సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: అన్ని వర్గాలకు సముచిత స్థానం కల్పించాలనే యోచనతో డీసీసీ జంబో కమిటీకి రూపకల్పన చేశారు. అయినప్పటికీ, జిల్లాలోని అన్ని ప్రాంతాలవారికి న్యాయం జరగలేదనే విమర్శ వినిపిస్తోంది. పలు నియోజకవర్గాల నాయకుల నుంచి అసంతృప్తి వ్యక్తమవుతోంది. పాత కార్యవర్గాన్ని పరిశీలిస్తే నూతన కమిటీలో 75 మంది ఎక్కువగానే ఉన్నారు. ఈ కమిటీ కూర్పు కోసం ఐదు నెలల కాలం పట్టిందంటే నియోజకవర్గానికి చెందిన నేతలు పేర్ల జాబితాను ప్రతిపాదించడానికి ఎంత సమయం తీసుకున్నారో అర్థమవుతోంది. డీసీసీ అధ్యక్షుడు తాహెర్‌బిన్ హుందాన్ పలుమార్లు నేతల వెంటబడితే గానీ కొన్ని నియోజకవర్గాల నుంచి జాబి తా అందని పరిస్థితి. అయినప్పటికీ కమిటీ ప్రకటన తర్వాత అసంతృప్తి జ్వాలలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. ఎల్లారెడ్డి, నిజామాబాద్ అర్బన్ నాయకులు జిల్లా కమిటీ ఎంపికపై పెదవి విరుస్తున్నారు.
విభేదాలతోనే
జిల్లా నేతల మధ్య నెలకొన్న విభేదాల కారణంగానే కమిటీకూర్పునకు ఇంత కాలం పట్టిందనే విషయం తేటతెల్లమవుతోంది. నేతల మధ్య విభేదాలు తీవ్రం గా ఉన్న పలు నియోజక వర్గాల నుంచి జిల్లా కమిటీ లో ఎవరికి ప్రాతినిధ్యం కల్పించాలనే విషయం కష్టంగా మారిందంటున్నారు. నేపథ్యంలోనే దొర్లిన తప్పిదాల కారణంగానే ఈ అసంతృప్తి రగులుతున్నట్టు తెలుస్తోంది. జుక్కల్, ఎల్లారెడ్డి, బాన్సువాడ, బాల్కొండ, ఆర్మూర్, నిజామాబాద్ రూరల్ నియోజక వర్గాల్లో స్థానిక ముఖ్యనేతలు, అసెంబ్లీ ఎన్నికల రేసులో ఉన్న నాయకులు రానున్న ఎన్నికల దృష్ట్యా తమ అనుచరులకు కమిటీలో కీలకచోటు దక్కాలని ప్రయత్నించారు. అయితే జంబో కార్యవర్గంలో అవకాశం లభించినప్పటికీ సరైన స్థానం దక్కక నిరుత్సాహంలో ఉన్నారు. పైగా ఇంత పెద్ద కమిటీలో ఉన్నా...లేకున్నా ఒక్కటేనన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేయ డం గమనార్హం. రాష్ట్ర విభజన నేపథ్యంలో త్వర లో రెండు పీసీసీలు ఏర్పడనుండగా పీసీసీ చీఫ్ బొత్స ఆమోదంతో వెలువడిన జిల్లా కమిటీలో స్థానం అవసరమా అన్న ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.
కమిటీ కూర్పు ఇలా
గత జూలైలో డీసీసీ అధ్యక్షునిగా నియమితులైన తాహెర్‌బిన్ హుందాన్ ఐదునెలల తరువాత 115 మందితో కూడిన జిల్లా కమిటీని గురువారం అధికారికంగా ప్రకటించారు. 24 మందిని ఉపాధ్యక్షులు గా, 39 మందిని ప్రధాన కార్యదర్శులుగా, 37 మం దిని కార్యదర్శులుగా, 13 మంది సహాయ కార్యదర్శులు, ఒకరిని కో శాధికారిగా నియమించారు. ఇంత మందితో కమిటీని ఏర్పాటు చేసినప్పటికీ ఇందులో కార్యవర్గ సభ్యులు లేకపోవడం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మరొక దఫాలో కార్యవర్గ సభ్యులను ని యమించే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు పేర్కొం టున్నాయి. తొమ్మిదేళ్ల పాటు డీసీసీ అధ్యక్షుడుగా పనిచేసిన గడుగు గంగాధర్ సారథ్యంలో 40 మం దితోనే జిల్లా కమిటీ కొనసాగింది. కొద్ది కాలం పా టు జిల్లా పార్టీ అధ్యక్షురాలుగా పనిచేసిన ఆకుల లలి త కూడా 45 మందితో జిల్లా కమిటీని ఖరారు చేశా రు. అయితే, రానున్న సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఇంత మందితో జిల్లా కమిటీని అధ్యక్షుడు తాహెర్‌బిన్‌హుందాన్ ఖరారు చేశారని చెప్పుకుంటున్నారు.
జంబో డీసీసీ
Published Fri, Dec 20 2013 5:01 AM | Last Updated on Wed, Oct 17 2018 6:06 PM
Advertisement
Advertisement