సాక్షి, కరీంనగర్ : జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కొండూరి రవీందర్‌రావుపై పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఉమేశ్‌రావు ఫిర్యాదు చేశారు. పార్టీ విషయాల్లో రవీందర్‌రావు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని బుధవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో బొత్సను కలిసి లిఖితపూర్వకంగా ఫిర్యాదు అందించారు. సొంత నియోజకవర్గం సిరిసిల్ల సర్పంచులకు సన్మానం చేసిన రవీందర్‌రావు అదే నియోజకవర్గానికి చెందిన తనను కానీ, ముఖ్యనేతలెవరిని కానీ పిలవలేద ని, పార్టీ కార్యక్రమాన్ని సొంత వ్యవహారంగా చూస్తున్నారని వివరించారు. అధ్యక్షుడి ఒంటెత్తు పోకడలపై పార్టీ జిల్లా నాయకులు సైతం ఆగ్రహంగా ఉన్నారని ఫిర్యాదులో పేర్కొనగా, పరిశీ లిస్తానని బొత్స హామీ ఇచ్చారని తెలిసింది. డీసీసీ అధ్యక్షుడి వ్యవహార సరళిపై చాలా రోజులు గా అసంతృప్తిగా ఉన్న ఆయన సొంత నియోజకవర్గ ముఖ్యనేతలు కూడా పీసీసీకి మరో ఫిర్యా దు అందించేందుకు సిద్ధపడుతున్నారు.
పార్టీ వ్యవహా రాలకు రవీందర్‌రావు పూర్తి సమయాన్ని కేటాయించలేకపోతున్నారని, జిల్లాలోని అన్ని ప్రాంతాల నాయకులను కలుపుకొని పోవడం లేదని పేర్కొంటున్నారు. సర్పంచుల సన్మానానికి తమనెవరినీ పిలవకపోవడం ద్వారా పార్టీ శ్రేణులకు తప్పుడు సంకేతాలిచ్చినట్లయిం దని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డీసీసీబీ అధ్యక్షుడిగా కూడా ఉన్న రవీందర్‌రావు బ్యాంకు పనుల్లోనే బిజీగా ఉండడంతో పార్టీ వ్యవహారాలకు సమయం కేటాయిం చడం లేదంటున్నారు. సాధారణ ఎన్నికలు సమీపిస్తున్నందున పార్టీ మరింత చురుగ్గా పనిచేయాల్సి ఉందని, నిరంతరం ప్రజల్లో ఉండేలా కార్యచరణ రూపొందించాలని చెబుతున్నారు. జిల్లాలో టీఆర్‌ఎస్ పార్టీ బలంగా ఉండగా, తెలంగాణ ఏర్పాటు తర్వాత సైతం విలీన ప్రతిపాదనలను ఆ పార్టీ కొట్టి పారేస్తున్నందున కాంగ్రెస్ పార్టీ పటిష్టతపై ఇప్పటినుంచే దృష్టి సారించాల్సిన అవసరముం దన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి కీలక సమయంలో జంట పదవులకు రవీందర్‌రావు న్యాయం చేయలేరని వారు తమ ఫిర్యాదులో పేర్కొనాలని నిర్ణయించారు. ఈ ఫిర్యాదుతో నేడో రేపో వారు బొత్సను కలిసే అవకాశముంది.
కొండూరిపై బొత్సకు ఫిర్యాదు
Published Thu, Sep 12 2013 1:40 AM | Last Updated on Fri, Sep 1 2017 10:37 PM
Advertisement