
సిరిసిల్ల: కాంగ్రెస్ పార్టీ నాయకుడు, టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ మేనల్లుడు చీటి ఉమేశ్‌రావు సొంతపార్టీపైనే వ్యతిరేక వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట లు ఆదివారం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వెంటనే ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం పదిర గ్రామానికి చెందిన ఉమేశ్‌రావు 2005 నుంచి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నారు. కాగా, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పది, పన్నెండు సీట్లు కూడా రావని, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఆయన భార్య గెలవడమే కష్టమంటూ వ్యాఖ్యలు చేశారు.
సిరిసిల్లలో అసమర్థమైన నాయకత్వం ఉందంటూ.. మాట్లాడారు. ఉమేశ్‌రావు మాట్లాడిన ఈ మాటలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్‌లో ఉమేశ్‌రావు కోవర్ట్ అంటూ ఆ పార్టీ నాయకులు మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీలో అధికార ప్రతినిధిగా కొనసాగిన ఉమేశ్‌రావు పార్టీకి రాజీనామా చేయడం రాజన్న సిరిసిల్ల జిల్లాలో చర్చనీయాంశమైంది.
Comments
Please login to add a commentAdd a comment