జిల్లా సరిహద్దుల్లో నిఘా పెంపు
తాండూరు: జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో నిఘా పెంచుతామని హైదరాబాద్ రేంజ్ డీఐజీ టీవీ శశిధర్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఆయన తాండూరు డీఎస్పీ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా డీఐజీ విలేకరులతో మా ట్లాడారు. నేరాలను తగ్గించేందుకు జి ల్లా సరిహద్దు అయిన కర్ణాటక బార్డర్లో గట్టి నిఘా ఏర్పాటు చేస్తామని చెప్పా రు. కొత్త వ్యక్తుల కదలికలపై తమ సిబ్బంది నిఘా ఉంచుతారన్నారు. దారి దోపిడీలను అరికట్టేందుకు హైవే పెట్రోలింగ్‌ను పకడ్బందీగా అమలుపరుస్తామని డీఐజీ పేర్కొన్నారు.
పెద్దేముల్ మండలంలో ఇటీవల జరిగిన కాల్పుల ఘటనపై సమగ్ర విచారణ చేస్తున్నట్లు తెలిపారు. కుందేళ్లు వేట కోసమే అటవీ ప్రాంతంలో కాల్పులు జరిగినట్లు తమ ప్రాథమిక విచారణలో వెల్లడి అయిందన్నారు. బైక్ వెళ్తున్న నలుగురుని పోలీ సులు ఆపే ప్రయత్నం చేశారని, ఈక్రమంలో బైక్ రోడ్డు ప్రమాదానికి గురై ఒకరు మృతి చెందినట్లు డీఐజీ వివరిం చారు. ఒక సింగిల్ బోర్ తుపాకీని పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు ఆ యన పేర్కొన్నారు. తాండూరు ప్రాం తంలో మట్కా బెట్టింగ్ వ్యవహారాలపై కఠినంగా వ్యవహరించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని డీఐజీ శశిధర్‌రెడ్డి చెప్పారు.
పట్టణంలో ట్రాఫిక్ సమ స్య పరిష్కారానికి త్వరలో చర్యలు చేపడతామన్నారు. రంజాన్ పండగ సందర్భంగా ప్రార్థన మందిరాల వద్ద పెట్రోలింగ్‌తో పాటు గట్టి బందోబస్తు ఏర్పా ట్లు చేస్తున్నట్లు డీఐజీ వివరించారు. సీఐల బదిలీల విషయం తన పరిధిలో లేని అంశమని ఆయన చెప్పా రు. డీఎస్పీ కార్యాలయంలో వివిధ కేసుల పురోగతితో పాటు రికార్డులను డీఐజీ పరిశీలించారు.
అంతకుముందు ఆయన పోలీసుల నుంచి గౌరవ వందన స్వీకరించారు. సమావేశంలో ఎస్పీ రాజకుమారి, తాండూరు డీఎస్పీ షేక్ ఇస్మాయిల్, అర్బన్, రూరల్ సీఐలు వెంకట్రామయ్య, రవికుమార్ ఉన్నారు. కాగా సమావేశ అనంతరం డీఐజీ తాండూరు టౌన్, కరణ్‌కోట ఠాణాలను తనిఖీ చేశారు.