Umesh Rao
-
‘కాంగ్రెస్ పది, పన్నెండుకంటే ఎక్కువ సీట్లు గెలువదు’
సిరిసిల్ల: కాంగ్రెస్ పార్టీ నాయకుడు, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మేనల్లుడు చీటి ఉమేశ్‌రావు సొంతపార్టీపైనే వ్యతిరేక వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట లు ఆదివారం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వెంటనే ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం పదిర గ్రామానికి చెందిన ఉమేశ్‌రావు 2005 నుంచి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నారు. కాగా, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పది, పన్నెండు సీట్లు కూడా రావని, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఆయన భార్య గెలవడమే కష్టమంటూ వ్యాఖ్యలు చేశారు. సిరిసిల్లలో అసమర్థమైన నాయకత్వం ఉందంటూ.. మాట్లాడారు. ఉమేశ్‌రావు మాట్లాడిన ఈ మాటలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్‌లో ఉమేశ్‌రావు కోవర్ట్ అంటూ ఆ పార్టీ నాయకులు మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీలో అధికార ప్రతినిధిగా కొనసాగిన ఉమేశ్‌రావు పార్టీకి రాజీనామా చేయడం రాజన్న సిరిసిల్ల జిల్లాలో చర్చనీయాంశమైంది. -
టీఆర్ఎస్లో ముసలం: కేసీఆర్ మేనల్లుడు
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ పార్టీలో ముసలం పుట్టిందని, మంత్రి హరీశ్‌రావును ఆ పార్టీలో పక్కనపెట్టారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి, కేసీఆర్ మేనల్లుడు ఉమేశ్‌రావు అన్నారు. మంత్రి హరీశ్‌రావు మంచి పనిమంతుడని, అలాంటి వాడు కాంగ్రెస్ లోకి వస్తే బావుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, హరీశ్ రావు కూడా అవమానాలను భరిస్తూ టీఆర్ఎస్లో కొనసాగాల్సిన అవసరం లేదన్నారు. కాంగ్రెస్సే హరీశ్‌రావుకు సరైన పార్టీ అని పేర్కొన్నారు. హరీశ్ వస్తే కాంగ్రెస్ పార్టీకి సైతం లాభం కలుగుతుందని, ఆయనను కాంగ్రెస్‌లోకి తెచ్చేందుకు తాను ప్రయత్నిస్తానని చెప్పారు. -
డీసీసీ అధ్యక్షులకు ఎన్నికల్లో నో ఎంట్రీనా?
► అధిష్టానం నిబంధనపై కాంగ్రెస్ నేతల అభ్యంతరం ► ఏఐసీసీ దృష్టికి తీసుకెళతామన్న దిగ్విజయ్ సాక్షి, హైదరాబాద్: జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షులకు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశముండదనే అధిష్టానం నిబంధనపై కాంగ్రెస్ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. జిల్లాల్లో పార్టీని అధ్యక్షులే నడిపించాల్సి ఉం టుందని.. అలాంటి వారికి ఎన్నికల్లో పోటీకి అవకాశం లేకపోతే సీనియర్లు అధ్యక్ష బాధ్యతను స్వీకరించే అవకా శం ఉండదంటున్నారు. కొత్త జిల్లాల్లో డీసీసీ అధ్యక్షులతో పాటు మండల, బ్లాక్ కమిటీల అధ్యక్షుల నియామకంపై గురు వారం గాంధీభవన్‌లో సమీక్ష జరిగింది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజ య్‌సింగ్, కుంతియా, కొప్పుల రాజు, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, భట్టి విక్రమార్క, సీనియర్ నేతలు కె.జానారెడ్డి, షబ్బీర్ అలీ తదితరులు పాల్గొన్నారు. డీసీసీ అధ్యక్షులు ఎన్నికల్లో పోటీ చేయరాదనే నిబం ధనపై సమావేశంలో ప్రధానంగా చర్చకు వచ్చింది. పోటీకి అవకాశం లేకపోవడంతో బాధ్యతలు స్వీకరించేందుకు నేతలు ఆసక్తి కనబరచడం లేదని జిల్లాల ముఖ్య నేతలు పేర్కొన్నారు. జూనియర్లకు పదవులు అప్ప గిస్తే సీనియర్లు సహకరించక పార్టీ కార్యక్ర మాలు ముందుకుసాగే అవకాశాలుండవని తెలిపారు. నిబంధనను తొలగించాలని మాజీ ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు జగ్గారెడ్డి అధిష్టా నాన్ని కోరారు. ఈ అంశంపై ఏఐసీసీ నాయ కత్వంతో చర్చిస్తామని దిగ్విజయ్ చెప్పినట్టు సమాచారం. అయితే డీసీసీ అధ్యక్ష పదవుల కు పోటీ చేయనున్న, చేయని వారి జాబితాను వేర్వేరుగా రూపొందించి పార్టీ జాతీయ నాయకత్వానికి పంపించనున్నట్లు పార్టీ ముఖ్యనేత ఒకరు తెలిపారు. కాగా, హైదరా బాద్ మినహా ఖమ్మం, నల్లగొండ, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల సమావేశం శుక్ర వారం జరగనుంది. 15 రోజుల్లో డీసీసీలు: వారంలో మండల, బ్లాక్ కమిటీలకు.. 15 రోజుల్లో డీసీసీలకు అధ్యక్షుల నియామకం పూర్తిచేయాలని దిగ్వి జయ్ సూచించినట్టు సమాచారం. కరీంనగర్ జిల్లాలో కేసీఆర్ బంధువులు ఉమేశ్‌రావు, రేగులపాటి రమను ముఖ్య పదవుల్లో నియ మించాలనే ప్రతిపాదనలపై పలువురు నేతలు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలిసింది. -
కొండూరిపై బొత్సకు ఫిర్యాదు
సాక్షి, కరీంనగర్ : జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కొండూరి రవీందర్‌రావుపై పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఉమేశ్‌రావు ఫిర్యాదు చేశారు. పార్టీ విషయాల్లో రవీందర్రావు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని బుధవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో బొత్సను కలిసి లిఖితపూర్వకంగా ఫిర్యాదు అందించారు. సొంత నియోజకవర్గం సిరిసిల్ల సర్పంచులకు సన్మానం చేసిన రవీందర్రావు అదే నియోజకవర్గానికి చెందిన తనను కానీ, ముఖ్యనేతలెవరిని కానీ పిలవలేద ని, పార్టీ కార్యక్రమాన్ని సొంత వ్యవహారంగా చూస్తున్నారని వివరించారు. అధ్యక్షుడి ఒంటెత్తు పోకడలపై పార్టీ జిల్లా నాయకులు సైతం ఆగ్రహంగా ఉన్నారని ఫిర్యాదులో పేర్కొనగా, పరిశీ లిస్తానని బొత్స హామీ ఇచ్చారని తెలిసింది. డీసీసీ అధ్యక్షుడి వ్యవహార సరళిపై చాలా రోజులు గా అసంతృప్తిగా ఉన్న ఆయన సొంత నియోజకవర్గ ముఖ్యనేతలు కూడా పీసీసీకి మరో ఫిర్యా దు అందించేందుకు సిద్ధపడుతున్నారు. పార్టీ వ్యవహా రాలకు రవీందర్రావు పూర్తి సమయాన్ని కేటాయించలేకపోతున్నారని, జిల్లాలోని అన్ని ప్రాంతాల నాయకులను కలుపుకొని పోవడం లేదని పేర్కొంటున్నారు. సర్పంచుల సన్మానానికి తమనెవరినీ పిలవకపోవడం ద్వారా పార్టీ శ్రేణులకు తప్పుడు సంకేతాలిచ్చినట్లయిం దని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డీసీసీబీ అధ్యక్షుడిగా కూడా ఉన్న రవీందర్రావు బ్యాంకు పనుల్లోనే బిజీగా ఉండడంతో పార్టీ వ్యవహారాలకు సమయం కేటాయిం చడం లేదంటున్నారు. సాధారణ ఎన్నికలు సమీపిస్తున్నందున పార్టీ మరింత చురుగ్గా పనిచేయాల్సి ఉందని, నిరంతరం ప్రజల్లో ఉండేలా కార్యచరణ రూపొందించాలని చెబుతున్నారు. జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ బలంగా ఉండగా, తెలంగాణ ఏర్పాటు తర్వాత సైతం విలీన ప్రతిపాదనలను ఆ పార్టీ కొట్టి పారేస్తున్నందున కాంగ్రెస్ పార్టీ పటిష్టతపై ఇప్పటినుంచే దృష్టి సారించాల్సిన అవసరముం దన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి కీలక సమయంలో జంట పదవులకు రవీందర్రావు న్యాయం చేయలేరని వారు తమ ఫిర్యాదులో పేర్కొనాలని నిర్ణయించారు. ఈ ఫిర్యాదుతో నేడో రేపో వారు బొత్సను కలిసే అవకాశముంది.