divya darshanam
-
దివ్యదర్శనం టోకెన్లు జారీ పునఃప్రారంభం
తిరుమల: తిరుమల నడకమార్గాల్లో దివ్యదర్శనం టోకెన్ల జారీని టీటీడీ శనివారం ఉదయం నుంచి పునః ప్రారంభించింది. కోవిడ్ నేపథ్యంలో మూడు సంవత్సరాలుగా టీటీడీ దివ్యదర్శనం టోకెన్ల జారీని నిలిపివేసింది. అయితే భక్తుల కోరిక మేరకు అలిపిరి నడక మార్గంలో గాలిగోపురం వద్ద 10 వేలు, శ్రీవారి మెట్టు మార్గంలో ఐదు వేల దివ్యదర్శనం టోకెన్లను శనివారం నుంచి కేటాయిస్తున్నారు. భక్తులు నేరుగా తమ ఆధార్ కార్డుతో హాజరైతేనే టోకెన్లు జారీ చేస్తారు. టీటీడీ కొద్దిరోజులపాటు ప్రయోగాత్మకంగా దివ్యదర్శనం టోకెన్ల జారీని పరిశీలించనుంది. 3 నుంచి తిరుమల శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు శ్రీవారి ఆలయంలో ఈ నెల 3 నుంచి 5వ తేదీ వరకు సాలకట్ల వసంతోత్సవాలు వైభవంగా జరుగనున్నాయి. ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ పౌర్ణమికి ముగిసేటట్లుగా ఈ ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. 3న శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ మలయప్పస్వామివారు నాలుగు మాడవీధుల్లో ఊరేగుతారు. వసంతోత్సవ అభిషేక నివేదనలు పూర్తయిన అనంతరం తిరిగి ఆలయానికి చేరుకుంటారు. 4న స్వామివారు బంగారు రథంపై భక్తులకు దర్శనమిస్తారు. 5న శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారితో పాటు శ్రీసీతారామలక్ష్మణ ఆంజనేయస్వామి ఉత్సవమూర్తులు, శ్రీ రుక్మిణి సమేత శ్రీకృష్ణస్వామి ఉత్సవమూర్తులు వసంతోత్సవ వేడుకల్లో పాల్గొని తిరిగి సాయంత్రం ఆలయానికి చేరుకుంటారు. వసంతోత్సవాన్ని పురస్కరించుకొని 4న అష్టదళ పాదపద్మారాధన, 3 నుంచి 5వ తేదీ వరకు కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది. -
పేద వర్గాలకు వరం.. ‘దివ్య దర్శనం’
తిరుమల: శ్రీవారి దివ్య దర్శనం విధానం పేద వర్గాలకు వరంగా మారుతోంది. బ్రహ్మోత్సవాల సమయంలో రాష్ట్ర భక్తులకు ప్రయోగాత్మకంగా ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేసిన టీటీడీ.. వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా పది రోజుల పాటు ఏపీ, తెలంగాణతో పాటు తమిళనాడు భక్తులకూ అదే తరహా ఏర్పాట్లకు సిద్ధమైంది. శ్రీవారిని క్షణకాలం దర్శించుకుంటే చాలు జీవితం ధన్యమవుతుందని భక్తులు భావిస్తారు. అయితే వ్యయప్రయాసలకోర్చి శ్రీనివాసుడిని చేరుకునేందుకు అష్టకష్టాలు పడుతున్న భక్తులు కోకొల్లలు. తమ జీవిత కాలంలో స్వామి కరుణించకపోతారా, ఎప్పటికైనా దర్శన భాగ్యం లభించకపోతుందా అని నిరీక్షించే భక్తులను దృష్టిలో ఉంచుకుని టీటీడీ దివ్యదర్శనం కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దీనిలో భాగంగా వెనుకబడిన ప్రాంతాలకు చెందిన పేద భక్తులకు ఉచిత రవాణా, వసతి, భోజన సౌకర్యాలతో స్వామివారి దర్శనభాగ్యం కల్పించేందుకు ఏర్పాట్లు చేపట్టింది. అది కూడా పర్వదినాల సమయంలో కావడం విశేషం. బ్రహ్మోత్సవాల సమయంలో తొమ్మిది రోజుల పాటు 13 జిల్లాలకు చెందిన భక్తులకు ఈ సౌకర్యం టీటీడీ కల్పించింది. నిత్యం రెండు జిల్లాల భక్తులను తిరుమలకు తీసుకొచ్చి స్వామి దర్శనభాగ్యం కల్పించింది. ఇలా తొమ్మిది రోజుల పాటు 248 మండలాల నుంచి 6,464 మంది భక్తులు ఉచితంగా స్వామిని దర్శించుకున్నారు. ఇందులో ఎíస్సీలు 3,485 మంది, ఎస్టీలు 2,114 మంది, మత్స్యకారులు 382 మంది భక్తులకు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల సమయంలో దర్శన భాగ్యం కలిగింది. తమ చిరకాల వాంఛను ఇలా సులభతరంగా తీర్చిన టీటీడీకి వారు ధన్యవాదాలు తెలిపారు. ఏపీ, తెలంగాణ, తమిళనాడు భక్తులకూ.. శ్రీవారి బ్రహ్మోత్సవాల తరహాలోనే రానున్న వైకుంఠ ఏకాదశి పర్వదిన సమయంలో కూడా వెనుకబడిన ప్రాంతాలకు చెందిన భక్తులకు (రోజూ సుమారు 1000 మందికి) స్వామివారి దర్శనభాగ్యం ఉచితంగా కల్పించాలని పాలక మండలి తాజాగా నిర్ణయం తీసుకుంది. ఈ సారి ఏపీతో పాటు తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల భక్తులకు స్వామి దర్శనం కలగనుంది. మామూలుగా స్వామి దర్శనమే మహద్భాగ్యంగా భక్తులు భావిస్తారు. అలాంటిది ఉచితంగా వైకుంఠ ద్వార దర్శనం లభిస్తుండటం భక్తులు పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నారు. నేడు వర్చువల్ సేవా దర్శన టికెట్ల విడుదల తిరుమల శ్రీవారికి జనవరి 1, 2 తేదీలు, 13 నుంచి 22, 26 తేదీలలో వర్చువల్ విధానంలో జరిపే సేవా దర్శనానికి సంబంధించి 5,500 టికెట్లను గురువారం సాయంత్రం 4 గంటలకు టీటీడీ విడుదల చేయనుంది. అదేవిధంగా జనవరి 1, 13 నుంచి 22 తేదీల వరకు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను రోజుకు 20 వేల చొప్పున, జనవరి 2 నుంచి 12, 23 నుంచి 31వ తేదీల వరకు రోజుకు 12 వేల చొప్పున టికెట్లను 24వ తేదీ ఉదయం 9 గంటలకు విడుదల చేస్తారు. తిరుమల వసతికి సంబంధించి 27న ఉదయం 9 గంటలకు విడుదల చేస్తారు. కాగా, జనవరి 11 నుంచి 14వ తేదీ వరకు వసతిని తిరుమలలో కరెంట్ బుకింగ్‌లో భక్తులు పొందవచ్చు. భక్తులు ఆన్లైన్లో ముందుగా దర్శన, వసతిని బుక్ చేసుకోవాలి. -
రోజుకో నిర్ణయం తీసుకుంటున్న టీటీడీ
-
దివ్య దర్శనం ఏదీ?
జనవరి 2న ప్రకటించిన ప్రభుత్వం నిరుపేద హిందువులకు దక్కని ప్రముఖ ఆలయాల దర్శనం రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాలను ఉచితంగా చూపిస్తామంటూ ప్రభుత్వం ప్రకటించిన దివ్యదర్శన యాత్ర ఆర్భాటానికే పరిమితమైంది. పథకం ప్రకటించిన తర్వాత ఆలయాల దర్శనంపై నిరుపేద హిందువుల్లో ఆశలు రేకెత్తాయి. నెలరోజులు గడుస్తున్నా.. నేటికీ యాత్ర గురించి ఊసే లేకపోవడంతో ఇది కూడా చంద్రబాబు గత హామీలు మాదిరిగానే ఉత్తుత్తిదేనంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. - గుత్తి రూరల్ రేషన్ కార్డు ఉంటే చాలు రవాణ, వసతి, భోజనాలు అన్నీ తామే భరించి దివ్యదర్శన యాత్రలో భాగంగా ఐదు రోజుల పాటు రాష్ట్రంలోని నాలుగు పెద్ద దేవాలయాల్లో దైవదర్శనం చేయించనున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఈ ఏడాది జనవరి 2న యాత్ర ప్రారంభమతుందని దేవాదాయ శాఖ ద్వారా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. వారానికి 200 మంది దివ్యదర్శనం యాత్రకు దరఖాస్తులు స్వీకరించేందుకు జిల్లాలోని 63 మండల కేంద్రాల్లోని తహశీల్దార్ కార్యాలయాల్లో ప్రత్యేకంగా బాక్స్‌లు ఏర్పాటు చేశారు. ఇందులో ఎస్సీఎస్టీలకు తొలి ప్రాధాన్యత ఉంటుందని, తమకు అందిన దరఖాస్తుల్లో లాటరీ ద్వారా మండలానికి 200 మంది చొప్పున ప్రతి వారం యాత్రకు తీసుకెళ్లనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. మొదలు కాని యాత్ర దివ్యదర్శనం యాత్రకు సంబంధించి ప్రభుత్వం ప్రకటించి 45 రోజులు గడిచినా ఇంకా యాత్ర ప్రక్రియ మొదలు కాలేదు. ఈ విషయంపై దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ ఆనంద్‌కుమార్ మాట్లాడుతూ.. ‘అనంతపురం జిల్లా వ్యాప్తంగా దాదాపు 4,800 దరఖాస్తులు అందాయి. అయితే యాత్రకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇంకా స్పష్టమైన ఆదేశాలు అందలేదు. రాష్ట్ర వ్యాప్తంగా జనవరి 2 నుంచి ఇప్పటి వరకూ శ్రీకాకుళం, కృష్ణా జిల్లాల్లో మాత్రమే యాత్రలు జరిగాయి. ఆదేశాలు రాగానే భక్తులను యాత్రకు తీసుకెళ్తాం’ అని పేర్కొన్నారు.