district president names
-
వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు వీరే
-
AP:26 జిల్లాలకు వైఎస్సార్సీపీ అధ్యక్షులు వీరే..
-
వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు వీరే..
సాక్షి, తాడేపల్లి: జిల్లా అధ్యక్షులు, రీజనల్ కోఆర్డినేటర్ల జాబితాను మంగళవారం వైఎస్సార్సీపీ ప్రకటించింది ఈ మేరకు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మంగళవారం మీడియా ముఖంగా వెల్లడించారు. జిల్లా అధ్యక్షులు వీరే.. జిల్లా పేరు అధ్యక్షులు 1 చిత్తూరు కేఆర్జే భరత్ 2 అనంతపురం కాపు రామచంద్రారెడ్డి 3 శ్రీసత్యసాయి ఎం. శంకర్ నారాయణ 4 అన్నమయ్య గడికోట శ్రీకాంత్‌రెడ్డి 5 కర్నూలు వై. బాలనాగిరెడ్డి 6 నంద్యాల కాటసాని రాంభూపాల్‌రెడ్డి 7 వైఎస్సార్(కడప) కే. సురేష్ బాబు 8 తిరుపతి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి 9 నెల్లూరు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి 10 ప్రకాశం బుర్రా మధుసూదన యాదవ్ 11 బాపట్ల మోపిదేవి వెంకట రమణ 12 గుంటూరు మేకతోటి సుచరిత 13 పల్నాడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి 14 ఎన్టీఆర్ వెల్లంపల్లి శ్రీనివాస్‌రావు 15 కృష్ణా పేర్ని వెంకటరామయ్య( నాని) 16 ఏలూరు ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్(నాని) 17 పశ్చిమ గోదావరి చెరుకువాడ శ్రీరంగనాధ రాజు 18 తూర్పు గోదావరి జగ్గంపూడి రాజ ఇంద్ర వందిత్ 19 కాకినాడ కురసాల కన్నబాబు 20 కోనసీమ పొన్నాడ వెంకట సతీష్ కుమార్ 21 విశాఖపట్నం ముత్తెంశెట్టి శ్రీనివాసరావు 22 అనకాపల్లి కరణం ధర్మశ్రీ 23 అల్లూరి సీతారామ రాజు కొట్టగుల్లి భాగ్యలక్ష్మీ 24 పార్వతీపురం మాన్యం పాముల పుష్పశ్రీవాణి 25 విజయనగరం చిన్న శ్రీను 26 శ్రీకాకుళం ధర్మాన కృష్ణదాస్ రీజినల్ కో- ఆర్డినేటర్లు జిల్లాలు, నియోజకవర్గాలు రీజినల్ కో ఆర్డినేటర్ 1 చిత్తూరు,అనంతపురం, శ్రీ సత్యసాయి, అన్నమయ్య డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 2 కర్నూలు, నంద్యాల సజ్జల రామకృష్ణారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి 3 వైఎస్సార్, తిరుపతి అనిల్ కుమార్ యాదవ్ 4 నెల్లూరు, ప్రకాశం, బాపట్ల బాలినేని శ్రీనివాస్ రెడ్డి 5 గుంటూరు, పల్నాడు కొడాలి వెంకటేశ్వరరావు( నాని) 6 ఎన్టీఆర్, కృష్ణా మర్రి రాజశేఖర్ 7 ఏలురు, పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి, కాకినాడ, కోనసీమ పీవీ మిథున్‌రెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్ 8 విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామ రాజు వైవీ సుబ్బారెడ్డి 9 పార్వతీపురం మాన్యం, విజయనగరం, శ్రీకాకుళం బొత్ససత్యనారాయణ -
పట్టు జారకుండా కట్టు తప్పకుండా
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుల నియామకంలో అధినేత కేసీఆర్ అంచనాలకు భిన్నంగా వ్యవహరించారు. ప్రజా ప్రతినిధులు కాని వారికి జిల్లా అధ్యక్ష పదవులు దక్కుతాయని గతంలో సంకేతాలిచ్చినా, అందుకు పూర్తి విరుద్ధంగా ఎంపికచేశారు. 33 జిల్లాల అధ్యక్ష పదవుల్లో 19 మంది ఎమ్మెల్యేలతో పాటు ఇద్దరు ఎమ్మెల్సీలు, ముగ్గురు ఎం పీలు, ముగ్గురు జడ్పీ చైర్మన్లకు అవకాశం దక్కింది. వీరితోపాటు అధ్యక్ష పదవి దక్కిన మరో ఆరుగురిలో ఓ మాజీ ఎమ్మెల్యే, మాజీ డీసీఎంఎస్ చైర్మన్, ఆయిల్‌ఫెడ్, సుడా, మున్సిపల్ చైర్మన్లతోపాటు మాజీ ఎంపీపీ ఉన్నారు. టీఆర్ఎస్ జిల్లా అధ్యక్ష పదవి పొందిన ఎమ్మెల్యేల్లో ఇద్దరు మాజీ మంత్రులు కాగా.. ప్రభుత్వ చీఫ్ విప్, విప్ కూడా ఉండటం గమనార్హం. హైదరాబాద్ జిల్లాకు ప్రత్యేకంగా పార్టీ అధ్యక్ష పదవిని చ్చారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజా ప్రతినిధులైతేనే జిల్లాల్లో పార్టీ పట్టు సడలకుండా ఉంటుం దని అధినేత భావించినట్టు సమాచారం. వచ్చే ఎన్నికల దృష్ట్యా కూడా వీరైతేనే సమన్వయం బాగుంటుందని, పార్టీని ముందుకు తీసుకెళ్లగలరనేది సీఎం అభిప్రాయంగా చెబుతున్నారు. ఎమ్మెల్యేలకు అధిక ప్రాధాన్యత ఓవైపు వివిధ సామాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకుంటూనే టీఆర్ఎస్ జిల్లా అధ్యక్ష పదవుల్లో ఎమ్మెల్యేలకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ కేసీఆర్ కసరత్తు చేశారు. మరో ఏడాదిన్నరలో అసెంబ్లీ ఎన్నికల వాతావరణం వేడెక్కనుండటంతో చిన్న జిల్లాల్లో స్థానిక నేతలకు అవకాశమిస్తే ఎదురయ్యే లాభనష్టాలను పరిగణనలోకి తీసుకుని ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలకు అవకాశమిచ్చారు. ప్రస్తుతం జిల్లా అధ్యక్ష పదవులు దక్కిన వారి నుంచి భవిష్యత్తులో పదవుల కోసం ఎదురయ్యే డిమాండ్లనూ దృష్టిలో ఉంచుకుని ఎంపికచేశారు. పార్టీ ప్రజా ప్రతినిధులను కాకుండా ఇతరులకు అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తే వారు ఎన్నికల సమయంలో చేజారితే ఎదురయ్యే తలనొప్పులు కూడా గమనంలో ఉంచుకుని జాబితా రూపొందించినట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. ఉద్యమ ప్రస్థానంలో వెంట ఉన్న వారికీ.. టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి పార్టీలో ఉన్న వారితో పాటు ఉద్యమ సమయంలో పార్టీలో చేరినవారికి అధ్యక్ష పదవుల్లో కేసీఆర్ పెద్దపీట వేశారు. 2014 తర్వాత వివిధ సందర్భాల్లో ఇతర పార్టీల నుంచి చేరిన వారికి కూడా అక్కడక్కడా జిల్లా అధ్యక్ష పదవులు దక్కాయి. అలాగే పార్టీ కార్యకలాపాల్లో, అసెంబ్లీలో చురుకుగా వ్యవహరించే నేతలకు జిల్లా అధ్యక్ష పదవుల్లో ప్రాధాన్యత దక్కినట్లు జాబితా వెల్లడిస్తోంది. బాల్క సుమన్, జీవన్‌రెడ్డి, వినయ్‌భాస్కర్, మెతుకు ఆనంద్, శంభీపూర్ రాజు, గువ్వల బాలరాజు తదితర యువ నేతలకు జిల్లా అధ్యక్ష పదవులు దక్కాయి. మహిళల కోటాలో పద్మా దేవేందర్‌రెడ్డి (మెదక్), మాలోత్ కవిత (మహబూబాబాద్), గండ్ర జ్యోతి (భూపాలపల్లి)కి అవకాశం వచ్చింది. మాజీ మంత్రులు జోగు రామన్న (ఆదిలాబాద్), సి.లక్ష్మారెడ్డి (మహబూబ్‌నగర్) జిల్లా అధ్యక్షుల జాబితాలో ఉన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో దుబ్బాక నుంచి పోటీచేస్తారని భావిస్తున్న మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి సిద్దిపేట జిల్లా అధ్యక్షుడిగా నియమితులయ్యారు. వైవిధ్యంగా కార్యవర్గ కూర్పు! జిల్లా అధ్యక్ష పదవుల నియామకం పూర్తికావడంతో పార్టీ రాష్ట్ర కార్యవర్గం కూర్పుపై టీఆర్ఎస్ అధినేత దృష్టి సారించారు. జాతీయ, రాష్ట్ర రాజకీయ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర కార్యవర్గ కూర్పు అత్యంత వైవిధ్యంగా ఉండబోతోందని పార్టీ ముఖ్యనేత ఒకరు వెల్లడిం చారు. ముఖ్యనేతలు, రాష్ట్ర రాజకీయాల్లో అనుభవం, సామాజిక సమీకరణల మేరకు రాష్ట్ర కార్యవర్గం ఉండబోతోందని చెబుతున్నారు. -
ఏపీ టీడీపీ జిల్లా అధ్యక్షుల పేర్లు ఖరారు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుల పేర్లు ఖరారయ్యారు. ఈ మేరకు జిల్లా అధ్యక్షుల పేర్లను టీడీపీ గురువారం వెల్లడించింది. పార్టీ ఖరారు చేసిన జల్లా అధ్యక్షుల పేర్లు ఈ కింది విధంగా ఉన్నాయి. - శ్రీకాకుళం జిల్లా టీడీపీ అధ్యక్షురాలిగా శిరీష నియామకం - విజయనగరం జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా ద్వారపురెడ్డి జగదీష్ నియామకం - విశాఖ సిటీ టీడీపీ అధ్యక్షుడిగా వాసుపల్లి గణేష్ కుమార్ నియామకం - విశాఖ రూరల్ టీడీపీ అధ్యక్షుడిగా పప్పల చలపతిరావు నియామకం - తూర్పుగోదావరి జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా పర్వతనేని చిట్టిబాబు నియామకం - పశ్చిమగోదావరి జిల్లా టీడీపీ అధ్యక్షురాలిగా తోట సీతారామలక్ష్మి నియామకం - విజయవాడ సిటీ టీడీపీ అధ్యక్షుడిగా బుడ్డా వెంకన్న నియామకం - విజయవాడ రూరల్ టీడీపీ అధ్యక్షుడిగా బత్తుల అర్జునుడు నియామకం - గుంటూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా జీవీఎస్ అంజనేయులు నియామకం - ప్రకాశం జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా దామచర్ల జనార్థన్ నియమాకం - నెల్లూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా బీదా రవీచంద్రాయాదవ్ నియామకం - కర్నూలు జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా శిల్పా చక్రపాణి నియమాకం - కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా శ్రీనివాసులురెడ్డి నియామకం - అనంతరంపురం జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా బీకే పార్థసారథి నియామకం - చిత్తూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా జి. శ్రీనివాసులు నియామకం