డీసీసీ అధ్యక్షులకు ఎన్నికల్లో నో ఎంట్రీనా?
► అధిష్టానం నిబంధనపై కాంగ్రెస్ నేతల అభ్యంతరం
► ఏఐసీసీ దృష్టికి తీసుకెళతామన్న దిగ్విజయ్
సాక్షి, హైదరాబాద్: జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షులకు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశముండదనే అధిష్టానం నిబంధనపై కాంగ్రెస్ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. జిల్లాల్లో పార్టీని అధ్యక్షులే నడిపించాల్సి ఉం టుందని.. అలాంటి వారికి ఎన్నికల్లో పోటీకి అవకాశం లేకపోతే సీనియర్లు అధ్యక్ష బాధ్యతను స్వీకరించే అవకా శం ఉండదంటున్నారు. కొత్త జిల్లాల్లో డీసీసీ అధ్యక్షులతో పాటు మండల, బ్లాక్ కమిటీల అధ్యక్షుల నియామకంపై గురు వారం గాంధీభవన్‌లో సమీక్ష జరిగింది.
ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజ య్‌సింగ్, కుంతియా, కొప్పుల రాజు, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, భట్టి విక్రమార్క, సీనియర్ నేతలు కె.జానారెడ్డి, షబ్బీర్ అలీ తదితరులు పాల్గొన్నారు. డీసీసీ అధ్యక్షులు ఎన్నికల్లో పోటీ చేయరాదనే నిబం ధనపై సమావేశంలో ప్రధానంగా చర్చకు వచ్చింది. పోటీకి అవకాశం లేకపోవడంతో బాధ్యతలు స్వీకరించేందుకు నేతలు ఆసక్తి కనబరచడం లేదని జిల్లాల ముఖ్య నేతలు పేర్కొన్నారు.
జూనియర్లకు పదవులు అప్ప గిస్తే సీనియర్లు సహకరించక పార్టీ కార్యక్ర మాలు ముందుకుసాగే అవకాశాలుండవని తెలిపారు. నిబంధనను తొలగించాలని మాజీ ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు జగ్గారెడ్డి అధిష్టా నాన్ని కోరారు. ఈ అంశంపై ఏఐసీసీ నాయ కత్వంతో చర్చిస్తామని దిగ్విజయ్ చెప్పినట్టు సమాచారం. అయితే డీసీసీ అధ్యక్ష పదవుల కు పోటీ చేయనున్న, చేయని వారి జాబితాను వేర్వేరుగా రూపొందించి పార్టీ జాతీయ నాయకత్వానికి పంపించనున్నట్లు పార్టీ ముఖ్యనేత ఒకరు తెలిపారు. కాగా, హైదరా బాద్ మినహా ఖమ్మం, నల్లగొండ, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల సమావేశం శుక్ర వారం జరగనుంది.
15 రోజుల్లో డీసీసీలు: వారంలో మండల, బ్లాక్ కమిటీలకు.. 15 రోజుల్లో డీసీసీలకు అధ్యక్షుల నియామకం పూర్తిచేయాలని దిగ్వి జయ్ సూచించినట్టు సమాచారం. కరీంనగర్ జిల్లాలో కేసీఆర్ బంధువులు ఉమేశ్‌రావు, రేగులపాటి రమను ముఖ్య పదవుల్లో నియ మించాలనే ప్రతిపాదనలపై పలువురు నేతలు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలిసింది.