హోమం నిర్వహిస్తున్న ప్రశాంత్‌రెడ్డి
-
పాపహరేశ్వరాలయంలో పోటెత్తిన భక్తజనం
-
నిర్మల్ జిల్లా కోసం అల్లోల ప్రశాంత్‌రెడ్డి ప్రత్యేక హోమం
దిలావర్‌పూర్ : శ్రావణమాస మొదటి సోమవారం కావడంతో మండలంలోని కదిలి ప్రాంతంలో వెలసిన అత్యంత ప్రాచీన ప్రాశస్త్యంగల శ్రీమాతాన్నపూర్ణ పాపహరేశ్వరుడి చెంతకు సోమవారం భక్తులు తండోపతండాలుగా తరలి వచ్చి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మొక్కులు తీర్చుకున్నారు. నిర్మల్ జిల్లా ఏర్పాటు కోసం అల్లోల ప్రశాంత్‌రెడ్డి కుటుంబ సమేతంగా ఆలయంలో సోమవారం ఉదయం నుంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు భవగవాన్‌రావ్ జోషి ఆధ్వర్యంలో త్రిశూల పాశుపతం, మహా హావన ఆరాధన, గణపతి హోమం, రుద్రహావనం, శ్రీలక్ష్మీగణపతి హోమాన్ని నిర్వహించారు.
ఉదయం నుంచి ఆలయానికి తరలి వచ్చిన భక్తులకు అన్నదానం చేశారు. ఈ ప్రత్యేక పూజల్లో రాష్ట్ర మంత్రి అల్లో ఇంద్రకరణ్‌రెడ్డి సతీమణి అల్లోల విజయలక్ష్మి, అల్లోల హన్మంత్‌రెడ్డి, అలోల్ల తిరుపతి రెడ్డి, అల్లోల సురేందర్‌డ్డి, స్థానిక సర్పంచ్ నార్వాడి వసుంధర భుజంగ్ రావుపాటిల్, టిఆర్‌ఎస్ మండల కో కన్వీనర్ కోడె రాజేశ్వర్, ఆయల మాజీ చైర్మన్ నార్వాడి సంభాజీరావు పాటిల్, నాయకులు ధనె రవి, కోడె నవీన్‌కుమార్, సప్పల రవి, కుస్లి భూమేశ్,నిమ్మల రవి, నాగభూషణ్, దత్తురాం, గుణవంత్‌రావు, తదితరులు పాల్గొన్నారు.
టిఆర్‌ఎస్‌జిల్లా ఉపాధ్యక్షుడి ప్రత్యేక పూజలు
పాపహరేశ్వరాలయంలో సోమవారం ఉదయం టీఆర్‌ఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు పాకాల రాంచందర్ ప్రత్యేక పూజలు నర్విహించారు. ఆయన వెంట నాయకులు తుమ్మల జగన్మోహన్‌రెడ్డి, తదితరులు ఉన్నారు.