distribution of land
-
ఇక ‘రింగు’ కోసం నిరంతర భూపరిహారం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ రీజినల్ రింగురోడ్డు (ఆర్ఆర్ఆర్)లో నిరంతరాయ భూ పరిహారం పంపిణీకి మార్గం సుగమమైంది. ఇందుకు వీలుగా ఆ మార్గంలో అడ్డుగా ఉన్న విద్యుత్ టవర్లు, స్తంభాల తరలింపు, నీటి కాలువల మళ్లింపు, అందుకు తగ్గ నిర్మాణాల (యుటిలిటీ షిఫ్టింగ్) కోసం రూ.364 కోట్ల మొత్తాన్ని డిపాజిట్ చేసేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ)కి లేఖ ఇచ్చింది. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య త్రైపాక్షిక ఆర్థిక ఒప్పందం కుదరనుంది. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ, ఎన్హెచ్ఏఐతో త్రైపాక్షిక ఒప్పందం త్వరలో జరగనుంది. ఇక రీజినల్ రింగురోడ్డు నిర్మాణంలో భూపరిహారంలో రాష్ట్ర ప్రభుత్వం తన వంతు వాటాతోపాటు యుటిలిటీ షిఫ్టింగ్‌కు అవసరమయ్యే మొత్తాన్ని చెల్లించేందుకు అంగీకరిస్తున్నట్టుగా ఇందులో సంతకాలు చేస్తారు. దీంతో ఈ ప్రాజెక్టు తదుపరి ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగేందుకు మార్గం సుగమమవుతుంది. ఇక అవార్డ్ జారీకి శ్రీకారం: ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగానికి సంబంధించి 158.645 కి.మీ. నిడివిలో భూసేకరణను మూడు నెలల్లో పూర్తి చేయాలంటూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మంగళవారం అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే. బుధవారం యుటిలిటీ షిఫ్టింగ్ కోసం రూ.364 కోట్లను చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమ్మతించడంతో భూపరిహారం పంపిణీకి సంబంధించిన అవార్డ్ జారీచేసే కసరత్తుకు ఎన్హెచ్ఏఐ అధికారులు శ్రీకారం చుట్టనున్నారు. అందుకు సంబంధించి, సేకరిస్తున్న భూముల్లోని నిర్మాణాలు, తోటలకు విలువ కట్టే ప్రక్రియ కొనసాగిస్తున్నారు. ఇది పూర్తి కాగానే గ్రామాల వారీగా అవార్డు పాస్ చేస్తారు. ఆయా గ్రామాలకు సంబంధించిన భూ పరిహారంలో 50 శాతం వాటాను రాష్ట్ర ప్రభుత్వం డిపాజిట్ చేస్తుంది. ఇలా రూ.2,600 కోట్ల వరకు రాష్ట్ర ప్రభుత్వం పరిహారంలో తన వంతు వాటాగా భరించాల్సి ఉంది. ఆ వెంటనే రోడ్డు నిర్మాణానికి టెండర్ల ప్రక్రియ ప్రారంభం అవుతుంది. గతంలో రాష్ట్ర ప్రభుత్వం–ఎన్హెచ్ఏఐ మధ్య ఏర్పడ్డ పేచీ కారణంగా దాదాపు 10 నెలలుగా రీజినల్ రింగ్‌రోడ్డు ప్రక్రియ నిలిచిపోయింది. ఇప్పుడు మళ్లీ ప్రారంభం కావటంతో రోడ్డు నిర్మాణ పనులు కూడా త్వరలోనే మొదలయ్యే సూచనలు కనపిస్తున్నాయి. దీంతోపాటు దక్షిణభాగానికి సంబంధించిన ప్రక్రియను కూడా ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. భారత్‌మాల పరియోజన–1లో ఉత్తర భాగం ఉన్న విషయం తెలిసిందే. దక్షిణ భాగాన్ని జాతీయ రహదారిగా గుర్తిస్తూ కేంద్రం ఉత్తర్వు జారీ చేయాల్సి ఉంది. దాన్ని భారత్‌మాల పరియోజన తదుపరి ఫేజ్‌లో చేర్చాల్సి ఉంది. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాయాలని నిర్ణయించింది. పార్లమెంటు ఎన్నికల తర్వాత ఈ ప్రక్రియ జరుగుతుందని భావిస్తున్నారు. ఇప్పటి వరకు రూ.100 కోట్ల జమ.. భూసేకరణకు రాష్ట్ర ప్రభుత్వ వాటా డబ్బును డిపాజిట్ చే సిన తర్వాత భూపరిహారం ప్రక్రియ ప్రారంభిస్తామని గ తంలో ఎన్హెచ్ఏఐ పేర్కొంది. కానీ దీనికి రాష్ట్ర ప్ర భుత్వం సమ్మతించలేదు. మొత్తం డబ్బులు ఒకేసారి డిపాజిట్ చేయటం సరికాదని స్పష్టం చేసింది. దీంతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది. ఎన్హెచ్ఐఏ ఐదు సార్లు లేఖ లు రాసినా ఫలితం లేకపోయింది. మరోవైపు గెజిట్ నో టిఫికేషన్ గడువు ముగియబోతుండటంతో ప్రాజెక్టు పెండింగులో పడిపోతుందని ఎన్హెచ్ఏఐ పేర్కొనటంతో ప్ర భుత్వం ఎట్టకేలకు రూ.100 కోట్లు జమ చేసింది. దీంతో గెజిట్లు ‘సజీవంగా’ఉండి ప్రాజెక్టు మనుగడలో ఉన్నట్టు గా పరిగణించారు. -
నివాస స్థలాలను స్వయంగా పరిశీలించండి
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న 25 లక్షల మందికి నివాస స్థలాల పంపిణీ కార్యక్రమాన్ని పూర్తిస్థాయిలో విజయవంతం చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. నివాస స్థలాల పంపిణీ కోసం ప్రతిపాదించిన ప్రతి ప్రాంతాన్ని జిల్లా కలెక్టర్లు/జాయింట్ కలెక్టర్లు/రెవెన్యూ డివిజనల్ అధికారులు స్వయంగా పరిశీలించాలని పేర్కొన్నారు. గత ప్రభుత్వాల హయాంలో ఇచ్చినట్టు మనం ఇళ్ల స్థలాలను అసైన్మెంట్ పట్టాల రూపంలో ఇవ్వడం లేదని, రిజిస్ట్రేషన్ చేసి ఇస్తున్నామన్న విషయం గుర్తుంచుకోవాలని సూచించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి తరఫున జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, సబ్ కలెక్టర్లకు ముఖ్యమంత్రి కార్యాలయం(సీఎంవో) ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ ఆదివారం ఆదేశాలు జారీ చేశారు. ఇళ్ల స్థలాలకు ప్రతిపాదించిన భూముల్లో కంపచెట్ల తొలగింపు, చదును చేయడం, సరిహద్దుల నిర్ధారణ పనులను వచ్చే వారంలో చేపట్టాలని సూచించారు. తాము పంపిన నమూనాలో భూముల సమాచారాన్ని సోమవారం సాయంత్రంలోగా వాట్సాప్ నంబరు 9013133636కు గానీ, మెయిల్‌కు గానీ పంపించాలని పేర్కొన్నారు. దేశంలోనే చరిత్రాత్మక నిర్ణయం ‘‘ఇళ్ల పట్టాలు పొందిన వారు ఆ స్థలాలను బ్యాంకుల్లో తాకట్టు పెట్టి, రుణాలు తీసుకునేందుకు వీలుగా లబ్ధిదారులందరికీ కన్వెయన్స్ డీడ్ (రిజిస్ట్రేషన్ పత్రం) ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. అయిదేళ్ల తర్వాత వీటిపై విక్రయ హక్కులు కూడా కల్పిస్తోంది’’ అని ప్రవీణ్ ప్రకాశ్ రాసిన లేఖలో పేర్కొన్నారు. జగన్ ప్రభుత్వం చేపడుతున్న నివాస స్థలాల పంపిణీ విధానం దేశంలోనే కాకుండా ప్రపంచంలోని చాలా దేశాలకు సైతం మార్గదర్శకం అవుతుందని నమ్ముతున్నట్లు వెల్లడించారు. ప్రవీణ్ ప్రకాశ్ పంపిన సర్క్యులర్‌లోని ముఖ్యమైన అంశాలు.. - కలెక్టర్లు/జాయింట్ కలెక్టర్లు/సబ్ కలెక్టర్లు/ ఆర్డీఓలు వెళ్లి పరిశీలించనిదే ఆయా భూములు నివాస స్థలాలకు పనికొస్తాయా? లేదా అన్నది నిర్ధారించలేరు. కాబట్టి నివాస స్థలాలు ఇవ్వడానికి ప్రతిపాదించే ప్రతి భూమిని ఉన్నతాధికారులు తప్పకుండా పరిశీలించాలి. - నివాస స్థలాలకు ప్రతిపాదించే భూములకు సంబంధించి కలెక్టర్లు కార్యాచరణ ప్రణాళిక రూపొందించి, కచ్చితంగా వచ్చే వారంలో అమలు చేయాలి. ప్రతి మండలంలో క్రమబద్ధంగా భూముల జాబితాను రూపొందించాలి. విభాగాల వారీగా భూముల జాబితాను రూపొందిస్తేనే ఎక్కడెక్కడ ఎలాంటి సమస్యలు ఉన్నాయో అర్థం చేసుకుని, పరిష్కరించడానికి వీలవుతుంది. ఈ విభాగాలకు సంబంధించిన భూములన్నింటినీ నివాస స్థలాల కోసం వినియోగించుకుంటాం. విభాగాల వారీగా భూముల జాబితా ఎలా ఉండాలంటే... - సుప్రీంకోర్టు, హైకోర్టు, జిల్లా కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న వివాదాస్పద భూములు - రాష్ట్ర భూపరిపాలన ప్రధాన కమిషనర్ కార్యాలయంలోని అప్పీళ్ల కమిషనర్ వద్ద పెండింగ్‌లో ఉన్న వివాదాస్పద భూములు - రాష్ట్ర సర్వే సెటిల్మెంట్ కమిషనర్ వద్ద పెండింగ్‌లో ఉన్న వివాదాస్పద భూములు - వివిధ ప్రభుత్వ విభాగాల అధీనంలో ఉన్న వినియోగించని భూములు - ఇతరత్రా ప్రభుత్వ భూములు -
అదిరిందయ్యా...‘చంద్రం’
►కొత్త రాష్ట్రం.. కొత్త పథకాలు ►పంద్రాగస్టు వేళ పండుగ కల ►తీరిన నాలుగేళ్ల ‘కరువు’ ►దళితులకు భూ పంపిణీ, పెట్టుబడులు ►రుణమాఫీతో రైతు మోములో ఆనందం సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: కొత్త రాష్ట్రం... కొత్త ముఖ్యమంత్రి...కొత్త పథకాలతో మెతుకుసీమ మురిసిపోతోంది. స్వరాష్ట్రంలో ‘తొలి స్వాతంత్య్ర’ వేడుకలకు జరుగుతున్న వేళ దళిత, గిరిజన, రైతు శ్రామిక వర్గాలు మెదక్ జిల్లా ముద్దుబిడ్డ, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకు సెల్యూట్ చేస్తున్నాయి. అండగా నిలబడి ఆపదలో ఆదుకున్న మంత్రి హరీష్‌రావుకు మనసులోనే నమస్కారం పెడుతున్నాయి. పంద్రాగస్టు కానుకగా కేసీఆర్ ప్రకటించిన వరాలు రైతాంగంలో ఆత్మ విశ్వాసాన్ని పెంచడంతో పాటు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం సార్థకతకు అర్థం చెప్పాయి. రూ. లక్షలోపు రుణ మాఫీ, దళితులకు మూడు ఎకరాల భూమి, నాలుగేళ్ల పంట నష్టం పరిహారం విడుదలతో అప్పుల బాధతో ఉన్న రైతాంగం మోములో చిరు నవ్వులు నింపాయి. ముఖ్యమంత్రి ఇలాగే సహకారం అందిస్తే వ్యవసాయం దండగ కాదు పండగని నిరూపిస్తామంటున్నారు కర్షకులు. రైతు మోములో చిరునవ్వు రూ.లక్షలోపు పంట రుణాలు మాఫీ చేస్తూ గత నెలలో రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకోవటం, ఈ నెల 13న రుణమాఫీ విధి విధానాలు, మార్గదర్శకాలను విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయటంతో జిల్లా రైతాంగం సంబురాలు చేసుకుంటోంది. బంగారం తనఖాపెట్టి తెచ్చుకున్న రుణాలతో పాటు, స్వల్పకాలిక, రుణాలను కూడా మాఫీ చేస్తామన్న సర్కార్ ప్రకటనతో జిల్లాలో 3.65 లక్షల మంది రైతులు లబ్ధి పొందనున్నారు. సుమారు రూ.884 కోట్ల రుణాలు మాఫీ అవుతాయని లీడ్ బ్యాం కు అధికారులు అంచనా వేస్తున్నారు. లీడ్ బ్యాంక్ నివేదిక ప్రకారం జిల్లాలో 4,58,637 మంది రైతులకు సం బంధించిన మొత్తం రూ.3,321.95 కోట్ల రుణాలు ఉన్నాయి. వీటిలో దాదాపు 1,559.92 కోట్లు బంగారం కుద వబెట్టిన రుణాలు, మరికొన్ని టర్మ్ రుణాలున్నా యి. రూ.లక్ష, అంతకు లోపు రుణాలను తీసుకున్న రైతులు 2,76,678 మంది ఉన్నారు. ఈ రైతులు తీసుకున్న రుణాల విలువ రూ.620 కోట్లు వీటితో పాటు 29,347 మంది రైతులు రూ.184.58 కోట్లను బంగారంపై పంట రుణాలు తీసుకున్నారు. వీటితోపాటు మరో 5,670 మంది రైతులు 89.29 కోట్లు ఇతర వ్యవసాయ అనుబంధ రుణాలు తీసుకున్నారు. ఆయా రుణాలు మాఫీ కానుండటంతో రైతుల్లో సంతోషం వ్యక్తమవుతోంది. దళితుల్లో కొత్త ఆశలు... తరతరాలుగా ఎదురుచూసిన గడియ వచ్చేసింది. బతుకు పోరాటం చేసినా సెంటు భూమి కూడా కొనలేక పోయిన దళితులు మూడు ఎకరాలకు ఆసాములయ్యే క్షణమొచ్చింది. దళిత కుటుంబానికి మూడు ఎకరాల సాగుభూమి ఇస్తామని ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించిన కేసీఆర్, దాని అమలుకు సిద్ధమ య్యారు. పంద్రాగస్టు వేడుకల్లో ఎంపిక చేసిన దళితులకు పట్టాల రూపంలో 135 ఎకరాల భూమిని పంచబోతున్నారు. కేసీఆర్ చేతుల మీదుగా గోల్కొండ వేడుకల్లో జిల్లాకు చెందిన ఆరుగురు దళి తులు పట్టా భూములు అందుకోనున్నారు. ఇప్పటి నుంచి మొదలు పెట్టి ఐదేళ్లపాటు కొనసాగించే ఈ మహాక్రతువులో జిల్లావ్యాప్తంగా దాదాపు 11,366 దళితకుటుంబాలు దశలవారీగా లబ్ధి పొందనున్నాయి. అధికారులు తొలివిడతగా తొమ్మిది నియోజకవర్గాల్లో నియోజకవర్గానికి ఒక గ్రామం చొప్పున లబ్ధిదారులను ఎంపిక చేశారు. మొత్తం 45 మందిని అర్హులుగా గుర్తించారు. వీరిలో సీఎం చేతుల మీదుగా ఆరుగురు, మిగి లిన వారికి జిల్లాకేంద్రంలో నిర్వహించే వేడుకల్లో మంత్రి హరీష్ చేతుల మీదు గా పట్టాలు అందుకోనున్నారు. ప్రభుత్వం పంపిణీ చేస్తున్న భూమి విలువ ప్రస్తుతం మార్కెట్లో రూ.3.50 లక్షల నుంచి ఆపైన పలుకుతోంది. దళితులకు భూమితోపాటుగా పంటలు సాగు చేసేందుకు అవసరమైన పెట్టుబడులు కూడా ఇస్తామని మంత్రి ప్రకటించటం దళితుల్లో కొత్త ఆశలు రేపుతోంది. నాలుగేళ్ల కరువు తీరింది ఒక్క నిర్ణయంతో మెతుకుసీమ రైతాం గం నాలుగేళ్ల కరువు తీరింది. 2011 నుంచి 2014 వరకు వర్షాభావం,అకాల వర్షాల కారణంగా దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం విడుదల చేస్తూ సీఎం కేసీఆర్ ఉత్తర్వులు జారీ చేశారు. పంటలు దెబ్బతిన్న జిల్లా రైతులు గత నాలుగేళ్లుగా పరిహారం సొమ్ము కోసం ఎదురుచూస్తున్నారు. అప్పుడు... ఇప్పుడంటూ గత ప్రభుత్వాలు చేసిన వాగ్దా నాలతో రైతులు బేజారయ్యారు. ఇక పరిహారం చేతికందని రైతులు ఆశలు వదులుకున్నారు. ఈ తరుణంలో ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లా రైతాంగానికి శుభవార్త వినిపించారు. నాలుగేళ్లుగా రైతులు ఎదురుచూస్తున్న పంటనష్టం పరిహారం సొమ్ము విడుదల చేస్తున్నట్లు ప్రకటించటమే కాకుండా ఉత్తర్వులు వెలువరించారు. జిల్లాలో 1.46 లక్షల మంది రైతాంగానికి లబ్ధి చేకూరుస్తూ రూ. 46.36 కోట్ల పంటనష్టం పరిహారం విడుదల చేయటం రైతాంగానికి ఊరట నిచ్చింది. ఇకరావనుకున్న నష్టపరిహా రం నాలుగేళ్ల తర్వాత ఇంటిగుమ్మం తొక్కటంతో మెతుకుసీమ రైతాంగం సంతోషం వ్యక్తం చేస్తోంది. పండుటాకులకు పండుగే.... దసరా నుంచి వృద్ధులు, వితంతువులకు రూ.1000, వికలాంగులకు రూ.1,500 పింఛన్లు అందించేందుకు ముఖ్యమం త్రి కేసీఆర్ సిద్ధమయ్యారు. జిల్లాలో జూన్ 14 నాటికి 1.67 లక్షల మంది వృద్ధు లు, 9,741 మంది వితంతువులు, 31,358 మంది వికలాంగులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీరందరూ దసరా నుంచి అందే పింఛన్‌తో ఆత్మగౌరవంతో బతకనున్నారు. -
4 నుంచి ఏడో విడత భూ పంపిణీ
ఒంగోలు కలెక్టరేట్, న్యూస్‌లైన్ : జిల్లాలో జనవరి 4వ తేదీ నుంచి ఏడో విడత భూ పంపిణీ చేపట్టనున్నట్లు కలెక్టర్ విజయకుమార్ తెలిపారు. పొదిలిలో మంత్రి చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు చెప్పారు. స్థానిక సీపీఓ కాన్ఫరెన్స్ హాలులో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏడో విడత భూ పంపిణీకి సంబంధించి 7,716 ఎకరాలను సిద్ధం చేసినట్లు వెల్లడించారు. 5,766 మంది రైతులకు భూమిని పంపిణీ చేసేందుకు పట్టాదారు పాస్‌పుస్తకాలు కూడా సిద్ధం చేశామన్నారు. 10వ తేదీలోపు భూ పంపిణీ ప్రక్రియ పూర్తవుతుందన్నారు. ‘పచ్చతోరణం’కు 7,200 ఎకరాలు... ఇందిరమ్మ పచ్చతోరణం పథకానికి సంబంధించి జిల్లాలో 7,383 మందికి 7,200 ఎకరాలకు పట్టాలు పంపిణీ చేసినట్లు కలెక్టర్ వివరించారు. అర్హులైన ఎస్సీ, ఎస్టీలను గుర్తించి పచ్చతోరణం పథకం కింద మొక్కలు పెంచే కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. డ్వామా ఆధ్వర్యంలో మొక్కలు పంపిణీ చేస్తున్నామన్నారు. జిల్లాలో 2 లక్షల 4 వేల వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించాలని లక్ష్యం కాగా, ప్రస్తుతం లక్షా 14 వేల మరుగుదొడ్లు గ్రౌండింగ్‌లో ఉన్నాయని, మార్చి నాటికి వాటిని పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. పరిశ్రమల స్థాపనకు భూసేకరణ... జిల్లాలో పరిశ్రమల స్థాపనకు భూ సేకరణ చేపడుతున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. పామూరు-కనిగిరి రోడ్డులో 12,500 ఎకరాలు సేకరించాలని కందుకూరు ఆర్డీవోను ఆదేశించినట్లు చెప్పారు. ఆ మేరకు ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ జనరల్ మేనేజర్‌తో మాట్లాడామన్నారు. ప్రకాశం అక్షర విజయం కార్యక్రమంలో భాగంగా 6.50 లక్షల మంది నిరక్షరాస్యులను గుర్తించామని, 20 వేల మంది వలంటీర్లతో 20 వేల 30 అక్షర కేంద్రాలను ఏర్పాటు చేశామని వివరించారు. మార్చి 21లోపు నిరక్షరాస్యులందరినీ అక్షరాస్యులుగా చేసి కేంద్ర ప్రభుత్వం నిర్వహించే పరీక్షకు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. *25.14 కోట్ల ఇన్పుట్ సబ్సిడీకి ప్రతిపాదనలు... రెండు నెలల క్రితం కురిసిన భారీ వర్షాల కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు 25.14 కోట్ల రూపాయల ఇన్పుట్ సబ్సిడీ కావాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించినట్లు కలెక్టర్ తెలిపారు. 39 మండలాల్లో 25,642 హెక్టార్లలో వ్యవసాయ, ఉద్యానవన పంటలు దెబ్బతిన్నాయన్నారు. 44,633 మంది చిన్న, సన్నకారు రైతులు నష్టపోయినట్లు తెలిపారు. 1000 చేనేత కుటుంబాలకు 5 వేల రూపాయల చొప్పున సాయం అందించాలని ప్రతిపాదించామన్నారు. రాజీవ్ విద్యామిషన్ ఆధ్వర్యంలో అదనపు తరగతి గదుల నిర్మాణాలను వేగవంతం చేసినట్లు వెల్లడించారు. 654 తరగతి గదులకుగానూ 633 పూర్తిచేశామన్నారు. 8 నెలల క్రితం ప్రారంభంకాని వాటిని రద్దు చేయాలన్న యోచనలో ఉండగా, అనతికాలంలోనే మంచి పురోగతి సాధించినట్లు కలెక్టర్ వివరించారు. విలేకర్ల సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి జీ గంగాధర్‌గౌడ్, ముఖ్య ప్రణాళికాధికారి కేటీ వెంకయ్య, డీఆర్డీఏ పీడీ పద్మజ తదితరులు పాల్గొన్నారు.