district incharge ministers list
-
ఏపీ: 26 జిల్లాలకు ఇన్చార్జి మంత్రులు వీరే..
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లోని 26 జిల్లాలకు రాష్ట్ర ప్రభుత్వం ఇన్చార్జి మంత్రులను నియమించింది. ఈ మేరకు ప్రభుత్వం మంగళవారం అధికారిక ఉత్తర్వులు వెలువరించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఈ నియమకాలు జరిగాయి. తాము ఇన్చార్జిగా ఉండే జిల్లాల్లో అభివృద్ధి కార్యక్రమాలను, పాలనపరమైన వ్యవహారాలను ఈ మంత్రులు పర్యవేక్షిస్తారు. జిల్లాల వారీగా ఇన్చార్జి మంత్రుల వివరాలు జిల్లా పేరు ఇన్చార్జి మంత్రి 1 గుంటూరు ధర్మాన ప్రసాదరావు 2 కాకినాడ సీదిరి అప్పల రాజు 3 శీకాకుళం బొత్స సత్యనారాయణ 4 అనకాపల్లి రాజన్న దొర 5 ఏఎస్ఆర్ఆర్ గుడివాడ అమర్నాథ్ 6 విజయనగరం బూడి ముత్యాల నాయుడు 7 పశ్చిమ గోదావరి దాటిశెట్టి రాజా 8 ఏలూరు పినిపె విశ్వరూప్ 9 తూర్పుగోదావరి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల్ 10 ఎన్టీఆర్ తానేటి వనిత 11 పల్నాడు కారుమూరి వెంకట నాగేశ్వరరావు 12 బాపట్ల కొట్టు సత్యనారాయణ 13 అమలాపురం జోగి రమేష్ 14 ఒంగోలు మేరుగ నాగార్జున 15 విశాఖపట్నం విడదల రజిని 16 నెల్లూరు అంబటి రాంబాబు 17 కడప ఆదిమూలపు సురేష్ 18 అన్నమయ్య కాకాణి గోవర్థన్‌రెడ్డి 19 అనంతపురం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 20 కృష్ణా ఆర్కే రోజా 21 తిరుపతి నారాయణ స్వామి 22 నంద్యాల అంజాద్ బాషా 23 కర్నూలు బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి 24 సత్యసాయి గుమ్మనూరి జయరాం 25 చిత్తూరు కేవి ఉషాశ్రీ చరణ్ 26 పార్వతీపురం గుడివాడ అమర్నాథ్ -
ఏపీ: 13 జిల్లాలకు ఇన్చార్జి మంత్రులు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాలకు రాష్ట్ర ప్రభుత్వం ఇన్చార్జి మంత్రులను నియమించింది. ఈ మేరకు ప్రభుత్వం గురువారం అధికారిక ఉత్తర్వులు వెలువరించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఈ నియమకాలు జరిగాయి. తాము ఇన్చార్జిగా ఉండే జిల్లాల్లో అభివృద్ధి కార్యక్రమాలను, పాలనపరమైన వ్యవహారాలను ఈ మంత్రులు పర్యవేక్షిస్తారు. జిల్లా పేరు ఇన్చార్జి మంత్రి 1 శ్రీకాకుళం వెల్లంపల్లి శ్రీనివాస్ 2 విజయనగరం చెరుకువాడ శ్రీరంగనాథరాజు 3 విశాఖపట్నం మోపిదేవి వెంకటరమణ 4 తూర్పుగోదావరి ఆళ్ల నాని 5 పశ్చిమగోదావరి పిల్లి సుభాష్‌చంద్రబోస్ 6 కృష్ణా కురసాల కన్నబాబు 7 గుంటూరు పేర్ని నాని 8 ప్రకాశం అనిల్‌కుమార్ యాదవ్ 9 నెల్లూరు మేకతోటి సుచరిత 10 కర్నూలు బొత్స సత్యనారాయణ 11 వైఎస్సార్ కడప బుగ్గన రాజేంద్రనాథ్ 12 అనంతపురం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 13 చిత్తూరు మేకపాటి గౌతమ్‌రెడ్డి -
13 జిల్లాలకు ఇన్ఛార్జ్ మంత్రుల నియామకం
హైదరాబాద్: 13 జిల్లాలకు ఇన్‌ఛార్జి మంత్రులను నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ వివరాలు ఈ దిగువన ఇస్తున్నాం. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి శ్రీకాకుళం పరిటాల సునీత విజయనగరం పల్లె రఘునాథ రెడ్డి విశాఖపట్నం యనమల రామకృష్ణుడు అనంతపురం జిల్లా కామినేని శ్రీనివాసరావు తూర్పుగోదావరి జిల్లా దేవినేని ఉమామహేశ్వర రావు పశ్చిమగోదావరి జిల్లా అయ్యన్న పాత్రుడు కృష్ణా జిల్లా పత్తిపాటి పుల్లారావు గుంటూరు జిల్లా నిమ్మకాయల చిన్న రాజప్ప ప్రకాశం జిల్లా రావెల కిషోర్ బాబు నెల్లూరు జల్లా శిద్దా రాఘవరావు చిత్తూరు జిల్లా పి.నారాయణ వైఎస్ఆర్ జిల్లా గంటా శ్రీనివాసరావు కర్నూలు జిల్లా అచ్చెన్నాయుడు ఉప ముఖ్యమంత్రి కె.ఇ.కృష్ణమూర్తి, ఇతర మంత్రులు బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి, కిమిడి మృణాళిని, పీతల సుజాత, కొల్లు రవీంద్రలకు ఎటువంటి బాధ్యతలు అప్పగించలేదు. -
జిల్లాల అభివృద్ధిపై సీఎం దృష్టి
ఇన్చార్జి మంత్రుల నియామకం సాక్షి, ముంబై: ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ శుక్రవారం జిల్లా ఇన్చార్జీ మంత్రుల జాబితా విడుదల చేశారు. దేవేంద్ర ఫడ్నవిస్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఏర్పాటుచేసి దాదాపు రెండునెలలు కావస్తోంది. కేబినెట్, సహాయ మంత్రులకు శాఖలను కేటాయించినప్పటికీ ఇంతవరకు జిల్లా ఇన్చార్జీ మంత్రులను నియమించ లేదు. ఎట్టకేలకు శుక్రవారం పేర్లు ప్రకటించారు. ఇందులో శివసేనకు చెందిన సుభాష్ దేశాయ్‌కి ముంబై నగరం, విద్యాశాఖ మంత్రి వినోద్ తావ్డేకు ఉప ముంబై నగరం జిల్లా ఇన్చార్జీ మంత్రిగా నియమించారు. ఇందులో అత్యధిక శాతం మంత్రులను వారివారి నియోజక వర్గాలున్న జిల్లాలకే ఇన్‌చార్జీలుగా నియమించడం గమనార్హం. వారి జిల్లాల్లో అభివృద్థి పనులు ఎలా సాగుతున్నాయో ఇతరులకంటే వారికే ఎక్కువ అనుభవం ఉంటుందనే ఉద్దేశంతోనే ఫడ్నవీస్ వారికి ఆయా బాధ్యతలు అప్పగించి ఉంటారని పరిశీలకులు భావిస్తున్నారు. జిల్లా ఇన్చార్జీ మంత్రుల వివరాలివే... ముంబై నగరం-సుభాష్ దేశాయ్, ముంబై ఉప నగరం-వినోద్ తావ్డే, ఠాణే-ఏక్నాథ్ షిండే, పాల్ఘార్-విష్ణు సావరా, రాయ్‌గడ్-రవీంద్ర వైకర్, సింధుదుర్గ్-దీపక్ కసర్కర్, సాంగ్లీ, కొల్హాపూర్-చంద్రకాంత్ పాటిల్, జల్గావ్, బుల్డాణ-ఏక్నాథ్ ఖడ్సే, పుణే-గిరీష్ బాపట్, అహ్మద్‌నగర్-రామ్ షిండే, ధుళే-దాదా భుసే, అకోలా, వాషిం- రంజిత్ పాటిల్, నాసిక్, నందుర్బార్-గిరీష్ మహాజన్, సాతారా-విజయ్ శివ్తరే, షోలాపూర్-విజయ్ దేశ్‌ముఖ్, అమరావతి-ప్రవీణ్ పోటే, వర్ధా-సుధీర్ మునగంటివార్, గోందియా-రాజ్‌కుమార్ బడోలే, యవత్మాల్-సంజయ్ రాఠోడ్, నాగపూర్-చంద్రశేఖర్ బావన్‌కుళే. భండార, ఉస్మానాబాద్- దీపక్ సావంత్, గడ్చిరోలి- అంబరీష్ ఆత్రం.