district bifergation
-
ఖమ్మం జిల్లాలో ఆగని ఆందోళనలు
ఖమ్మం: ఖమ్మం జిల్లా విభజన నేపథ్యంలో వివిధ డిమాండ్లతో ఆందోళనలు కొనసాగుతున్నాయి. జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాలను ముక్కలు చేయవద్దని కోరుతూ బస్సు యాత్ర కొనసాగుతోంది. బుధవారం ఉదయం ఆదివాసీ బస్సుయాత్ర టేకులపల్లికి చేరుకుంది. షెడ్యూల్డ్ ఏరియాల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో స్థానిక బోడు రోడ్డు సెంటర్లో ధర్నా చేపట్టారు. వాజేడు, వెంకటాపురం మండలాలను కొత్తగూడెం జిల్లాలో కలపాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్షాలు బంద్ చేపట్టాయి. రెండు మండలాలను వరంగల్ జిల్లా భూపాలపల్లిలో కలపాలనే ప్రతిపాదనను విర మించుకోవాలని డిమాండ్ చేశారు. -
‘ఉట్నూర్’ జిల్లా చేయాల్సిందే..
19న ఏజెన్సీ బంద్‌కు పిలుపు సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసి జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ ఉట్నూర్‌రూరల్ : ఉట్నూర్‌ను జిల్లాగా ప్రకటించాలని సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసి జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, ఉట్నూర్ జిల్లా సాధన కమిటీ కన్వీనర్ సిడాం శంభు డిమాండ్ చేశారు. శుక్రవారం స్థానిక ప్రెస్‌భవన్‌లో వారు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎలాంటి అధ్యయనం చేయకుండానే ప్రభుత్వం జిల్లాలను ప్రకటించడం సరికాదన్నారు. ఉట్నూర్ జిల్లా ఏర్పాటు చేయకపోతే ఆదివాసీల సంస్కృతి సంప్రదాయాలు విచ్ఛిన్నమవుతాయన్నారు. ఏజెన్సీ ప్రాంతాలు ఇతర జిల్లాల్లో కలవడంతో ఆదివాసీలకు అన్యాయం జరుగుతుందన్నారు. ఇది వరకే రాష్ట్ర ప్రభుత్వంతో తమ సంఘం ఆధ్వర్యంలో చర్చించి జిల్లాపై ప్రతిపాదనలు అందించామన్నారు. ఉట్నూర్, ములు, భద్రాచలంను ఆదివాసీ జిల్లాలుగా ఏర్పాటు చేయాలన్నారు. జిల్లా సాధన ఉద్యమంలో గిరిజనులే కాకుండా గిరిజనేతరులు సైతం పాల్గొనాలని కోరారు. ఇందులో భాగంగా ఈ నెల 19న ఏజెన్సీ బంద్ పాటిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసి జిల్లా కార్యదర్శి నంది రామయ్య, నాయకులు వెడ్మ భొజ్జు, గణపతి, రామారావు, రాందాస్, శ్రీనివాస్, నారాయణ, రాజేందర్, శంకర్, సర్దార్, జేపీ నాయక్, గణేశ్ భిక్కు, జుగాదిరావు , ఆర్.గణేశ్ పాల్గొన్నారు. -
దసరా నుంచే పాలన
అవసరం మేరకు సంక్షేమ కార్యాలయాలు అధికారులతో సీఎస్ రాజీవ్‌శర్మ సాక్షిప్రతినిధి, ఆదిలాబాద్ : నూతన జిల్లాలతోపాటు కొత్తగా ఏర్పడే రెవెన్యూ డివిజన్లు, మండలాలు కూడా దసరా నుంచే పనులు ప్రారంభించేలా ఏర్పాట్లు పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. అవసరాన్ని బట్టి సంక్షేమ శాఖల డివిజన్ కార్యాలయాలనూ ఏర్పాటు చేయాలన్నారు. శుక్రవారం ఆయన హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. నూతన డివిజన్ కేంద్రాల్లో ఆర్డీవో, సబ్ డివిజనల్ పోలీస్ అధికారి, సబ్ ట్రెజరీ కార్యాలయాలను ఏర్పాటు చేయాలన్నారు. అన్ని కార్యాలయాలకు అధికారులను నియమించి దసరా రోజు ప్రారంభం కావాడానికి సిద్ధం చేయాలన్నారు. కొత్తగా ఏర్పాటయ్యే ప్రతి మండలంలో మండల రెవెన్యూ అధికారి, ఓఎస్డీ, అభివృద్ధి అధికారులు, మండల విద్యాధికారి, వ్యవసాయ అధికారి, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కార్యాలయాలను ఏర్పాటు చేసి సిబ్బందిని నియమించాలని సూచించారు. నూతనంగా ఏర్పాటుకు ప్రతిపాదించిన మండలాల విస్తీర్ణం, జనాభా, ఆ ప్రాంతం, ప్రత్యేక లక్షణాలను ప్రభుత్వానికి తెలపాలన్నారు. అనంతరం కలెక్టర్ ఎం.జగన్మోహన్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు నూతన జిల్లాలోని, డివిజన్లు, మండలాలలో కార్యాలయాల ఏర్పాటుతోపాటు అధికారులు, సిబ్బందిని నియమిస్తామని తెలిపారు. జిల్లాలో నూతన మండలాల ప్రతిపాదనలు ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు తెలియజేస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో డీఆర్వో సంజీవరెడ్డి, సీపీవో కేశవరావు, డీఎంహెచ్‌వో జలపతినాయక్, కలెక్టరేట్ ఏవో అరవింద్ కుమార్, పర్యవేక్షకులు సుశీల, సంజయ్‌కుమార్, అధికారులు పాల్గొన్నారు. -
ఆలయాలకు శ్రావణ శోభ
పాపహరేశ్వరాలయంలో పోటెత్తిన భక్తజనం నిర్మల్ జిల్లా కోసం అల్లోల ప్రశాంత్‌రెడ్డి ప్రత్యేక హోమం దిలావర్పూర్ : శ్రావణమాస మొదటి సోమవారం కావడంతో మండలంలోని కదిలి ప్రాంతంలో వెలసిన అత్యంత ప్రాచీన ప్రాశస్త్యంగల శ్రీమాతాన్నపూర్ణ పాపహరేశ్వరుడి చెంతకు సోమవారం భక్తులు తండోపతండాలుగా తరలి వచ్చి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మొక్కులు తీర్చుకున్నారు. నిర్మల్ జిల్లా ఏర్పాటు కోసం అల్లోల ప్రశాంత్‌రెడ్డి కుటుంబ సమేతంగా ఆలయంలో సోమవారం ఉదయం నుంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు భవగవాన్రావ్ జోషి ఆధ్వర్యంలో త్రిశూల పాశుపతం, మహా హావన ఆరాధన, గణపతి హోమం, రుద్రహావనం, శ్రీలక్ష్మీగణపతి హోమాన్ని నిర్వహించారు. ఉదయం నుంచి ఆలయానికి తరలి వచ్చిన భక్తులకు అన్నదానం చేశారు. ఈ ప్రత్యేక పూజల్లో రాష్ట్ర మంత్రి అల్లో ఇంద్రకరణ్‌రెడ్డి సతీమణి అల్లోల విజయలక్ష్మి, అల్లోల హన్మంత్‌రెడ్డి, అలోల్ల తిరుపతి రెడ్డి, అల్లోల సురేందర్‌డ్డి, స్థానిక సర్పంచ్ నార్వాడి వసుంధర భుజంగ్ రావుపాటిల్, టిఆర్ఎస్ మండల కో కన్వీనర్ కోడె రాజేశ్వర్, ఆయల మాజీ చైర్మన్ నార్వాడి సంభాజీరావు పాటిల్, నాయకులు ధనె రవి, కోడె నవీన్‌కుమార్, సప్పల రవి, కుస్లి భూమేశ్,నిమ్మల రవి, నాగభూషణ్, దత్తురాం, గుణవంత్‌రావు, తదితరులు పాల్గొన్నారు. టిఆర్ఎస్జిల్లా ఉపాధ్యక్షుడి ప్రత్యేక పూజలు పాపహరేశ్వరాలయంలో సోమవారం ఉదయం టీఆర్ఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు పాకాల రాంచందర్ ప్రత్యేక పూజలు నర్విహించారు. ఆయన వెంట నాయకులు తుమ్మల జగన్మోహన్రెడ్డి, తదితరులు ఉన్నారు.