district level officials
-
ప్రభుత్వ కార్యాలయంలో..‘ఛీ’ కటి పడ్డాక
అనంతపురం సప్తగిరి సర్కిల్: జిల్లా వికలాంగుల సంక్షేమ శాఖలో ఆయనో కీచకుడు. అభాగ్యులు, ఆసరాలేని మహిళలను లక్ష్యంగా చేసుకుని తన కార్యకలాపాలను కొనసాగిస్తున్నాడు. జిల్లాలో గత నాలుగేళ్లుగా అతని కబంధ హస్తాల్లో చిక్కుకుని ఎందరో దివ్యాంగ మహిళలు, యువతులు నలిగిపోయారు. తల్లిదండ్రులు లేని అభాగ్యులను లక్ష్యంగా చేసుకుని రెచ్చిపోతుంటాడు. ఉన్నత చదువులు అభ్యసించిన వారికి సంక్షేమ పథకాలను ఎరగా వేసి లోబర్చుకుంటాడు. తన మాట వినకపోతే అసభ్య పదజాలంతో విరుచుకుపడి భయభ్రాంతులకు గురి చేస్తుంటాడు. ఎదుటి వారిని భయపెట్టి తన కార్యాన్ని చక్క బెట్టుకుంటుంటాడు. దర్యాప్తుల పేరుతో ఇళ్లలో చొరబడి.. ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాల లబ్ధి చేకూర్చే విషయంలో ఇతను ప్రత్యేక దర్యాప్తులు చేపడుతుంటాడు. సంక్షేమ పథకాల కోసం దరఖాస్తు చేసుకున్న వారి ఇళ్ల వద్దకు, వసతి గృహాల వద్దకు రాత్రి సమయంలో ఒంటరిగా వెళుతుంటాడు. ఇంటి బయట కూర్చొని మాట్లాడుదాం అంటూ దరఖాస్తుదారులు అంటున్న వినకుండా బలవంతంగా లోపలకు చొరబడి మాటలతో వారిని మాయ చేసే ప్రయత్నాలు చేస్తుంటాడు. ఇతని వ్యవహారం పలుమార్లు వివాదస్పదమైంది. అయితే తనకు సహకరించకపోతే సంక్షేమ పథకాల లబ్ధి చేకూరకుండా చేస్తానంటూ బెదిరించి పలువురిని లోబర్చుకున్నట్లు సమాచారం. వికలాంగుల సంక్షేమ శాఖలో ఉన్నతాధికారిగా వ్యవహరిస్తున్న ఈయన సమాజపరంగా పెద్ద నటుడు. సందర్భానుసారంగా రంగులు మారుస్తూ.. దివ్యాంగులకు సేవ చేయడానికే తాను ఉన్నట్లు నటిస్తుంటాడు. జిల్లా కేంద్రంలో నిర్వహించే వివిధ కార్యక్రమాల్లో వారే తన సర్వస్వంగా పెద్ద బిల్డప్ చూపిస్తూ మంత్రులను, ఉన్నతాధికారులను సైతం బురిడి కొట్టిస్తుంటాడు. జిల్లా వికలాంగుల సంక్షేమ శాఖలో ఉన్నతాధికారిగా పనిచేస్తున్న అతను.. కార్యాలయ వేళలు ముగిసిన తర్వాతే అందరికీ అందుబాటులోకి వస్తాడు. సాధారణంగా కార్యాలయం వేళలు సాయంత్రం 5.30 గంటలకు ముగుస్తాయి. ఈయన మాత్రం ఆరు గంటల తర్వాత కార్యాలయానికి చేరుకుంటాడు. ఇదే విషయాన్ని లబ్ధిదారు మహిళలకు తెలిపి.. కార్యాలయం వద్దకు రమ్మని ముందుగానే ఆదేశిస్తాడు. సమయం కాకపోయినా.. గత్యంతరం లేని స్థితిలో వారు అతను చెప్పినట్లు కార్యాలయానికి వెళ్లక తప్పడం లేదు. రహస్య వివాహం జిల్లాలోని ఓ ప్రముఖ విశ్వవిద్యాలయంలో విద్యనభ్యసిస్తున్న ఓ విద్యార్థినిని మాయమాటలతో లోబర్చుకుని ఆ అధికారి రహస్యంగా వివాహం చేసుకున్నట్లు ఆరోపణలున్నాయి. ఈ విషయంలో ఆమెను కార్యాలయంలోని ఓ ఉద్యోగి, వికలాంగుల సంఘం నాయకులే ఒప్పించినట్లు సమాచారం. ఈ విషయం బయటికి రాకుండా నగర శివారులోని ఓ ప్రాంతంలో ఆమెతో రహస్యంగా కాపురం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎలాంటి ఆధారం లేని ఆమెకు బ్యాక్లాగ్ పోస్టు ఇప్పిస్తానంటూ నమ్మించి పెళ్లి చేసుకున్నట్లు పలువురు పేర్కొంటున్నారు. ఇతర జిల్లాల్లోను ఇదే తంతు గతంలో చిత్తూరు జిల్లాలో విధులు పనిచేసిన సమయంలోనూ అతను ఓ దివ్యాంగురాలితో అసభ్యంగా ప్రవర్తించినందుకు ఆమె సోదరులు, ఇతరు దివ్యాంగులు కలిసి తగిన శాస్తి చేశారు. గతంలో తూర్పు గోదావరి జిల్లాలోని కాకినాడలోనూ మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆరోపణలున్నాయి. అదే తంతును ఇక్కడ కొనసాగిస్తూ నాలుగేళ్లుగా టీడీపీ నాయకుల అండ చూసుకుని రెచ్చిపోయాడు. వికలాంగ సంక్షేమ సంఘాలకు చెందిన కొందరు నాయకులను మచ్చిక చేసుకుని తన కార్యకలాపాలను ఇక్కడ కూడా విస్తరించినట్లు సమాచారం. -
ఈఈలే జిల్లా అధికారులు
భూపాలపల్లికి ములుగు పీఆర్, ఐబీ, ఆర్అండ్బీ డివిజన్లు వరంగల్‌కు ఏటూరునాగారం స్పెషల్ ఎంఐ డివిజన్ వరంగల్ : నూతన జిల్లాల ఇంజనీరింగ్ శాఖలకు ఆయా విభాగాల ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్(ఈఈ)లే జిల్లా స్థాయి అధికారులుగా వ్యవహరించనున్నారు. రహదారులు–భవనాలు, (ఆర్అండ్బీ), పంచాయతీరాజ్, గ్రామీణ నీటి సరఫరా, మిషన్ భగీరథ డివిజన్ కార్యాలయాలు కొత్త జిల్లాల్లో ఏర్పాటు చేసేందుకు అధికారులు సమాయత్తమవుతున్నారు. జిల్లా కేంద్రం లో పంచాయతీరాజ్, ఆర్అండ్బీ, ఆర్డబ్ల్యూఎస్, మిషన్ భగీరథ, నీటి పారుదల శాఖ ఎస్ఈ కార్యాలయాలు ఉన్నాయి. కొత్తగా ఎస్ఈ కార్యాలయాల ఏర్పాటు లేకపోవడంతో ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్ అధికారులే జిల్లా ఉన్నతాధికారులు కానున్నారు. పీఆర్ ఇంజనీరింగ్ జిల్లాలో మహబూబాబాద్, ములుగు, వరంగల్ పీఆర్ఐ డివిజన్లతోపాటు వరంగల్‌లో మరో పీఐ యూ డివిజన్లు ఉన్నాయి. కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా ములుగు పీఆర్ డివిజన్ కార్యాలయాన్ని భూపాలపల్లికి తరలించనున్నారు. వరంగల్‌లో ఉన్న రెండు డివిజన్లు ఒక్కో జిల్లాలో పనులు పర్యవేక్షించనున్నాయి. కేంద్ర ప్రభుత్వ పథకాలు పర్యవేక్షించే పీఐయూ డివిజన్ జిల్లాల ఏర్పాటులో పీఆర్ఐగా మారనుంది. భవిష్యత్తులో ఎస్ఈ పరిధి కేంద్ర ప్రభు త్వ పథకాల పర్యవేక్షణకు మరో డివిజన్ ఏర్పడే అవకాశాలు ఉంటాయని అధికార వర్గాలు తెలిపాయి. నీటి పారుదల శాఖ జిల్లాలో చిన్ననీటి పారుదల విభాగంలో వరంగల్, మహబూబాబాద్, ములుగు, ఏటూరునాగారంలో స్పెషల్ ఎంఐ డివిజన్లు ఉన్నాయి. ఇప్పటికే మహబూబాబాద్, వరంగల్ జిల్లాలకు డివిజన్ కార్యాలయాలు ఉన్నాయి. ములుగు డివిజన్ కార్యాలయాన్ని భూపాలపల్లికి, ఏటూరునాగారం స్పెషల్ ఎంఐ డివిజన్ జిల్లా కేంద్రానికి తరలించే ప్రతిపాదనలు సిద్ధం చేశా రు. గిరిజన ప్రాంతాల్లో పనుల పర్యవేక్షణకు ఏర్పడిన స్పెషల్ ఎంఐ డివిజన్ మాయం కానుంది. దీంతో నాలుగు జిల్లాల్లో అభివృద్ధి పనులను ఐటీడీఏ పర్యవేక్షించే పరిస్థితులు నెలకొన్నాయి. గ్రామీణ నీటి సరఫరా విభాగం జిల్లాలో గ్రామీణ నీటి సరఫరా విభాగం పరిధిలో వరంగల్, హన్మకొండ డివిజన్లు జిల్లా పరిషత్ కార్యాలయంలోనే విధులు నిర్వర్తిస్తున్నాయి. కొత్త జిల్లాల్లో రెండు కొత్త డివిజన్లను మహబూబాబాద్, భూపాలపల్లిలో ఏర్పాటు చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఆర్డబ్ల్యూఎస్ విభాగం పరిధిలో పనుల పర్యవేక్షణకు గాను ప్రతి నియోజకవర్గానికి ఒక్కొక్కటి చొప్పున 10 సబ్ డివిజన్లు ప్రస్తుతం ఉన్నాయి. వీటిని 7 సబ్ డివిజన్లకు కుదించనున్నారు. వరంగల్, నర్సంపేట, మహబూబాబాద్, ములుగు, మంథని డివిజన్లు ఉండగా కొత్తగా హన్మకొండ, భూపాలపల్లి రెండు రెవెన్యూ డివిజన్లు ఏర్పాటయ్యాయి. ఈ ఏడు రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో ఒక్కో సబ్ డివిజన్‌ను ఏర్పాటు చేసి ఆర్డబ్ల్యూఎస్ పనులు పర్యవేక్షించేలా అధికారులు ప్రతిపాదించారు. రహదారులు.. భవనాల శాఖ రహదారులు–భవనాల శాఖలో వరంగల్, ములుగు, మహబూబాబాద్ ఇంజనీరింగ్ డివిజన్లు ఉన్నాయి. ఇందులో వరంగల్, మహబూబాబాద్ జిల్లాలో డివిజన్ కార్యాలయాలు ఉండగా ములుగు డివిజన్ కార్యాలయాన్ని భూపాలపల్లి జిల్లా కేంద్రానికి తరలించనున్నారు. కొత్తగా ఏర్పాటు కానున్న మరో జిల్లాపై స్పష్టత వస్తే రూరల్(కాకతీయ) జిల్లాలో మరో డివిజన్ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఈ కార్యాలయాలు దసరా నుంచి పనిచేసేలా ఉద్యోగుల కేటాయింపు ప్రక్రియను ఆయా శాఖల ఉన్నతాధికారులు కసరత్తు ప్రారంభించారు. మార్పులు లేని మిషన్ భగీరథ రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో ఇంటింటికి తాగునీటి సౌకర్యం కల్పించేందుకు ప్రభుత్వం ‘మిషన్ భగీరథ’ను అమలులోకి తెచ్చింది. మిషన్ భగీరథ ఎస్ఈ కార్యాలయం పరిధిలో పరకాల, మహబూబాబాద్, వరంగల్, జనగామ డివిజన్ కార్యాలయాలు పనిచేస్తున్నాయి. మిషన్ భగీరథ ప్రాముఖ్యాన్ని పరిగణలోకి తీసుకొని ఈ డివిజన్లు ప్రస్తుతం యథావిధిగా కొనసాగించే అవకాశాలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. -
”ప్రభుత్వ కార్యాలయాలు తరలి వెళ్లాలి”
-
ఉండగానే దండుకుందాం..
సాక్షి, కాకినాడ : ‘దీపం’ ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని చూస్తున్నారు జిల్లా అధికారులు. సార్వత్రిక ఎన్నికల సమయంలో పనిచేసిన అధికారులందరికీ బదిలీ తప్పదని ప్రభుత్వం స్పష్టమైన సంకేతాలిచ్చింది. పైగా జిల్లాస్థాయిలో పనిచేస్తున్న అధికారులందరూ రెండేళ్లకు పైబడి ఇక్కడ పనిచేస్తున్న వారే. దీంతో ఉండగానే దండుకోవాలన్నట్టు.. పలువురు అధికారులు ఆర్జన కోసం ఆరాటపడుతున్నారు. సాధారణ బదిలీలపై ప్రభుత్వం నిషేధం ఎత్తివేసింది. సెప్టెంబర్ 3 నుంచి నెలాఖరు వరకు బదిలీలకు పచ్చజెండాఊపింది. సాధారణంగా నియామకం జరిగిన తర్వాత రెండేళ్ల వరకు బదిలీలకు అవకాశాలుండవు. క్లరికల్ స్థాయి ఉద్యోగులు, సిబ్బందినైతే కనీసం మూడేళ్లు కొనసాగిస్తుంటారు. తాజా బదిలీలకు ప్రత్యేక మార్గదర్శకాలంటూ లేనందున క్షేత్రస్థాయి సిబ్బందితో పాటు జిల్లాస్థాయి అధికారులు కూడా పెద్ద సంఖ్యలోనే బదిలీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొందరు ఇక్కడే కొనసాగాలని ప్రజాప్రతినిధుల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. కొందరు రాజధానిలో మకాం వేసి ప్రయత్నాలు సాగిస్తున్నారు. తమకు ఎలాగూ బదిలీ వేటు తప్పదన్న భావనతో పలువురు జిల్లాలోనే ఉండి దండుకునే పనిలో పడ్డారు. బదిలీ తప్పని పలువురు జిల్లాస్థాయి అధికారులు తాత్కాలిక రాజధాని(విజయవాడ) వైపు చూస్తున్నారు. బదిలీల్లో జోక్యం వలదన్న బాబు.. సార్వత్రిక ఎన్నికల సమయంలో జిల్లాలో పనిచేసిన అధికారులను బదిలీ చేసి కొత్త టీమ్‌ను ఏర్పాటు చేసుకోవాలని ఇప్పటికే జిల్లా నేతలకు టీడీపీ అధినేత హుకుం జారీ చేశారు. బదిలీల విషయంలో జోక్యం చేసుకోవద్దని, సిఫార్సు లేఖలు ఇవ్వవ ద్దని బాబు జిల్లా నేతలకు క్లాస్ తీసుకున్నట్టు సమాచారం. దీంతో జిల్లాలో పనిచేసే వారిని వెనకేసుకొచ్చేకంటే కొత్తగా వచ్చే వారి నుంచే దండుకుంటే మేలన్న ధోరణిలో వారున్నట్టు కనిపిస్తోంది. ఏదేమైనా ఈ నెలాఖరుతో తమకు స్థానచలనం తప్పదని తెలియడంతో పలువురు అధికారులు అందినంత దండుకోవాలని ఆరాటపడుతున్నారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న బిల్లులను చకచకా మంజూరు చేయడంతో పాటు అప్రూవల్స్, పర్మిట్లు, అనుమతులు, లెసైన్సుల జారీల్లో ఉదారంగా వ్యవహరిస్తూ భారీగానే దండుకుంటున్నట్టు తెలుస్తోంది. గతేడాది మంజూరు కానిబిల్లులను సాధారణంగా ఇచ్చే పర్సంటేజ్‌ల కంటే ఎక్కువగా ఇస్తే చాలు మంజూరు చేస్తామని అడిగి మరీ చేతులో పెడుతున్నారని పలువురు కాంట్రాక్టర్లు చెబుతుండడం పరిస్థితికి అద్దం పడుతోంది. కొన్ని శాఖల అధికారులు ఏదైనా ఫైలు తమ టేబుల్‌పైకి వస్తే చాలు క్షణాల్లో క్లియర్ చేస్తూ పర్సంటేజ్లను ముక్కుపిండి వసూలు చేసుకుంటున్నారు. ‘ఇల్లు చక్కబెట్టుకోవడమే’ఇప్పుడు వారి డ్యూటీ వివిధ శాఖల్లో డివిజన్, మండల స్థాయిల్లో పనిచేసే అధికారులు, సిబ్బంది కూడా ఇల్లు చక్కబెట్టుకునే పనిలో పడినట్టు కనిపిస్తోంది. మరోనాలుగైదురోజుల్లో బదిలీలపై మార్గ దర్శకాలు జారీ కాగానే తొలుత జిల్లా అధికారులకు, తర్వాత జిల్లా పరిధిలో బదిలీలకు షెడ్యూల్ విడుదలయ్యే సూచనలున్నాయి. విద్యాసంవత్సరం ప్రారంభమై మూడు నెలలు గడి చాక బదిలీలు గతంలో ఎన్నడూ చేయలేదని, తక్షణం బదిలీలను నిలుపుదల చేయాలని ఇప్పటికే జేఏసీ నేతలు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. అయినా ఎన్నికల సమయంలో పని చేసిన వారందరినీ కదపాల్సిందేనన్న పట్టుదలతో అధికార పార్టీ పెద్దలున్నారు. ఏదేమైనా వచ్చే నెలలో జిల్లాలో అధికారులు మూడో వంతు బదిలీ అయ్యే పరిస్థితి కనిపిస్తోంది. అక్టోబర్ నుంచి కలెక్టర్, జేసీ స్థాయి అధికారులతో పాటు పూర్తిగా కొత్తవారు జిల్లాకు రానున్నారని చెబుతున్నారు. -
సీఎం పర్యటనకు భారీ ఏర్పాట్లు
కుప్పం: రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమ, మంగళ వారాల్లో కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యమంత్రి పదవి చేపట్టాక ఆయన తొలిసారిగా సొంత నియోజకవర్గానికి వస్తున్నారు. సోవువారం ఉదయుం 9 గంటలకు హైదరాబాద్ నుంచి బెంగళూరుకు చేరుకుని అక్కడ నుంచి హెలి క్యాప్టర్‌లో రామకుప్పానికి వస్తారు. బస్టాండ్‌లో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం కార్యకర్తల సవూవేశంలో ప్రసంగి స్తారు. అక్కడ నుంచి శాంతిపురానికి చేరుకుని బహిరంగ సభ, కార్యకర్తల సవూవేశం నిర్వహిస్తారు. కడా కార్యాలయూన్ని సందర్శిస్తారు. గణేష్‌పురం వద్ద ఉన్న సీఆర్సీ భవనంలో నియోజకవర్గ పార్టీ నాయకులతో సవూవేశమవుతారు. అనంతరం గుడుపల్లి వుండల కేంద్రంలో బహిరంగ సభ, కార్యకర్తల సవూవేశంలో పాల్గొంటారు. తర్వాత కుప్పం బస్టాండులో జరిగే బహిరంగసభలో ప్రసంగిస్తారు. ఆర్అండ్బీ అతిథి గృహంలో జిల్లా అధికార్లతో సమీక్ష సవూవేశం నిర్వహించి రాత్రికి అక్కడే బస చేస్తారు. వుంగళవారం ఉదయుం 9 గంటలకు హైదరాబాద్‌కు తిరుగు ప్రయూణమవుతారు. శనివారం ఉదయుం జిల్లా స్థాయి అధికారులు కుప్పం పట్టణానికి వచ్చారు. నియోజకస్థారుు అధికార్లతో సమీక్షలు నిర్వహించారు. వుదనపల్లె సబ్ కలెక్టర్ భరత్ గుప్తా అధికార్లతో సమీక్షలు జరిపారు. చిత్తూరు ఎస్పీ రావుకృష్ట, పలవునేరు డీఎస్పీ హరినాథ్ రెడ్డి సీఎం పర్యటించే ప్రాంతాలను పరిశీలించారు.