలోని అశోక్‌నగర్ వద్ద మిర్చి పరిశోధన కేంద్ర కోసం 90ఎకరాలు సేకరించారు. ఇందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి ఇంత ప్రాచుర్యం తీసుకొచ్చిన మిర్చి రైతుల విషయంలో ప్రభుత్వం ఎందుకు పట్టనట్లు వ్యవహరిస్తోందో అంతుబట్టడం లేదు. రైతులు ఒకవైపు ప్రకృతి ప్రకోపానికి దెబ్బ తింటుండగా, మరోవైపు ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు తగిన గిట్టుబాటు ధర లభించక అవస్థలు పడుతున్నారు. దీనికి తోడు నకిలీల దెబ్బకు వారు కోలుకోలేని స్థితిలోకి నెట్టబడుతున్నారు. రైతుల సంక్షేమంపై కోటలు దాటేలా మాటలు చెప్పే ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు వారిని ఆదుకునే విషయంలో ఎందుకు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారో అర్థం కాకుండా ఉంది. ఇలా ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా రైతులు మళ్లీ మళ్లీ దగా పడుతూనే ఉన్నారు. -
మళ్లీ దగా!
► వాతావరణ బీమా మంజూరులో తీవ్ర అన్యాయం ► 39 మండలాలకు నయాపైసా మంజూరు కాని వైనం ► 24 మండలాల్లో 1.85 లక్షల మందికి రూ.109.66 కోట్లు మంజూరు ► ప్రీమియం రూపంలో రూ.115.60 కోట్లు కట్టిన 5.08 లక్షల మంది రైతులు ► కట్టిన ప్రీమియం కన్నా తక్కువ పరిహారం మంజూరు కరువు కోరల్లో చిక్కుకున్న ‘అనంత’ రైతులకు మరోసారి అన్యాయం జరిగింది. వాతావరణ బీమా పథకం వల్ల 2011 నుంచి దారుణంగా మోసపోతున్న రైతులు ఈ సారి కూడా వంచనకు గురయ్యారు. ప్రీమియం రూపంలో పెద్దమొత్తంలో గుంజుతున్న బీమా కంపెనీ.. పరిహారం విషయంలో మాత్రం చిల్లర విదిల్చుతోంది. 2015 ఖరీఫ్ పంట నష్టానికి సంబంధించి 1,85,194 మంది రైతులకు కేవలం రూ.109.66 కోట్లు మంజూరు చేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. అనంతపురం అగ్రికల్చర్: పంటల బీమా స్థానంలో అమలు చేస్తున్న వాతావరణ బీమా పథకం జిల్లా రైతులకు ఏమాత్రమూ భరోసా ఇవ్వలేకపోతోంది. ప్రతియేటా మాదిరే ఈసారీ అన్నదాతలను ఆదుకోలేకపోయింది. గత ఏడాది జిల్లా వ్యాప్తంగా 5,08,868 మంది రైతులు రూ.115.60 కోట్ల ప్రీమియం చెల్లించారు. పరిహారం మాత్రం కేవలం 24 మండలాలకు మంజూరైంది. 1,85,194 మందికి రూ.109.66 కోట్లు మంజూరు చేస్తూ బుధవారం బీమా కంపెనీ ఉత్తర్వులిచ్చింది. 39 మండలాల పరిధిలోని 3,23,674 మందికి నయాపైసా మంజూరు చేయలేదు. మంజూరైన వాటిలోనూ అత్యధికంగా కనగానపల్లి మండలానికి రూ.17.59 కోట్లు, ధర్మవరం మండలానికి రూ.12.20 కోట్లు ఇచ్చింది. అత్యల్పంగా లేపాక్షి మండలానికి రూ.63.32 లక్షలు మాత్రమే మంజూరు చేసింది. అగళి, అమడగూరు, అనంతపురం, బత్తలపల్లి, బుక్కపట్నం, బుక్కరాయసముద్రం, చెన్నేకొత్తపల్లి, చిలమత్తూరు, గాండ్లపెంట, గార్లదిన్నె, గుత్తి, గోరంట్ల, గుడిబండ, గుంతకల్లు, కదిరి, కళ్యాణదుర్గం, కంబదూరు, కణేకల్లు, కొత్తచెరువు, ముదిగుబ్బ, నల్లచెరువు, నల్లమాడ, ఎన్పీ కుంట, నార్పల, ఓడీ చెరువు, పామిడి, పెనుకొండ, పుట్లూరు, రామగిరి, రాయదుర్గం, రొళ్ల, శెట్టూరు, శింగనమల, తాడిమర్రి, తాడిపత్రి, తలుపుల, తనకల్లు, యాడికి, యల్లనూరు మండలాలకు పరిహారం మంజూరు కాలేదు. రైతులకు జరిగిన అన్యాయంపై ఉద్యమించడానికి రైతులు, రైతు సంఘాలు, విపక్షాలు సిద్ధమవుతున్నాయి. -
ఏఎస్ఐ మోహన్‌రెడ్డికి బిగుస్తున్న ఉచ్చు
కరీంనగర్: కరీంనగర్ జిల్లా ఏఎస్ఐ మోహన్‌రెడ్డి అక్రమ వడ్డీ వ్యాపారం దందా మరిన్ని మలుపులు తిరుగుతోంది. ఈ వ్యవహారంపై ఇప్పటికే దర్యాప్తు చేపట్టిన సీఐడీ అధికారులు.. మోహన్‌రెడ్డికి ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించిన వారందరి వివరాలు సేకరించింది. ఆయనకు తాకట్టు పెట్టిన ఆస్తుల విలువ రూ.50 కోట్ల వరకు ఉండొచ్చని భావిస్తున్నారు. వాటి క్రయ విక్రయాలు జరుపవద్దని తాజాగా సీఐడీ ఆదేశాలు జారీ చేసింది. వాటి రిజిస్ట్రేషన్లను నిలిపివేయాలని అధికారులను కోరింది. దీంతోపాటు, 2006లో మోహన్‌రెడ్డిపై నమోదైన ఆదాయానికి మించి ఆస్తుల కేసును తిరగదోడింది. ఇందుకు సంబంధించి 68మంది సాక్షులను కోర్టులో హాజరుపరిచేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఈ ఏడాది సీఐడీ నమోదు చేసిన 27 కేసుల్లో మోహన్‌రెడ్డికి సంబంధించినవే నాలుగు ఉన్నాయి. ఈ వ్యవహారానికి సంబంధించి పోలీసు శాఖ ఏఎస్పీ నుంచి హోంగార్డు స్థాయి వరకు 12 మందిపై వేటువేసింది. మరో ఇద్దరిపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. మోహన్‌రెడ్డిపై పోలీసులు ఇప్పటికే 20కిపైగా కేసులు నమోదు చేశారు. మరోపక్క, మోహన్ రెడ్డి కేసులో ఆరుగురుని సీఐడీ అధికారులు కోర్టులో హాజరుపరిచారు. 14 రోజుల రిమాండ్ తో జైలుకు తరలించారు.