Distance Education Center
-
దూర విద్యే..!
- కోర్సుల నిర్వహణ ప్రశ్నార్థకం ... - కొత్త కోర్సులకు అనుమతి ఇవ్వని యూజీసీ - ఆన్లైన్ కోర్సులదీ ఇదే పరిస్థితి - వర్సిటీ అత్యుత్సాహం వల్లే ఈ దుస్థితి ఏఎన్‌యూ: ఆచార్య నాగార్జున యూనివర్సిటీ దూరవిద్యా కేంద్రం నిర్వహించే కొన్ని కోర్సులకు ఈ విడత ప్రవేశాలు ప్రశ్నార్థకంగా మారాయి. 2015-16 విద్యా సంవత్సరానికి సంబంధించి యూజీసీ అనుమతి లభించక నోటిఫికేషన్ జారీలో జాప్యం జరిగింది. మరో వైపు దూరవిద్యా కేంద్రం నిర్వహించే కోర్సులకు అనుమతి ఇస్తూ యూజీసీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ బ్యూరో సెక్షన్ ఆఫీసర్ భరద్వాజ్ మూడు రోజుల క్రితం యూనివర్సిటీకి లేఖ పంపారు. అయితే 2010 వరకు ప్రవేశ పెట్టిన కోర్సులకు మాత్రమే ఈ ఏడాది నోటిఫికేషన్ ఇచ్చుకోవచ్చని తరువాత ప్రవేశ పెట్టిన కోర్సులకు యూజీసీ అనుమతితోనే నోటిఫికేషన్ జారీ చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. 2010 వరకు పీజీ, డిగ్రీ, డిప్లొమా, సర్టిఫికెట్ విభాగాల్లో మొత్తం 65 కోర్సులను నిర్వహించింది. ఆ తరువాత కాలంలో ఉపాధి అనుబంధంగా ఉన్న 15కు పైగా కొత్త కోర్సులను ప్రవేశ పెట్టింది. వీటికి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ నుంచి అనుమతి తీసుకుందా అనే విషయం స్పష్టం కాలేదు. దీంతో యూజీసీ తాజాగా జారీ చేసిన ఉత్తర్వుల్లో 2010 వరకు ఉన్న కోర్సులకే అనుమతి ఇస్తూ నిర్ణయం తీసుకుంది. ఆన్లైన్ కోర్సుల నిర్వహణకు లభించని అనుమతి ... ఏఎన్‌యూ ఇటీవల వివిధ ఆన్లైన్ కోర్సులను నిర్వహిస్తోంది. వీటి నిర్వహణకు లక్షల రూపాయలను వెచ్చించింది. ప్రత్యేక వ్యవస్థను కూడా ఏర్పాటు చేసింది. అయితే నిర్వహణకు సంబంధించి విధివిధానాలు రూపొందించే వరకు ఈ కోర్సులను నిర్వహించవద్దని యూజీసీ నిబంధనలు విధించింది. దీంతో ఏఎన్‌యూ అట్టహాసంగా ప్రారంభించిన ఆన్లైన్ కోర్సుల భవిష్యత్‌పై నీలినీడలు అలుముకున్నాయి. దీంతో పాటు దూరవిద్యాకేంద్రం ద్వారా నిర్వహించనున్న ఎంఈడీ తదితర కోర్సులదీ అదే పరిస్థితి. యూనివర్సిటీ హెడ్‌క్వార్టర్‌లో ఫుల్‌టైం ఫ్యాకల్టీ లేకుండా కోర్సులు నిర్వహించవద్దని కూడా యూజీసీ స్పష్టం చేసింది. దీంతో ఎడ్యుకేషన్, ఎంఏ హిందీ తదితర కోర్సులను నిలిపివేయాల్సిన పరిస్థితి నెలకొంది. యూనివర్సిటీ అత్యుత్సాహం వల్లే ఈ పరిస్థితి ... అన్ని అనుమతులు తీసుకొని కొత్త కోర్సులు ప్రారంభించాల్సి ఉండగా హడావుడిగా దూరవిద్య కోర్సులను ప్రారంభించటం వల్లనే ఈ దుస్థితి నెలకొందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పైగా 2010 తరువాత ప్రవేశ పెట్టిన కోర్సులు చదివిన వారి పరిస్థితి కూడా ప్రశ్నార్థకంగా మారింది. దీంతో పాటు యూనివర్సిటీ అధికారుల నిర్లక్ష్యాన్ని కూడా యూజీసీ అధికారు లు లేఖలో స్పష్టం చేయటం విశేషం. ఏఎన్‌యూ నుంచి యూజీసీకి అఫిడవిట్ తదితర పత్రాలను సకాలంలో సమర్పించలేదని ఇది సరికాదని బ్యూరో సెక్షన్ ఆఫీసర్ భరద్వాజ్ పేర్కొన్నారు. ప్రత్యేక నిబంధనలు పట్టించుకోకుండా కొందరు అధికారులు చేపట్టిన చర్యల వల్లే ఈ పరిస్థితి నెలకొందనే విమర్శలు వస్తున్నాయి. దీనిపై దూరవిద్యాకేంద్రం డెరైక్టర్ ఆచార్య ఎంవీ రాంకుమార్త్న్రంను వివరణ కోరగా అన్ని కోర్సులకు యూజీసీ అనుమతి ఉందని అన్ని కోర్సులకు నోటిఫికేషన్ జారీ చేస్తామని తెలిపారు. -
దూరవిద్య బీఈడీ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
హైదరాబాద్: తిరుపతి పద్మావతి విశ్వవిద్యాలయం దూరవిద్య కేంద్రంలో బీఈడీ స్పాట్ అడ్మిషన్స్ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రభుత్వోన్నత విద్యా అధ్యయన సంస్థ ప్రిన్సిపల్ ఎం.సోమిరెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండి ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో కనీసం రెండేళ్లు ఉపాధ్యాయ వృత్తిలో అనుభవం ఉన్న మహిళా అభ్యర్థులు అర్హులన్నారు. ఆసక్తి గలవారు ఈ నెల 23, 24వ తేదీల్లో మాసబ్‌ట్యాంక్ ఎన్ఎండీసీ వద్ద ఉన్న ప్రభుత్వోన్నత విద్యా అధ్యయన సంస్థకు ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరు కావాలన్నారు. ఇతర వివరాలకు 80194 05275 నంబర్‌కు ఫోన్ చేయవచ్చు, మరింత సమాచారం కోసం వెబ్సైట్ www.spmvv.ac.in లాగిన్ కావచ్చు. -
రూల్స్.. రివర్స్..!
కేయూ, దూరవిద్య కేంద్రం బాగోతం ఫీజులు చెల్లించకుండానే పీజీ పరీక్షల నిర్వహణ నకిలీ హాల్ టికెట్లతో ఎంవోయూ సెంటర్ నిర్వాకం నామినల్ రోల్స్‌లో పేర్లు ఉన్న విద్యార్థుల ప్రశ్నపత్రాలనే మూల్యాంకనం చేయూలి. కానీ.. ఇక్కడ ఇవేమీ పట్టించుకోకుండా ప్రొవిజనల్, మెమోలు సిద్ధం చేస్తున్నారు..! ఇక.. ఎక్కడైనా అడ్మిషన్, టర్మ్ ఫీజు చెల్లించిన తర్వాతే తరగతులు ప్రారంభమవుతారుు. ఆ తర్వాత నామినల్ రోల్స్‌లో పేర్లు నమోదవుతారుు. ఈ మేరకు సదరు విద్యార్థులు పరీక్షలు రాసేందుకు అర్హులు. కానీ.. ఇక్కడ పరీక్షలు రాసిన తర్వాతే అడ్మిషన్ తీసుకుంటున్నారు..! కేయూ, దూరవిద్య కేంద్రంలో నిరాటంకంగా సాగుతున్న ఈ తంతు కొందరికి కాసులు కురిపిస్తోంది. దూరవిద్యా కేంద్రం పరిధిలోని రంగారెడ్డి జిల్లాకు చెందిన ఎంఓయూ స్టడీ సెంటర్లో ఇటీవల వెలుగులోకి వచ్చిన ఘటనే నిదర్శనం.. కొనసాగుతున్న అక్రమ బాగోతం ఇది. నకిలీ హాల్‌టికెట్లతో పరీక్షలు రారుుంచిన సదరు ఎంఓయూ స్టడీ సెంటర్‌పై చర్యలు తీసుకోకుండా.. ప్రేమ ఒలకబోయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నారుు. కేయూ దూరవిద్యా కేంద్రం పరిధిలోని రంగారెడ్డి జిల్లా తాండూరుకు చెందిన ఓ డిగ్రీ కాలేజీ ఎంఓయూ స్టడీ సెంటర్లో ఇటీవల వెలుగులోకి వచ్చిన ఘటనే ఇందుకు నిదర్శనం. ఈ స్టడీ సెంటర్లో 2011-12 అడ్మిషన్లు తీసుకున్న విద్యార్థులు కొందరు ప్రథమ సంవత్సరం పూర్తి చేశాక.. ద్వితీయ సంవత్సరం 2012-2013 అడ్మిషన్లకు సంబంధించి దూరవిద్యా కేంద్రానికి ఎలాంటి టర్మ్, పరీక్ష ఫీజు చెల్లించలేదు. ఈ మేరకు వారికి యూనివర్సిటీ పరీక్షల విభాగం హాల్ టికెట్లు పంపిణీ చేయలేదు. కానీ, సంబంధిత ఎంఓయూ సెంటర్ యూజమాన్యం.. ఫీజు చెల్లించని వారిలో కొందరు విద్యార్థులకు 2013లో నిర్వహించిన పీజీ ఫైనలియర్ పరీక్షలకు అనుమతి ఇచ్చింది. అదీ.. నకిలీ హాల్‌టికెట్లను సృష్టించి, నామినల్ రోల్స్‌లో పేరు లేని అభ్యర్థులకు అందజేసి పరీక్షలు రాయించారు.ఆయా జవాబుపత్రాలను కేయూ పరీక్షల విభాగానికి పంపారు. నిబంధనల ప్రకారం నామినల్ రోల్స్‌లో పేరు లేని విద్యార్థుల జవాబు పత్రాలను వాల్యుయేషన్ చేయకూడదు. ఇదేమీ పట్టని కేయూ పరీక్షల విభాగం అధికారులు మూల్యాంకన ప్రక్రియ పూర్తి చేసి, ఆ తర్వాత ఫలితాలను నిలిపివేశారు. దీంతో తాండూరు స్టడీసెంటర్ యాజమాన్యం పలు సార్లు కేయూ పరీక్షల విభాగం అధికారుల చుట్టు తిరిగారు. ఫీజులు చెల్లించకుండా విద్యార్థులతో పరీక్షలు రాయించడం నిబంధనలకు విరుద్ధమని, ఫలితాలు ప్రకటించేది లేదని కొద్దిరోజులుగా అధికారులు తిరస్కరిస్తూ వచ్చారు. ఈ క్రమంలో ఏదోలా సదరు ఎంఓయూ సెంటర్ నిర్వాహకులు.. కేయూ పరీక్షల విభాగం అధికారులను మచ్చిక చేసుకుని కొంత ముట్టజెప్పినట్లు తెలిసింది. ఈ క్రమంలో ఎటువంటి ఇబ్బంది రాకుండా.. కొందరు విద్యార్థులు దూరవిద్యా కేంద్రం డెరైక్టర్‌కు లేఖపెట్టుకున్నారు. చివరకు ఒక్కో అభ్యర్థి రూ.7,200 ఫీజు చెల్లిస్తూ నో డ్యూస్ సర్టిఫికెట్ ఇస్తామని ఒప్పందానికి వచ్చారు. దీంతో రెండు రోజులుగా విద్యార్థులు దూరవిద్యా కేంద్రానికి ఫైన్‌తో సహా టర్మ్ ఫీజు చెల్లించి, కేయూలో ప్రొవిజనల్, మెమోలు తీసుకుంటున్నారు. ఇప్పటివరకు 8 మంది అభ్యర్థులు సర్టిపికెట్లను తీసుకున్నారు. ఇందులో ఏడుగురు ఎంఏ సోషియాలజీ, ఒకరు ఎంఏ పోలిటికల్ సైన్స్ విద్యార్థులు ఉన్నారు. సదు ఎంఓయూ స్టడీ సెంటర్లో ఇలా 50 మంది వరకు విద్యార్థులు ఉన్నట్లు సమాచారం. కానీ.. ఇక్కడ నకిలీ హాల్‌టికెట్లతో పరీక్ష రారుుంచిన ఎంఓయూ సెంటర్‌పై యూనివర్సిటీ అధికారులు చర్యలు తీసుకోకపోవడం.. పరీక్షలు రాసిన తర్వాత దూరవిద్యా కేంద్రం అధికారులు అడ్మిషన్లు తీసుకోవడం విస్మయాన్ని కలిగిస్తోంది. ఉన్నతాధికారులు సైతం మిన్నకుండి పోవడం పట్ల అనుమానాలు వ్యక్తమవుతున్నారుు.