District Congress Committee
-
చెప్పు దెబ్బలు తిన్న జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు
లక్నో : లైంగిక వేధింపులకు పాల్పడ్డాడన్న కారణంతో ఇద్దరు యువతులు కలిసి అందరూ చూస్తుండగానే ఒక వ్యక్తిని చెప్పులతో దేహశుద్ది చేసిన ఘటన ఆదివారం ఉత్తర్‌ప్రదేశ్‌లోని జలాన్‌లో చోటుచేసుకుంది. వివరాలు.. జలాన్‌కు చెందిన అనూజ్ మిశ్రా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేస్తున్నాడు. కాగా ఆదివారం అనూజ్ మిశ్రా జలాన్ సమీపంలోని ఒరై రైల్వే స్టేషన్‌కు వచ్చాడు. ఇంతలో స్టేషన్‌వైపు వస్తున్న ఇద్దరు యువతులపై అనూజ్‌మిశ్రా అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఈవ్ టీజింగ్‌కు పాల్పడడమే గాకుండా లైంగిక వేధింపులకు గురిచేశాడు. (చదవండి : బట్టతల దాచి పెళ్లి చేసుకున్నాడని..) దీంతో ఆగ్రహించిన సదరు యువతులు అనూజ్ మిశ్రాను పట్టుకొని తమ చెప్పులతో దేహశుద్ది చేశారు. చివరికి అనూజ్‌మిశ్రా క్షమించమని మహిళ కాళ్లు మీద పడ్డా అప్పటికే కనికరించలేదు. అప్పటికే కోపంతో ఊగిపోతున్న వారు అతని బట్టలు చించేసి మరోసారి చితకబాదారు. ఇంతలో పోలీసులు జోక్యం చేసుకొని అనూజ్ మిశ్రాను విడిపించి అతనిపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడికి ఈ శాస్తి జరగాల్సిందే అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. -
డీసీసీ అధ్యక్షులకు ఎన్నికల్లో నో ఎంట్రీనా?
► అధిష్టానం నిబంధనపై కాంగ్రెస్ నేతల అభ్యంతరం ► ఏఐసీసీ దృష్టికి తీసుకెళతామన్న దిగ్విజయ్ సాక్షి, హైదరాబాద్: జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షులకు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశముండదనే అధిష్టానం నిబంధనపై కాంగ్రెస్ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. జిల్లాల్లో పార్టీని అధ్యక్షులే నడిపించాల్సి ఉం టుందని.. అలాంటి వారికి ఎన్నికల్లో పోటీకి అవకాశం లేకపోతే సీనియర్లు అధ్యక్ష బాధ్యతను స్వీకరించే అవకా శం ఉండదంటున్నారు. కొత్త జిల్లాల్లో డీసీసీ అధ్యక్షులతో పాటు మండల, బ్లాక్ కమిటీల అధ్యక్షుల నియామకంపై గురు వారం గాంధీభవన్‌లో సమీక్ష జరిగింది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజ య్‌సింగ్, కుంతియా, కొప్పుల రాజు, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, భట్టి విక్రమార్క, సీనియర్ నేతలు కె.జానారెడ్డి, షబ్బీర్ అలీ తదితరులు పాల్గొన్నారు. డీసీసీ అధ్యక్షులు ఎన్నికల్లో పోటీ చేయరాదనే నిబం ధనపై సమావేశంలో ప్రధానంగా చర్చకు వచ్చింది. పోటీకి అవకాశం లేకపోవడంతో బాధ్యతలు స్వీకరించేందుకు నేతలు ఆసక్తి కనబరచడం లేదని జిల్లాల ముఖ్య నేతలు పేర్కొన్నారు. జూనియర్లకు పదవులు అప్ప గిస్తే సీనియర్లు సహకరించక పార్టీ కార్యక్ర మాలు ముందుకుసాగే అవకాశాలుండవని తెలిపారు. నిబంధనను తొలగించాలని మాజీ ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు జగ్గారెడ్డి అధిష్టా నాన్ని కోరారు. ఈ అంశంపై ఏఐసీసీ నాయ కత్వంతో చర్చిస్తామని దిగ్విజయ్ చెప్పినట్టు సమాచారం. అయితే డీసీసీ అధ్యక్ష పదవుల కు పోటీ చేయనున్న, చేయని వారి జాబితాను వేర్వేరుగా రూపొందించి పార్టీ జాతీయ నాయకత్వానికి పంపించనున్నట్లు పార్టీ ముఖ్యనేత ఒకరు తెలిపారు. కాగా, హైదరా బాద్ మినహా ఖమ్మం, నల్లగొండ, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల సమావేశం శుక్ర వారం జరగనుంది. 15 రోజుల్లో డీసీసీలు: వారంలో మండల, బ్లాక్ కమిటీలకు.. 15 రోజుల్లో డీసీసీలకు అధ్యక్షుల నియామకం పూర్తిచేయాలని దిగ్వి జయ్ సూచించినట్టు సమాచారం. కరీంనగర్ జిల్లాలో కేసీఆర్ బంధువులు ఉమేశ్‌రావు, రేగులపాటి రమను ముఖ్య పదవుల్లో నియ మించాలనే ప్రతిపాదనలపై పలువురు నేతలు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలిసింది. -
జిల్లాల్లో పరిస్థితిపై నివేదిక ఇవ్వండి
సాక్షి, హైదరాబాద్: స్థానిక సంస్థల కోటాలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థుల బలాబలాలు, పార్టీ పరిస్థితి తదితర అంశాలపై రెండు రోజుల్లో నివేదిక సమర్పించాలని జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షులను టీపీసీసీ సమన్వయ కమిటీ ఆదేశించింది. జిల్లాల్లో ఉన్న స్థానిక పరిస్థితులు, రాజకీయ పార్టీల బలాబలాలకు అనుగుణంగా ఎన్నికల అవగాహనపై నిర్ణయం తీసుకుంటే మంచిదని సమన్వయ కమిటీ భావిస్తోంది. డీసీసీల నుంచి నివేదికలు వచ్చాక రెండురోజుల్లో మరోసారి సమావేశమై... ఏయే జిల్లాల్లో పోటీ చేయడం, అభ్యర్థులు, ఇతర అంశాలపై చర్చించి ఎన్నికల వ్యూహాన్ని సిద్ధం చేసుకోనుంది. ఆది, సోమవారాల్లో ఈ నివేదికలను ఢిల్లీలోని పార్టీ హైకమాండ్‌కు పంపి, అక్కడి నుంచి వచ్చే ఆదేశాలకు అనుగుణంగా అభ్యర్థులు, స్థానిక అవగాహనలపై తుది నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించింది. గురువారం గాంధీభవన్‌లో టీపీసీసీ సమన్వయ కమిటీ సభ్యులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, భట్టి విక్రమార్క, జానారెడ్డి, షబ్బీర్ అలీ, పొన్నాల లక్ష్మయ్య, దామోదర రాజనర్సింహ, జె.గీతారెడ్డి, శ్రీధర్‌బాబు సమావేశమై ఈ అంశాలపై చర్చించారు. ఈ ఎన్నికలకు సంబంధించి పార్టీపరంగా మరింత కసరత్తు నిర్వహించాలని వారు అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. జిల్లాల్లో పార్టీకున్న బలాబలాలు, ఆయా జిల్లాల్లో ఎమ్మెల్సీని గెలిపించుకొనేందుకు ఏయే పార్టీల నుంచి లోపాయికారీ సహకారం అవసరం, పరస్పర ప్రయోజనాల పరిరక్షణ, అధికార టీఆర్ఎస్ను ఓడించేందుకు ఉన్న అవకాశాలు తదితర అంశాలు చర్చకు వచ్చినట్లు సమాచారం. మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల్లో రెండేసి సీట్లున్నందున, కాంగ్రెస్, టీడీపీ చెరొకటి చేజిక్కించుకునేలా చూస్తే మంచిదని ఆ జిల్లాల నేతలు కమిటీ సభ్యులకు సూచించినట్లు తెలుస్తోంది. సీనియర్లు, డీసీసీలతో చర్చించాకే నిర్ణయం: ఉత్తమ్ జిల్లాల్లోని సీనియర్ నేతలు, డీసీసీ అధ్యక్షులతో చర్చించాకే ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై నిర్ణయం తీసుకుంటామని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలి పారు. సమన్వయ కమిటీ భేటీలో ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన అంశాలపైనే చర్చించామని, ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. కమిటీ సభ్యుల అభిప్రాయాల ప్రకారం జిల్లా అధ్యక్షులు, సీనియర్ నాయకులతోనూ చర్చలు జరపాలని నిర్ణయించామన్నారు. పార్టీ ముఖ్య నేతలను కూడా సంప్రదించి, మరోసారి సమన్వయ కమిటీ సమావేశాన్ని నిర్వహిస్తామని తెలిపారు. ఆ తర్వాతే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, పోటీ తదితర అంశాలపై స్పష్టత వస్తుందన్నారు. -
డీసీసీ సారథి మహేశ్వర్‌రెడ్డి
ఆదిలాబాద్ : జిల్లా కాంగ్రెస్ కమిటీ(డీసీసీ) అధ్యక్ష పదవి మహేశ్వర్‌రెడ్డికి వరించింది. మొదట భార్గవ్‌దేశ్ పాండేను ప్రకటించిన తర్వాత పార్టీలో వివాదం చోటుచేసుకోవడం, ఆ తర్వాత తెరపైకి మహేశ్వర్‌రెడ్డి పేరు రావడం తెలిసిందే. ఈ ఇద్దరిలో అధ్యక్ష పదవి ఎవరిని వరిస్తుందోనని పార్టీలో ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యం లో గురువారం ఏఐసీసీ నుంచి ఏలేటి మహేశ్వర్‌రెడ్డిని ఖరారు చేస్తూ నియామక పత్రాన్ని పీసీసీకి పంపారు. రాత్రి 8గంటల ప్రాంతంలో పీసీసీ అధ్యక్షుడు పొన్నా ల లక్ష్మయ్య, మాజీ మంత్రి షబ్బీర్‌అలీ, నాగయ్య తదితరుల సమక్షంలో మహేశ్వర్‌రెడ్డికి నియామక పత్రాన్ని అందజేశారు. కాగా ప్రేమ్‌సాగర్‌రావు వర్గానికి చెందిన భార్గవ్‌తో పాటు ఆ వర్గంలోని నాయకులతో మహేశ్వర్‌రెడ్డి రాజీ కుదుర్చుకోవడంతోనే పార్టీలో వివాదం సద్దుమణిగిందనే ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్‌లో మారుతున్న సమీకరణాలు.. తాజాగా మహేశ్వర్‌రెడ్డిని డీసీసీ అధ్యక్షుడిగా నియమించినప్పటికీ ప్రత్యర్థి వర్గం నుంచి ఎలాంటి వ్యతిరేకత రాకపోవడం వెనక పలు సమీకరణాలు చోటుచేసుకున్నాయనే ప్రచారం జరుగుతోంది. హైదరాబాద్‌లో గురువారం మహేశ్వర్‌రెడ్డి, ప్రేమ్‌సాగర్‌రావు వర్గీయులైన భార్గవ్‌దేశ్‌పాండే, అనిల్‌జాదవ్, హరినాయక్, తదితరులతో విస్తృతంగా చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఆయా నియోజకవర్గాల్లో వారి నాయకత్వంలో పార్టీ అభివృద్ధికి తన హస్తం అందిస్తానని మహేశ్వర్‌రెడ్డి వారికి భరోసానిచ్చినట్లు చెప్పుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రధానంగా ఆదిలాబాద్ నియోజకవర్గ రాజకీయ పరిస్థితులపై ఆసక్తి కలిగిస్తోంది. ఇదివరకు డీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సి.రాంచంద్రారెడ్డి తనకుతానే అధ్యక్ష పదవి నుంచి వైదొలుగుతూ కొత్తవారికి అవకాశం ఇవ్వాలని పార్టీకి విన్నవించారు. తన నియోజకవర్గంపై తాను దృష్టి సారిస్తానని పార్టీకి తెలిపారు. రాంచంద్రారెడ్డితో మహేశ్వర్‌రెడ్డి సన్నిహితంగా ఉన్నారు. ప్రస్తుతం భార్గవ్‌ను రాజీ కుదుర్చుకునేందుకు ఎలాంటి ఆపన్నహస్తం మహేశ్వర్‌రెడ్డి చూయించారనే దానిపై చర్చ సాగుతోంది. ఏలేటిని వరించిన పగ్గాలు.. 2009లో నిర్మల్ నియోజకవర్గం నుంచి పీఆర్పీ పార్టీ తరఫున బరిలోకి దిగి ప్రధాన ప్రత్యర్థి ఇంద్రకరణ్‌రెడ్డిపై విజయం సాధించిన మహేశ్వర్‌రెడ్డి అప్పట్లో జిల్లాలో సంచలనం సృష్టించారు. ఆ తర్వాత పీఆర్పీ కాంగ్రెస్‌లో విలీనం కావడంతో ఆయన కాంగ్రెస్ పార్టీలోనూ కీలకంగా వ్యవహరించారు. ఐదేళ్లపాటు ఎమ్మెల్యేగా నియోజకవర్గ ప్రజలకు దగ్గరయ్యారు. కాంగ్రెస్‌లో మాజీ ఎంపీ వివేక్, సి.రాంచంద్రారెడ్డితో కలిసి ప్రత్యర్థి వర్గం ప్రేమ్‌సాగర్‌రావుతో రాజకీయంగా ఢీకొట్టారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి బరిలోకి దిగినప్పటికీ ఓటమి చెందారు. రెండు నెలల కిందట డీసీసీ అధ్యక్షుడిగా భార్గవ్‌దేశ్ పాండేను అదిష్టానం ప్రతిపాదించినప్పుడు మహేశ్వర్‌రెడ్డి వర్గం వ్యతిరేకించింది. తాజాగా ఆయన ఆ వర్గంతో రాజీ కుదుర్చుకొని రాజకీయంగా కీలక పదవిని చేపట్టారు. పూర్వ వైభవానికి కృషి.. కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవానికి కృషి చేస్తానని డీసీసీ అధ్యక్షుడిగా నియామకమైన ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ‘సాక్షి’తో తెలిపారు. ఇకపై గ్రూపుల్లేని కాంగ్రెస్ పార్టీ కనిపిస్తుందని, అందరిని కలుపుకొని వెళ్తానని పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో జిల్లాలోని పది నియోజకవర్గాల్లో గెలుపొందే దిశగా పార్టీని పటిష్టపరుస్తానన్నారు. గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయిల్లో క్యాడర్‌ను పెంపొందిం చి పటిష్ఠం చేస్తానని, తనపై నమ్మకం ఉంచి పదవిని అప్పగించినందుకు అధినేత సోనియా గాంధీ, పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, షబ్బీర్‌అలీ, వివేక్, పొన్నం ప్రభాకర్, మధుయాష్కీ తదితరులకు కృతజ్ఞతలు తెలిపారు. -
యువ నాయకత్వానికి కాంగ్రెస్ పగ్గాలు
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : వరుస ఎన్నికల్లో ఘోర పరాజయం పాలై చావుదెబ్బతిన్న జిల్లా కాంగ్రెస్ పార్టీ పగ్గాలను యువ నాయకత్వానికి అందించాలని ఆ పార్టీ అధిష్టానం నిర్ణయించింది. ఈ మేరకు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షునిగా ఆదిలాబాద్ పట్టణానికి చెందిన భార్గవ్‌దేశ్ పాండే ను నియమిస్తూ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. పార్టీ అధినేత్రి సోనియాగాంధీ నిర్ణయం మేరకు డీసీసీ అధ్యక్షునిగా భార్గవ్‌దేశ్‌పాండేను నియమించినట్లు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జనార్దన్ ద్వివేది ప్రకటించారు. ఆదిలాబాద్‌తోపాటు, రంగారెడ్డి, మెదక్ జిల్లాల డీసీసీ అధ్యక్షులను కూడా అధిష్టానం నియమించింది. జిల్లాలో ఎంతో కీలకమైన డీసీసీ అధ్యక్ష పదవిని 28 ఏళ్ల యువకునికి అప్పగించడం ఆ పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇప్పటి వరకు డీసీసీ అధ్యక్షునిగా సీనియర్ నాయకులు సి.రాంచంద్రారెడ్డి వ్యవహరించారు. డీసీసీ అధ్యక్ష పదవికి ముగ్గురు పేర్లను అధిష్టానం పరిశీలించింది. డీసీసీ మాజీ అధ్యక్షుడు రవీందర్రావు, నిర్మల్ మాజీ ఎమ్మెల్యే ఎ.మహేశ్వర్‌రెడ్డిల పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ిపీసీసీ కార్యదర్శి నరేష్‌జాదవ్ కూడా ఈ పదవిని ఆశించారు. ఈ ఎన్నిక విషయంలో తెలంగాణ పీసీసీ నెలరోజుల క్రితం జిల్లా నేతలతో అభిప్రాయ సేకరణ నిర్వహించింది. అయితే యువనేత రాహుల్‌గాంధీతో ఉన్న సన్నిహిత సంబంధాల కారణంగా భార్గవ్‌కు ఈ పదవి దక్కిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. భగ్గుమన్న విభేదాలు జిల్లా కాంగ్రెస్ పార్టీలో ఉన్న వర్గ విభేదాలు మరోమారు భగ్గుమన్నాయి. రెండు గ్రూపులుగా కొనసాగుతున్న పార్టీలో ఒకవర్గం నేతలు భార్గవ్ నియామకాన్ని వ్యతిరేకిస్తోంది. ఈ నియామకాన్ని ప్రకటించిన వెంటనే మాజీ ఎంపీ వివేక్ ఆ పార్టీ సీనియర్ నాయకులు జానారెడ్డితో హైదరాబాద్‌లో భేటీ అయినట్లు సమాచారం. అధిష్టానం నిర్ణయాన్ని నిరసిస్తూ పలువురు నాయకులు పార్టీకి రాజీనామా చేయనున్నారని పీసీసీ కార్యదర్శి నరేష్‌జాదవ్ ‘సాక్షి’ప్రతినిధితో పేర్కొన్నారు. ఎన్ఎస్యూఐ నుంచి.. 2004లో ఎన్ఎస్యూఐలో చేరిన భార్గవ్ 2006లో ఎన్ఎస్యూఐ రాష్ట్ర కార్యదర్శిగా నియామకమయ్యారు. 2009లో యువజన కాంగ్రెస్ తమిళనాడు ఎన్నికల ఇన్‌చార్జీగా వ్యవహరించారు. 2010లో ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. 2012 నుంచి యువజన కాంగ్రెస్‌లో కొనసాగుతున్న ఆయన 2014 ఎన్నికల్లో యూత్ కాంగ్రెస్ కోటాలో ఎమ్మెల్యేగా టికెట్ తెచ్చుకున్నారు. ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. -
మళ్లీ మల్లేశ్‌కే డీసీసీ పగ్గాలు!
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) సారథిగా క్యామ మల్లేశ్ మరోసారి నియమితులయ్యారు. డీసీసీ అధ్యక్షుడిగా ఆయనను నియమిస్తూ గురువారం ఏఐసీసీ ఉత్తర్వులు జారీచేసింది. సార్వత్రిక ఎన్నికల్లో ఇబ్రహీంపట్నం నుంచి అసెంబ్లీ బరిలో నిలిచిన మల్లేశ్‌ను జోడు పదవుల నేపథ్యంలో డీసీసీ నుంచి తప్పించింది. దీంతో చేవెళ్ల టికెట్‌ను ఆశించి భంగపడ్డ పడాల వెంకటస్వామికి ఎన్నికల వేళ ఈ పదవిని కట్టబెట్టారు. ఎన్నికలు పూర్తికావడం... పార్టీ ఘోరపరాజయం చ విచూసిన నేపథ్యంలో పడాలకు ఉద్వాసన పలికి, తిరిగి క్యామకే డీసీసీ పగ్గాలను అప్పగించాలనే నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టమవుతుంది. అదే సమయంలో ఈ నెల 24,25వ తేదీల్లో ఇబ్రహీంపట్నం మండలం శేరిగూడలోని శ్రీ ఇందూ కాలేజీలో ‘మేధోమథనం’ సదస్సును నిర్వహిస్తుండడం... అతిరథమహారథులు వస్తున్న ఈ సదస్సును ప్రతిష్టాత్మకంగా భావించిన పీసీసీ... సీనియర్ అయిన మల్లేశ్‌ను కొత్త అధ్యక్షుడిగా ప్రకటించేందుకు మొగ్గు చూపినట్లు కనిపిస్తోంది. కాగా, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిన టీఆర్ఎస్ ప్రభుత్వం విధానాలపై ఆందోళనలు చేస్తామని, రుణమాఫీ, ఫీజు రీయింబర్స్మెంట్ విషయంలో ఆ పార్టీ అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా త్వరలోనే ఉద్యమ కార్యచరణ ప్రకటిస్తామని క్యామ అన్నారు. జిల్లావ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు నెలకొన్నా అధికారపార్టీకి చీమకుట్టినట్లయినా లేకపోవడం శోచనీయమని పేర్కొన్నారు. పార్టీకి పూర్వవైభవం తె చ్చేందుకు, సంస్థాగతంగా పటిష్టం చేసేందుకు త్వరలోనే జిల్లా విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహిస్తానని, ముఖ్యనేతల సలహాలు, సూచనలు పాటిస్తూ పార్టీని బలోపేతం చేస్తానని అన్నారు. -
ఒక్కోచోట ముగ్గురు
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలుగా పోటీ చేయనున్న అభ్యర్థుల ఎంపిక కసరత్తు ఊపందుకుంది. ఈ మేరకు జిల్లా కాంగ్రెస్ కమిటీ(డీసీసీ) రూపొందించిన అభ్యర్థుల జాబితాను ఇటీవలే తెలంగాణ ఎన్నికల కమిటీకి పంపించారు. ఒక్కో నియోజకవర్గానికి ముగ్గురు చొప్పున అభ్యర్థుల పేర్లను ఈ ప్రతిపాదిత జాబితాలో చోటు కల్పించారు. డీసీసీల నుంచి వచ్చిన జాబితాలు పరిశీలించి, అభిప్రాయాన్ని పంపాలని ఆ పార్టీ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్‌సింగ్ కొత్తగా ఏర్పడిన తెలంగాణ ఎన్నికల కమిటీని ఆదేశించిన విషయం విధితమే. జిల్లా నుంచి పంపిన ఈ జాబితా ఇప్పుడు తెలంగాణ ఎన్నికల కమిటీ పరిశీలనలో ఉందని డీసీసీ అధ్యక్షుడు సి.రాంచంద్రారెడ్డి పేర్కొన్నారు. జిల్లాలో మొత్తం పది ఎమ్మెల్యే స్థానాలుండగా, రెండు చోట్ల కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలున్నారు. ఆసిఫాబాద్ (ఎస్టీ) నుంచి ఆత్రం సక్కు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. నిర్మల్ నియోజకవర్గం నుంచి పీఆర్పీ నుంచి గెలుపొంది, కాంగ్రెస్‌లో చేరిన మహేశ్వర్‌రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ముగ్గురేసి ఆశావహుల పేర్లను జాబితాలో పేర్కొనగా, సిట్టింగ్ స్థానాలకు సంబంధించి ఒక్క సిట్టింగ్ ఎమ్మెల్యే ఒక్కరి పేరునే జాబితాలో పేర్కొన్నారు. అన్ని పార్టీలు అభ్యర్థుల ప్రకటన ప్రక్రియపై పూర్తిస్థాయిలో దృష్టి సారించిన నేపథ్యంలో ఈ అంశం ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది. సామాజిక వర్గాల ఆధారంగా జాబితా.. జిల్లాలో పది ఎమ్మెల్యే స్థానాలున్నాయి. ఆదిలాబాద్ ఎంపీ నియోజకవర్గం పరిధిలో ఆసిఫాబాద్, బోథ్, ఖానాపూర్ స్థానాలు ఎస్టీలకు రిజర్వు కాగా, ఆదిలాబాద్, సిర్పూర్, నిర్మల్, ముథోల్ స్థానాలు జనరల్ అయ్యాయి. పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో చెన్నూరు, బెల్లంపల్లి ఎస్సీలకు రిజర్వు కాగా, మంచిర్యాల స్థానం జనరల్ అయ్యింది. రిజర్వేషన్ లేని ఈ ఐదు స్థానాల్లో సామాజిక అంశాన్ని పరిగణలోకి తీసుకుని అభ్యర్థుల ప్రతిపాదిత జాబితాను రూపొందిం చారు. ఈ ఐదింటిలో కనీసం రెండు స్థానాలైనా బీసీలకు కేటాయించే అవకాశాలున్నాయని, ఆయా సామాజిక వర్గాల నేతలు భావిస్తున్నారు. మహిళా కోటా, యువత వంటి కోణాల్లో అభ్యర్థుల ఎంపిక ఉండాలని సంబంధిత వర్గాలకు చెందిన ఆశావహులు డిమాండ్ చేస్తున్నారు. మైనార్టీలకు కూడా తగిన స్థానం కల్పించాలనే భావన వ్యక్తమవుతోంది. మరోవైపు పార్టీనే నమ్ముకుని పనిచేస్తున్న వారిని పక్కన బెట్టి, కొత్తగా వచ్చిన వారికి టిక్కెట్లు కట్టబెడితే ఊరుకునేది కొన్ని నియోజకవర్గాల్లో డిమాండ్ తెరపైకి వస్తోంది. ఏది ఏమైనా తీవ్రస్థాయిలో గ్రూపు విభేదాలున్న ఈ పార్టీలో ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపిక ఎలా ఉంటుందోనని రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. కాగా డీసీసీ రూపొందించిన అభ్యర్థుల జాబితాలో టిక్కెటుపై ఎన్నో ఆశలు పెట్టుకున్న ఒకరిద్దరికి చోటు దక్కలేదు. దీంతో వారు అధిష్టానానికి ఫిర్యాదు చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పార్టీ తెలంగాణ ఎన్నికల కమిటీ ముఖ్య నాయకుల దృష్టికి తీసుకెళ్తున్నట్లు సమాచారం. -
జంబో డీసీసీ
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: అన్ని వర్గాలకు సముచిత స్థానం కల్పించాలనే యోచనతో డీసీసీ జంబో కమిటీకి రూపకల్పన చేశారు. అయినప్పటికీ, జిల్లాలోని అన్ని ప్రాంతాలవారికి న్యాయం జరగలేదనే విమర్శ వినిపిస్తోంది. పలు నియోజకవర్గాల నాయకుల నుంచి అసంతృప్తి వ్యక్తమవుతోంది. పాత కార్యవర్గాన్ని పరిశీలిస్తే నూతన కమిటీలో 75 మంది ఎక్కువగానే ఉన్నారు. ఈ కమిటీ కూర్పు కోసం ఐదు నెలల కాలం పట్టిందంటే నియోజకవర్గానికి చెందిన నేతలు పేర్ల జాబితాను ప్రతిపాదించడానికి ఎంత సమయం తీసుకున్నారో అర్థమవుతోంది. డీసీసీ అధ్యక్షుడు తాహెర్‌బిన్ హుందాన్ పలుమార్లు నేతల వెంటబడితే గానీ కొన్ని నియోజకవర్గాల నుంచి జాబి తా అందని పరిస్థితి. అయినప్పటికీ కమిటీ ప్రకటన తర్వాత అసంతృప్తి జ్వాలలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. ఎల్లారెడ్డి, నిజామాబాద్ అర్బన్ నాయకులు జిల్లా కమిటీ ఎంపికపై పెదవి విరుస్తున్నారు. విభేదాలతోనే జిల్లా నేతల మధ్య నెలకొన్న విభేదాల కారణంగానే కమిటీకూర్పునకు ఇంత కాలం పట్టిందనే విషయం తేటతెల్లమవుతోంది. నేతల మధ్య విభేదాలు తీవ్రం గా ఉన్న పలు నియోజక వర్గాల నుంచి జిల్లా కమిటీ లో ఎవరికి ప్రాతినిధ్యం కల్పించాలనే విషయం కష్టంగా మారిందంటున్నారు. నేపథ్యంలోనే దొర్లిన తప్పిదాల కారణంగానే ఈ అసంతృప్తి రగులుతున్నట్టు తెలుస్తోంది. జుక్కల్, ఎల్లారెడ్డి, బాన్సువాడ, బాల్కొండ, ఆర్మూర్, నిజామాబాద్ రూరల్ నియోజక వర్గాల్లో స్థానిక ముఖ్యనేతలు, అసెంబ్లీ ఎన్నికల రేసులో ఉన్న నాయకులు రానున్న ఎన్నికల దృష్ట్యా తమ అనుచరులకు కమిటీలో కీలకచోటు దక్కాలని ప్రయత్నించారు. అయితే జంబో కార్యవర్గంలో అవకాశం లభించినప్పటికీ సరైన స్థానం దక్కక నిరుత్సాహంలో ఉన్నారు. పైగా ఇంత పెద్ద కమిటీలో ఉన్నా...లేకున్నా ఒక్కటేనన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేయ డం గమనార్హం. రాష్ట్ర విభజన నేపథ్యంలో త్వర లో రెండు పీసీసీలు ఏర్పడనుండగా పీసీసీ చీఫ్ బొత్స ఆమోదంతో వెలువడిన జిల్లా కమిటీలో స్థానం అవసరమా అన్న ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. కమిటీ కూర్పు ఇలా గత జూలైలో డీసీసీ అధ్యక్షునిగా నియమితులైన తాహెర్‌బిన్ హుందాన్ ఐదునెలల తరువాత 115 మందితో కూడిన జిల్లా కమిటీని గురువారం అధికారికంగా ప్రకటించారు. 24 మందిని ఉపాధ్యక్షులు గా, 39 మందిని ప్రధాన కార్యదర్శులుగా, 37 మం దిని కార్యదర్శులుగా, 13 మంది సహాయ కార్యదర్శులు, ఒకరిని కో శాధికారిగా నియమించారు. ఇంత మందితో కమిటీని ఏర్పాటు చేసినప్పటికీ ఇందులో కార్యవర్గ సభ్యులు లేకపోవడం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మరొక దఫాలో కార్యవర్గ సభ్యులను ని యమించే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు పేర్కొం టున్నాయి. తొమ్మిదేళ్ల పాటు డీసీసీ అధ్యక్షుడుగా పనిచేసిన గడుగు గంగాధర్ సారథ్యంలో 40 మం దితోనే జిల్లా కమిటీ కొనసాగింది. కొద్ది కాలం పా టు జిల్లా పార్టీ అధ్యక్షురాలుగా పనిచేసిన ఆకుల లలి త కూడా 45 మందితో జిల్లా కమిటీని ఖరారు చేశా రు. అయితే, రానున్న సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఇంత మందితో జిల్లా కమిటీని అధ్యక్షుడు తాహెర్‌బిన్‌హుందాన్ ఖరారు చేశారని చెప్పుకుంటున్నారు. -
డీసీసీ కార్యవర్గం
నిజామాబాద్‌సిటీ, న్యూస్‌లైన్: జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు తాహెర్ బిన్ హుందాన్ గురువారం నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పార్టీని పటిష్టపరిచేందుకు నియోజక వర్గాల వారీ గా, పట్టణ, మండల, గ్రామాల నుంచి కార్యకర్తలకు కార్యవర్గంలో చోటు కల్పించినట్లు తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 80 శాతం వరకు ప్రాధాన్యత ఇచ్చామన్నారు. డీసీసీ ఉపాధ్యక్షులు ... భక్త వత్సలం(ఢిల్లీ), దారం సాయిలు, పాండురంగారావు, రాంరెడ్డి, మామిండ్ల అంజయ్య, ఎంఏ ఖుదూ ్దస్, చందూ పూజారి, ఎండీ నవీద్ పర్వేజ్, అలేటి రాంరెడ్డి, టి.విజయరాణి, గుండా సరోజ, సూరి బాబు, అస్వఖ్ హైమద్ ఖాన్(పప్పా), కుమ్మరి రాములు, జి.పురుషోత్తం, రాంజనాయక్ (మాజీ జడ్పీటీసీ ), పసుల ముత్తెన్న, సక్రె నాయక్ (మాజీ ఎంపీపీ), ఎల్ల సాయిరెడ్డి, హన్మంత్‌రెడ్డి, శంకర్‌గౌడ్, ఎల్ఎన్ నారాయణ, సలంద్ర బాబురావు. ప్రధాన కార్యదర్శులు ... ఆకుల చిన్న రాజేశ్వర్, కిషోర్‌యాదవ్, అలిబిన్యాదవ్, అలిబిన్ అబ్దూల్లా, జంగిడి సతీష్, సాయిప్రసాద్(సాయిబాబా), మేకల సురేష్, సడక్ బాల్కిషన్, గణపతిరెడ్డి, షేక్ అన్వర్ పాషా, గోపాల్‌రెడ్డి, పెద్ది పవన్, బద్దం నర్సారెడ్డి, తంబాక్ చంద్రకళ, తాటికొండ శ్రీనివాస్, వై నర్సింగ్, గుణప్రసాద్, వెంకట్రాంరెడ్డి, చల్ల రవీందర్, గాధారి మనోహర్‌రెడ్డి, కిషోర్రావు (పీఏసీసీఎస్ చైర్మన్), వెంకట్ గౌడ్, సం గారెడ్డి( మాజీ ఎంపీపీ), కిషోర్రావు, పి తిరుపతి రెడ్డి (సర్పంచ్), దయాకర్‌గౌడ్, మెబిన్ఖాన్, ఎర్రం గణపతి, లింగరెడ్డి, కొమినేని వాసుబాబు, ముల్కేడి శ్రీనివాస్‌రెడ్డి, జమున రాథోడ్, సంగం అనిల్‌కుమా ర్, మహమ్మద్ ఫయాజుద్దీన్, విజయగౌడ్, మేకల గంగాప్రసాద్, దేవాగౌడ్, అర్గుల్ నర్సయ్య, నారాయణరావు(నాని), బి తిరుపతి రెడ్డి. కార్యదర్శులు .. మల్లిఖార్జున్‌రావు, ఎంఏ బారి, బండి నర్సాగౌడ్, వెంకట్‌రెడ్డి, బోగ రామస్వామి, రాజేశ్వర్‌గౌడ్, అం బీర్ మధుసూదన్‌రావు(మాజీ ఎంపీపీ), బానోత్ బాల్‌రాం (మాజీ మార్కెట్ కమిటీ సభ్యుడు), కొత్త మనోహర్, రాంచందర్‌రెడ్డి, చిత్ర (సర్పంచ్), తాన్సింగ్, సుబ్బం ముత్యం, అర్వపల్లి పురుషోత్తం గుప్తా(మాజీ నగర కాంగ్రెస్ కమిటీఅధ్యక్షుడు), ఎండీ అయూబ్‌ఖాన్, ఎంఏ అజీజ్, పూదరి యోగి, గొల్ల ఎర్రన్న మాజీ సర్పంచ్, ఆకుల శ్రీనివాస్, జావీ ద్ హైమద్, అయోషా, బీఎల్ నరేందర్, మనోహర్‌రెడ్డి, ద్యావత్ రాజ్‌కుమార్, పల్లెంపట్టి శివనారాయ ణ, ఎస్కే కరీం, సత్య గంగాయ్య, భోజన్న(పీఏసీసీఎస్ చైర్మన్), లింగాల శంకర్, శ్రీధర్‌గౌడ్, చిన్న సతీ ష్, సంజీవ్‌రెడ్డి, ఎం లింబాద్రి (మాజీ ఎంపీటీసీ), మహమ్మద్ మిస్బుద్దీన్ (మాజీ కార్పొరేటర్), ముజాయిద్‌ఖాన్ (మాజీ కార్పొరేటర్), అల్లూరి శ్రీనివాస్ (ఉప సర్పంచ్), జీడీ శ్రీనివాస్‌రావు. సహాయ కార్యదర్శులు ... మోహన్ పటేల్, మల్లయ్య, నర్సయ్య యాదవ్, పోలీస్ కమలా, పోలా ఉషా, ఆకుల కవిత, కె రాము, ఖలీల్ పాషా, వెన్న రమేష్, విట్టం జీవన్, సత్తెల్లి రాము, సడక్ వినోద్, భూమ్య నాయక్. కోశాధికారి ...మీసాల సుధాక ర్ రావు.