7న నెల్లూరు నుంచి దివ్యదర్శనయాత్ర
నెల్లూరు : దేవాదాయ, ధర్మాదాయశాఖ ఆధ్వర్యంలో ఈ నెల 7నుంచి 10వ తేదీ వరకు దివ్యదర్శనయాత్ర చేపడుతున్నట్లు దేవాదాయ, ధర్మాదాయశాఖ సహాయ కమిషనర్ వేగూరు రవీంద్రరెడ్డి తెలిపారు. దివ్యదర్శనయాత్రలో భాగంగా జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన సుమారు 200 మంది భక్తులు రాష్ట్రంలోని తిరుచానూరు, తిరుమల, ఒంటిమిట్ట, మహానంది ,శ్రీశైలం దివ్యక్షేత్రాలను దర్శించనున్నారన్నారు.
నాలుగు రోజుల జరిగే యాత్ర శ్రీశైలం నుంచి నర్రవాడ మీదుగా నెల్లూరు చేరుతుందన్నారు. దివ్యదర్శనయాత్ర 7వ తేదీ ఉదయం 9 గంటలకు స్థానిక కరెంట్ ఆఫీస్ సెంటర్ సమీపంలోని శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయం నుంచి బయలుదేరుతుందన్నారు. ఇప్పటికే దివ్యదర్శనయాత్రలో పాల్గొనే భక్తులకు ఇప్పటికే సమాచారం పంపామన్నారు. సమాచారం అందుకున్న భక్తులు మాత్రమే దివ్యదర్శనయాత్రకు రావాలని ఆయన తెలిపారు.